neredmet police station
-
గంజాయి అలవాటు చేసి మరీ గ్యాంగ్ రేప్
మేడ్చల్, సాక్షి: నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన మైనర్‌కు సదరు యువకులు గంజాయి అలవాటు చేశారు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయంతో ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పడకుండా ఉండిపోయింది. ఈలోపు శరీరంలో మార్పులు రావడంతో బాధితురాలిని, తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. ఆ కేసును నేరెడ్‌మెట్‌కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
సుమేధ మృతి: మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన సుమేధ కపూరియా (12) తల్లిదండ్రులు సోమవారం నేరేడ్మెట్ పోలీసులను కలిశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ.. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీరందరిపై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. కాగా, నేరేడ్మెట్లోని కాకతీయ నగర్లో నివాసముండే అభిజిత్, సుకన్య దంపతుల కుమార్తె సుమేధ గత గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లింది. దీన్‌దయాళ్ నగర్‌లోని ఓపెన్ నాలాలో ప్రమాదవశాత్తూ పడి మరణించింది. వరద ఉధృతికి బాలిక మృతదేహం బండచెరువుకు కొట్టుకొచ్చింది. (చదవండి: ‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’) (చదవండి: ఉసురు తీసిన నాలా) -
‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు కడుపుకోత మిగిలిందని సుమేధ కపూరియా తల్లిదండ్రులు సుకన్య, అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని అన్నారు. ఆదివారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా కూతురు ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. సుమేధ మృతిపై మానవ హక్కుల సంఘం స్పందించినందుకు ధన్యవాదాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలా మూసివేయాలి. మా కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారు ఆలోచించుకోవాలి. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారు. నాలా కారణంగానే మా బిడ్డ మరణించడం అధికారుల వైఫల్యం కాదా? అభివృద్ధి చేయలేనప్పడు ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు. మా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు. కాలనీలో ఒక్క సీసీ కెమెరా లేదు. ఘటన జరిన ప్రాంతంలో చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా?’అని సుమేధ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కాగా, నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్లో నివాసముండే 12 ఏళ్ల సుమేధ సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వరద ఉధృతికి సుమేధ మృతదేహం స్థానికంగా ఉండే బండ చెరువుకు కొట్టుకెళ్లింది. (చదవండి: ఉసురు తీసిన నాలా ) -
ఉసురు తీసిన నాలా
నేరేడ్మెట్ (హైదరాబాద్): అమ్మా... కాసేపు ఆడుకొని వస్తానని తల్లికి చెప్పిందా చిన్నారి. సరదాగా సైకిల్ తొక్కుదామని బయటికి వెళ్లింది. ఇక ఎప్పటికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోయింది. నోరు తెరిచిన ఓపెన్ నాలా ఆ పన్నెండేళ్ల బాలికను మింగేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యా నికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయింది. సైకిల్ తొక్కడానికి వెళ్లి అదృశ్యమైన బాలిక చివరకు చెరువులో శవమై తేలింది. కనిపించ కుండా పోయిన దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో బాలిక విగతజీవిగా లభించింది. ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగిన తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద సంఘ టన హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ ఠాణా పరిధిలో... ఈస్ట్ దీనదయాళ్‌నగర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈస్ట్ దీనదయాళ్నగర్ రోడ్ నం.2లోని అద్దె ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగి అభిజిత్ కపూరియా, సుకన్య దంపతులు నివసిస్తున్నారు. రెండు నెలల కిందటే వీరు కాకతీయనగర్ నుంచి దీనదయాళ్‌నగర్‌కు మారారు. వీరికి కూతురు సుమేధ కపూరియా (12), ఒక కుమారుడు ఉన్నారు. కూతురు సుమేధ స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. గురు వారం సాయంత్రం సుమారు 6.15 గంటల ప్రాంతంలో సుమేధ సైకిల్ తొక్కడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అంతర్గత రోడ్లపై 6.26 వరకు సైకిల్ తొక్కుతున్నట్టు కాలనీలోని సీసీ టీవీలో రికార్డయింది. ఆ తరువాత బాలిక అదృశ్యమైంది. రాత్రి 7 గంటలు కావస్తున్నా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలనీలో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వారిని అడిగినా జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కాలనీలోని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రమాదవశాత్తు కూతురు నాలాలో పడిపోయిందా? అనే అనుమానం కలిగింది. బాలిక అదృశ్యమైన విషయం స్థానికులకు తెలియడంతో వారూ తల్లిదండ్రులతో కలిసి వెతకడం ప్రారంభించారు. మూడు గంటల పాటు గాలించినా జాడ తెలియలేదు. గురువారం సాయంత్రం కాలనీలో సైకిల్‌పై వెళుతున్న బాలిక సుమేధ (సీసీ టీవీ దృశ్యం) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10 గంటలకు కాలనీకి చేరుకొని అర్థరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 8 గంటలకు రెస్క్యూ బృందం వచ్చి గాలింపు మొదలుపెట్టింది. కాలనీలోని మురుగునీరు వెళ్లే బండచెరువు నాలాలో రెస్క్యూ బృందం వెతుకుతుండగా సుమేధ తొక్కిన సైకిల్ లభించింది. అదే నాలా వెంట గాలిస్తూ సుమారు రెండు కి.మీ.దూరంలో ఉన్న బండచెరువు వద్దకు వెళ్లిన రెస్క్యూ బృందానికి బాలిక సుమేధ విగతజీవిగా లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కాసేపు ఆడుకొని వస్తానని చెప్పి వెళ్లిన కూతురు...చెరువులో శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం చూసి కాలనీ వాసులు కంటతడిపెట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు. ఎవరు తెచ్చిస్తారు? తన కూతురు మరణానికి కారణం ఎవరని సుమేధ తండ్రి అభిజిత్ కపూరియా ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం ఓపెన్‌నాలా వల్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే బాలిక సుమేధ ప్రమాదానికి గురై మరణించిందని స్థానికులు తీవ్రంగా విమర్శించారు. బాలిక అదృశ్యమైన విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేసినా స్పందించలేదని, సకాలంలో గాలింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహారించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్ దీనదయాళ్నగర్ను సందర్శించి నాలా పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాలిక మృతిపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కలివిడిగా ఉండేది చిన్నారి సుమేధ మా దగ్గర భరత నాట్యం నేర్చుకుంటోంది. రోజూ మధ్యాహ్నాం వేళ ఒక గంట భరత నాట్యం నేర్చుకునేది. మా కాలనీకి వచ్చి రెండు నెలలే అవుతున్నా...గడిచిన నెలన్నర రోజులుగా భరతం నాట్యం నేర్చుకోవడానికి వచ్చేది. నాట్యంలో మెళకువలను ఇట్టే గ్రహించేది. స్నేహితులతోనూ కలివిడిగా ఉండేది. షీ ఈజ్ వెరీ షార్ప్. నాట్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మా ఇంట్లోని కుక్కపిల్లతో చాలాసేపు ఆడుకునేది. పెట్స్ అంటే ఇష్టమని సుమేధ చెబుతుండేది. మాతో కలిసిపోయి ఆడుతూపాడుతూ ఉండే చిన్నారి నాలాలో పడి మృతి చెందటం బాధ కలిగించింది. –అర్షిత, నాట్య శిక్షకురాలు ప్రమాదమేనా? బాలిక సుమేధ అదృశ్యం, మృతి సంఘటన ప్రమాదమా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నాలాలో పడి.. అందులో కొట్టుకుపోయి చనిపోయిందా? ఎవరైనా పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైకిల్ తొక్కుతుండగా బాలికతో ఎవరైనా మాట్లాడారా? నాలాలో పడితే రెండు కి.మీ. దూరంలోని చెరువు వరకు కొట్టుకుపోయినా.. బాలిక ముక్కు నుంచి రక్తం రావ డం మినహా ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ‘సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన సుమేధ నాలా వద్ద నుంచి వెళుతుండగా చూశాను. తరువాత ఆమె కోసం వెతుకుతున్నారని తెలిసి నాలా ప్రాంతంలో గాలించాం’ అని కాలనీవాసి జ్ఞానకుమార్ తెలిపారు. -
నా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు?
సాక్షి, హైదరాబాద్ : ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతిచెందిన చిన్నారి సుమేధ మృత దేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. వారు ఉస్మానియా ఆసుపత్రి నుంచి సుమేధ మృతదేహంతో ఇంటికి చేరుకోగా.. చిన్నారి మృతదేహం చూసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పాపను చివరిసారిగా చూసేందుకు కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో చిన్నారి ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ( విషాదం: చెరువులో శవమై తేలిన సుమేధ ) ఈ సందర్భంగా సుమేధ తండ్రి మాట్లాడుతూ.. రేపు సుమేధ అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపారు. తన కూతురు మరణానికి కారణం ఎవరని ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
విషాదం: చెరువులో శవమై తేలిన సుమేధ
సాక్షి, మేడ్చల్: నేరెడ్‌మెట్‌లో అదృశ్యమైన సుమేధ కపూరియా (12) కేసు విషాదంతమైంది. బాలిక మృత దేహం శుక్రవారం మధ్యాహ్నం బండచెరువులో లభ్యమైంది. కాగా, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్ కాలనీలో నివాసముండే సుమేధ గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేయించగా.. బండ చెరువులో బాలిక విగత జీవిగా కనిపించింది. (చదవండి: ఇంటి నుంచి బయటికెళ్లిన బాలిక అదృశ్యం) -
బాలిక అదృశ్యం: కిడ్నాప్ చేశారేమో!
సాక్షి, మేడ్చల్: సైకిల్ తొక్కుకుంటూ ఇంటినుంచి బయటికెళ్లిన ఓ బాలిక అదృశ్యం కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని నేరెడ్మేట్ కాకతీయ నగర్లో గురవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగుచూసింది. కాకతీయ నగర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నసుమేధ కపురియా (12) నిన్న సాయంత్రం సైకిల్ తీసుకొని బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిగిరి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, నిన్న కురిసిన భారీ వర్షానికి దీన్ దయాళ్ నగర్లో నాళాలు పొంగిపొర్లాయని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో నాలా వద్ద జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీంలతో గాలింపు చేపట్టగా బాలిక సైకిల్ కనిపించింది. సుమేధ నాలాలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖైరాలీ పబ్లిక్ స్కూల్లో సుమేధ 5 వ తరగతి చదుతున్నట్టు తెలిసింది. (చదవండి: ప్రగతి భవన్: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) కిడ్నాప్ చేశారు..! బాలిక గల్లీలో ఉన్నపెద్ద నాలాలో పడి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అక్కడ ఉన్న ఓపెన్ నాలాలో బాలిక సైకిల్ లభించడంతో మోరీపై ఇళ్ల ముందున్న పైకప్పును తొలగంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తమ పాప నాలాలో పడి తప్పిపోయిందని అనుకోవడం లేదని బాలిక తల్లి సుకన్య చెప్తున్నారు. ఎవరైనా తమ బిడ్డను కిడ్నాప్ చేశారేమోనని భావిస్తున్నట్టు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: కరోనాతో మాదాపూర్ ఎస్ఐ మృతి) -
ఊరెళ్తామని 696 మంది దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ అనుమతి నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు నేరేడ్మెట్ ఠాణాతో పాటు తహసీల్దార్ కార్యాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం ఉదయమే వివిధ రంగాల్లో పని చేస్తున్న డివిజన్ పరిధిలోని వలస కార్మికులు, కూలీలు పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో నేరేడ్మెట్ సీఐ నర్సింహా్మస్వామి, తహసీల్దార్ గీత పర్యవేక్షణలో పోలీసులు కార్మికులతో మాట్లాడారు. తమ సొంత ఊళ్లకు వెళతామని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్లతోపాటు పూర్తి వివరాలతో వలస కారి్మకులకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, ఓడిశా రాష్ట్రాల్లోని సొంత గ్రామాలకు వెళ్లేందుకు 696మంది వలస కారి్మకులు దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్ గీత ‘సాక్షి’తో చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతితో కారి్మకులను వారి సొంత గ్రామాలకు తరలించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. -
డైట్ కాలేజీలో నిరుద్యోగి ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం లేక నిరాశ చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరగడం కలకలం రేపింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైట్ కాలేజీలో రవి కుమార్ (32) ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియనప్పటికీ.. సరైన ఉద్యోగం లేకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. అందరూ చూస్తుండగానే రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో రవికుమార్ ప్రాణాలు తీసుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అదే కాలేజీలో జెండా కూడా ఎగురవేశామని అన్నారు. -
కన్నపేగే కర్కశంగా మారింది
హైదరాబాద్: నవ మాసాలు మోసిన తల్లే తన కన్న కుమారుడి పట్ల కర్కశంగా మారింది లాలించి గోరుముద్దలు తినిపించాల్సిన వయసులో కాల్చిన కడ్డీతో వాతలు పెట్టింది. ఈ అమానవీయ ఘటన నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ఎన్.చంద్రబాబు కథనం ప్రకారం... మౌలాలికి చెందిన రేష్మ(22)కు డోర్నకల్‌కు చెందిన అమీర్‌పాషాతో 2008లో పెళైలంది. వీరికి ఇద్దరు కుమారులు. మనస్పర్థలు రావడంతో భార్యాభర్తలు ఇటీవల విడాకులు తీసుకున్నారు. రేష్మా ఏడాది క్రితం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన మహేష్‌తో రెండో వివాహం చేసుకుంది. పెద్ద కుమారుడు రేష్మా తల్లి దండ్రుల వద్ద ఉంటుండగా, చిన్న కుమారుడు ఆయాన్(5) రేష్మా, మహేష్‌లతో పాటు ఉంటున్నాడు. కాగా రేష్మా సోదరుడు రిజాజ్ ఇటీవల ఆయాన్‌ను తమకు దత్తత ఇవ్వాలని అడిగాడు. దీంతో రూ. 50 వేలు ఇస్తే కుమారుడు ఆయాన్‌ను ఇస్తానని చెప్పింది. రిజాజ్ డబ్బులు ఇవ్వకపోవడంతో రేష్మా కుమారుడు ఆయాన్‌ను ఒంటిపై పెదవులు, పిరుదులు,కాళ్లు,చేతులు, మర్మాంగంపై ఈనెల 4న వాతలు పెట్టింది. రియాన్ తీసుకువెళ్లడానికి మంగళవారం ఇంటికి వచ్చిన రియాజ్ బాలుడి దుస్థితి చూసి వెంటనే నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . ఇదిలా ఉండగా కుమారుడు ఆయాన్ చెప్పినట్లు వినడం లేదని, కాలనీలో ఉన్న బాయి వద్దకు తరుచు వెళ్తున్నాడని, వెళ్లవద్దని వారించినావినడం లేదని దీంతో భయం పెట్టాలని ఉద్దేశంతో వాతలు పెట్టినటు రేష్మా చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఐపిసి 384,324,506 సెక్షన్లప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని పసిపిల్లాడి కర్కశంగా వాతలు పెట్టిన కన్న తల్లిపై హత్యా కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చేయాలని మానవ హక్కుల సంఘం నాయకులు అనురాధ డిమాండ్ చేశారు.