కోనేరు సెంటర్(మచిలీపట్నం), కంచికచర్ల: వైద్యం కోసం వెళ్లిన ఓ దళితురాలిని కోరిక తీర్చమంటూ వేధించాడు ఓ వైద్యుడు, ప్రతిఘటించిన ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ కామాంధుడు సదరు దళితురాలిని కులం పేరుతో ధూషించగా ఆ బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకుని, పోలీసులకు వివరించి రక్షణ కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వైద్యుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నందిగామ మండలం కంచికచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగింది. (చదవండి: ‘నీ మరదల్ని చంపేశా.. వెళ్లి చూసుకోండి’)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచికచర్లకు చెందిన ప్రముఖ ఎముకల వైద్యుడు పిడికిటి రాజేంద్ర విజయవాడలో పిడికిటి క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన కంచకచర్ల మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఒక దళిత మహిళ ఎముకలకు సంబంధించిన సమస్యతో వైద్యం కోసం డాక్టర్ రాజేంద్ర వద్దకు వెళ్లింది. డాక్టర్ రాజేంద్ర వైద్య పరీక్షలు అంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చమంటూ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను కులం పేరుతో ధూషిస్తూ మరింత రెచ్చిపోయాడు. బాధితురాలు నేరుగా కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘోరాన్ని పోలీసులకు చెప్పి రాజేంద్రపై ఫిర్యాదు చేసింది.(చదవండి: అంతులేని విషాదం: చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది)
కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం రాజేంద్రను కంచికచర్లలో అదుపులోకి తీసుకున్నారు. నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, సీఐ కె సతీష్‌ల సమక్షంలో తమదైన శైలిలో విచారణ చేశారు. అనంతరం అరెస్ట్‌చేసి కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడినుంచి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 41 నోటీసు జారీ చేసి అతన్ని విడుదల చేశారు. ఇదిలా ఉండగా డాక్టర్ పిడికిటి రాజేంద్ర మాజీ మంత్రి దేవినేని ఉమాకు స్వయానా బంధువు కాగా, ఈ కేసు నుంచి అతన్ని తప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే రాజేంద్ర కంచికచర్లలో ప్రముఖ సీనియర్ వైద్యుడి కుమారుడు కావటంతో ఈ కేసు కంచికచర్లలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment