indecent behavior
-
ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం
‘నా పేరు నందిని. మాది కోదాడ. కుటుంబంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. పావు గంటలో అమ్మవారి దర్శనం అవుతుందని చెప్పడంతో రూ.500 టికెట్లు తీసుకున్నాం. క్యూ లైన్లోకి వచ్చి గంటన్నర గడచినా చిన గాలిగోపురం వద్దే పోలీసులు నిలిపేశారు. టికెట్లు కొనని వారిని మాత్రం పంపించారు. ఇదేం అన్యాయం అని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను పంపిస్తూ టికెట్లు కొన్న భక్తులను గంటల తరబడి నిలబెట్టేశారు’. ఇది ఒక్క నందిని అభిప్రాయమే కాదు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల అందరి విమర్శ.విజయవాడస్పోర్ట్స్: ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడో తేదీన దసరా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొండను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని భక్తులతో పాటు, ఉత్సవ విధులకు హాజరైన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తొలి రోజు నుంచే పోలీసుల దౌర్జన్యంపై పలువురు అధికారులు, సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. మంగళవారం పోలీసుల తీరు మరింత శృతిమించడంతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై ఎన్నడూ లేని విధంగా నల్ల రిబ్బన్లతో నిరసనలు కొనసాగాయి. అన్నింటా వారే.. పోలీస్‌శాఖ అధికారులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించిన తరువాత దసరా ఉత్సవాలు ప్రారంభం కావడం కొన్నేళ్లగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అమ్మవారు తమ ఆడపడుచని, ఉత్సవం తమదేననే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దసరా ఉత్సవాలకు దేవదాయ శాఖ 1,200 మంది, మునిసిపల్ 1,500 మంది, ఎన్సీసీ 400 మంది, రెవెన్యూ 300 మంది, వైద్య–ఆరోగ్య 250 మంది, అగి్నమా పక శాఖ 150 మంది అధికారులు, సిబ్బందిని ఉత్సవాలకు కేటాయించగా. పోలీస్ శాఖ మాత్రం ఆరు వేల మందిని కొండ చుట్టూ మోహరించింది. భక్తులకు అవసరమైన సేవలను దేవదాయ, రెవెన్యూ, మునిసిపల్, ఎన్సీపీ, వైద్య ఆరోగ్య శాఖలు అందిస్తుంటే రక్షణ పేరుతో వచ్చిన పోలీసులు పెత్తనం చెలాయిస్తున్నారు. మహామంటపం దిగువనున్న లిఫ్ట్‌ను పూర్తిగా స్వాదీనం చేసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మినహా ఎవరినీ లిఫ్ట్‌లోకి అనుమతించడం లేదని, క్యూ లైన్ సజావుగా సాగకుండా నిరంతరం అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజే దేవదాయ శాఖ ఇంజినీర్‌ను పోలీసులు అడ్డుకుని జులుం ప్రదర్శించారు. దీంతో సదరు ఉద్యోగి మహామంటపం కింద పోలీసుల కోసం వేసిన టెంట్లు, కురీ్చలను తొలగించేశారు. ఈ పంచాయితీ రాష్ట్ర సచివాలయం అధికారులు వరకు వెళ్లింది. లిఫ్ట్‌ల వద్ద పోలీసులు చేస్తున్న అతికి నిరసనగా అదే లిఫ్ట్‌ల వద్దే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను డంప్ చేస్తున్నారు. ఓం రింగ్ నుంచి ప్రొటోకాల్ వరకు వెళ్లకుండా ఓ న్యాయమూర్తిని పోలీసులు ఇబ్బంది పెట్టారు. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి సదరు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రూ.500 టిక్కెట్లు కొన్న భక్తులను నిలిపివేసి, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పోలీసులు పంపించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్, వినాయకుడి గుడి, ఘాట్‌రోడ్డు గాలిగోపురం ప్రాంతాల్లో తమను నిలిపివేస్తున్నారని, ఆలయంపై వరకు బైక్‌లను అనుమతించడం లేదని, తమను ఆలయంలోకి వెళ్లనీయడంలేదని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు అసభ్యకరంగా ఉందని పోలీస్ కమిషనర్ వద్ద పలువురు మహిళలు వాపోయారు. ఉత్సవ సేవా కమిటీలో ఉన్న తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నల్ల రిబ్బన్లతో నిరసన ఖాకీల తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు మంగళవారం ఆందోళనకు దిగారు. మీడియా పాయింట్ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరసన కొనసాగింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకున్న పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హుటా హుటిన మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. మీడియా పాయింట్ నుంచే డీజీపీ అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. డీజీపీ వెళ్లే సమయంలో పోలీస్ శాఖకు వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తే పరువు పోతుందని గ్రహించి, వారితో చర్చలు జరిపారు. డీసీపీ గౌతమి సాలి తీరు సరిగ్గా లేదని సీపీకి మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మీడియా వాళ్లను కొండపైకి అనుమతించవద్దని డీసీపీ పదేపదే ఆదేశాలిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని సీపీ హామీ ఇవ్వడంతో మీడియా ప్రతినిధులు నిరసన విరమించారు. ఆ వెంటనే అదే మార్గంలో డీజీపీని అమ్మవారి దర్శనానికి సీపీ వెంట బెట్టుకుని వెళ్లారు. -
మహిళలపై టీడీపీ నేత వేధింపులు
శింగనమల: అతనో టీడీపీ చోటా నేత. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా అనధికారికంగా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మహిళా కూలీలపై కన్నేశాడు. తన పక్క మీదకు వస్తేనే బిల్లులు చేస్తానంటూ వేధించసాగాడు. చివరకు అర్ధరాత్రి.. అపరాత్రి అని కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యకర సంభాషణలు కొనసాగిస్తుండడంతో విసుగు చెందిన మహిళలు తమను కాపాడాలంటూ నేరుగా ఎస్పీని ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపురం జిల్లా శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ను తప్పించి ఆ స్థానానికి తన పేరును టీడీపీ నాయకుడు శ్రీనివాసులు నాయుడు ప్రతిపాదించుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఆయనకు అందలేదు. అయినా ‘ప్రభుత్వం మాది, అంతా మేము చెప్పినట్లే నడుచుకోవాలి’ అనే ధోరణితో ఫీల్డ్ అసిస్టెంట్ తానేనంటూ చలామణి అవుతున్నాడు. తరచూ ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి మహిళా కూలీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.కొంత మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి రాత్రి సమయంలో ఫోన్లు చేస్తూ అసభ్యకర సంభాషణ సాగించాడు. తన పక్కమీదకు వస్తేనే బిల్లులు చేస్తానని, లేకపోతే ఎవరొచ్చి చెప్పినా వినేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విసుగు చెందిన మహిళలు వారం కిందట శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు.. శ్రీనివాసులు నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే మిన్నుకుండి పోయారు. ఈ క్రమంలో అతని వేధింపులు తారస్థాయికి చేరాయి. దీంతో బాధితులు పలువురు సోమవారం అనంతపురంలో జిల్లా ఎస్పీ జగదీష్ ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఫోన్లో శ్రీనివాసులు నాయుడు మాట్లాడిన సంభాషణకు సంబంధించి వాయిస్ రికార్డులు వినిపించారు. అతని నుంచి తమకు రక్షణ కలి్పంచాలని వేడుకున్నారు. -
హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన
-
కర్నూలులో ‘నారాయణ’ వీడియోల కలకలం..
కర్నూలు సిటీ: ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి.. జూనియర్ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్‌లు ఆ వీడియోలను డీన్ లింగేశ్వరరెడ్డి వాట్సాప్‌కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు. మరికొంత మంది బ్లాక్మెయిల్ తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయసాగారు. దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బ్లాక్‌మెయిలర్స్‌ను పిలిపించి సెల్ఫోన్లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. నిందితులను కర్నూలు రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన ఉద్యోగులను కోర్ డీన్ హైదరాబాద్‌కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి -
చిచ్చుపెట్టిన బైక్‌ర్యాలీ!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం గులాబీ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని రెండు వర్గాలు ఇప్పటివరకు మాటల తూటాలు, విమర్శలకే పరిమితమయ్యాయి. ద్విచక్రవాహన ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో మరింత వివాదాస్పదంగా మారాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్నేతలు శుక్రవారంనాడు ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో పాటు పాలకవర్గం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీలో తన తనయుడితో కలిసి కాపు సీతాలక్ష్మి వెళ్తున్న బైక్‌ను, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ వాహనం వెనుకనుంచి ఢీకొట్టడంతో సీతాలక్ష్మి కిందపడిపోయారు. యూసుఫ్ కావాలనే తన వాహనాన్ని ఢీకొట్టారంటూ సీతాలక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు కొందరు యూసుఫ్‌తో వాగ్వాదానికి దిగగా.. ప్రమాదవశాత్తూ జరిగిందంటూ కొందరు యూసుఫ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. టూటౌన్ సీఐ రాజు ఇరువర్గాలను సమదాయించి పంపించేశారు. కాగా, చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు సంఘీభావం తెలిపారు. నేను మహిళను, దండం పెడతా అన్నా.. ‘నేను ప్రయాణిస్తున్న బైక్‌ను యూసుఫ్ అప్పటికే రెండుసార్లు ఢీకొట్టారు. ‘ఆగన్నా నేను మహిళను.. మీకు దండం పెడతా...’ అని చెప్పినా వినిపించుకోలేదు. అలాగే ముందుకొచ్చాడు. నా కుమారుడికి చెప్పి బండి పక్కకు ఆపి ఇంటికొచ్చేశా. మహిళనని చూడకుండా అగౌరవపరిచారు. చైర్‌పర్సన్‌కే రక్షణ లేకుంటే సాధారణ మహిళలు బయటికి ఎలా వస్తారు? యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానంతో పాటు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లాను’ అంటూ కాపు సీతాలక్ష్మి శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కొత్తగూడెం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ‘చైర్పర్సన్ డ్రైవర్ నాగరాజు బండి తొలుత నా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి నా బండి చైర్పర్సన్ వాహనాన్ని ఢీకొంది. అంతే తప్ప దురుద్దేశంతో చేయలేదు’అంటూ యూసుఫ్ మరో వీడియోలో స్పందించారు. -
బాలిక పట్ల అసభ్య ప్రవర్తనకు ఐదేళ్ల జైలు శిక్ష
విజయవాడ లీగల్: ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కమ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో బాధిత బాలిక కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. నిందితుడు షేక్ బాజీ (44) అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2016 మార్చి 19వ తేదీ సాయంత్రం స్నేహితులతో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపిన నిందితుడు టెర్రస్‌పైకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను కోర్టు విచారించింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
వైద్యం కోసం వెళితే వాంఛ తీర్చమన్నాడు..
కోనేరు సెంటర్(మచిలీపట్నం), కంచికచర్ల: వైద్యం కోసం వెళ్లిన ఓ దళితురాలిని కోరిక తీర్చమంటూ వేధించాడు ఓ వైద్యుడు, ప్రతిఘటించిన ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ కామాంధుడు సదరు దళితురాలిని కులం పేరుతో ధూషించగా ఆ బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని, పోలీసులకు వివరించి రక్షణ కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వైద్యుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నందిగామ మండలం కంచికచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగింది. (చదవండి: ‘నీ మరదల్ని చంపేశా.. వెళ్లి చూసుకోండి’) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచికచర్లకు చెందిన ప్రముఖ ఎముకల వైద్యుడు పిడికిటి రాజేంద్ర విజయవాడలో పిడికిటి క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన కంచకచర్ల మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఒక దళిత మహిళ ఎముకలకు సంబంధించిన సమస్యతో వైద్యం కోసం డాక్టర్ రాజేంద్ర వద్దకు వెళ్లింది. డాక్టర్ రాజేంద్ర వైద్య పరీక్షలు అంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చమంటూ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను కులం పేరుతో ధూషిస్తూ మరింత రెచ్చిపోయాడు. బాధితురాలు నేరుగా కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పి రాజేంద్రపై ఫిర్యాదు చేసింది.(చదవండి: అంతులేని విషాదం: చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది) కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం రాజేంద్రను కంచికచర్లలో అదుపులోకి తీసుకున్నారు. నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, సీఐ కె సతీష్‌ల సమక్షంలో తమదైన శైలిలో విచారణ చేశారు. అనంతరం అరెస్ట్‌చేసి కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడినుంచి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 41 నోటీసు జారీ చేసి అతన్ని విడుదల చేశారు. ఇదిలా ఉండగా డాక్టర్ పిడికిటి రాజేంద్ర మాజీ మంత్రి దేవినేని ఉమాకు స్వయానా బంధువు కాగా, ఈ కేసు నుంచి అతన్ని తప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే రాజేంద్ర కంచికచర్లలో ప్రముఖ సీనియర్ వైద్యుడి కుమారుడు కావటంతో ఈ కేసు కంచికచర్లలో చర్చనీయాంశంగా మారింది. -
వైద్యం పేరుతో వికృత చేష్టలు
ఏలూరు టౌన్: ఏలూరు నగరం వన్‌టౌన్ ప్రాంతంలో ఒక యువతిపై వైద్యం పేరుతో లైంగిక దాడికి ప్రయత్నించిన పారామెడికల్ వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు వన్‌టౌన్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్ నవాబ్‌పేట మారుతీనగర్ ప్రాంతంలో క్లినిక్‌ను పి.సత్యానందం నిర్వహిస్తున్నాడు. అతను ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఒక కంటివైద్యశాలలో పారామెడికల్ వైద్యునిగా పనిచేస్తున్నాడు. స్థానికంగానూ క్లినిక్ నిర్వహిస్తూ వైద్యం అందిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక యువతి తలనొప్పితో బాధపడుతూ ఆదివారం క్లినిక్‌కు వచ్చింది. మరోసారి సోమవారం తన తమ్ముడిని తీసుకువెళ్లింది. అయితే వైద్యుడు సత్యానందం యువతికి ఒక ఇంజెక్షన్ చేశాడు. తల తిరుగుతుందని, కొంచెం సేపు ఓర్చుకోవాలంటూ ఆమెకు చెప్పాడు. ఇదే క్రమంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో యువతి గట్టిగా కేకలు వేసింది. బయట ఉన్న యువతి సోదరుడు లోనికి వెళ్లి అడ్డుకున్నాడు. బంధువులకు సమాచారం ఇవ్వటంతో వారంతా క్లినిక్ వద్దకు చేరుకుని వైద్యునికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్సై రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన
వడోదర: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అతుల్ బెదాడే తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాడు. తాను కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమ్ క్రికెటర్లతో అతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. దాంతో బెదాడేను సస్పెండ్ చేస్తున్నట్లు బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) ప్రకటించింది. ఈ మేరకు బెదాడేకు లేఖ రాసిన కార్యదర్శి అజిత్ లెలె పలు అంశాలు వెల్లడించారు. ‘మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయడంలాంటివి’... బెదాడేపై వచ్చిన ప్రధాన ఆరోపణలని ఆయన చెప్పారు. క్రికెటర్ల రాతపూర్వక ఫిర్యాదు తర్వాత తాము విచారణ జరపడంతో అనేక విషయాలు బయటపడ్డాయని లెలె పేర్కొన్నారు. ప్రస్తుతానికి సస్పెండ్ చేసినా... ఈ అంశంపై ఇక ముందు పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా బీసీఏ ప్రకటించింది. 53 ఏళ్ల అతుల్ బెదాడే 1994లో భారత్ తరఫున 13 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు. -
విద్యార్థినిని కిడ్నాప్‌కు యత్నించలేదు
సాక్షి, ఆమనగల్లు: పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆటోతో పాటు ఒమన్ దేశానికి చెందిన ఓ నిందితుడి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. గురువారం సాయంత్రం కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న బాలిక తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటోలోని యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం స్థానిక ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కడ్తాల మండలం నార్లకుంట తండాకు చెందిన బాలిక ఆమనగల్లులోని కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిత్యం స్వగ్రామం నుంచి పాఠశాలకు వచ్చి వెళ్తుండేది. ఈక్రమంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు బాలిక నార్లకుంట తండాకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిలబడి ఉంది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఆటోను చూసి ప్యాసింజర్ ఆటోగా భావించి ఆపి అందులో ఎక్కింది. ఆటోలో ఉన్న యువకుడు విద్యార్థినిని పొగతాగుతావా.. అంటూ చేయి పట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర భయాందోళనకు గురై ఆటోలో నుంచి కిందికి దూకడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటన విషయం వెంటనే విఠాయిపల్లి సమీపంలో ఆటోతోపాటు అందులో ఉన్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. బాధితురాలి వాంగ్మూంలం మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు ఇమ్రన్ హుస్సేన్(ఒమన్ దేశస్తుడు), మహ్మద్ సాజిద్(చంద్రాయణగుట్ట)గా గుర్తించి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ స్నేహితులు. ఆటోతోపాటు ఇమ్రాన్ హుస్సేన్ పాస్‌పోర్టును సీజ్ చేశామన్నారు. అయితే, మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతలను చూసేందుకు నిందితులు ఇద్దరూ మూడు రోజుల క్రితం బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రన్ హుస్సేన్ తల్లి పాతనగరవాసి, తండ్రి ఒమన్ దేశస్తుడు. ఇతడు తరచూ మేనమామల ఇంటికి వస్తుంటాడని సీఐ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఆమనగల్లు ఎస్ఐ ధర్మేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: విద్యార్థినితో ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన -
ఎయిర్పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, శంషాబాద్ : శంషాబాద్‌లో ముగ్గురు యువకులు హంగామా చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని పట్ల మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. ఎయిర్ పోర్ట్‌లో డ్యూటీ ముగించుకుని శంషాబాద్‌లో క్యాబ్ దిగి నడుచుకుంటూ వస్తున్న యువతిపై వెనకాలే బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు మద్యం చల్లారు. ఒక్కసారిగా ఊహించని ఘటన ఎదురవ్వడంతో షాక్‌కు గురైన యువతి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో కేకలు విన్న యువకులు మద్యం బాటిళ్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సంఘటనపై యువతి ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కూతురిపై లైంగికదాడికి ప్రయత్నించిన తండ్రి..
అమీర్‌పేట: కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే లైంగిక దాడికి యత్నించాడోవ్యక్తి. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్కూల్ టీచర్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి తెలిపిన మేరకు..అమీర్‌పేట లీలానగర్‌లో సయ్యద్ (46) పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బీఎస్ మక్తాలో మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి ముగ్గురు కూతుళ్లు. 13 ఏళ్ల పెద్ద కూతురిపై పలుమార్లు లైంగిక దాడికియత్నించాడు. మూడు రోజుల క్రితం లైంగికంగా వేధించేందుకు యత్నించగా తప్పించుకుని పారిపోయింది. మరుసటి రోజు పాఠశాలలో బాలిక ఎవరితో మాట్లాడకుండా ఉండటంతో గమనించిన టీచర్ ఆరాతీసింది. దీంతో తండ్రి వికృత చేష్టలను తెలిపిది. వెంటనే బాలిక తల్లికి సమాచారం అందించడంతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు సయ్యద్‌ను రిమాండ్‌కు తరలించారు. సయ్యద్‌పై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కేసు నమోదై ఉందని ఎస్ఐ తెలిపారు. -
యువతితో అసభ్య ప్రవర్తన.. ముగ్గురు అరెస్టు!
సాక్షి, ఇబ్రహీంపట్నం : ఫేస్బుక్ పరిచయంతో ఓ విద్యార్థినిని హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మణికంట, ధీరజ్, భాష అనే నిందితులను పోలీసులు అరెస్టు చేసిస విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో దృశ్యాలు మైలవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ రూమ్‌ను బుక్‌చేసుకుని కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది. అనంతరం సెల్ల్లో చిత్రీకరించిన వ్యక్తులు మొదటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. వీడియోను ఫేస్బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, మణికంఠ అనే స్నేహితుడితో లాడ్జికి తాను వెళ్లానని, అక్కడ అతని స్నేహితులు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై అత్యాచారయత్నం అభియోగాల కింద కేసు నమోదు చేశారు. -
మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం
గుడివాడ : ఓ మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం ఆలస్యంగా వెలుగు చూసింది. దళిత అధికారి అని కూడా చూడకుండా కులం పేరుతో తిట్టిన టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసులు పెడితే కనీసం పట్టించుకోకపోగా ఆమెపై బదిలీ వేటు వేసిన ఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం.. వేలంపాటలో దక్కలేదనే అక్కసుతోనే... గుడివాడ రూరల్ మండలంలోని కూలిపోయిన అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాల తొలగింపునకు వేలం నిర్వహించారు. మోటూరుకు చెందిన టీడీపీ నేత శేషగిరి వేలంలో పాల్గొనగా వేరే వ్యక్తికి దక్కింది. అతను భవనాలు కూల్చే పనిలో ఉండగా శేషగిరి ఫోన్ చేసి పార్టీ ఫండ్‌గా రూ.25 వేలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తనకు ఎంపీడీవో కె. జ్యోతి కాంట్ట్రాక్టు ఇచ్చారని, ఆమెను అడగాలని చెప్పటంతో రెచ్చిపోయిన ఆ నాయకుడు ఎంపీడీవోను తిట్టినట్లు వినికిడి. కులం పేరుతో ధూషించి అనరాని మాటలు అన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఆమె టీడీపీ నాయకుడు శేషగిరి తనను ఏ మని తిట్టాడో కాంట్రాక్టర్‌తో లేఖ రాయించుకున్నారు. టీడీపీలో రెండు వర్గాలుగా విడిపోయి.. విషయం తెలియగానే టీడీపీలోని ఓ వర్గం ఎంపీడీవోకు ఫోన్ చేసి శేషగిరిపై అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పారు. మరోవైపు టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కేసు పెట్టడానికి వీల్లేదని చెప్పినట్లు వినికిడి. అయితే తనకు జరిగిన అవమానంతో ఆమె గుడివాడ రూరల్ స్టేషన్లో శేషగిరిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది. టీడీపీ కార్యాలయంలో పంచాయతీ.. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎంపీడీవోను పిలిపించి పంచాయితీ పెట్టారు. కేసు వెనక్కి తీసుకోవాలని వత్తిడి తెచ్చారు. ఎంత చెప్పినా ఆమె వినకపోవటంతో నీవు వైఎస్సార్ సీపీ నేతలకు పనులు చేస్తున్నావని అభియోగం మోపారు. దీనిపై ఆమె ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. రాజీ కుదరకపోవడంతో బదిలీ వేటు.? రాజీకి రాలేదని ఎంపీడీవోపై బదిలీ వేటు వేశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తో మాట్లాడి ఏ కారణం లేకుండానే ఆమెను పెదపారుపూడి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. -
విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన
ఇబ్రహీంపట్నం : ఫేస్బుక్ పరిచయంతో ఓ విద్యార్థినిని హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైలవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ రూమ్‌ను బుక్‌చేసుకుని కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు తెలిసింది. బెదిరింపులు.. అనంతరం సెల్ల్లో చిత్రీకరించిన వ్యక్తులు మొదటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. వీడియోను ఫేస్బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరిం చారు. కొండపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ముగ్గురి మధ్య పంచాయతీ నిర్వహించారు. విషయం పోలీసులకు తెలియటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లైంగిక దాడి జరగలేదు : సీపీ ఓ టీవీ చానల్లో మంగళవారం ప్రచారమైనట్లుగా ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్ గ్రాండ్ హోటల్లో యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. చానల్లో గ్యాంగ్ రేప్ వార్త చూసిన వెంటనే తాము అప్రమత్తమై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. హోటల్‌కు వచ్చి వెళ్లిన యువతి ఆచూకి తెలుసుకుని ఆమెతో మాట్లాడామని.. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆమె స్పష్టం చేసిందన్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో హోటల్‌కు వెళ్లినమాట వాస్తవమేనని.. అతనితోపాటు మిత్రులు ఇద్దరు హోటల్‌రూమ్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించగా.. ప్రతిఘటించి వారి బారి నుంచి బయటపడ్డానని వివరించారని చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని భయపడి కేసు పెట్టలేదని ఆమె వివరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నగరానికి దూరంగా ఉన్నారని.. రాగానే కేసు పెట్టమని కోరామని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆహారమిచ్చి... అసభ్య ప్రవర్తన
బనశంకరి: మహిళా డీజేతో ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన నగరంలో వెలుగుచూసింది. ఒక పబ్‌లో పనిచేసే మహిళా డీజే ఒంట్లో బాగా లేకపోవడంతో సోమవారం ఇంటికే భోజనం పంపాలని స్విగ్గి యాప్‌లో ఆహారం ఆర్డర్ చేసింది. కొంతసేపటికి విగ్నేష్ అనే పేరుతో డెలివరీ బాయ్ ఆమె అపార్టుమెంటు ఫ్లాట్‌కు వచ్చాడు. అయితే అతడు తలుపు కొట్టకుండా, నేరుగా ఫ్లాట్ లోపలి వరకు రావడంతో ఆమె ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. భోజనం తీసుకుని బిల్లు చెల్లించి ఇంట్లోకి బయలుదేరింది. యువకుడు వెంబడించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చేసుకోగా గట్టిగా శబ్ధం రావడంతో పొరుగు ఫ్లాట్‌లోని కుక్కలు గట్టిగా మొరగడంతో డెలివరీ బాయ్ ఉడాయించాడు. ఈ ఘటనపై బాధిత మహిళ ఫేస్బుక్ ద్వారా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రోగితో డాక్టర్ అసభ్య ప్రవర్తన..చితకబాదిన స్థానికులు
-
అసభ్య డాక్టర్‌కు దేహశుద్ధి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వైద్యం కోసం బిడ్డను తీసుకువచ్చిన తల్లిని వేధింపులకు గురిచేశాడో వైద్యుడు. రాత్రివేళల్లో ఫోన్లు చేస్తూ, అసభ్య మెసేజ్‌లు పంపుతూ హింసించాడు. డాక్టర్ చేష్టలతో విసుగెత్తిన ఆమె.. తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. ఆమె భర్త, బంధువులు ఆస్పత్రికి వచ్చి ఆ వైద్యుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. విజయవాడలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. జాతీయ ఆరోగ్య కార్యక్రమమైన రాష్ట్రీయ బాల స్వాస్థ్య (ఆర్బీఎస్) విభాగాన్ని ఇక్కడి పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఆర్బీఎస్లో భాగమైన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(డీఈఐసీ)ను పిల్లల ఓపీ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌కు ‘డౌన్ సిండ్రోమ్’తో పుట్టిన తన బిడ్డకు వైద్యం చేయించేందుకు విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా డీఈఐసీకు వస్తోంది. పాపకు పరీక్షలు చేస్తూ డాక్టర్ ఇమ్రాన్ తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాక ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం, రాత్రివేళల్లో ఫోన్ చేసి విసిగించడం లాంటివి చేసేవాడు. రోమియో వైద్యుని చేష్టలకు ఆ మహిళ విసిగిపోయి బంధువులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు డాక్టర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వచ్చిన 20 రోజులకే: డాక్టర్ ఇమ్రాన్ కృష్ణా జిల్లా గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు వైద్యునిగా పనిచేసే వాడు. విజయవాడలోని పాఠశాలల్లో వైద్య పరీక్షలతో పాటు, డీఈఐసీలో పోస్టు ఖాళీగా ఉండటంతో గత నెల 18న ఆయన్ని ఇక్కడ నియమించారు. విధుల్లో చేరి 20 రోజులు కాకముందే వివాదంలో చిక్కుకున్నారు. -
ఆలయంలో అపచారం
నిర్భయ వంటి చట్టాలు వచ్చినా మహిళల భద్రతకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఎంతో ప్రసిద్ధి చెందిన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఓ మహిళతో ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. అక్కడ పనిచేసే మహిళా స్వీపర్‌పై అక్కడే పనిచేసే ఓ ఉద్యోగి ఆలయ ప్రాంగణంలోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వారం రోజుల క్రితం ఆలయంలో పని చేసే స్వీపర్ రామలక్ష్మి (పేరు మార్చాము) రోజూ లాగానే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచిన అనంతరం అద్దె గదుల్లో చెత్త ఊడుస్తోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఆలయ అటెండర్ వెంకటరమణ ఎవరూ లేనిది గమనించి ఆ గదిలోకెళ్లి తలుపునకు గొళ్లెం పెట్టి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ఆమె ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డితో పాటు ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. అక్కడి ఉద్యోగులకు కూడా విషయాన్ని చెప్పింది. కానీ వారి నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో జరిగిన ఘోరాన్ని తన భర్తకు చెప్పి ఆవేదన చెందింది. అన్యాయానికి ఖరీదు కట్టిన టీడీపీ నేత రామలక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని తన భర్తతో కలిసి స్థానికంగా ఓ టీడీపీ నేత వద్దకు వెళ్లి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి కూడా అంతకు ముందే సదరు నేతను కలవడంతో చేసేది లేక అన్యాయానికి వెల కట్టే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ ఇక లాభం లేదని నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీలక్ష్మి వెంటనే స్పందిస్తూ నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో నిందితుడు వెంకటరమణపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 506, 342 కింద కేసు (క్రైం.నెం314/2017) నమోదు చేశారు. సీఐ శ్రీధర్ ఈ కేసును విచారిస్తున్నారు. అటెండర్‌ను సస్పెండ్ చేశాం ఆలయంలో మద్యం సేవించి స్వీపర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆలయ అటెండర్ వెంకటరమణను అధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, ఆలయ సహాయ కమిషనర్ -
మహిళలను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి
వేలూరు: వానియంబాడి సమీపంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, పురుషులపై దాడి చేస్తున్న యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేశారు. వేలూరు జిల్లా వానియంబాడి బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 30 ఏళ్ల వయసు గల యువకుడు తిరుగుతున్నాడు. శనివారం వానియంబాడిలో వారపు సంత కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు సంతకు వచ్చారు. చూడడానికి మతిస్థిమితం లేని వాడిగా ఉన్న ఆ యువకుడు బస్సు కోసం వేచి ఉన్న మహిళా ప్రయాణికుల దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సైకో అని భావించి మహిళలు పరుగులు తీశారు. అరుునప్పటికీ ఆ యువకుడు మహిళలను వెంటపడుతూ అడ్డుగా వచ్చిన పురుషులపై దాడి చేశాడు. దీంతో కొందరు యువకులు అతన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం సీకే రోడ్డుకు వెళ్లిన అతడు అదే చేష్టలు చేయడంతో స్థానిక యువకులు పట్టుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. వానియంబాడి టౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి విచారించారు. యువకుడు తమిళం, తెలుగులో సరళంగా మాట్లాడుతున్నాడు. మతిస్థిమితం లేని వాడిగా ప్రవర్తించాడు. పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. -
పోకిరీ కార్పొరేటర్
♦ విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్య ప్రవర్తన ♦ విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు నిర్వాకం ♦ కేసు నమోదు చేసిన ఆర్జీఐఏ పోలీసులు సాక్షి, హైదరాబాద్: విమానంలో మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ 25 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుపై శంషాబాద్ విమానాశ్రయంలోని ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సుధాకర్ కథనం ప్రకారం... హైదరాబాద్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీలో ఓ యూనివర్సిటీలో పనిచేసే మహిళా ఫ్రొఫెసర్ రీతూవాసు ప్రిమలానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఏఐ-544 విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరారు. హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళుతున్న ఈ విమానంలోనే ఆమె పక్కసీట్లోనే కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు కూర్చున్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు మహిళా ప్రొఫెసర్‌ను తన కాలివేళ్లతో పదేపదే తాకడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. కార్పొరేటర్ ప్రవర్తనపై బాధితురాలు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావుపై పోలీసులు 354 సెక్షన్(మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్‌ను పోలీసులకు అప్పగించాల్సిన ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో అతడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆర్జీఐఏ పోలీసులు వెంటనే కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు సమాచారం అందించగా, వెంకటేశ్వరరావు ఆలోపే అక్కడి నుంచి జారుకున్నట్లు సమాధానమిచ్చారు. అతడిని పట్టుకునేందుకు చట్టపరంగా ముందుకెళతామని సీఐ సుధాకర్ తెలిపారు. ఎయిర్ ఇండియా సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే నిందితుడు ఈపాటికి కటకటాల్లో ఉండేవాడని పోలీసులు అంటున్నారు. కేంద్ర మంత్రి ఆరా : విమానంలో కార్పొరేటర్ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కేంద్రమంత్రి మేనకా గాంధీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మేనకా గాంధీ తెలంగాణ సీఎం కార్యాలయానికి ఫోన్ చేశారు. దీంతో అక్కడి అధికారులు పోలీసులను సంప్రదించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలను వారు మేనకకు వివరించినట్లు సమాచారం. బాధితురాలు రీతూవాసు కేంద్రమంత్రికి సన్నిహితురాలని తెలిసింది. కాగా, విమానంలో మహిళా ప్రొఫెసర్ పట్ల టీడీపీ కార్పొరేటర్ అసభ్య ప్రవర్తనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడలో మేయర్ శ్రీధర్ వాహనాన్ని అడ్డుకున్నాయి. పొంతన లేని వాదన : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉమ్మడి వెంకటేశ్వరరావును రక్షించుకొనేందుకు అధికార టీడీపీ కార్పొరేటర్లు పొంతనలేనివాదన వినిపించారు. విమానంలో ఆయన పక్కసీట్లో కూర్చున్న మహిళకు 60 ఏళ్లు ఉంటాయన్నారు. విమానం ఎక్కిన దగ్గర నుంచీ ఆమె అందరితో గొడవ పడిందన్నారు. అయితే వెంకటేశ్వరరావుపైనే ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. ఇదిలా ఉండగా... శంషాబాద్ ఎయిర్ ఇండియా సెక్యూరిటీ అధికారుల ఆదేశాల మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. తాను ఏ తప్పూ చేయలేదని, నిద్రలో పొరపాటున తన కాలు మహిళకు తగిలిందని అతడు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
విద్యార్థినిని వీడియో తీసిన పాఠశాల టీచర్
ఇదేం వైపరీత్యం.. ⇒ విద్యార్థినితో కరస్పాండెంట్ కుమారుడి అసభ్య ప్రవర్తన ⇒ వీడియో తీసిన పక్క పాఠశాల టీచర్ దాన్ని షేర్ చేసిన కరెస్పాండెంట్ ⇒ బెదిరింపులకు పాల్పడ్డ మీడియా ప్రతినిధులు కేపీహెచ్‌బికాలనీ: ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో మరో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ను వీడియో తీసి ఇతరులకు షేర్ చేసిన ఉదంతంలో బాలానగర్ పోలీసులు నిందితులైన ఇద్దరు పాఠశాల కరెస్పాండెంట్లను, విద్యార్థిని అరెస్ట్ చేశారు. సీఐ బిక్షపతిరావు తెలిపిన మేరకు.. గత నెల 30న కోమటిబస్తీకి చెందిన ఓ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాల కరస్పాండెంట్ కుమారుడు భవనంపైకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఈ విషయాన్ని పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్కూల్ టీచర్ గమనించి సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసింది. ఆ వీడియోను పాఠశాల కరస్పాండెంట్‌కు చూపించడంతో అతను తన ప్రత్యర్థి పాఠశాల కరస్పాం డెంట్‌పై ఉన్న కోపంతో వీడియోను ఇతరులకు షేర్ చేసి ప్రచారంలో పెట్టాడు. దీంతో ఇద్దరు స్థానిక మీడియా ప్రతినిధులు పాఠశాల కరస్పాండెంట్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఈనెల 6న తెలుసుకున్న విద్యార్ధిని కుటుంబీకులు, స్థానిక బస్తీవాసులు ఆగ్రహాంతో ఇరు పాఠశాలల కరస్పాండెంట్లను, మీడియా ప్రతినిధులను నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులైన ఇద్దరు కరస్పాండెంట్లు సురేష్, విజయ్‌కుమార్‌లతో పాటు ఇద్దరు మీడియా ప్రతినిధులను, విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్ధిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
విమానంలో అసభ్య ప్రవర్తన, అరెస్ట్
కోయంబత్తూరు: విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోయంబత్తూరు- చెన్నై ఇండిగో విమానంలో ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్, ఇతర మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. విచక్షణ మర్చిపోయి ప్రవర్తించడంతో పాటు, ఎయిర్ హోస్టెస్ ను సెల్ ఫోన్ లో ఫోటో తీయడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మిగతా సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపైనా కేసు నమోదయ్యాయి. వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా నిందితుల్లో ఒకరు హిందూ మహాసభ నేత కాగా మరో ఇద్దరు న్యాయవాదులు కావటం శోచనీయం. ఈ ఘటన గత రాత్రి చెన్నై ఇండిగో విమానంలో జరిగింది. సెంథిల్ కుమార్, రాజా... విమానం ఎక్కిన దగ్గర నుంచి పెరున్దురైకి చెందినవారు కాగా, స్వామినాథన్ ట్రిచ్చివాసి. -
యువతికి మత్తు మందు ఇచ్చి.. డాక్టర్ అసభ్య ప్రవర్తన
కంటోన్మెంట్: ఆసుపత్రికి వచ్చిన ఓ యువతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి తరఫు బంధువులు వెల్లడించిన వివరాల మేరకు లాల్బజార్లో ఉండే ఓ యువతి (20) సోమవారం సాయంత్రం చర్మ వ్యాధికి సంబంధించి స్థానికంగా ఉండే గీత నర్సింగ్ హోంకు వెళ్లింది. అక్కడ ఉండే డాక్టర్ ఇంజక్షన్ ఇస్తానని చెప్పి బెడ్‌పై పడుకోబెట్టాడు. ఆమె చేతికి ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే మత్తులోకి జారుకుంది. తన కళ్లముందు జరుగుతున్న సంఘటనలు గుర్తిస్తున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సత్తువలో అచేతనంగా ఉండిపోయింది. కొద్దిగా శక్తిని కూడదీసుకున్నాక తన మిత్రుడికి ఫోన్ చేయడంతో అతను హుటాహుటిని ఆసుపత్రికి చేరుకున్నాడు. అతను వెళ్లేసరికి కుర్చీలో ఆ యువతి కుర్చీలో నీరసంగా పడిపోయి ఉంది. ఆమె సెల్‌ఫోన్ కిందపడిపోయి ఉంది. ఈ సందర్భంగా ఆమె తన మిత్రుడికి జరిగిన ఘటనను వివరించింది. అయితే అమ్మాయి నీరసంగా ఉండటంతో ఇంజక్షన్ ఇవ్వగా నిస్సత్తువలోకి జారుకుందని డాక్టర్ బుకాయించాడు. అయితే తనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాక శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతి తన మిత్రుడికి తెలిపింది. వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఛీ ఛీ ఇదేం దూషణ!
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఓ ఉన్నతాధికారి నిర్వాకం - మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య ప్రవర్తన - ‘సాక్షి’తో గోడు చెప్పుకున్న బాధితులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఏయ్.. పచ్చ రంగు చీర కట్టుకున్నదాన.. నిన్నే..! ఇటురా.. మీటింగ్‌కు వచ్చావా? లేక.. ’ ఈ మాటలు ఎవరో సభ్యత లేని మనిషివి కావు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి అధికారి.. నర్సులను, మహిళా ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్దేశించి అంటున్న మాటలు. ఉన్నతస్థాయి అధికారి దూషణ పర్వాన్ని తట్టుకోలేక కొంత మంది బాధితులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘వైద్య విధ్వంసం’పై ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన మహిళా ఉద్యోగులు.. ‘మీరు రాస్తున్న కథనాలతో పాటు మా వ్యథను కూడా ప్రచురించండి’ అని కోరారు. ఇంతకాలం మౌనంగా భరించిన వారు.. తమ బాధను బట్టబయలు చేశారు. ఆ చూపులు భరించలేం... ఇటీవల సమావేశానికి వచ్చిన ఓ మహిళా ఉద్యోగిని ఉద్దేశించి ‘ఏమే.. బొట్ల బొట్ల చీరకట్టుకొచ్చినవ్.. షూటింగ్‌కు వచ్చావా?’ అంటూ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటంతో సదరు ఉద్యోగి కన్నీరు మున్నీరుగా విలపించడంతో తోటి ఉద్యోగులు ఓదార్చారు. అదే రోజు జరిగిన విషయాన్ని ఆమె తన తండ్రికి వివరించింది. తండ్రి ఈ విషయాన్ని ఓ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.మరో ప్రభుత్వ ఉద్యోగి భార్యను కూడా ‘ఏమే’ అంటూ ఏకవచనంతో సంబోధించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే చూపులతో ఇబ్బంది పెట్టినట్టు ఫిర్యాదులు అందాయి. తమ ఇంట్లో కూడా చెప్పుకోలేని దుస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెమో ఇప్పించి.... సదరు ఉద్యోగి టార్గెట్ చేసిన మహిళా ఉద్యోగులకు చీటికి మాటికి మెమోలు ఇప్పిస్తారని, వచ్చి నేరుగా కలవాలని తన సబార్డినేట్స్‌తో ఫోన్ చేయిస్తారని, మెమో పట్టుకొని ఆయన ఆఫీసు రూంలోకి వెళ్తే నరకంలోకి వెళ్లినట్లుగా ఉంటుందని ఓ ఉద్యోగి ఉద్వేగానికి లోనయ్యారు. మీసం తిప్పుతూ ‘మీరు చెప్పినట్టు ఇక్కడ సాగవు’ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారని, ఎదురు మట్లాడితే వేధింపులకు గురి చేస్తారని, చేయని తప్పుకు ఎక్కడ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆవేదనతో ఉన్నామని.. మరో ఉద్యోగి కన్నీళ్ల పర్యంతమయ్యారు. సదరు ఉద్యోగి మీద నిర్భయ చట్టం ప్రయోగిస్తే ఇప్పటి వరకు కనీసం 50 కేసులు పెట్టాల్సి వచ్చేదని మరో ఉద్యోగి ఆక్రోశం వెళ్లగక్కారు. ఇలాంటి అధికారిని తక్షణమే పంపించి మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడాలని వారు కలెక్టర్‌ను కోరుతున్నారు.