హస్తినాపురం: తనను నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలికి మద్యం తాగించి.. స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ పి.కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, గౌతంరెడ్డి అనే యువకుడు పాఠశాల స్నేహితులు. యువతికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ చేసుకునేందుకు సోమవారం రాత్రి 7.30కు వీరిద్దరూ కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్ కాలనీలోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు.
.. ఆ తర్వాత ఇదే రెస్టారెంట్‌లో గౌతంరెడ్డి గది అద్దెకు తీసుకుని యువతిని తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని కూడా గదికి పిలిచాడు. ఇద్దరు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి గదిలో గౌతంరెడ్డి తో పాటు మరో వ్యక్తి ఉండడంతో తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు చెందిన ఇద్దరు యువకులు అక్కడ నుంచి పారిపోయారు.
.. బాధితురాలు విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టి తీసుకెళ్లగా వారు ఆమె స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే యువతి స్నేహితులు రెస్టారెంట్‌కు వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు గౌతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు శివాజీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment