నా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? | Sumedha Father Cries After Watching Lifeless Body Of Her In Hyderabad | Sakshi
Sakshi News home page

నా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు?

Published Fri, Sep 18 2020 6:22 PM | Last Updated on Fri, Sep 18 2020 6:33 PM

Sumedha Father Cries After Watching Lifeless Body Of Her In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతిచెందిన చిన్నారి సుమేధ మృత దేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. వారు ఉస్మానియా ఆసుపత్రి నుంచి సుమేధ మృతదేహంతో ఇంటికి చేరుకోగా.. చిన్నారి మృతదేహం చూసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పాపను చివరిసారిగా చూసేందుకు కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో చిన్నారి ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ( విషాదం: చెరువులో శవమై తేలిన సుమేధ )

ఈ సందర్భంగా సుమేధ తండ్రి మాట్లాడుతూ.. రేపు సుమేధ అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపారు. తన కూతురు మరణానికి కారణం ఎవరని ప్రశ్నించారు. నాలాను నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన ‍వ్యక్తం చేశారు. తన కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, సుమేధ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ కన్నీరు మున్నీరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement