ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం
కత్తితో పొడిచి యువకుడి హత్య..
నలుగురు నిందితుల అరె
హైదరాబాద్: చిన్న గొడవ కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారితీసిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగి ంది. బాలంరాయి అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజు, యాదమ్మ దంపతుల కుమారుడు బి.తరుణ్ (18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి అత ను స్థానిక శివాలయం సమీపంలోని చౌరస్తాలో ఉన్న ఓ పాన్ షాప్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడి భుజం తరుణ్‌కు తగిలింది.
దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సదరు యువకుడు మరో ముగ్గురిని తీసుకువచ్చాడు. నలుగురూ కలిసి తరుణ్‌తో గొడవకు దిగారు. పరిస్థితి అదుపుతప్పి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తమ గదికి వెళ్లిన వారు కత్తి తీసుకువచ్చి తరుణ్‌ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల అదుపులో నిందితులు..
బేగంపేట పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన శివశంకర్, తరుణ్, జహీరాబాద్‌కు చెందిన పండు, సాయికిరణ్ తరుణ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఈ నెల 1న అంబేడ్కర్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన సాయికిరణ్, బీ తరుణ్ మధ్య మొదట గొడవ జరగ్గా, సాయికిరణ్ మిగతా ముగ్గురిని తీసుకురావడంతో గొడవ పెద్దదై హత్యకు దారితీసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment