టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం | fire accident in tyre Factory | Sakshi
Sakshi News home page

టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Published Fri, Apr 14 2017 7:58 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in tyre Factory

(యాదాద్రి)భువనగిరి: మండల కేంద్రంలోని  జమ్మాపురం సమీపంలోని టైర్ల కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ ప్రాంగణమంతా ఎగసిపడుతున్న మంటలు పొగతో నిండిపోయింది. ఉదయం 4.30 గంటల నుంచి ప్రారంభమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
 
అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.15 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement