ప్రతీకాత్మక చిత్రం
మేడ్చల్, సాక్షి: నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కాచిగూడకు చెందిన మైనర్‌కు సదరు యువకులు గంజాయి అలవాటు చేశారు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయంతో ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పడకుండా ఉండిపోయింది. ఈలోపు శరీరంలో మార్పులు రావడంతో బాధితురాలిని, తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి వివరించింది.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. ఆ కేసును నేరెడ్‌మెట్‌కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment