సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్‌తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. మంటల ధాటికి మూడు బోగీలు(S4,S5,S6) పూర్తిగా దగ్ధమయ్యాయి. శుక్రవారం ఉదయం 11.25 నిమిషాలకు ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సహాయక చర్యలను జీఎం అరుణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతున్నట్లు గమనించామని, మంటలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైల్వేశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
సంబంధిత వార్త: Yadadri: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం
కాగా కొన్ని రోజుల క్రితం సౌత్ సెంట్రల్‌కు వచ్చిన బెదిరింపు లేఖ పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ రూట్‌లో బాలాసోర్ వంటి ప్రమాదం జరుగుతుందని ఓ అంగతకుడు లేఖలో హెచ్చరించారు. ఈ లేఖపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ లేఖకు దీనికి ఏమైనా లింక్ అందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ప్రమాదంపై అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. 36912, 82819 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇక హైరా నుంచి హైదరాబాద్‌కు 1550 కిలోమీటర్ల దూరం ఉండగా.. గమ్యం మరో 40 కిలో మీటర్లు ఉందనగా ఈ ప్రమాదం జరిగింది. పగలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన రాత్రిపూట జరిగితే ఎన్ని ప్రాణాలు పోయేవోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా బోగీలతో సికింద్రాబాద్‌కు రైలు ప్రయాణమైంది.
Comments
Please login to add a commentAdd a comment