
పాపన్నపేట(మెదక్): కాలేజీకి వెళ్లమన్నందుకు ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగె కృష్ణ కూతురు సింధుజ (19) మెదక్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.
నెల రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే దిగాలుగా కూర్చుంటోంది. కళాశాలకు వెళ్లాలని కుటుంబ సభ్యులు శనివారం ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అదేరోజు ఇంట్లో ఉన్న తమ్ముడిని బయటకు పంపిన సింధుజ.. ఉరి వేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆçస్పత్రికి పోలీసులు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment