
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మేడ్చల్: నేరెడ్‌మెట్‌లో అదృశ్యమైన సుమేధ కపూరియా (12) కేసు విషాదంతమైంది. బాలిక మృత దేహం శుక్రవారం మధ్యాహ్నం బండచెరువులో లభ్యమైంది. కాగా, నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషిమాత నగర్ కాలనీలో నివాసముండే సుమేధ గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేయించగా.. బండ చెరువులో బాలిక విగత జీవిగా కనిపించింది.
(చదవండి: ఇంటి నుంచి బయటికెళ్లిన బాలిక అదృశ్యం)
Comments
Please login to add a commentAdd a comment