సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. ప్రాథమికంగా షాట్ సర్క్యూట్ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంటలు పూర్తిగా పెరగకముందే బోగీల్లోని ప్రయాణికులను దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడం స్వల్ప ఉపశమనం. మంటల ధాటికి మూడు బోగీలు పూర్తిగా దగ్ధమైమయ్యాయి. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన కారణంగా ఈ రూటులో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
తప్పిన పెనుముప్పు
మంటలు చెలరేగడానికి కచ్చితంగా కారణం ఏంటన్నది తెలియకపోయినా.. కొందరు ప్రయాణీకులు మాత్రం రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నట్టు గమనించామని తెలిపారు. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతూ కనిపించాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తొలుత S4లో మంటలు వ్యాపించాయని చెప్పారు. ఉదయం 11 -11.30 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, మంటలు రావడంతో ప్రయాణీకులు చైన్ లాగి రైలుని ఆపివేశారు. ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. చైన్ లాగకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.
కాగా కాలిపోయిన బోగీల్లో ఎక్కువ మంది విశాఖ వాసులు ఉన్నారు. రిజర్వేషన్ లేకున్నా.. కొందరు స్లీపర్ బోగీల్లో ఎక్కినట్టు గుర్తించారు. మొత్తం మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఫలక్‌నుమా S4, S5, S6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు లింక్ తొలగించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: హైదరాబాద్‌లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ..
Comments
Please login to add a commentAdd a comment