సాక్షి, విశాఖపట్నం : న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వస్తే దానిని అవకాశంగా మార్చుకుంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. బాధితుల పాలిట సమస్యగా మారుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అని చెప్పుకు తిరిగే ఖాకీల్లో కొందరు కామాంధులుగా మారుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఓ యువతిని లైంగికంగా వేధించిన ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌పై సస్పెండ్ వేటు పడింది.
వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని ఓ హోటల్లో పనిచేసే వారణాసికి చెందిన యువకుడు, మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతి సోషల్ మీడియాలో ప్రేమించుకున్నారు. ప్రియుడి కోసం మలేషియా నుంచి విశాఖపట్నం వచ్చి, ప్రియుడు పనిచేసే హోటల్లోనే ఉద్యోగంలో చేరింది. అయితే, ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రియుడు ఉద్యోగం వదిలేసి విశాఖపట్నం నుండి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల ఎదురుచూసిన యువతి ప్రియుడి ఆచూకీ కోసం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు పంజాబ్లో ఉన్న అతన్ని గుర్తించి, విశాఖకు తీసుకొచ్చి జైలుకు తరలించారు.
అయితే, ప్రియుడిని జైలుకు పంపితే తర్వాత తనను వివాహం చేసుకోడని ఆందోళన పడిన యువతి జైలుకు పంపవద్దని సీఐను కోరింది. దాన్ని అవకాశంగా తీసుకున్న సీఐ యువతిపై లైంగిక వేధిపులు మొదలుపెట్టాడు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 28న నేరుగా యువతి ఉంటున్న హోటల్ గదికే వెళ్ళి లైంగిక దాడికి దిగారు. దాంతో యువతి సీఐ ప్రవర్తనను వీడియో తీసి, నేరుగా నగర కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమీషనర్ వెంటనే విచారణకు ఆదేశించారు. యువతి అందించిన వీడియో సాక్ష్యాల ఆధారంగా కమీషనర్ సీఐను సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment