Tyre Factory
-
అదానీ, అంబానీల చూపు.. ఏపీ వైపు: సీఎం జగన్
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా ప్రకటించారు సీఎం జగన్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 2023 నాటికి రెండో పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్న ఆయన.. ఒక ప్రాంతం అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి అని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో ఏపీకి 17 భారీ పరిశ్రమల ద్వారా 39, 350 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం జగన్.. వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రానున్నాయని చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగంలోనూ 31,671 పరిశ్రమలు రూ.8,285 కోట్లు పెట్టుబడులు పెట్టాయన్నారు. మూతపడ్డ ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు చేయూతనిస్తున్నట్లు.. రూ.1,463 కోట్లతో ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. గతంలో అదానీ సంస్థ పేరు మాత్రం చెప్పుకునే వాళ్లు. కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదానీ అడుగులు ఏపీలో పడ్డాయని, అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు.. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు లక్ష వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని.. 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీనే అనే విషయాన్ని వేదిక సాక్షిగా ప్రకటించారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : దీపావళి వేళ హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ టైర్ల గోదాంలో ఆదివారం సాయంత్రం అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో టైర్లు తగలబడిపోవడంతో స్థానిక ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. అనంతరం రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం 5 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి కావడంలో బాణాసంచా మంటలు ఎగిసిపడి ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
వాహనాలకు ‘నైట్రోజన్’ టైర్లు
న్యూఢిల్లీ: టైర్ల నాణ్యతను పెంచేందుకు టైర్ల తయారీలో రబ్బర్‌తో సిలికాన్ కలపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు. సిలికాన్ కలసిన రబ్బర్ టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్ వాయువు నింపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో టైర్లు పేలే అవకాశాలు తగ్గుతాయని, ఆగ్రాలో రోడ్డుప్రమాదం వంటి ఘటనలు తగ్గుతాయని గడ్కరీ అన్నారు. నోయిడా–ఆగ్రా హైవేలో సోమవారం జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేను యూపీ ప్రభుత్వమే నిర్మించిందని దాంతో కేంద్రానికి ఏ సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్లో రోడ్డు భద్రత బిల్లు గత సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉందని దాన్ని ఆమోదించాలని సభ్యులను కోరారు. అది పాసైతే 30 శాతం బోగస్ లైసెన్స్‌లు రద్దవుతాయన్నారు. దేశంలో 25 లక్షల మంది అనుభవజ్ఞులైన డ్రైవర్ల అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఓ లోక్‌సభ సభ్యుడు చైర్మన్‌గా ఓ కమిటి ప్రారంభిస్తామన్నారు. ఈ కమిటీ ద్వారా రోడ్డు భద్రతా సూచనలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం
వరంగల్ అర్బన్ జిల్లా : ఖాజీపేట మండలం ఐడీబీఎల్‌లోని జై చిరంజీవ టైర్ల పరిశ్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్ డోర్ బ్లాస్టవ్వడంతో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హన్మకొండ లోని మాక్స్ కేర్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వారే. వీరిలో పప్పు రాజ్ బార్ అనే ఆపరేటర్ ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలాన్ని ఖాజీపేట ఏసీపీ సత్యనారాయణ, సీఐ ధర్మసాగర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
-
టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
(యాదాద్రి)భువనగిరి: మండల కేంద్రంలోని జమ్మాపురం సమీపంలోని టైర్ల కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ ప్రాంగణమంతా ఎగసిపడుతున్న మంటలు పొగతో నిండిపోయింది. ఉదయం 4.30 గంటల నుంచి ప్రారంభమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.15 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.