మహిళలను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి | Indecent behavior with women person arrest | Sakshi
Sakshi News home page

మహిళలను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి

Published Sun, Nov 27 2016 3:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

యువకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు - Sakshi

యువకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

వేలూరు: వానియంబాడి సమీపంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, పురుషులపై దాడి చేస్తున్న యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేశారు. వేలూరు జిల్లా వానియంబాడి బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 30 ఏళ్ల వయసు గల యువకుడు తిరుగుతున్నాడు. శనివారం వానియంబాడిలో వారపు సంత కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు సంతకు వచ్చారు. చూడడానికి మతిస్థిమితం లేని వాడిగా ఉన్న ఆ యువకుడు బస్సు కోసం వేచి ఉన్న మహిళా ప్రయాణికుల దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సైకో అని భావించి మహిళలు పరుగులు తీశారు.

అరుునప్పటికీ ఆ యువకుడు మహిళలను వెంటపడుతూ అడ్డుగా వచ్చిన పురుషులపై దాడి చేశాడు. దీంతో కొందరు యువకులు అతన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం సీకే రోడ్డుకు వెళ్లిన అతడు అదే చేష్టలు చేయడంతో స్థానిక యువకులు పట్టుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. వానియంబాడి టౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి విచారించారు. యువకుడు తమిళం, తెలుగులో సరళంగా మాట్లాడుతున్నాడు. మతిస్థిమితం లేని వాడిగా ప్రవర్తించాడు. పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement