
సాక్షి, నంద్యాల జిల్లా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లాలో కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి కీచకుడి అవతారం ఎత్తాడు. ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో ఘటన జరిగింది.

నీలిచిత్రాలు చూడమంటూ సోషల్ టీచర్ బొజ్జన్న ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హెడ్‌మాస్టర్‌కు తెలిసే చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ బొజ్జన్నపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment