సాక్షి, నంద్యాల జిల్లా: సీతారామాపురంలో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బారాయుడు హత్య ఘటనపై డీఐజీ సీరియస్ అయ్యారు. నంద్యాల రూరల్ సీఐ శివ కుమార్‌రెడ్డి, మహానంది ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం ఉన్నప్పటికీ సీఐ, ఎస్‌ఐ నిర్లక్ష్యం వహించారని అభియోగం. పోలీసుల అలసత్వం వల్లే వైఎస్సార్‌సీపీ నేత హత్య జరిగిందని నిర్థారణ అయ్యింది. మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో శనివారం అర్ధరాత్రి 12.20 గంటలకు టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలో వైఎస్సార్‌సీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న(65) ఇంట్లోకి వెళ్లి బయటకు లాగి.. కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు.
పోలీసులు గుడ్లప్పగించి చూస్తుండగా సుబ్బరాయుడు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. హత్య జరిగే ప్రమాదముందని మూడు గంటల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా, కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment