బాయ్ ఫ్రెండ్స్తో కలిసి దాడి చేశారు | hostel girls attacked us, says warden navaneetha | Sakshi
Sakshi News home page

బాయ్ ఫ్రెండ్స్తో కలిసి దాడి చేశారు

Published Wed, Jan 15 2014 2:22 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

hostel girls attacked us, says warden navaneetha

హైదరాబాద్: హాస్టల్ ఉంటున్న యువతులపై తన భర్త, అతని స్నేహితులు కలిసి లైంగిక దాడి చేసారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వార్డెన్ నవనీత తెలిపారు. బీఎన్రెడ్డి నగర్ లోని శ్రీ సాయి మణికంఠ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న యువతులపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణ ఆరంభించారు. దీనిలో భాగంగా ఆ హాస్టల్ వార్డెన్ నవనీతను పోలీసులు విచారించారు. కుట్రలో భాగంగానే ఆ మహిళలు ఫిర్యాదు చేసారన్నారు. వారి ప్రవర్తన బాగోలేదని మందలించినందుకు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తనపైన, తన భర్తపైన దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు.
 

శ్రీసాయి మణికంఠ లేడీస్ హాస్టల్ యజమాని నరేష్ తో పాటు అతని స్నేహితులు, తాగిన మత్తులో హాస్టల్ లోని అమ్మాయిలపై లైంగిక దాడికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సంక్రాంతి సందర్భంగా హాస్టల్ లోని విద్యార్థులు ఊరెళ్లారు. బీహార్ కు చెందిన ఐదుగురు యువతులు హాస్టల్ లోనే ఉన్నారు. దీంతో పథకం ప్రకారం, స్నేహితులతో కలిసి లేడీస్ హాస్టల్ యజమాని, విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో  తప్పించుకుని గత రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో సన్నిహితులతో కలిసి మళ్లీ ఉదయాన్నే పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. బాధితులను స్థానికులు అండగా నిలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement