- కెరీర్‌లో మూడుసార్లు సస్పెండ్ అయిన సీఐ నాగయ్య
- అయినా తీరు మార్చుకోని వైనం!
పుల్‌కల్ : పుల్‌కల్ పోలీసు స్టేషన్‌లోని మృతి చెందిన లక్ష్మయ్య మృతికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసిన జోగిపేట సీఐ నాగయ్య వివాదాలకు కేరాఫ్‌గా మారాడు. గతంలో సైతం నాగయ్య పలు సంఘటనల్లో బాధ్యుడయ్యాడు. దీంతో రెండుసార్లు సస్పెండ్ అయ్యాడు. తాజాగా లక్ష్మయ్య మృతిపై కూడా ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యాడు. నాగయ్య ఎక్కడ పనిచేసినా మచ్చ తెచ్చే సంచలనాలు చోటు చేసుకుంటూ సస్పెండ్ అవ్వడం పరిపాటిగా మారింది.
పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బందిలో ఒక్కరిని ఎంచుకుని తన కార్యాలయంలో డిప్యూటేషన్ వేయించుకుని తనకు రావాల్సిన సెటిల్‌మెంట్లు, లావాదేవీలను వారితో చేయించుకుంటాడనే ఆరోపణలున్నాయి. పుల్‌కల్ పోలీసు స్టేషన్‌లో సైత ం తనకు సన్నిహితంగా ఉన్న ఓ కానిస్టేబుల్‌తో కేసులకు సంబంధించిన వ్యవహారాలకు ప్రతినిధిగా పెట్టుకుని కథను నడిపించేవాడని తెలుస్తోంది. అడిగినంత ఇస్తే చాలు కే సులు కొట్టేస్తాడని.. లేనిపక్షంలో చిత్ర హింసలకు గురి చేస్తారనే ఆరోపణలున్నాయి.
డిసెంబర్ 27న మండల పరిధిలోని ఎస్ ఇటిక్యాల్‌లో వివాహిత హత్యకు గురైన సంఘటనలో సీఐ నాగ య్య నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఒకరిని మాత్రమే రిమాండ్ మిగిలిన ఇద్దరి నుంచి పెద్ద మొత్తంలో ము డుపులు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. లాకప్‌లో మృతి చెందిన లక్ష్మయ్య వ్యవహారంలో సైతం హత్యకు గురైన మంజులకు చెందిన బంగారం, అప్పుగా ఇచ్చిన రూ. 2 లక్షలను రికవరీ పేరుతో తాను తీసుకునేందుకే నాలుగు రోజులుగా లక్ష్మయ్యపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారణ జరిపినట్లుగా తెలిసింది. అయితే లక్ష్మయ్య పోలీస్‌స్టేషన్‌లో మృతి చెందడంతో అందుకు బాధ్యుడిని చేస్తూ సీఐ నాగయ్యతో పాటు పుల్‌కల్ ఎస్‌ఐ లోకేష్, కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.
వివాదాలకు కేరాఫ్..!
Published Sat, Mar 14 2015 12:40 AM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM
Advertisement
Advertisement