
దేశంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఇదే క్రమంలో మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ వడ్డీని పొందవచ్చు. అదే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (Mahila Samman Savings Certificate-MSSC) స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ పథకాన్ని ప్రారంభించింది.
కనీసం రూ.1000.. గరిష్టంగా రూ. 2 లక్షలు
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద కనీసం రూ. 1000.. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 2 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అయితే, మీరు ఖాతా తెరిచిన తేదీ నుండి సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం కింద, మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో మీ భార్య పేరు మీద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను తెరవవచ్చు.
రూ.32,000 వడ్డీ
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కింద మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. ఒక వేళ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, ఈ మొత్తంపై మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీపై మొత్తం రూ. 2,32,044.00 పొందుతారు. అంటే రూ.2 లక్షల డిపాజిట్ పై రూ.32,044 వడ్డీని పొందుతారు.
కుమార్తె లేదా తల్లి పేరుతోనూ ఖాతా
మీకు ఇంకా వివాహం కాకపోతే, మీరు మీ తల్లి పేరు మీద కూడా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మాత్రమే కాదు, మీకు కుమార్తె ఉంటే, మీరు ఆమె పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment