vanastalipuram
-
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
సాక్షి,హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వనస్థలిపురం ఘటనలో స్నేహితుడి అరెస్ట్
హస్తినాపురం: తనను నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలికి మద్యం తాగించి.. స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ పి.కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, గౌతంరెడ్డి అనే యువకుడు పాఠశాల స్నేహితులు. యువతికి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ చేసుకునేందుకు సోమవారం రాత్రి 7.30కు వీరిద్దరూ కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్ కాలనీలోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు... ఆ తర్వాత ఇదే రెస్టారెంట్లో గౌతంరెడ్డి గది అద్దెకు తీసుకుని యువతిని తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని కూడా గదికి పిలిచాడు. ఇద్దరు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి గదిలో గౌతంరెడ్డి తో పాటు మరో వ్యక్తి ఉండడంతో తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు చెందిన ఇద్దరు యువకులు అక్కడ నుంచి పారిపోయారు... బాధితురాలు విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టి తీసుకెళ్లగా వారు ఆమె స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే యువతి స్నేహితులు రెస్టారెంట్‌కు వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు గౌతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు శివాజీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు. -
వనస్థలిపురంలో రేడియో స్టేషన్ టవర్ ఎక్కి వక్తి హల్ చల్..
-
Hyderabad: పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్యకు చెబితే..
సాక్షి, హైదరాబాద్: వనస్థలీపురంలోని సాహెబ్‌నగర్‌లో ఓ భార్య భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఫరూక్ అలీ అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఏడాదిన్నర క్రితం తనను మతాంతర వివాహం చేసుకున్నాడని బాధితురాలు దుర్గ ఆరోపిస్తోంది. మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ప్రేమ పేరుతో మోసం చేసి బంగారం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ విషయమై మొదటి భార్యకు చెబితే ఫరూక్‌ను ఇంట్లో బంధించి.. తనను తీవ్రంగా కొట్టినట్లు చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మహిళా సంఘాలతో భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగానని బాధితురాలు తెలిపింది. అయితే తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని తన భర్త ఫరూక్ అలీతో ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. -
Hyderabad: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. అయితే, వారం రోజుల క్రితం రూ.22 లక్షలతో ఉడాయించిన ప్రవీణ్.. పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టులో లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అనంతరం హయత్ నగర్ కోర్టు.. ప్రవీణ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రవీణ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 30 వరకు ప్రవీణ్ రిమాండ్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలు ఉన్నాయి. నేను ఎలాంటి మోసానికి పాల్పడలేదు. బ్యాంక్‌లో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకే నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నారు. అతి త్వరలో బయటకు వచ్చి బ్యాంక్ మోసాలను బయట పెడతాను. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి సాక్షాలతో నిరూపిస్తాను. బ్యాంక్‌లో లకర్స్‌కి పెట్టాల్సిన కెమెరాను కిందకు పెట్టారు’’ అని తెలిపాడు. జరిగింది ఇది.. నగరంలోని వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 22.53 లక్షల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. డబ్బులు తానే తీసుకెళ్లానని, క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయానని.. మళ్లీ బెట్టింగ్‌లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్యాంక్ మేనేజర్‌కు ప్రవీణ్ మొదట మెసేజ్ చేశారు. అనంతరం మాట మార్చి.. బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియోను బయటకు వదిలాడు. ఆ వీడియోలో బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, అనవసరంగా తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించాడు. ఇది కూడా చదవండి: హైటెక్ దొంగ.. చోరీ చేసిన కార్లను.. -
బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో..
సాక్షి, హైదరాబాద్: వనస్థలీపురం బ్యాంక్ చోరీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానంటూ క్యాషియర్ ప్రవీణ్.. బ్యాంక్ మేనేజర్‌కి మెసేజ్ చేశాడు. బెట్టింగ్‌లో వచ్చేస్తే తిరిగిస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బ్యాంకు ఉద్యోగులకు సమాచారమిచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, రెండ్రోజుల కిత్రం బ్యాంకులో 22 లక్షల 53వేలతో క్యాషియర్ ప్రవీణ్ పరారయ్యాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చదవండి: (పెళ్లింట పెనువిషాదం: జీలకర్ర బెల్లం సమయానికి కుప్పకూలిన వధువు) -
హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం
-
వనస్థలిపురంలో గ్యాంగ్ వార్ కలకలం
-
హైదరాబాద్: వనస్థలిపురం ఏటీఎంలో భారీ చోరీ
-
వనస్థలిపురం: ఏటీఎంలో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలో సోమవారం చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చోటుచేసుకుంది. ఏటీఎం చోరీ చేయడానికి మొత్తం ఐదు మంది ముఠా సభ్యులు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. దుండగుల్లో ఏటీఎంలోకి గ్యాస్ కటర్‌తో ఒక్కరూ మాత్రమే వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (టట్లుబాజీ గ్యాంగ్: కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లు) నాలుగు ఏళ్ల క్రిందట ఇదే ఏటీఎంలో ఈ దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాజా చోరీ నేపథ్యంలో పాత నేరస్థులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులు 6 బృందాలుగా దుండగుల కోసం గాలిస్తున్నారు. ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండవ సారి కూడా దొంగతనం జరిగిందని పోలీసులు భావిసున్నారు. కనీస అలారం సౌకర్యం ఏర్పటుచేయని ఏటీఎం మేనేజ్మెంట్పై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చోరీలో దుండగులు ఏటీఎం నుంచి ఎంత మొత్తం దోచుకెళ్లారనేది తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో కంపించిన భూమి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, వైదేహి నగర్లో గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్క సెకండ్ పాటు భూమి కంపించి శబ్దాలు రావడంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. బీఎన్‌రెడ్డి నగర్ కాలనీల్లో భూమి కంపించిన ప్రాంతంలో గతంలో ఎనరాళ్లు ఉండేవని చెబుతున్నారు. గంట గంటకు ఏమవుతుందో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. -
ఏసీపీ జయరాం సస్పెన్షన్‌పై అధికారుల విచారణ
సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌కు కారణమైన భూ వివాదంలో అధికారుల విచారణ కొనసాగుతోంది. బాధితులు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో రాచకొండ సీపీ కార్యాలయం అధికారులు భూవివాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విచారణా అధికారులు బాధితులతో కలిసి భూమిని పరిశీలించారు. బాచారం సర్వే నెంబర్ 73 నుంచి 101మధ్య సర్వే నెంబర్లలోని 412 ఎకరాల భూమిని పరిశీలించారు. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భూమి వేల కోట్ల విలువ కలిగి ఉంది. సానా సతీష్ బినామీల ఆధీనంలో ఉన్న 412 ఎకరాల్లో వివాదం చోటు చేసుకుంది. ఇటీవల తప్పుడు కేసులు, బెదిరింపులతో భూమి స్వాధీనం చేసుకొని అక్రమంగా ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. కమల ప్రియా ఆటో జనరల్ ఏజన్సీ పేరుతో ఈ వివాదాస్పద భూమిపై భారీ లోన్ కూడా తీసుకున్నారు. కోల్‌కతా ఫైనాన్స్ కంపెనీ నుంచి భారీగా రుణం తీసుకున్న సానా సతీష్ బినామీ కంపెనీ హైపొతికేషన్ పేరుతో ఆ భూముల్లో బోర్డ్ ఏర్పాటు చేశారు. గతంలో టెనెంట్స్‌కు, యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ భూమి అసలు యజమానులు పూణేకు చెందిన రాజా ఆనందరావు కుంటుంబ సభ్యులు. దీంతో సాన సతీష్ డాక్యుమెంట్లు నకిలీ అని రంగారెడ్డి కోర్టులో ఆనందరావు వారసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే భూమిపై ప్రస్తుతం హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో గతంలో తహశీల్దార్, వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విజయా రెడ్డి అనే తహశీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయ్యారు. ఈ కేసుపై ప్రస్తుతం స్పెషల్ టీం అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. పూర్తిగా విచారిస్తే సానా సతీష్‌తో పాటు మరికొందరు పెద్దల పాత్ర ఉంటుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్పై వేటు అమీర్‌పేట: ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడని న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళను ఏసీపీ జయరాం వద్దకు పంపించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంలో కారకుడయ్యాడని నిర్ధారించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా సానా సతీష్ భూ వివాదంలో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ జయరాం కార్యాలయంలోనే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఎస్ఆర్నగర్ నూతన ఇన్స్పెక్టర్గా నర్సింహారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇబ్రహీంపట్నం భూములపై సీబీఐ విచారణ జరిపించాలి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అన్యాక్రాంతముతున్న ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాచారం భూ వివాదంతో పాటు ఓ ప్రైవేటు సంస్థ 500 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి కుంటలు, చెరువులను కబ్జా చేసిందని, ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములు ప్రైవేటు పరం అయ్యాయన్నారు. ఈ విషయంలో స్థానిక ఎంఎల్ఏ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. -
కరోనా పేషంట్ అంత్యక్రియల వివాదంపై హైకోర్టులో విచారణ
-
మంత్రి కేటీఆర్‌కు ఓ మహిళ ట్వీట్
-
నా భర్త జాడ చెప్పండి కేటీఆర్ !
సాక్షి, హైదరాబాద్: కరోనా.. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబసభ్యులు కడచూపునకూ నోచుకోకుండా చేసింది. మాయదారి మహమ్మారి అయిన వాళ్లనూ దూరం పెట్టడంతో ఆ కుటుంబంలోని తండ్రీకొడుకులకు అనాథ శవాల్లా దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. మృతుల్లో ఒకరి భార్య ‘నా భర్త జాడ చెప్పండి సార్’ అంటూ మంత్రి కేటీఆర్‌కు బుధవారం ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేయడంతో.. కరోనా మనుషుల మధ్య అనుబంధాలనూ ఎలా దూరం చేస్తుందో వెలుగుచూసింది. మృతుల్లో ఒకరైన మధుసూదన్ భార్య సైతం కరోనా బారినపడి, ఆస్పత్రి నుంచి డిశ్చారై్జ్జ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే భర్త డిశ్చార్జి అయినట్టు వైద్యులు చెప్పారు. తీరా చూస్తే ఇంట్లో భర్త జాడలేదు. కుటుంబసభ్యులూ పెదవిప్పలేదు. దీంతో ఆవేదన చెందిన ఆమె కేటీఆర్‌కు ట్వీట్ చేయగా.. ఆపై విషయం తెలిసి ఆమె హతాశురాలైంది. కనీసం దహస సంస్కారాల వీడియో అయినా చూపించకపోవడం దారుణమంటూ కన్నీరుమున్నీర వుతోంది. కట్టుకున్న వాడి కడచూపునకూ నోచుకోలేకపోయానని విలపిస్తోంది. పరామర్శించేందుకు వెళ్తే అంటుకుంది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన ఆలంపల్లి ఈశ్వరయ్య కుటుంబం నలభై ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చింది. ఈయన పెద్దకుమారుడు ఆలంపల్లి శ్రీనివాస్ సరూర్‌నగర్ శారదా నగర్లో ఉంటూ మలక్‌పేట గంజ్‌లో పల్లీనూనె వ్యాపారం చేస్తున్నాడు. ఈశ్వరయ్య దంపతులు వనస్థలిపురం ఎ–క్వార్టర్స్‌లో రెండో కుమారుడు మధుసూదన్ వద్ద ఉంటున్నారు. ఏప్రిల్ మూడో వారంలో శ్రీనివాస్‌కు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, అతడిని పరామర్శించేందుకు తండ్రి ఈశ్వరయ్య సహా తల్లి, సోదరుడు మధుసూదన్ వెళ్లారు. సాధారణ చికిత్సతో జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చి, ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 26న ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇదే సమయంలో మధుసూదన్ తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను ఇంట్లో నిర్వహించారు. హుడా సాయినగర్‌లో ఉండే ఆయన అత్త సహా ఎస్‌కేడీనగర్‌లోని సోదరి కుటుంబసభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు. మరోపక్క శ్రీనివాస్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన తల్లిదండ్రులు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడు మధుసూదన్, ఆయన భార్య మాధవి, ఇతర కుటుంబసభ్యులు మొత్తం 25 మందిని కింగ్‌కోఠి ఆస్పత్రి క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డలో తండ్రికి..సాహెబ్‌నగర్‌లో కొడుక్కి.. ఆరోగ్యం విషమించి ఏప్రిల్ 29న తండ్రి ఆలంపల్లి ఈశరయ్య (72) మృతిచెందారు. ఆ మర్నాడే రెండో కుమారుడు మధుసూదన్ (42) చనిపోయారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ సహా అప్పటికే ఆ కుటుంబసభ్యులంతా వైరస్ బారినపడటం, ఒక్కొక్కరు ఒక్కో వార్డులో చికిత్స పొందుతుండటం, ఒకరోజు వ్యవధిలోనే కుటుంబంలోని ఇద్దరు చనిపోవడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. మొదట తండ్రి మరణవార్తను పెద్దకుమారుడికి చేరవేశారు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రిలోనే ఉండటంతో కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి. దీంతో కుటుంబసభ్యుల అంగీకారంతో ఆస్పత్రి అధికారులు ఈశ్వరయ్య మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. వారు జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో కరోనా నిబంధనల మేరకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో దహనం చేశారు. మర్నాడే మధుసూదన్ కూడా చనిపోయినట్టు సోదరుడు శ్రీనివాస్‌కు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులెవరూ రాకపోవడంతో తండ్రి మృతదేహంలాగే, తన సోదరుడికీ అంత్యక్రియలు నిర్వహించాలని శ్రీనివాస్ కోరడంతో ఆస్పత్రి అధికారులు ఆయన మృతదేహాన్ని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. ఆయనకు సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. మరోపక్క కరోనా బారినపడి చికిత్సపొందుతున్న మధుసూదన్ భార్య మాధవికి భర్త మృతి వార్తను కుటుంబసభ్యులు చెప్పలేదు. చెబితే ఆరోగ్యం మరింత దెబ్బతినడమే కాక మానసికంగా షాక్‌కు గురవుతుందని భావించారు. భర్త కోలుకున్నాడని చెప్పారు.. చికిత్స తరువాత కోలుకోవడంతో మాధవితో పాటు ఆమె అత్త, పిల్లలు, ఇతర బంధువులను ఈ నెల 17న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యం కావడం, రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు ఉదయం మాధవి తదితరులు ఇంటికి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నప్పడు తన భర్త మధుసూదన్ కోలుకుని ఇంటికి వెళ్లారని వైద్యులు చెప్పడం, తీరా ఇంట్లో ఆయన కనిపించకపోవడంతో మాధవి ఆందోళన చెందారు. ఆరా తీస్తే.. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఆమె మరింత కలత చెందారు. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు, పోలీసులు ఆమె కుటుంబసభ్యులను అప్రమత్తం చేయగా వారు ఆమె వద్దకు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. చివరిచూపు దక్కనివ్వకుండా, కనీసం సమాచారం లేకుండా తన భర్త మృతదేహానికి ఆంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని ఆమె అధికారులను నిలదీశారు. అందరూ ఉన్నా అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారని వాపోయారు. తన బాధను చూడలేకనే పిల్లలు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పెట్టారన్నారు. @KTRTRS Missing case of my husband at Gandhi hospital.... Hello K. Taraka Rama Rao sir, Myself madhavi w/o Madhusudhan(age:42) living with two daughters in vanasthalipuram. As our family members being suffering from corona had admitted in Gandhi hospital & we all had — Alampally Madhavi (@AlampallyMadha3) May 20, 2020 బంధువులే చెప్పొద్దన్నారు.. ఈ ఉదంతంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందించారు. మధుసూదన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులెవరూ రాకపోవడంతోనే, మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనల మేరకే ఆయన మృతదేహానికి జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. అప్పటికే వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరిన ఆయన భార్యకు ఇది తెలిస్తే.. ఆమె మానసికంగా కుంగిపోయి షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందన్న కుటుంబసభ్యుల విజ్ఞప్తితోనే తామీ విషయాన్ని ఆమెకు చెప్పలేదని, ఆ తర్వాత బంధువులు కూడా ఆమెకు ఆయన మరణవార్త చెప్పకపోవడమే సమస్యకు కారణమని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. డాక్టర్లపై ఆరోపణలు తగవు: మంత్రి ఈటల గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారని, వారిపై ఆరోపణలు చేయటం సరికాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆయ న గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల కోసమే ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఏమీ దాయడంలేదన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన మొదట్లో ఎవరన్నా చనిపోతే వారి కుటుంబ సభ్యులు సైతం చూడడానికి భయపడేవారని.. దహన సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రాలేదని తెలిపా రు. అమెరికా, ఇటలీ వంటి దేశాలలో వందలమంది చనిపోతే.. కుటుంబ సభ్యులు లేనివారికి ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయని వెల్లడించారు. బంధువుల సూచనల మేరకే.. గత నెల 29న వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే రోగి కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆసుపత్రిలో చేరారని.. 30న చనిపోయారని మంత్రి ఈటల తెలిపారు. ‘‘దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీకి వచ్చారు. ఆయన ఒకటో తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లో ఉన్నారు. భర్త చనిపోయిన విషయాన్ని భార్యకి చెప్తే షాక్‌కి గురవుతారని, ఇలాంటి సమయంలో చెప్పకుండా ఉండటమే మేలని బంధువులు సూచించారు. దీంతో ఆయన మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి జీహెచ్ఎంసీ సిబ్బందితో దహన సంస్కారాలు నిర్వహించాం’’అని ఆయన వివరించారు. బంధువులకు చెప్పకుండా మధుసూదన్‌కు అంత్యక్రియలు నిర్వహించారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కరోనా నుంచి కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. -
కరోనా: ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిపై హైదరాబాద్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి వనస్థలిపురంలోని జీవన్ సాయి హాస్పిటల్ వారు 6 రోజుల పాటు వైద్యం అందించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి మలక్‌పేటకు చెందిన గ్రౌండ్నట్ షాప్ యాజమానిగా పోలీసులు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తితో సంబంధం ఉన్న మరో 16 మందిని పోలీసులు హోం క్వారంటైన్‌కు తరలించారు. ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్‌లో కరోనా కలకలం పోలీసుపై ఉమ్మేసి.. కరోనా ఉందని అబద్ధం -
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : దీపావళి వేళ హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ టైర్ల గోదాంలో ఆదివారం సాయంత్రం అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో టైర్లు తగలబడిపోవడంతో స్థానిక ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. అనంతరం రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి కావడంలో బాణాసంచా మంటలు ఎగిసిపడి ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
130 కేజీల గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, మహారాష్ట్ర నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును వనస్థలిపురం పోలీసులు రట్టు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తం 130 కేజీల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ముఠాలో ప్రధాన సూత్రధారిగా బానోత్ సుధాకర్‌గా గుర్తించామని అన్నారు. మహారాష్ట్రలో గంజాయిని కేజీ రూ. 2 వేలకు ఖరీదు చేసి, నగరంలో రూ. 7వేలకు అతడు విక్రయించేవాడు. ఇందులో భాగంగా 130 కేజీల గంజాయిను తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసు బృందం వీరిని సోమవారం వలపన్ని పట్టుకుంది. అయితే ఎవరి వద్ద నుంచి గంజాయి రిసీవ్ చేసుకున్నారో తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల పట్టుబడుతున్న ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్మకాలు చేస్తున్నారనీ, అలాంటి ముఠాలపై 'ఎన్డీపీసీ' యాక్ట్‌తో శిక్షలు పడేలా చూస్తున్నామని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో అనేక కేసుల్లో నిందితులకు శిక్షపడే శాతం పెరిగిందనీ, అలానే గంజాయి అక్రమ రవాణా చేసేవారికి పూర్తి స్థాయిలో చెక్ పెడతామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. -
వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
-
నగదు చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్ద జరిగిన నగదు చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏటీఎంలో డబ్బులు వేయడానికి వచ్చిన సిబ్బందిని సుమారు 6 గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆటో ఎక్కడ నుంచి వచ్చింది..దుండగులు ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారా లేక దొంగిలించిన ఆటోనా..అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒకే నెంబర్‌పై రెండు ఆటోలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు వేయడానికి వచ్చిన సిబ్బంది తీరుపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సిబ్బందిలోనే ఎవరైనా దుండుగులకు సమాచారమిచ్చి ఈ చోరీకి కుట్రపన్ని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక టీంలతో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నగరమంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. పురానా పూల్ బ్రిడ్జి వద్ద ఆటోను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనామా కూడలి వద్ద నున్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది నగదు పెట్టెలు తీసుకువచ్చిన సమయంలో వారి దృష్టి మరల్చి రూ.70 లక్షలున్న పెట్టె ఎత్తుకెళ్లిన సంగతి తెల్సిందే. -
ఒకేరోజు నాలుగు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు
-
వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
-
స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి
-
వనస్థలిపురంలో దారుణ ఘటన
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో సాహెబ్‌నగర్‌లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. బస్సులోంచి కిందపడ్డ రబ్బరును అందుకునేందుకు ప్రయత్నించిన ఒకటో తరగతి విద్యార్థిని తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ఆరేళ్ల అంజలి వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్‌లో చదువుతోంది. ఈ రోజు ఉదయం పాఠశాలకు చెందిన బస్సు సాహెబ్‌నగర్ నుంచి విద్యార్థులను తీసుకుని వనస్థలిపురం వస్తోంది. ఈ నేపథ్యంలో బస్సులో కూర్చున్న అంజలి రబ్బరు కింద పడింది. రబ్బరును అందుకునే ప్రయత్నంలో బస్సు నుంచి జారి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అంజలి మృతిచెందిందని వైద్యులు తెలిపారు. కాగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పాటుగా, బస్సు డోర్ వద్ద క్లీనర్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
శోభన్‌బాబు హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: వనస్థలిపురంలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన శోభన్‌బాబు కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హత్యకేసులో నిందితులైన శశిధర్, యాదగిరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మీడియా ముందు హాజరుపరిచారు. గత నెలలో గోవాకు వెళ్లి పేకాట ఆడడంతో రూ.లక్షా 30 వేల నగదును యాదగిరి పోగొట్టుకున్నాడు. యాదగిరి, శోభన్‌బాబులు తిరిగి వచ్చేటప్పుడు ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో పథకం ప్రకారం మరికొందరితో కలిసి హత్య చేశాడు. శోభన్‌బాబుకు యాదగిరి చిన్ననాటి స్నేహితుడు. హత్యకు గురైన శోభన్ బాబు స్వస్థలం నల్లగొండ. రాజేష్, మరికొందరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. -
బస్టాపులోకి దూసుకెళ్లిన కారు
ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు హైదరాబాద్: స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాపులో నిలిచి ఉన్న వారిపైకి ఓ కారు మృత్యువులా దూసు కొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భాగ్యమ్మ తన కారు (ఏపీ 29బీపీ 3677)లో బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్తోంది. ఈ క్రమంలో ఇంజాపూర్ కమాన్ దాటిన తరువాత కారు అదుపుతప్పి బస్టాపులోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో బస్టాపులో ఉన్న ఇంజాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య(70) అక్కడికక్కడే మృతి చెందగా, మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగమ్మ (60) తీవ్రంగా గాయపడింది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చని పోయింది. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన మరో మహిళ అనితకు స్వల్ప గాయాలయ్యాయి. జంగమ్మ, అనిత తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. -
వోల్వో బస్సు దగ్ధం మరో బస్సులో మంటలు
-
వోల్వో బస్సు దగ్ధం.. మరో బస్సులో మంటలు
హైదరాబాద్/ విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల పెను ప్రమాదాలు తప్పాయి. ఒకేరోజు కొన్ని గంటల తేడాతో రెండు ప్రైవేట్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సులో మంటలను అదుపు చేశారు. ఈ రెండు ఘటనల్లో ప్రయాణకులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం: విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం పరవాడపాలెం వద్ద శనివారం వేకువజామున కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి అనకాపల్లికి పెళ్లి బృందంతో వెళుతున్న ఈ బస్సులో పొగలు వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు నుంచి పొగలు వస్తున్నాయని పక్కనే కారులో వెళ్తున్నవారు చెప్పడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. ప్రయాణుకులు కిందకు దిగారో లేదో బస్సులోకి మంటలు వ్యాపించాయి. బస్సు చాలావరకు దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెళ్ళి బృందాన్ని మరో బస్సులో తరలించారు. బస్సులో మంటలు: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వినాయక్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సు వనస్థలిపురం దాటగానే ఒక్కసారిగా పొగ వాసన రావడంతో ప్రయాణికులు ఆప్రమత్తమై బస్సును ఆపించి అంతా తమ సామాన్లతో సహా కిందకు దిగిపోయారు. ముందుగా దిగినవారు చూసేసరికి అప్పటికే బస్సు కింద భాగంలో మంటలు మొదలయ్యాయి. దాంతో వాళ్లు లోపల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ కిందకు దించేశారు. అందుబాటులో ఉన్న నీళ్లను మంటలపై చల్లారు. అయినా పొగలు మాత్రం చాలాసేపటి వరకు ఆగలేదు. బస్సు నాన్ ఏసీ కావడం, కిటికీ అద్దాలు తెరుచుకుని ఉన్న ప్రయాణికులు వాసనను గుర్తించి సకాలంలో అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అదే ఏసీ బస్సు అయి ఉంటే అద్దాలు అన్నీ మూసేసి ఉండేవని, పొగ వాసన కూడా తమకు తెలిసేది కాదని ప్రయాణికులలో ఉన్న నవీన్ అనే యువకుడు 'సాక్షి'కి చెప్పారు. బహుశా ఇంధన ట్యాంకు లీకేజి వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడిన ప్రయాణికులు.. కూకట్ పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడినుంచి సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు రేగాయి. అయితే అప్పటికే తెల్లవారడం, మెలకువ వచ్చిన ప్రయాణికులు పొగ వాసనకు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వినాయక్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సు వనస్థలిపురం దాటగానే ఒక్కసారిగా పొగ వాసన రావడంతో ప్రయాణికులు ఆప్రమత్తమై బస్సును ఆపించి అంతా తమ సామాన్లతో సహా కిందకు దిగిపోయారు. ముందుగా దిగివారు చూసేసరికి అప్పటికే బస్సు కింద భాగంలో మంటలు మొదలయ్యాయి. దాంతో వాళ్లు లోపల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ కిందకు దించేశారు. మంటల మీద దగ్గర అందుబాటులో ఉన్న నీళ్లు చల్లారు. అయినా పొగలు మాత్రం చాలాసేపటి వరకు ఆగలేదు. బస్సు నాన్ ఏసీ కావడం, కిటికీ అద్దాలు తెరుచుకుని ఉన్న ప్రయాణికులు వాసనను గుర్తించి సకాలంలో అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అదే ఏసీ బస్సు అయి ఉంటే అద్దాలు అన్నీ మూసేసి ఉండేవని, పొగ వాసన కూడా తమకు తెలిసేది కాదని ప్రయాణికులలో ఉన్న నవీన్ అనే యువకుడు 'సాక్షి'కి చెప్పారు. బహుశా ఇంధన ట్యాంకు లీకేజి వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడిన ప్రయాణికులు.. కూకట్ పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడినుంచి సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. -
వనస్థలిపురంలో వైఎస్ విజయమ్మ బర్త్‌డే వేడుకలు
-
‘కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళ్తా’
- అదనపు కట్నం కోసం భర్త వేధింపులు - అత్తింటి ముందు మహిళ ధర్నా హైదరాబాద్: కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన మధు, శ్రీలత దంపతులకు ఒక కుమార్తె ఉంది. గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగరీత్యా ఉంటున్న మధు.. భార్య శ్రీలతను కట్నం కోసం వేధిస్తున్నాడు. వివాహ సమయంలో 50 తులాల బంగారంతోపాటు ఎకరం భూమి ఇచ్చినా అతని కట్న దాహం తీరలేదు. ఇంకా కట్నం తెస్తేనే అమెరికా తీసుకెళతానని తెగేసి చెప్పాడు. ఇందుకు అతని తల్లి, తోబుట్టువులు సహకరిస్తున్నారు. దీంతో శ్రీలత శుక్రవారం కుటుంసభ్యులతో కలిసి అత్తింటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. -
వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శ్రీలత రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
వారం వ్యవధిలోనే 8 నెమళ్లు మృతి
-
రెండు ఏటీఎంలలో చోరికి యత్నం
-
రెండు ఏటీఎంలలో చోరికి యత్నం
హైదరాబాద్ : వనస్థలిపురం సమీపంలోని చింతలకుంటలో దొంగలు హల్చల్ చేశారు. ఏకకాలంలో రెండు బ్యాంకుల ఏటీఎంలలో చోరికి గుర్తుతెలియని దుండగులు విఫలయత్నం చేశారు. ఎస్బీఐ, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
హైకోర్టు కాలనీలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: ఇంటి ముందు పూలు కోస్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురం పరిధి, హైకోర్టు కాలనీలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన జయమ్మ ఇంటి ముందు పూలు కోస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వనస్థలిపురంలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపింది. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న విద్యార్థి చందూని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన కిడ్నాపర్లు అక్కడ చందూ పై దాడి చేసి చితక బాదారు. చందూ కిడ్నాప్ కు గురైనట్టు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు సకాలంలో చందూ ఆచూకీ కనిపెట్టారు. కిడ్నాపర్ల దాడిలో తీవ్రగాయాలపాలైన చందూను హాస్పటిల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో చందూ ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో విలేకరికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలోని సుష్మాథియేటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీరాల కృష్ణ(28) అనే సాక్షి విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన కృష్ణను ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు
హైదరాబాద్: నిబంధనలు పాటించకుండా భూమి కేటాయింపులు జరిపారని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్యను వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి ఆయన భూమిని కేటాయించిన కేసులో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. హయత్ నగర్ మండలం తుర్కయాంజల్‌లోని సర్వే నంబర్ 52లో పది ఎకరాల భూమిని నిబంధనలు పాటించకుండా డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్య మంజూరు చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. -
వనస్థలిపురంలో స్టూడెంట్స్ వార్.. రాళ్లతో దాడి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ఘర్షణ పడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. వీరి మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారడంతో ఇరువర్గాల విద్యార్థులు రాళ్లతో దాడిచేసుకున్నారు. ఈ ఘటన వనస్థలిపురంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు బైకులపై వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వకున్నారు. వారి మధ్య ఘర్షణకు గల కారణాలు తెలియలేదు. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు రాళ్లు రువ్వుకోవడంతో అక్కడి స్థానికులు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన విద్యార్థులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విద్యార్థుల ఘర్షణపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వనస్థలిపురంలో అగ్నిప్రమాదం
వనస్థలిపురం: నగరంలోని వనస్థలిపురం ఎన్జీవో కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం కాలనీలోని రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించి పక్క భవనాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి మంటలను అదుపు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో కారు బీభత్సం
-
వనస్థలిపురంలో కారు బీభత్సం.. ఒకరి మృతి
హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ బ్రేక్ బదులు ఎక్సలేటర్‌ను తొక్కడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శుక్రవారం ఉదయం మారుతి ఆల్టో కారు డ్రైవర్ తత్తరపాటుతో ఎక్సలేటర్ తొక్కడంతో విజయవాడ రహదారిపై రాఘవేంద్ర హోటల్ సమీపంలో అదుపుతప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తర్వాత రోడ్డు దాటుతున్న ఎస్.సారంగపాణి (65) అనే వ్యక్తి పైకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారు డ్రైవర్ పరారైయ్యాడు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. (తుర్కయాంజల్) -
చావు ఎలా వస్తుందో చెప్పలేం!
హైదరాబాద్: వనస్థలిపురం ఆటోనగర్‌లో విషాదం నెలకొంది. కార్ల షెడ్డులో పని చేసే కార్మికుడు అక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. కొన్ని కొన్ని సందర్భాలలో చావు ఎలా వస్తుందో చెప్పలేం. కారును పైకి లేపి మరమ్మతులు చేస్తుండగా, అది లక్ష్మణ్ అనే కార్మికుడిపై పడింది. ఆ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెంటనే ఆ షెడ్డు యజమాని పారిపోయాడు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. -
క్రేన్ కిందపడి చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. హస్తినాపురంలో శుక్రవారం ఉదయం ఓ బాలుడు క్రేన్ కిందపడి మృతి చెందాడు. హస్తినాపురంలో నర్సరీ చదువుతున్న విద్యార్థి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన క్రేన్ వాహనం బాలుడుని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. స్తానికుల వెంటనే స్పందించి క్రేన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని స్తానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏ కంటి పాపనో
-
తల్లి శవం వద్ద 9 నెలల బాబు!
-
తల్లి శవం వద్ద 9 నెలల బాబు!
-
తల్లి శవం వద్ద 9 నెలల బాబు!
హైదరాబాద్: అప్పటివరకు భుజాన ఎత్తుకున్న తల్లి ఒక్కసారిగా రోడ్డుపక్కన కుప్పకూలి కిందపడి చనిపోయింది. చెంత తనవారు ఎవరూ లేరు. చేతిలో నుంచి తల్లి వదిలివేయడంతో 9 నెలల బాబు తల్లి శవం పక్కన కూర్చొని గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్నాడు. వనస్థలిపురం సమీపంలోని ఆటోనగర్ వద్ద మంగళవారం రాత్రి 7.30 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీసులు ఈ హృదయవిదారక దృశ్యం చూశారు. సమీపంలో ఆమెకు సంబంధించినవారు ఎవరూలేరు. తల్లి మూర్చవచ్చి కిందపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. తాము గుర్తించిన వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి తల్లి మృతదేహాన్ని ఉస్మానియ ఆస్పత్రికి తరలించినట్లు వనస్థలిపురం సిఐ గోపాలకృష్ణ చెప్పారు. 1098కు ఫోన్ చేసి శిశువిహార్ వారికి విషయం చెప్పి బాబుని వారికి అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాబు సారధి స్టూడియో సమీపంలోని శిశువిహార్‌లో ఉన్నాడు. బాబు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు శిశువిహార్ సూపరింటెండెంట్ స్వరూప చెప్పారు. -
భార్యకు భర్త వేధింపులు
-
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
-
హాస్టల్ యువతుల పట్ల యజమాని అసభ్య ప్రవర్తన
-
బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి దాడి చేశారు
హైదరాబాద్: హాస్టల్ ఉంటున్న యువతులపై తన భర్త, అతని స్నేహితులు కలిసి లైంగిక దాడి చేసారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వార్డెన్ నవనీత తెలిపారు. బీఎన్‌రెడ్డి నగర్ లోని శ్రీ సాయి మణికంఠ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న యువతులపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణ ఆరంభించారు. దీనిలో భాగంగా ఆ హాస్టల్ వార్డెన్ నవనీతను పోలీసులు విచారించారు. కుట్రలో భాగంగానే ఆ మహిళలు ఫిర్యాదు చేసారన్నారు. వారి ప్రవర్తన బాగోలేదని మందలించినందుకు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తనపైన, తన భర్తపైన దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. శ్రీసాయి మణికంఠ లేడీస్ హాస్టల్ యజమాని నరేష్ తో పాటు అతని స్నేహితులు, తాగిన మత్తులో హాస్టల్ లోని అమ్మాయిలపై లైంగిక దాడికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సంక్రాంతి సందర్భంగా హాస్టల్ లోని విద్యార్థులు ఊరెళ్లారు. బీహార్ కు చెందిన ఐదుగురు యువతులు హాస్టల్ లోనే ఉన్నారు. దీంతో పథకం ప్రకారం, స్నేహితులతో కలిసి లేడీస్ హాస్టల్ యజమాని, విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో తప్పించుకుని గత రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో సన్నిహితులతో కలిసి మళ్లీ ఉదయాన్నే పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. బాధితులను స్థానికులు అండగా నిలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
హాస్టల్ యువతుల పట్ల యజమాని అసభ్య ప్రవర్తన
హైదరాబాద్ : రక్షణగా ఉండాల్సిన హాస్టల్ యజమానే .... యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వనస్థలిపురం బీఎన్ రెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. శ్రీసాయి మణికంఠ లేడీస్ హాస్టల్ యజమాని నరేష్ తో పాటు అతని స్నేహితులు, తాగిన మత్తులో హాస్టల్ లోని అమ్మాయిలపై లైంగిక దాడికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సంక్రాంతి సందర్భంగా హాస్టల్ లోని విద్యార్థులు ఊరెళ్లారు. బీహార్ కు చెందిన 5 మంది యువతులు హాస్టల్ లోనే ఉన్నారు. దీంతో పథకం ప్రకారం, స్నేహితులతో కలిసి లేడీస్ హాస్టల్ యజమాని, విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో తప్పించుకుని గత రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించకపోవడంతో సన్నిహితులతో కలిసి మళ్లీ ఉదయాన్నే పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. బాధితులను స్థానికులు అండగా నిలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా యువతుల ఫిర్యాదుతో నరేష్....హాస్టల్ బోర్డు పీకేశాడు. -
ప్రేమకు తల్లి బలి
-
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం జరిగింది. కూతరును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని బంధువులు చితక్కొట్టారు. అడ్డువచ్చిన అతని తల్లిపై సైతం దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన లక్ష్మణ్ తన కుటుంబసభ్యులతో కలిసి వనస్థలిపురంలోని సాయి సప్తగిరి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అదే జిల్లా పోచంపల్లికి చెందిన రాంచంద్రారెడ్డి కూడా అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. రామచంద్రారెడ్డి కూతురు సుష్మ- లక్ష్మణ్‌లు సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. సుష్మ తండ్రి ప్రేమకు అడ్డుచెప్పడంతో వారిద్దరి మధ్య కొద్దిరోజులు మాటలు లేవు. అయితే ఈ మధ్యే వాళ్లు తిరిగి కలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రామచంద్రారెడ్డి, అతని కుటుంబ సభ్యులు లక్ష్మణ్‌పై దాడి చేశారు. అడ్డు వచ్చిన తమ తల్లిపై దాడి చేశారని.. అందువల్లే ఆమె చనిపోయిందని లక్ష్మణ్ అతని బంధువులు ఆరోపించారు. -
యువకుడిని హత్యచేసి పెట్రోల్‌పోసి నిప్పంటించారు
హైదరాబాద్: వనస్థలిపురం గణేష్ నగర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడిని హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. సగానికిపై కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. హంతకులు ఎవరనేది కూడా తెలియదు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఈ యువకుడిని ఎవరైనా హత్య చేయించి ఉంటారేమోనన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు స్థానికులు ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు.