వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Vanasthalipuram Tire Godown | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం

Published Mon, Oct 28 2019 9:15 AM | Last Updated on Mon, Oct 28 2019 9:22 AM

Fire Accident In Vanasthalipuram Tire Godown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దీపావళి వేళ హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ టైర్ల  గోదాంలో ఆదివారం సాయంత్రం అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో టైర్లు తగలబడిపోవడంతో స్థానిక ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. అనంతరం రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి కావడంలో బాణాసంచా మంటలు ఎగిసిపడి ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement