Railway officials
-
కూ.. చకచకా..
సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే లైన్ల పనులను రైల్వే అధికారులు, సిబ్బంది, కార్మీకులు శరవేగంగా పూర్తి చేశారు. మొత్తంగా 52 గంటల్లో పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్ నడిపించారు. అంతా సవ్యంగా ఉండడంతో బుధవారం మధ్యాహ్నం విజయవాడ– సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కదిలింది. పగలూ.. రాత్రి తేడా లేకుండా...: వరద ఉధృతి పెరిగి తాళ్లపూసపల్లి– కేసముద్రం రైల్వేలైన్‌లోని 432, 433 కిలోమీటరు మార్కు వద్ద 200 మీటర్ల మేర పట్టాల కింద కంకర, మట్టి, సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 418 కిలోమీటర్ రాయి వద్ద 200 మీటర్ల మేర, మరో నాలుగు చోట్ల పాక్షికంగా లైన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో శనివారం అర్ధరాత్రి 2 గంటల నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్మీకులను తీసుకొచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పనులు వేగంగా..: దేశంలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ నడిచే రైలుమార్గం దెబ్బతినడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా, దీంతో మరమ్మతుల పనుల్లో అధికారులు వేగం పెంచారు. ముందుగా డౌన్‌లైన్ పనులు తాళ్లపూసపల్లి– కేసముద్రం మధ్యలో ఏడు జేసీబీలు, 300 మంది కార్మీకులు, 100 మంది సూపర్వైజర్లు, 100 మంది వివిధ కేటగిరీకి చెందిన రైల్వే ఉద్యోగులు ఇలా మొత్తంగా 500 మంది పనిచేశారు. – ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 13 జేసీబీలు, 150 మంది సూపర్వైజర్లు, 300 మంది రైల్వేస్టాఫ్, 550మంది కార్మికులు మొత్తం కలిసి 1000 మందితో పనులు ప్రారంభించారు. పనులకు వరద ప్రవాహం అడ్డురావడంతో బండరాళ్లు, ఇసుక బస్తాలతో వరదను కట్టడి చేసి పనులు వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే అప్‌లైన్ (సికింద్రాబాద్–విజయవాడ) లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు.. కదిలిన రైళ్లు రైల్వే ట్రాక్ పనులు పూర్తి కావడంతో ముందుగా తాళ్లపూసపల్లి– మహబూబాబాద్ మధ్య ట్రయల్ రన్‌గా గూడ్సు రైలును నడిపారు. ఇంటికన్నె–కేసముద్రం మధ్య కేసముద్రం రైల్వేస్టేషన్లో నిలిచిన సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలును ట్రయల్ రన్‌గా నడిపారు. ఆ తర్వాత నాలుగు గూడ్స్ రైళ్లను అప్‌లైన్‌లో పంపించారు. ఇక ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో కేసముద్రం–ఇంటికన్నె మధ్య 418 కిలోమీటర్ మీదుగా వేగాన్ని తగ్గించి 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడిపించారు. రైల్వేట్రాక్ మరమ్మతులు చేసిన చోట కొంతవరకు కుంగిపోయింది. కాగా ట్రాక్ కుంగిపోయిన చోట జాకీలతో పైకి లేపి మరమ్మతు పనులు చేశారు. వర్షం కురుస్తున్నా, పనులను మాత్రం ఆపకుండా వేగవంతంగా చేస్తున్నారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్–విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం–తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం–బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు బెంగళూరు–విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్–తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–భువనేశ్వర్ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా–సికింద్రాబాద్ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్–పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు సికింద్రాబాద్–పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్–సికింద్రాబాద్ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు సికింద్రాబాద్–ధనాపూర్ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 28 వరకు బెంగళూరు–ధనాపూర్ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్–హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ–నర్సాపూర్ (17226), హుబ్లీ–గుంతకల్లు (07337), గుంతకల్లు–హుబ్లీ (07338), బల్గెవి–కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట–బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యేక రైళ్ల పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికం గాను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి 17వ తేదీ వరకు కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268), మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), ఈ నెల 5 నుంచి 18 వరకు గుంటూరు–రాయగడ (17243/17244), బిట్రగుంట–విజయవాడ (07977/07978), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07575), విజయవాడ–గూడూరు (07500), విజయవాడ–గూడూరు (12744), ఈ నెల 4, 5, 6, 8 తేదీలలో విజయవాడ–విశాఖపట్నం (22702), ఈ నెల 9, 11, 12, 13 తేదీలలో విశాఖపట్నం–విజయవాడ (22701), ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు గుంటూరు–విశాఖపట్నం (17239/17240), ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు, అదే విధంగా ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు గూడూరు–విజయవాడ (07458/12743) రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. కాగా, మచిలీపట్నం– విజయవాడ, నర్సాపూర్–విజయవాడ, విజయవాడ–భీమవరం మధ్య రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రత్యేక రైళ్లు పొడిగింపు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాల నుంచి నడుపుతున్న పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు పూర్ణా–తిరుపతి (07609), ఈ నెల 5 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి–పూర్ణా (07610), ఈ నెల 2 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్–నర్సాపూర్ (07631), ఈ నెల 3 నుంచి 31వ తేదీ వరకు నర్సాపూర్–హైదరాబాద్ (07632), ఈ నెల 3 నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–సికింద్రాబాద్ (07481), ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–తిరుపతి (07482), ఈ నెల 1 నుంచి 29వ తేదీ వరకు కాకినాడ టౌన్–లింగంపల్లి (07445), ఈ నెల 2 నుంచి 30వ తేదీ వరకు లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) రైళ్లను పొడిగించారు. -
రైల్లో అలారం చైన్‌కు లగేజీ తగిలిస్తే కేసు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యాగులు, సెల్ఫోన్లను అలారం చైన్ పుల్లింగ్ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల కోచ్‌లను ఎల్బీహెచ్ కోచ్‌లుగా ఆధునీకరించారు. అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్ స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ (పీఈఏఎస్డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్‌ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్‌ఫోన్‌ను వేలాడదీస్తున్నారు. ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్‌గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం -
విజయనగరం రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ
సాక్షి, విజయనగరం: విజయనగరం కంటకాపల్లి రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ జరపనున్నారు అధికారులు. బుధవారం, గురువారం విశాఖపట్నం డివిజనల్ మేనేజర్, వాల్తేర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే అలమండ, కొత్తవలసల మధ్య ప్రత్యక్ష సాక్షుల్ని, అలాగే క్యాబిన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కోణంలోనే విచారణ అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 52 మందిని క్షతగాత్రులుగా గుర్తించింది. వీరిలో ఎక్కువమంది స్వల్ప గాయాలతో బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు అలమండ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలైన వారు, కళ్లు దెబ్బతిన్న వారు, ఎముకలు విరిగిన వారు 29 మంది విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేరారు. సోమవారం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. నేడు క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు వైద్యులు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నెమ్మదిగా వెళ్తున్న పలాస-విశాఖ ప్యాసింజర్‌ను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ-విశాఖ ప్యాసింజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు. నిత్యం విశాఖకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆదివారం సెలవు నేపథ్యంలో రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే... ఎలా ఉండేదోనని ఆ ఘటనను తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపమా? మానవ తప్పిదమా? విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయాలి. అలాగే.. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది. నేడు కూడా పలు రైళ్ల రద్దు కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రిజర్వేషన్ చేయించుకున్న పలువురు ఆదివారం రాత్రి నుంచి స్టేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రంలోపే కంటపల్లి వద్ద ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ల సమయాల్లో మార్పు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇవాళ(అక్టోబర్ 31న).. హావ్‌డా-సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా, హావ్‌డా-ఎస్ఎంవీ బెంగళూరు(12245) దురంతో, షాలిమార్-హైదరాబాద్(18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే.. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(08531) పాసింజర్, తిరుపతి-విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 31న రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దసరా సీజన్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సత్రగచ్చి–బెంగళూరు (06286) రైలు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు బెంగళూరు చేరుతుంది. చైన్నై సెంట్రల్–భువనేశ్వర్ (06073) రైలు ఈ నెల 23, 30, నవంబర్ 6 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06074) ఈ నెల 24, 31, నవంబర్ 7 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (06071) రైలు ఈ నెల 28, నవంబర్ 4 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సత్రగచ్చి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06072) ఈ నెల 23, 30, నవంబర్ 6 తేదీల్లో ఉదయం 5 గంటలకు సత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. భువనేశ్వర్ న్యూ–బెంగళూరు (06288) రైలు ఈ నెల 22న ఉదయం 8.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. నాందేడ్–పానిపట్ (07635) రైలు ఈ నెల 26న ఉదయం 5.40 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పానిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07636) ఈ నెల 27న మధ్యాహ్నం 3.15 గంటలకు పానిపట్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు నాందేడ్ చేరుతుంది. పునరుద్ధరించిన రైళ్లు ఇవే... నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23–26 వరకు విజయవాడ–గుంటూరు (07783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580), నడికుడి–మాచర్ల (07579), మాచర్ల–గుంటూరు (07780), గుంటూరు–విజయవాడ(07788) రైళ్లను పున రుద్ధరించినట్లు చెప్పారు. -
దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. నాందేడ్–కాకినాడ టౌన్ (07061) రైలు ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. హైదరాబాద్–కటక్ (07165) రైలు ఈ నెల 24న రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07166) ఈ నెల 25న రాత్రి 10.30 గంటలకు కటక్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
పట్టాలెక్కిన విజయవాడ–చెన్నై వందేభారత్ రైలు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–చెన్నై, కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆదివారం పట్టాలు ఎక్కాయి. దేశవ్యాప్తంగా 9 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపైకి చేరుకున్న వందేభారత్ రైలుకు 1,500 మందికిపైగా విద్యార్థులతో కలసి రైల్వే అధికారులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ మాట్లాడుతూ..మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భార్ భారత్, ఇండియా ఫస్ట్ ఇనీషియేటివ్స్ ఆఫ్ ది నేషన్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును తయారు చేయడం దేశం సాధిస్తోన్న ప్రగతికి నిదర్శనమన్నారు. 9 నెలల్లోనే ఏపీకి 3 వందేభారత్ రైళ్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. రైల్వే చరిత్రలో 2023 గొప్ప మేలి మలుపుగా నిలిచిపోతుందన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు జెండాలు ఊపి రైలుకు వీడ్కోలు పలికారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కాచిగూడ– యశ్వంతపూర్ వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ రైలు ఏపీలోని కర్నూలు, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడ–చెన్నై సెంట్రల్‌కు మొట్టమొదటి వందే భారత్ రైలును చూసేందుకు నగరవాసులు, పలు పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో స్టేషన్ సందడిగా మారింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో ప్రదర్శించిన పలు నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులు వందే భారత్ రైలుతో సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): సికింద్రాబాద్ డివిజన్లోని మాకుడి–సీర్పూర్ టౌన్ సెక్షన్ మధ్యలో నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయంతో పాటు, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ధనాపూర్–సికింద్రాబాద్ (03225), 22న హైదరాబాద్–గోరఖ్‌పూర్ (02575), 23న హైదరాబాద్–రక్షౌ ల్ (07051), 24న సికింద్రాబాద్–ధనాపూర్ (03226), గోరఖ్‌పూర్–హైదరాబాద్ (02576), 26న రక్షౌ ల్–హైదరాబాద్ (07052) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును పెద్దపల్లి, నిజామాబాద్, పూర్ణా, అకోలా మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా ఈ నెల 22 నుంచి 25 వరకు యశ్వంత్‌పూర్– హజరత్ నిజాముద్దిన్ (12649) రైలును, అలాగే ఈ నెల 18, 19, 21, 23, 24, 25 తేదీల్లో హజరత్ నిజాముద్దిన్–యశ్వంత్‌పూర్ (12650) రైలును బళ్లారి, గుంతకల్లు, వాడి, మన్మడ్, ఖాండ్వా, ఇటార్సీ స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. -
బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ
భువనేశ్వర్: అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపిన బాలాసోర్ రైలు ప్రమాదం కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనగా నిలుస్తూ బాలాసోర్ రైల్వే ప్రమాదంలో 290 మంది మరణానికి కారణమైంది. సిగ్నల్ వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తూ అందుక్కారణమైన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మొహమ్మద్ అమిర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ లను జూలైలోనే అరెస్టు చేయగా తాజాగా వారిపై హత్యానేరం తోపాటు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కూడా చేశారని చార్జిషీటులో అభియోగాలను మోపింది సీబీఐ. బహనగా స్టేషన్ సమీపంలోని గేటు నెంబర్ 94 లెవెల్ క్రాసింగ్ వద్ద LC గేటు నెంబర్ 79 సర్క్యూట్ దయాగ్రామ్ ఆధారంగా మరమ్మతు పనులను పర్యవేక్షించిన మహంత అన్ని పనులు పూర్తయిన తర్వాత విధి నిర్వహణలో అలసట కనబరుస్తూ టెస్టింగ్ నిర్వహించాలి. అందులో ఏమైనా వైఫల్యాలు ఉంటే మార్పులు చేసి వాటిని సరిచేయాలి. కానీ మహంత నిర్లక్షయంగా వ్యవహరిస్తూ టెస్టింగ్ నిర్వహించలేదని, ఇంటర్‌లాకింగ్ ఇన్స్టాలేషన్ కూడా ప్రణాళికాబ్యాద్మగా లేవని.. ఈ కారణాల వల్లనే మూడు రైళ్లు ఢీకొన్నాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. #BREAKING | Central Bureau of Investigation (CBI) files chargesheet in Balasore Train accident case. #CBI #BalasoreTrainAccident #Balasore #BalasoreTrainTragedy WATCH #LIVE here- https://t.co/6CjsNJ9CEq pic.twitter.com/9rSEOROykp — Republic (@republic) September 2, 2023 ఇది కూడా చదవండి: వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
ఫలక్‌నుమా రైలు ప్రమాదం.. విద్రోహ చర్యా?
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్‌తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. మంటల ధాటికి మూడు బోగీలు(S4,S5,S6) పూర్తిగా దగ్ధమయ్యాయి. శుక్రవారం ఉదయం 11.25 నిమిషాలకు ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సహాయక చర్యలను జీఎం అరుణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతున్నట్లు గమనించామని, మంటలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైల్వేశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సంబంధిత వార్త: Yadadri: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం కాగా కొన్ని రోజుల క్రితం సౌత్ సెంట్రల్‌కు వచ్చిన బెదిరింపు లేఖ పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ రూట్లో బాలాసోర్ వంటి ప్రమాదం జరుగుతుందని ఓ అంగతకుడు లేఖలో హెచ్చరించారు. ఈ లేఖపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ లేఖకు దీనికి ఏమైనా లింక్ అందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైలు ప్రమాదంపై అధికారులు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. 36912, 82819 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇక హైరా నుంచి హైదరాబాద్‌కు 1550 కిలోమీటర్ల దూరం ఉండగా.. గమ్యం మరో 40 కిలో మీటర్లు ఉందనగా ఈ ప్రమాదం జరిగింది. పగలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన రాత్రిపూట జరిగితే ఎన్ని ప్రాణాలు పోయేవోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా బోగీలతో సికింద్రాబాద్‌కు రైలు ప్రయాణమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా కాచిగూడ–ఖుర్దారోడ్డు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాచిగూడ–ఖుర్దారోడ్డు (07223) రైలు ఈ నెల 24న రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్డు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07224) ఈ నెల 25న ఖుర్దారోడ్డులో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.00 గంటలకు కాచిగూడ చేరుతుంది. రెండు మార్గాలలో ఈ రైలు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బెరంపూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
నేడు, రేపు విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని తాడి–అనకాపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో గూడ్స్‌రైలు పట్టలు తప్పడం ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నింటిని నేడు (16న), కొన్నింటిని నేడు, రేపు (16, 17 తేదీల్లో) రద్దుచేసినట్లు ప్రకటించారు. నేడు రద్దయిన రైళ్లు విజయవాడ–విశాఖపట్న(12718/12717), విశాఖపట్నం–కడప (17488), హైదరాబాద్–విశాఖపట్నం (12728), విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (12861), సికింద్రాబాద్–విశాఖపట్నం (12740), విశాఖపట్నం–తిరుపతి (22708), గుంటూరు–రాయగడ (17243). నేడు, రేపు రద్దయిన రైళ్లు కడప–విశాఖపట్నం (17487), విశాఖపట్నం–హైదరాబాద్ (12727), మహబూబ్‌నగర్–విశాఖపట్నం (12862), విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739), రాయగడ– గుంటూరు (17244). -
వందేభారత్ వచ్చేస్తోంది!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పూర్తిస్వదేశీ సాంకేతికతతో రూపొందిన సూపర్‌ఫాస్ట్ ట్రెయిన్ వందేభారత్ ఉమ్మడి జిల్లాలో కూత పెట్టనుంది. ఈనెలలో నాగపూర్ – సికింద్రాబాద్ మధ్య రైలు ప్రారంభానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో ఈరైలు రెండుసార్లు ట్రయల్ రన్ పూర్తిచేసుకుంది. సోమవారం కూడా రైలు ఎక్కడా ఆపకుండా సికింద్రాబాద్ – నాగపూర్ వరకు 100 కి.మీ. వేగంతో నడిపినట్లు తెలిసింది. మే నెలలో తొలిసారి వందేభారత్ రైలును ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో ట్రయల్ రన్ చేపట్టగా సకాలంలో గమ్యస్థానం చేరుకుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి రూట్లలో వందేభారత్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ – నాగపూర్ రూట్లో పరుగుతో రికార్డునెక్కనుంది. రామగుండం, కాగజ్‌నగర్‌లో హాల్టింగ్? అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన వందేభారత్ రైలు.. సికింద్రాబాద్ – ఖాజీపేట, ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో త్వరలో పరుగులు తీయనుంది. ఇటీవలే ఈ సెక్షన్లో మూడోలైన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఇదే సెక్షన్ మీదుగా వందేభారత్‌ను సికింద్రాబాద్ టు నాగపూర్ వరకు ట్రయల్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ – నాగపూర్ వరకు 581 కిలో మీటర్లు. సాధారణ రైళ్లకై తే ఈ రెండు నగరాల మధ్య 10 గంటలకుపైగా సమయం పడుతోంది. వందేభారత్ రైలైతే 6.30 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే వీలుంది. మొన్న జరిగిన పరీక్షల్లో రైలు కేవలం ఆరుగంటల్లోనే చేరుకుందని సమాచారం. మిగిలిన అరగంటలో హాల్టింగ్‌ల సమయాన్ని తీసేసినా.. ఆరున్నర గంటల్లో చేరుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి, రామగుండం, ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో మార్పులు కూడా ఉండవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. జగిత్యాల రూట్లో నడపాలి జగిత్యాల రూట్లో చాలా మంది ఎక్స్‌ప్రెస్ సర్వీసు కోసం ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి – జగి త్యాల మార్గంలో వందేభారత్ రైలు నడిపితే ముంబై వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇ ప్పుడు 10 గంటల సమయం పడుతుంది. రూ.2 వేల ఖర్చవుతుంది. వందేభారత్ వస్తే.. వేగంగా ముంబై చేరుకుంటాం, ఖర్చు తగ్గుతుంది. – నాగిరెడ్డి రాజిరెడ్డి, హార్వెస్టర్ యజమాని, జగిత్యాల పెద్దపల్లిలో హాల్టింగ్ ఇవ్వాలి ఖాజీపేట – బల్లార్షా సెక్షన్లో వందేభారత్ రైలు రానుండటం హర్షణీయం. దీంతో స్థానికులకు చాలామేలు జరుగుతుంది. పెద్దపల్లిలో హాల్టింగ్ ఉంటుందన్న ప్రచారంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లికి హా ల్టింగ్ కల్పిస్తే నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ వాసులకు అనుకూలంగా ఉంటుంది. – కొండి సతీశ్, ఆమ్ ఆద్మీ పార్టీ ట్రాక్‌ల సామర్థ్యం పెంపు రైలు పరుగుపెట్టనున్న నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో ట్రాక్స్పీడ్ పెంచారు. సికింద్రాబాద్ పరిధిలో ఖాజీపేట – బల్లార్ష రూట్‌ను అప్‌గ్రేడ్ చేశారు. దాదాపు 130 కి.మీ. వేగంతో ఈ మార్గంలో రైళ్లు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట – రామగుండం వరకు, పెద్దపల్లి – మెట్పల్లి వరకు కనిష్టంగా 90 కి.మీ. నుంచి గరిష్టంగా 130 కి.మీ. వరకు వేగంగా వెళ్లేలా ట్రాక్‌లు రెడీ చేశారు. భవిష్యత్తులో వందేభారత్ రైలును పెద్దపల్లి – కరీంనగర్, కరీంనగర్ – జగిత్యాల, జగిత్యాల – నిజామాబాద్ రూట్లలోనూ నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు, నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంటుంది. సిరిసిల్ల, జగిత్యాల విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉండనుంది. -
వేసవి ప్రత్యేక రైళ్ల పొడిగింపు.. ఏయే రూట్లలో అంటే?
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటలో తెలిపారు. హైదరాబాద్–తిరుపతి (07643) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) జూన్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, తిరుపతి–సికింద్రాబాద్ (07481) జూన్ 4 నుంచి 25 వరకు ఆదివారం, సికింద్రాబాద్–తిరుపతి (07482) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, హైదరాబాద్–నర్సాపూర్ (07631) జూన్ 3 నుంచి 24 వరకు ప్రతి శనివారం నడుస్తాయని పేర్కొన్నారు. నర్సాపూర్–హైదరాబాద్ (07632) జూన్ 4 నుంచి 30 వరకు ప్రతి ఆదివారం, విజయవాడ–నాగర్సోల్ (07698) జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్సోల్–విజయవాడ (07699) జూన్ 3 నుంచి జూలై 1 వరకు ప్రతి శనివారం, తిరుపతి–అకోలా (07605) జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, అకోలా–తిరుపతి (07606) జూన్ 4 నుంచి జూలై 2 వరకు ప్రతి ఆదివారం, పూర్ణ–తిరుపతి (07607) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–పూర్ణ (07608) జూన్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం నడుస్తాయని తెలిపారు. -
వందేభారత్ సూపర్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా పట్టాలెక్కిన రెండు వందేభారత్ రైళ్లూ సూపర్ సక్సెస్ అయ్యాయి. టికెట్ ధర ఎక్కువైనా ప్రయాణికులు వాటిల్లో వెళ్లేందుకు ఎగబడుతున్నారు. దీంతో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి రైళ్లు కిక్కిరిసి పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్–తిరుపతి రైలు సగటు ఆక్యుపెన్సీ రేషియో 131 శాతం ఉండగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు 134 శాతం నమోదవుతోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 128 శాతం ఉండగా, తిరుగు ప్రయాణంలో 106 శాతంగా నమోదవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పట్టాలెక్కిన వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీలో ఇవే టాప్‌లో నిలవటం విశేషం. వేగమే ప్రధానం.. కాచిగూడ–తిరుపతి మధ్య 2017లో డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించారు. అది మధ్యాహ్నం పూట ప్రయాణించేది కావటంతో బెర్తులకు బదులు చైర్‌కార్ మాత్రమే ఉంటుంది. దీంతో దానికి ఏమాత్రం ఆదరణ లేక ఆక్యుపెన్సీ రేషియో 12 శాతానికి పడిపోయింది. ఫలితంగా దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు దానిలాగే మధ్యాహ్నం వేళ, చైర్‌కార్‌తో ప్రయాణించే వందేభారత్‌ను ప్రవేశపెట్టినప్పుడు రైల్వే అధికారులకు డబుల్ డెక్కర్ రైలే గుర్తొచ్చింది. దీంతో తిరుపతి వందేభారత్‌కు కేవలం 8 కోచ్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభించింది. అధిక ఛార్జీ, పగటి వేళ ప్రయాణం, బెర్తులు ఉండకపోయినప్పటికీ జనం ఎగబడుతున్నారు. విశాఖపట్నం వందేభారత్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇందుకు వందేభారత్ వేగమే కారణమని స్పష్టమవుతోంది. విశాఖ, తిరుపతిలకు సాధారణ రైళ్లలో 12 నుంచి 14 గంటల సమయం పడుతుంటే వందేభారత్ కేవలం 8 గంటల్లో గమ్యం చేరుస్తోంది. ఉదయం బయలుదేరితే మధ్యాహా్ననికల్లా గమ్యం చేరుతుండటంతో ప్రయాణికులకు ఒక పూట ఆదా అవుతోంది. సికింద్రాబాద్–విశాఖ వందేభారత్‌లో.. విశాఖ వెళ్లేప్పుడు ఎక్కువ మంది ప్రయాణిస్తుండగా, సికింద్రాబాద్–తిరుపతి సర్వీసులో మాత్రం, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. తిరుపతిలో దర్శనాలు పూర్తి చేసుకున్నాక, మధ్యాహ్నం రైలెక్కి అదే రోజు రాత్రికల్లా నగరానికి చేరుకోగలుగుతుండటం వారికి కలిసి వస్తోంది. తిరుపతి రైలు ఆదాయం అదుర్స్ జనవరి 15న విశాఖ వందేభారత్ రైలు ప్రారంభమైంది. కాగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 19 వరకు దాని ద్వారా రైల్వేకు రూ.31 లక్షల ఆదాయం నమోదైంది. అయితే తిరుపతి సర్విసులో 8 కోచ్‌లు మాత్రమే ఉన్నా, పది రోజుల్లో రూ.17.50 లక్షల ఆదాయం వచ్చింది. త్వరలో తిరుపతి రైలుకు కోచ్‌ల సంఖ్యను 16కు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘వందే భారత్’పై ప్రయాణికుల్లో క్రేజ్
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రజలు ఇందులో ప్రయాణించేందుకు అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారని రైల్వే అధికారులు చెప్పారు. జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. దీని వేళలు విజయవాడ పరిసర ప్రజలకు అనుకూలంగా మారాయి. దీంతో విజయవాడ కేంద్రంగా ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. నెల రోజుల్లో విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్‌కు 8,613 మంది.. రాజమండ్రి, విశాఖకు మరో 9,883 మంది ప్రయాణించారు. విశాఖ వైపు నుంచి 9,742 మంది, సికింద్రాబాద్ వైపు నుంచి 10,970 మంది విజయవాడకు వచ్చారు. మొత్తంగా విజయవాడ స్టేషన్‌కు సంబంధించి రోజుకు సగటున 1,352 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆకట్టుకుంటున్న సౌకర్యాలు.. వందే భారత్‌లోని ఆధునిక సౌకర్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వేగం, ఏసీతో పాటు ప్రతి కోచ్‌లో రిక్లైనర్ సీట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు, ఎమర్జెన్సీ అలారం బటన్లు, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లున్నాయి. సురక్షిత ప్రయాణం కోసం అన్ని కోచ్‌ల లోపలా, బయట సీసీటీవీ కెమెరాలు, మెరుగైన అగ్నిమాపక భద్రతను ఏర్పాటు చేశారు. ఆధునిక బయో వాక్యూమ్ టాయిలెట్లు కూడా ఉన్నాయి. ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు ప్రతి కోచ్‌లో పెద్ద డిస్ప్లే యూనిట్లను ఏర్పాటు చేశారు. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా ‘కవచ్’ పరిజ్ఞానాన్ని కల్పించారు. 140 శాతం ఆక్యుపెన్సీ సంతృప్తికరం.. వందే భారత్ రైలు విశాఖపట్నం–సికింద్రాబాద్ మధ్య రెండు వైపులా పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. ఇరువైపులా దాదాపు 140 శాతం సగటు ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. వేగంతో పాటు ఆధునిక సౌకర్యాలుండటంతో విజయవాడ, సమీప ప్రాంతాల ప్రయాణికులు ఇందులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. – అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ -
బొమ్మ దొరికిందోచ్..!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రయాణంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకడం అరుదు. అలాంటి ఓ వస్తువును రైల్వే అధికారులు స్వయంగా ఇంటికే వచ్చి బాధితులకు అప్పగిస్తే..! పైగా, అది ఓ చిన్నారికి ఎంతో ఇష్టమైన బొమ్మ అయితే...! ఆ బొమ్మను తిరిగి పొందిన ఆ చిన్నారి ఆనందానికి అవధులు ఉంటాయా..? ఉండవనే చెప్పవచ్చు. సికింద్రాబాద్ నుంచి అగర్తలాకు (07030) వెళ్లే రైలులో ఈ నెల 4న ప్రయాణం చేస్తున్న భూసిన్ పట్నాయక్ అనే ప్రయాణికుడి ఎదురు సీట్లో ఉన్న ఓ చిన్నారి తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకొంది. దాని కోసం దిగాలుగా ఏడుస్తున్న ఆ చిన్నారికి ఎలాగైనా దానిని అందించాలనే ఉద్దేశంతో భూసిన్ రైల్వే మదద్ యాప్ ద్వారా 139 నంబర్‌కు ఫోన్ చేసి విషయాన్ని చేరవేశారు. దీంతో రైల్వే అధికారులు ఆ చిన్నారి వివరాలను సికింద్రాబాద్ రైల్వే కౌంటర్ ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ సిబ్బంది ఆ బొమ్మ ఆచూకీ కోసం ఆరా తీసి, న్యూ జల్ఫాయ్‌గురి స్టేషన్ దగ్గర్లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా అలియాబరి స్టేషన్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ చిన్నారి తల్లిదండ్రులు మోహిత్, నస్రీన్ బేగంలను కలిసి ఆ బొమ్మను అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రికి, అధికారులు, సిబ్బందికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. -
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు
కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ (17024)కు ముప్పు తప్పింది. గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు రైలు కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. గద్వాల స్టేషన్ వద్ద రైలు ఇంజన్‌కు ఉన్న లింక్ హుక్ తెగిపోవడంతో బోగీలు విడిపోయాయి. అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును నెమ్మదించి ఆపై నిలిపివేశారు. దీంతో ఇంజన్ సుమారు 10 మీటర్ల దూరం వెళ్లి నిలిచిపోయింది. రైల్వే అధికారులు మరో ఇంజన్‌కు బోగీలను అమర్చి పంపించారు. దీంతో రైళ్ల రాకపోకలకు గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. -
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్–కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్(07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్–కొల్లాం (07121) ఈ నెల 27, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో, సికింద్రాబాద్–కొల్లాం (07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం–సికింద్రాబాద్ (07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్–కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో, కొట్టాయం–సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వివరించారు. -
విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) అదే 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనగాం, ఖాజీపేట, వరంగల్లు, మహబూబ్‌నగర్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్–యశ్వంతపూర్ (07233) రైలు ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో సాయంత్రం 3.50 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. నరసాపూర్ –సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు కేటాయింపు నరసాపూర్–సికింద్రాబాద్–నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు సీనియర్ డీసీఎం ఆంజనేయులు పేర్కొన్నారు. నరసాపూర్ – సికింద్రాబాద్ (07466) రైలు ఈ నెల 30న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ –నరసాపూర్ (07467 ) రైలు అక్టోబరు 1న సికింద్రాబాద్‌లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి నరసాపూర్ స్టేషన్‌కు మరుసటిరోజు ఉదయం 8.35 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. -
పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇక్కడి రైల్వే అధికారులు శనివారం ప్రకటించారు. రద్దు చేసిన రైళ్లలో విజయవాడ–గుంటూరు(17783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580/07579), మాచర్ల–విజయవాడ (07782), డోర్నకల్లు–విజయవాడ (07755), భద్రాచలం రోడ్డు–విజయవాడ (07278/07979) ఉన్నాయి. -
తుక్కు విక్రయంతో రైల్వేకు రూ.100 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తుక్కు ఇనుము విక్రయం ద్వారా దక్షిణ మధ్య రైల్వే 103 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రైల్వేలో ఇనుప తుక్కు విపరీతంగా పేరుకుపోతుండగా.. చోరీలు జరగడంతోపాటు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీస్తోంది. దీనికి పరిష్కారంగా దక్షిణ మధ్య రైల్వే ‘జీరో స్క్రాప్ పాలసీ’ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇనుప తుక్కును వదిలించుకునేందుకు దానిని ఎప్పటికప్పుడు విక్రయించేలా అనుమతి ఇచ్చింది. డివిజన్ల పరిధిలోని అన్ని సెక్షన్లలో ఇనుప తుక్కును గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. ట్రాక్‌ల పక్కన ఇనుప తుక్కు గరిష్టంగా నెల రోజుల కంటే ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. విరిగిన రైలు పట్టాలు, పీ–వే ఐటమ్స్, లోకోలు, కోచ్‌లు, వేగన్లకు సంబంధించి తుక్కును ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేసి ఇ–ప్రొక్యూర్‌మెంట్‌కు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకోసం యూజర్ డిపో మాడ్యూల్‌ను అన్ని స్టోర్ డిపోల వద్ద ఉంచారు. ఈ విధానం సత్ఫలితాలిస్తోంది. ఇంతకుముందు ప్రతి మూడు నెలలకు ఒకసారి తుక్కును విక్రయించేవారు. దీనివల్ల ఇనుము తుప్పు పట్టి సరైన ధర వచ్చేది కాదు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు తుక్కును విక్రయిస్తుండటంతో అధిక ధర వస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 103 రోజుల్లోనే తుక్కు విక్రయాలతో ఏకంగా రూ.100 కోట్ల ఆదాయం రావడం విశేషం. 2021–22లో మొదటి మూడు నెలల్లో రూ.51 కోట్ల ఆదాయం రాగా, 2022–23లో రూ.100 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. రానున్న రోజుల్లో జీరో స్క్రాప్ పాలసీని మరింత సమర్థంగా అమలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు అన్ని డివిజన్ల అధికారులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. -
ఓవరాక్షన్.. రియాక్షన్.. రైలు ఆలస్యం జైలుకు పంపింది!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి తన వ్యాపార పనులపై చెన్నై వెళ్లిన ఉదయ్ భాస్కర్ అక్కడి రైల్వే స్టేషన్లో హడావుడి చేశాడు. తాను ప్రయాణించాల్సిన రైలు ఆలస్యం కావడంతో ఆ సమయంలో ‘అధిక మర్యాదలు’ డిమాండ్ చేశాడు. దీనికోసం తాను రైల్వే ఉన్నాధికారి బంధువునంటూ బిల్డప్ ఇచ్చాడు. ఆరా తీసిన జీఆర్పీ పోలీసులు అసలు విషయం తెలుసుకుని రైల్లో ప్రయాణిస్తున్న భాస్కర్‌ను కట్పాడిలో అరెస్టు చేసి వెనక్కు తీసుకెళ్లారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఉదయ్ భాస్కర్ అల్యూమినియం వ్యాపారి. వ్యాపార పనుల నిమిత్తం తరచు చెన్నై వెళ్లి వస్తుండేవాడు. ఇటీవల చెన్నై అతను శుక్రవారం రాత్రి నగరానికి తిరిగి వచ్చేందుకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. అయితే ఆ రైలు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు భాస్కర్ తెలుసుకున్నాడు. దీంతో ఆ సమయం వరకు వేచి ఉండటానికి వెయిటింగ్ హాల్ వద్దకు వెళ్లారు. అది అప్పటికే నిండిపోవడంతో సమీపంలో ఉన్న వీఐపీ లాంజ్‌పై అతడి కన్ను పడింది. దాంట్లోకి ప్రవేశించేందుకు ఉన్నతాధికారి బంధువు అవతారం ఎత్తాడు. తాను రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన వినయ్ కుమార్ త్రిపథి సమీప బంధువునంటూ అక్కడి సిబ్బందికి చెప్పాడు. అది నిజమని నమ్మని వీఐపీ లాంజ్ ఉద్యోగులు లోపలికి అనుమతించారు. రైల్వే ఉద్యోగులపై చిందులు.. ఎంతైనా తమ శాఖకు చెందిన ఉన్నతాధికారి బంధువు కదా అనే ఉద్దేశంతో కాస్త మర్యాదపూర్వకంగా నడుచుకున్నారు. దీంతో భాస్కర్లో కొత్త ఆలోచనలు పుట్టకువచ్చాయి. తనకు దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదని, సరైన ఆహారం, పానీయాలు అందించట్లేదంటూ హంగామా చేశాడు. అక్కడ ఉన్న రైల్వే ఉద్యోగులపై చిందులు తొక్కడంతో పాటు దీనిపై తాను త్రిపథికి ఫిర్యాదు చేస్తానని గద్ధించాడు. తనతో మర్యాదగా నడుచుకోని ప్రతి ఒక్కరినీ ఈశాన్య రాష్ట్రాలకు బదిలీ చేయిస్తానంటూ లేనిపోని హడావుడి చేశాడు. చివరకు తన రైలు ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే ఇతడి ఓవర్ యాక్షన్‌ను గమనించిన రైల్వే ఉద్యోగులకు అనుమానం రావండంతో రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా భాస్కర్ వివరాలు సేకరించారు. వీటిని రైల్వే బోర్డు చైర్మన్ కార్యాలయానికి పంపడం ద్వారా అతడికి, త్రిపథికి ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. దీంతో వీఐపీ లాంజ్ ఉద్యోగులు చెన్నై సెంట్రల్ స్టేషన్‌లోని గవర్నమెంట్ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ ఆ సమయంలో భాస్కర్ ప్రయాణిస్తున్న రైలు కట్పాడి జంక్షన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి అధికారుల సమాచారం ఇవ్వడం ద్వారా రైల్లో ఉన్న భాస్కర్‌ను దింపించారు. శనివారం ఉదయం కట్పాడి చేరుకున్న జీఆర్పీ బృందం భాస్కర్‌ను అరెస్టు చేసి చెన్నై తీసుకువెళ్లింది. రైల్వే కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. చదవండి: సైబర్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వైద్యుడు -
ఇకపై అన్నీ రెగ్యులర్ రైళ్లే
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దేశంలో కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ తరువాత విడతల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ.. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి అన్నీ రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల అనవసర ప్రయాణాన్ని తగ్గించే ఉద్దేశంతో అదనపు చార్జీలు విధించి ‘సున్నా’ నంబర్‌తో మొదలయ్యే ప్రత్యేక రైళ్లను తొలుత దూర ప్రాంతాల మధ్య నడిపి, అనంతరం తక్కువ దూరం మధ్య పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లను నడపడం ప్రారంభించింది. దాదాపు అన్ని ప్యాసింజర్ రైళ్లు ప్రత్యేక రైళ్ల పేరుతో నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీల కంటే అధికంగా ఉండటంతో పాటు రైల్వేశాఖ ప్రత్యేక ప్రయాణికులకు అందిస్తున్న రాయితీలు కూడా ఉండవు. దీంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ ఇప్పటి నుంచి విడతల వారీగా ప్రత్యేక రైళ్ల స్థానంలో కరోనాకు ముందు ఉండే విధంగా సాధారణ రైలు నంబర్లతో, పాత చార్జీలతోనే రెగ్యులర్ రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2021 రైల్వే టైంటేబుల్ ప్రకారం దాదాపుగా అన్ని రైళ్లు రెగ్యులర్ రైళ్లుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ ప్రత్యేక రైలు మరో రెండు వారాలు పొడిగింపు నరసాపురం: గత మూడు ఆదివారాలుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి సికింద్రాబాద్‌కు నడుస్తున్న ప్రత్యేక రైలును ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో రెండు వారాలు పొడిగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు ఈ నెల 21, 28 తేదీల్లో కూడా నడుస్తుందని నరసాపురం రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు మంగళవారం తెలిపారు. 07455 నంబర్‌తో ఈ రైలు సాయంత్రం ఐదు గంటలకు నరసాపురంలో బయలుదేరి పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటిరోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. -
దీపావళికి ప్రత్యేక వారాంతపు రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దీపావళి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పూర్ణ–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పూర్ణ–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (07607) నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పూర్ణలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07608) నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.25 గంటలకు పూర్ణ చేరుకుంటుంది. -
ఆంధ్రా ఊటీకి అద్దాల బోగీలు
అరకు లోయ: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయకు వచ్చే పర్యాటకుల కోసం రైల్వేశాఖ మరో రెండు అద్దాల బోగీలను అందుబాటులోకి తెస్తోంది. విశాఖ నుంచి అరకు లోయకు నడిచే రెగ్యులర్ ట్రైన్‌కు వీటిని జత చేసేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక అద్దాల రైలు బోగీ ఉన్నప్పటికీ పర్యాటకుల నుంచి ఈ సీజన్లో డిమాండ్ పెరిగింది. దీంతో అరకు ట్రైన్‌కు అదనంగా రెండు విస్టోడోమ్ అద్దాల బోగీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాదే అదనంగా రెండు అద్దాల బోగీలు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినప్పటికీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీలను మంగళవారం రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. విశాఖ నుంచి అరకు లోయ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ రెండు అద్దాల బోగీలు పర్యాటకులు, స్థానికులను ఆకర్షించాయి. వీటిలో రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా, ఇతర అధికారులు ప్రయాణించారు. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీల్లో 44 సీట్లతో పాటు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని రైల్వే ఏడీఆర్ఎం ఎస్కే గుప్తా తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న విస్టో డోమ్ బోగీ కన్నా ఈ రెండు బోగీల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. -
బెజవాడలో గోల్డ్ మాఫియా!
-
పండుగ ప్రత్యేక రైళ్ల పునరుద్ధరణ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల అవసరాల దృష్ట్యా రైల్వే శాఖ గతంలో నడిపిన పండుగ ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి ప్రకటించే వరకు ఈ రైళ్లు నిర్దేశించిన తేదీల్లో నడవనున్నాయి. ఈనెల 30 నుంచి బరోని–యర్నాకులం ప్రత్యేక రైలు(02521), నవంబర్ 3 నుంచి యర్నాకులం–బరోని ఎక్స్‌ప్రెస్ (02522), ఈ నెల 31 నుంచి దర్భంగ–మైసూర్ (02577), నవంబర్ 3 నుంచి మైసూర్–దర్భంగ (02578), ఈనెల 29 నుంచి గయా–ఎమ్జీఆర్ చైన్నై(02389), ఈనెల 31 నుంచి ఎమ్జీఆర్ చెన్నై–గయా (02390), ఈనెల 27 నుంచి పాటలీపుత్ర–యశ్వంతపూర్ (03251), యశ్వంతపూర్–పాటలీపుత్ర (03252), ముజఫర్‌పూర్–యశ్వంతపూర్ (05228), యశ్వంతపూర్–ముజఫర్‌పూర్ (05227) రైళ్లు నడవనున్నాయి. -
నేడు హార్బర్లో మెగాబ్లాక్,లోకల్ ట్రైన్స్ రద్దు
సాక్షి ముంబై: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీని ప్రభావం లోకల్ రైళ్లతోపాటు మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై కూడా పడనుంది. దీంతో పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించి నడుపనున్నారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అత్యవసర సేవలందించే వారికోసం నడుపుతున్న లోకల్ సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడనుంది. సెంట్రల్ రైల్వే మార్గంపై.. సెంట్రల్ రైల్వే మార్గంలోని మాటుంగా – ములూండ్ రైల్వే స్టేషన్ల మధ్య అప్, డౌన్ ఫాస్ట్ ట్రాక్‌పై ఉదయం 11.05 గంటల నుంచి సాయంత్రం 4.05 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో అప్, డౌన్ ఫాస్ట్ ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను మాటుంగా – ములూండ్ రైల్వేసైఏ్టషన్ల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పైకి మళ్లించనున్నారు. దీంతో ఈ రైళ్లన్ని మాటుంగా–ములూంలడ్ రైల్వే స్టేషన్ల మధ్య అన్ని రైల్వేస్టేషన్లలో నిలువనున్నాయి. అయితే అప్ ఫాస్ట్ రైళ్లు మాటుంగా తర్వాత, డౌన్ ఫాస్ట్ రైళ్లు ములూండ్ తర్వాత మళ్లీ ఫాస్ట్ ట్రాక్‌లపైకి మళ్లించనున్నారు. దీంతో రెళ్లన్ని సుమారు 15 నిమిషాలు ఆలస్యంగా నడవనున్నాయి. హార్బర్లో.. హార్బర్ మార్గంలో మాన్‌ఖుర్డ్ – నేరుల్ల మధ్య అప్‌డౌన్ మార్గంలో ఉదయం 11.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో మెగాబ్లాక్ సమయంలో సీఎస్ఎంటీ–పన్వెల్/బేలాపూర్/వాషీల మధ్య అప్‌డౌన్ మార్గాల్లో నడిచే లోకల్ రైళ్లను రద్దు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక లోకల్ రైళ్లను పన్వేల్–కుర్లా, కుర్లా–సీఎస్‌ఎంటీల మధ్య నడపనున్నారు. ప్రయాణికుల ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ (సీఎస్ఎంటీ) – మాన్ఖుర్డ్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. అదేవిధంగా సెంట్రల్ మార్గంలోని మెయిన్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు థనే–పన్వేల్ ట్రాన్స్‌హార్బర్ మార్గంలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
కొనసాగనున్న ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యశ్వంత్‌పూర్–అహ్మదాబాద్ వారాంతపు రైళ్లు (06501/06502), యశ్వంత్‌పూర్–జయ్‌పూర్ వారాంతపు రైళ్లు (06521/06522), అజ్మీర్–బెంగళూర్ వారాంతపు రైళ్లు (06205/06206), బెంగళూర్–జోద్పూర్ వారాంతపు రైళ్లు (06533/06534), యశ్వంత్‌పూర్–ఢిల్లీ వారాంతపు రైళ్లు (06593/06594) యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ‘సికింద్రాబాద్–అగర్తల’ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్–అగర్తలా మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలు(07029) ఈ నెల 18, 25 తేదీలలో ప్రతి శుక్రవారం ఉదయం 6.10 గంటలకు అగర్తలలో బయలుదేరి, రెండో రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (07030) ఈ నెల 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం మధ్యాహ్నం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగర్తలా చేరుకుంటుంది. చదవండి: 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటు వేగవంతం -
పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కోవిడ్ కారణంగా ప్రయాణికులు లేక పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే.. ► చెన్నై సెంట్రల్–హైదరాబాద్ (02603/02604), నర్సాపూర్–నిడదవోలు (07241/07242), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (07237/07238) రైళ్లను ఈ నెల 16 వతేదీ నుంచి జూలై 15 వరకు.. ► చెన్నై సెంట్రల్–నాందేడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి జూలై 17 వరకు .. ► తిరుపతి–చెన్నై సెంట్రల్ (06204/06203) ఈ నెల 16వ తేదీ నుంచి రద్దు చేశారు. -
‘యాస్’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాను కారణంగా విజయవాడ మీదుగా నడిచే 21 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. 23న మైసూర్–హౌరా (08118), 24న యశ్వంత్‌పూర్–భువనేశ్వర్ (02846), చెన్నై సెంట్రల్–పూరీ (02860),ఎర్నాకులం–హౌరా (02878), గౌహతి–యశ్వంత్‌పూర్ (06578) రైళ్లు రద్దయ్యాయి. 25న హౌరా–వాస్కోడిగామా (08047/08048), హౌరా–యశ్వంత్‌పూర్ (06598), అగర్తలా–బెంగళూరు (02516/02516)రైళ్లు, 26న గౌహతి–సికింద్రాబాద్ (07029),విల్లుపురం–పురులియా (06170), యశ్వంత్‌పూర్–ముజఫర్‌పూర్ (05227) రైళ్లు రద్దయినట్లు పేర్కొన్నారు. 28న న్యూటిన్‌సూకియా–బెంగళూరు (02250), 29న యశ్వంత్‌పూర్–బాగల్పూర్ (02253), యశ్వంత్‌పూర్–కామాఖ్య (02551) రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. హౌరా–హైదరాబాద్ ప్రత్యేక రైలు (08645/08646) ఈ నెల 24 నుంచి 27 వరకు, ఈ నెల 26, 27న బయలుదేరాల్సిన విల్లుపురం–కాగజ్‌నగర్ (06178/06177), 27, 28న బయలుదేరాల్సిన బెంగళూరు–గౌహతి (02509)లను రద్దు చేసినట్లు వివరించారు. -
రైల్వే అధికారుల రాజభోగం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రైల్వే అధికారుల ప్రయాణం అత్యంత ఖరీదు వ్యవహారంగా మారింది. కోవిడ్ ఆంక్షల దృష్ట్యా రెగ్యులర్ రైళ్లను, ప్యాసింజర్ రైళ్లను పక్కన పెట్టి సామాన్య ప్రయాణికులకు రైల్వే సేవలను దూరం చేసిన అధికారులు తాము మాత్రం విలాసవంతమైన సెలూన్ కోచ్‌లలో విహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు తనిఖీల్లో భాగంగా తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం ఈ సెలూన్లను వినియోగిస్తుండగా .. మరికొందరు ఎలాంటి తనిఖీలు లేకుండానే వీటిని వినియోగించుకుంటున్నట్లు సమాచారం. రాజసాన్ని, విలాసాన్ని ప్రతిబింబించే సెలూన్ కోచ్‌లను ఉన్నతాధికారులు తమ అధికారిక పర్యటనల కోసం వినియోగించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ‘హోమ్ ఆన్ వీల్స్’ పేరిట ప్రయాణికులకు సైతం వాటిని అందుబాటులోకి తేవాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. పెళ్లిళ్లు, వేడుకలు, ఇంటిల్లిపాది కలిసి వెళ్లే పర్యటనల కోసం ప్రయాణికులు ఐఆర్సీటీసీ ద్వారా సెలూన్లను రిజర్వ్ చేసుకొనే సదుపాయం ఉంది. బ్రిటీష్ కాలం నుంచి ఇటీవల వరకు అధికారులకే పరిమితమైన సెలూన్లను మొదటిసారి ప్రయాణికుల వినియోగింలోకి తెచ్చారు. కానీ ఒకవైపు కోవిడ్ ఉధృతి, మరోవైపు సెలూన్ ప్యాకేజీలపైన పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ప్రయాణికుల వినియోగంలోకి రాలేదు. రైల్వేపై ఆర్ధిక భారం రైళ్ల నిర్వహణ, వనరుల వినియోగంలో పారదర్శకతను పాటించే అధికారులు సెలూన్ ప్రయాణాల పేరిట మాత్రం రూ.లక్షల్లో ఖర్చు చేయడం గమనార్హం. ఒక ఉన్నతాధికారి ఒకసారి సెలూన్ జర్నీ చేసేందుకు అయ్యే ఖర్చుతో విమానంలో ఎగ్జిక్యూటీవ్ జర్నీ చేయవచ్చునని కార్మిక సంఘం నాయకుడొకరు విస్మయం వ్యక్తం చేశారు. ఏసీ బోగీ అయిన ఈ సెలూన్లో రెండు బెడ్ రూమ్‌లు, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, మరో నలుగురు ప్రయాణం చేసేందుకు వీలుగా పడకలు ఉంటాయి. సకల సదుపాయాలు ఉన్న ఈ బోగీ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. ఆర్పీఎఫ్ భద్రత ఎలాగూ ఉంటుంది. వెరసి ఒక సెలూన్ వినియోగానికి గంటకు రూ.2,500 చొప్పున నిర్వహణ భారం పడుతుంది. సిబ్బంది ట్రావెలింగ్ అలవెన్సులు, ఇతరత్రా ఖర్చులన్నీ అదనం. హైదరాబాద్ నుంచి తిరుపతి, విజయవాడ, కర్నూలు, విశాఖ, షిర్డీ, ఊటీ, ఢిల్లీ తదితర ప్రాంతాలకు రెగ్యులర్‌గా రాకపోకలు సాగిస్తున్నారు. ‘రాయల్’ జర్నీ కోసమేనా... బ్రిటీష్ కాలం నుంచి రైల్వే అధికారులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులకు పనిచేసే నగరంలో బంగళాలతో పాటు బంగళా ఫ్యూన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఈ తరహా సకల సదుపాయాలు కలిగిన విలాసవంతమైన సెలూన్లను అందుబాటులో ఉంచారు. రాయల్ సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రత్యేక సదుపాయాలపైన రైల్వేశాఖ ఆంక్షలు విధించింది. కానీ కొంతమంది అధికారులు వీటిని ఖాతరు చేయడం లేదు. రైళ్ల రాకపోకల్లో జాప్యం సెలూన్ కోచ్‌లను ప్రధాన రైళ్లకు అటాచ్ చేయడంతో పాటు డిటాచ్ చేసే సమయంలో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటుంది. అలాగే సెలూన్ల కోసం కేటాయించిన ప్లాట్‌ఫామ్‌లపైన రైళ్లను నిలిపేందుకు అవకాశం ఉండదు. దీంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుంది. సెలూన్తో బయలుదేరే రైళ్లు అరగంట నుంచి ముప్పావు గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ‘సికింద్రాబాద్ స్టేషన్లో వారానికి రెండు, మూడు సెలూన్లు కనిపిస్తాయి. ఆ సెలూన్ల అటాచ్మెంట్, డిటాచ్మెంట్ సేవలతో పాటు సదరు అధికారి వెళ్లిపోయే వరకు మొత్తం యంత్రాంగమంతా ఆయన సేవలోనే నిమగ్నమైపోతుంది. దీంతో సాధారణ రైళ్ల నిర్వహణ లో జాప్యం జరుగుతుంది’ అని ఒక సీనియర్ లొకోపైలెట్ ఆందోళన వ్యక్తం చేశారు. -
దయచేసి వినండి.. ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నడుపుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లలో తేదీలు, బయలుదేరే సమయం, చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు ► భువనేశ్వర్–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (08479) ఈ నెల 12 నుంచి 26 వరకూ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయం 8.45కి బదులు 8.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08480) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.15కి బదులు 10.25కి తిరుపతిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 9.30కి బదులుగా 5.55కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02839) ఈ నెల 17 నుంచి 31 వరకూ ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు బదులుగా 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులు 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02840) ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకూ ప్రతి శుక్రవారం రాత్రి 9.10కి బదులు 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 5.25కి బదులు ఉదయం 5.55కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–బెంగళూరు ప్రత్యేక వారాంతపు రైలు (02845) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. బెంగళూరుకు ఉదయం 10.50కి బదులు 9.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02846) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 8.25కి బదులు సాయంత్రం 4.45కి బెంగళూరులో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 11.15కి బదులుగా సాయంత్రం 6.15కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–పుదుచ్చేరి ప్రత్యేక వారాంతపు రైలు (02898) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. పుదుచ్చేరికి మధ్యాహ్నం 12.40కి బదులుగా 12.10కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02897) ఈ నెల 16 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం సాయంత్రం 4.45కి పుదుచ్చేరిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కి సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–రామేశ్వరం ప్రత్యేక వారంతపు రైలు (08496) ఈ నెల 11 నుంచి 25 వరకూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. రామేశ్వరానికి రాత్రి 11 గంటలకు బదులు 10.35కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08495) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.40కి బదులుగా 8.50కి రామేశ్వరంలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► పూరి–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02859) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి పూరిలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు మధ్యాహ్నం 2.55కి బదులు 1.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02860) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం సాయంత్రం 4.25కి చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. పూరీకి మధ్యాహ్నం 3.15కి బదులుగా 1.45కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైలు (02851) ఈ నెల 11 నుంచి 28 వరకూ ప్రతి సోమ, శుక్రవారం ఉదయం 8.20కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. హజ్రత్ నిజాముద్దీన్‌కు సాయంత్రం 5.10కి బదులు 5 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02852) హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉదయం 5.50కి బదులు 5.10కి బయలుదేరుతుంది. విశాఖపట్నానికి సాయంత్రం 5.30కి బదులుగా 2.15కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు (02869) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం రాత్రి 7.05కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులుగా 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02870) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం రాత్రి 9.10కి బదులుగా ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 10.30కి బదులుగా రాత్రి 10.30కి చేరుకుంటుంది. ► విశాఖపట్నం–కడప ప్రత్యేక రైలు (07488) ఈ నెల 12 నుంచి 31 వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. కడపకు ఉదయం 7.25కి బదులు 7 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07487) ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.05కి బదులు 5.45కి కడపలో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 11.30కి చేరుకుంటుంది. -
12 నుంచి 24 ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఈ నెల 12 నుంచి రైళ్లను పెంచనున్నారు. కోవిడ్–19 కారణంగా ఇప్పటి వరకు 14 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిన రైల్వేశాఖ.. ఇక నుంచి 24 రైళ్లకు పెంచాలని నిర్ణయించింది. రైళ్లలో రాకపోకలకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆక్యుపెన్సీ 70 నుంచి 80శాతం ఉంటోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ► డివిజన్ పరిధిలోని ఒక్కో జిల్లాలో ఒకొక్క స్టేషన్లో మాత్రమే రైలు ఆగుతుంది. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. ► షెడ్యూల్ రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. గతంలోలా ఈ 24ను ప్రత్యేక రైళ్లగానే నడుపుతారు. ముందుగానే రిజర్వేషన్లు ఇస్తారు. ► రైలులో ఎక్కేందుకు గంట ముందుగానే రావాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలు చేసిన తరువాతనే రైలులోకి అనుమతిస్తారు. బోగీలు శానిటైజేషన్ తరువాతనే ప్రయాణీకుల్ని అనుమతిస్తున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాలనే నిబంధన పెట్టారు. 12వ తేదీ నుంచి నడిచే 24 రైళ్లు ఇవే..... ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– చాప్రా (02669), ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ(02615), హౌరా–సికింద్రాబాద్ (02703), విశాఖపట్నం–న్యూఢిల్లీ (02805), హౌరా–యశ్వంత్‌పూర్ (02245), భువనేశ్వర్–ముంబై(01020), తిరుచ్చిరాపాలి –హౌరా (02664), దానాపూర్– కెఎస్ఆర్ బెంగళూరు (02296), చాప్రా–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02670), గుంటూరు– సికింద్రాబాద్ (07201), హౌరా–తిరుచ్చిరాపాలి (02663), ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్– న్యూఢిల్లీ (02433), బెంగళూరు కంటోన్మెంట్–గౌహతి (02509), ముంబై–భువనేశ్వర్(01019), న్యూఢిల్లీ–ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02434), సికింద్రాబాద్–గుంటూరు (07202), గౌహతి–బెంగళూరు కంటోన్మెంట్ (02510), సికింద్రాబాద్–హౌరా (02704), కెఎస్ఆర్ బెంగళూరు–దానాపూర్ (02295), యశ్వంత్‌పూర్–హౌరా (02246), న్యూఢిల్లీ–విశాఖపట్టణం (02806), హైదరాబాద్– విశాఖపట్టణం (02728), న్యూఢిల్లీ –ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02616), విశాఖపట్నం– హైదరాబాద్ (02727). -
రైళ్లలో టపాసులు తీసుకెళ్తే అంతే సంగతి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా రైళ్లలో ఎలాంటి పేలుడు పదార్ధాలు తీసుకెళ్లరాదని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి సందర్భంగా టపాసులు, బాణాసంచా తీసుకెళ్లడం కూడా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అలాంటి ప్రయాణికులపైన రైల్వేయాక్ట్ –1989లోని సెక్షన్లు 164, 165 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఎవరైనా వ్యక్తులు రైళ్లలో టపాసులు, బాణా సంచా తీసుకెళ్తున్నట్లు అనుమానం వస్తే ప్రయాణికులు వెంటనే 182 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని కోరారు. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. -
రైలు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైళ్లకు ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అధికారులను ఆదేశించారు. వంతెనలు, సొరంగాలు, చెరువులను ఆనుకుని ట్రాక్ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. మంగళవారం ఆయన రైల్ నిలయంలో రైళ్ల భద్రత, సమయపాలనపై సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు ఏర్పడే సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వైఫల్యాలపై దృష్టి సారించాలన్నారు. సరుకు రవాణాలో కూడా శ్రద్ధ కనబరచాలన్నారు. 150వ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, మహాత్ముడి జీవిత విశేషాలతో ఉన్న చిత్రాలను రైల్వేస్టేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జీఎం జాన్ థామస్, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ బ్రజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘కళంకిత అధికారులపై వేటు’
లండన్ : అవినీతి అధికారులపై చర్యలు చేపట్టడం ద్వారా అధికారులకు సరైన సంకేతాలు పంపుతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అవినీతి అధికారుల ప్రొఫైల్స్‌ను తమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులకు సరైన సంకేతాలు పంపే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ కళంకిత అధికారుల ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తోందని చెప్పారు. ఇండియా డే కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు గోయల్ బ్రిటన్ చేరుకున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 15 మంది పరోక్ష పన్నుల విభాగానికి చెందిన సీనియర్ అధికారులచే పదవీ విరమణ చేయించిన సంగతి తెలిసిందే. -
ప్రయాణికులకు బోగిభాగ్యం
సాక్షి, హైదరాబాద్: వేగంగా వెళ్లే రైలులో ఒక్క బోగీ పట్టాలు తప్పినా దాని వెనక ఉండే ఇతర బోగీలు పరస్పరం గుద్దుకుని ఒకదానిపై ఒకటి ఎక్కటం సహజం. ప్రతి రైలు ప్రమాదాల్లో ఈ తరహా దృశ్యాలే కనిపిస్తాయి. భారీ ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణం కూడా ఇలా బోగీలు ఒకదానిపైకి ఒకటి దూసుకుపోవటమే. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా రైల్వే శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు ఒకదానిపైకిఒకటి దూసుకుపోవటానికి కారణం ప్రస్తుతం ఉన్న పాత పద్ధతి కప్లింగ్సే అనే విషయాన్నీ ఆ శాఖ గుర్తించింది. దీంతో వాటిని సమూలంగా మార్చేందుకు సిద్ధమైంది. గతంలోనే దీన్ని గుర్తించి కొత్త తరహా కప్లింగ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. అయితే వాటిల్లోనూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవడంతో నిలిపివేసింది. తాజాగా అమెరికాలో వినియోగంలో ఉన్న కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ తరహా కప్లర్స్ ఏర్పాటు చేస్తే బోగీలు పరస్పరం ఢీకొనటం అనేది జరగదు. అలాగే ప్రయాణంలో కుదుపులు లేకుండా సౌకర్యంగా ఉండనుంది. రైల్వే ఆధునికీకరణలో భాగంగా రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఏఏఆర్ హెచ్ కప్లర్స్.. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రైల్ రోడ్ ఫర్ హైస్పీడ్.. ఇదో విదేశీ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా బోగీలను అనుసంధానించే కప్లింగ్ వ్యవస్థతో ఉత్పన్నమవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక పరికరాల్ని రూపొందించింది. ప్రస్తుతమున్న సీబీసీకి దీన్ని అనుసంధానించాలని మన రైల్వే నిర్ణయించింది. ఆ పరికరం ఏర్పాటుతో వేగంగా వెళ్తున్న రైలు బ్రేకు వేసినా, నెమ్మదిగా వెళ్లే రైలు ఒక్కసారిగా వేగాన్ని పెంచినా ఏర్పడే భారీ కుదుపులను ఇది నిరోధించనుంది. ఈ పరికరం ఏర్పాటుతో రైళ్లలో కుదుపుల సమస్యకు విరుగుడు కలగనుంది. అవసరం ఏంటి..? ఇప్పటివరకు మన రైళ్లలో ఐఆర్ఎస్ స్క్రూ టైప్ సంప్రదాయ కప్లింగ్ వ్యవస్థే వాడకంలో ఉంది. ఇది తొలితరం కప్లర్. రెండు బోగీలను చివరలో కొండీలు ఉండే గొలుసు లాంటి దానితో బంధించి మధ్యలో భారీ స్క్రూను ఏర్పాటు చేస్తారు. ఇంజన్ మొదలు, బోగీల వరకు ఒకదానికొకటి అనుసంధానించే వ్యవస్థ ఇదే. బోగీలు పట్టాలు తప్పినప్పుడు ఈ లింక్ విడిపోయి బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి ఎక్కి భారీ ప్రాణనష్టానికి కారణమవుతోంది. దీంతో ఈ సంప్రదాయ కప్లర్స్‌ను తొలగించి వాటి స్థానంలో సెంటర్ బఫర్ కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. కానీ కొన్ని బోగీలకే వాటిని ఏర్పాటు చేయగలిగారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికీ 3,378 కోచ్‌లకు సంప్రదాయ కప్లర్స్ ఉండగా, కేవలం 1,238 కోచ్‌లకు మాత్రమే సీబీసీ ఏర్పాటు చేశారు. ఇక వేగంగా మిగతా వాటికి కూడా సీబీసీలను ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా తయారయ్యే బోగీలన్నింటికీ వాటినే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ.. ఈ సీబీసీతో కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఇప్పుడు వాటిని అధిగమించేందుకే అమెరికా తరహా ఏఏఆర్ హెచ్ కప్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవి మామూలు కుదుపులు కాదు.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మిత్రులు రైలులో ఢిల్లీ బయలుదేరారు. కాసేపటికి వారి బోగీలకు టీవాలా రావటంతో వీరు కొనుక్కుని తాగుతూ మాట ల్లో పడిపోయారు. ఇంతలో రైలు బ్రేకు వేయటంతో పెద్ద కుదుపు.. చేతిలోని టీ వారి మీద ఒలికిపోయింది. ఇక రాత్రి పడుకున్నాక ఇలాగే కుదుపులు ఏర్పడి సైడ్ బెర్త్‌పై పడుకున్న వారి తలలు రైలు గోడకు కొట్టుకోవాల్సి వచ్చింది. ఇంతటి భారీ కుదుపులతో ప్రయాణికులు బెంబేలెత్తారు. అలాంటి కుదుపులతో రైలు పట్టాలు తప్పిందేమోనని భయపడి హడలి పోయారు. సీబీసీ కప్లర్స్ ఏర్పా టు చేసిన రైల్లోనే ఈ కుదుపులు ఏర్పడుతున్నాయి. దీంతో రైల్వే శాఖ మంత్రి వరకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన ఆరా తీయగా, కుదుపులకు సీబీసీ కప్లింగ్ వ్యవస్థనే కారణమని తెలిసింది. పట్టాలు తప్పినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా చేసి ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడుతున్నా.. ఈ కుదుపులు మాత్రం భరించలేనివిగా ఉన్నాయి. దీం తో అధికారులు ఏఏఆర్ హెచ్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీబీసీ కప్లర్స్ ఉన్న అన్ని కోచ్‌లకు వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. వీటివల్ల కుదుపుల్లేని ప్రయాణమే కాకుండా, శబ్దం తక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కప్లింగ్ ఏర్పాటు చేసేప్పుడు తక్కువ సిబ్బంది అవసరం పడుతుందని, మార్చే క్రమంలో సిబ్బం ది ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. -
నేడు ఆటో, క్యాబ్‌ల బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు మంగళవారం బంద్ పాటించనున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతునిస్తున్న నేపథ్యంలో బస్సుల రాకపోకలపై కూడా బంద్ ప్రభావం ఉండనుంది. అయితే ప్రధాన కార్మిక సంఘమైన టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) మాత్రం సమ్మెకు దూరంగా ఉండనుంది. ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. ఎక్కడికక్కడే స్టాప్.. సమ్మె నేపథ్యంలో లక్షకు పైగా ఆటోరిక్షాలు, మరో 50 వేల క్యాబ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఓలా, ఊబెర్ క్యాబ్‌లు, 25 వేలకు పైగా స్కూల్ ఆటోలు, వ్యాన్లు కూడా ఆగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెను కొనసాగించనున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రతినిధులు వెంకటేశ్, సత్తిరెడ్డి.. తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ప్రతినిధులు ఈశ్వర్రావు, కొండల్‌రెడ్డి ప్రకటనల్లో తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలోని కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తేయాలని.. డ్రైవర్ల భద్రత, సంక్షేమం కోసం డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరగనున్న రైళ్లు.. రైల్వే కార్మిక సంఘాలు సైతం సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్నప్పటికీ రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా ఉంటాయి. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్లతో పాటు, నగరంలోని వివిధ మార్గాల్లో ప్రయాణికులకు సదుపాయం అందజేసే ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మెట్రో రైళ్లు కూడా యథావిధిగా తిరుగుతాయి. బస్సులపై ప్రభావం.. సమ్మెకు కొన్ని కార్మిక సంఘాలు మద్దతునిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల పైనా పాక్షికంగా ప్రభావం పడే అవకాశముంది. గ్రేటర్లో ప్రతి రోజూ 3,850 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 32 లక్షల మంది ప్రయాణిస్తారు. బంద్ ప్రభావం కారణంగా ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సమ్మెలో పాల్గొనే సిబ్బంది వల్ల కొన్ని రూట్లలో బస్సులు నిలిచిపోవచ్చు. అయితే సాయంత్రం అన్ని రూట్లలో యథావిధిగా బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది. -
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
కాజీపేట రూరల్: విశాఖపట్నం నుంచి నాందేడ్ వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన మెకానికల్ సిబ్బంది కాజీపేట జంక్షన్లో మంటలు ఆర్పి, మరమ్మతు చేసి పంపించారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు చేరుకున్న సమయంలో ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు, పొగలు వ్యాపించి వాసన రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరంగల్ రైల్వేస్టేషన్లో సిబ్బంది మంటలను గుర్తించి కాజీపేట రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. ఉదయం 6.45 గంటలకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు రాగానే మెకానికల్ సిబ్బంది హుటాహుటిన ఏసీ కోచ్ వద్దకు చేరుకొని పరిశీలించారు. బోగీ కింద ఉన్న బ్యాటరీల్లో మంటలు రావడాన్ని గుర్తించి వెంటనే వాటిని ఆఫ్ చేసి మరమ్మతు చేశారు. అనంతరం 7.15 గంటలకు రైలును పంపించారు. ఈ ఘటనతో అరగంట పాటు రైలును కాజీపేట జంక్షన్లో నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రైల్వే యార్డులో బోగీ దగ్ధం మరో సంఘటనలో కాజీపేట జంక్షన్‌లోని రైల్వే యార్డులో నిలిపి ఉన్న పాత రైలు బోగీలో మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. యార్డు లో ఒక వైపు గూడ్స్ వ్యాగన్లు, మరోవైపు ఆయిల్ ట్యాంకర్ల రైలు, కొద్ది దూరంలో వేరే లైన్లో కాలం చెల్లిన ప్యాసింజర్ కోచ్‌లను నిలిపి ఉంచారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక పాత బోగీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్లో ఉన్న రైల్వే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ లోగా రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని తెల్లవారుజామున 4 గంటల వరకు మంటలు చల్లార్చారు. ఈ ఘటనలో బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ స్వల్పంగా కాలిపోయింది. సికింద్రాబాద్ , కాజీపేట రైల్వే అధికారులు కోచ్ దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు కాజీపేట రైల్వే పోలీసులు తెలిపారు. ఒకే రోజు రెండు ఘటనలు.. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, కాజీపేట రైల్వే యార్డులో పాత బోగీ దగ్ధం కావడంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ రెండు ఘటనల్లో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రైలు ఆపి.. వందలాది ప్రాణాలు కాపాడి!
రేణిగుంట: సోమవారం.. తెల్లవారుతున్న వేళ... పొలంలో నాట్లు వేసే పని నిమిత్తం ఓ రైతు మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతూ గుర్తించిన ఓ దృశ్యం, తర్వాత ఆయన చేసిన సాహసం... వందలాది మంది ప్రాణాలను నిలబెట్టింది. ప్రమాద ఘంటికలను మోగిస్తూ విరిగిపోయి ఉన్న రైలు పట్టాలను గమనించిన అన్నదాత ప్రమాదమని తెలిసినా ఎర్రటి టీషర్టు ఊపుతూ రైలుబండికి ఎదురెళ్లి ఆపేశాడు. చిత్తూరు జిల్లా రేణిగుంట–శ్రీకాళహస్తి రైల్వేమార్గంలో మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో పెను ప్రమాదమే తప్పింది. వెదుళ్లచెరువుకు చెందిన రైతు మల్లికార్జున్ తన పొలంలో నాట్లు కోసం కూలీలను పిలిచేందుకు సోమవారం తెల్లవారుజామున ఎస్టీ కాలనీ వైపు వెళుతుండగా రైలు పట్టాలను దాటే సమయంలో ఎడమ వైపు ఉన్న ఓ రైలు పట్టా రెండుగా విరిగిపోయి ఉండటాన్ని గుర్తించాడు. సమీపంలో వెళుతున్న ఎస్టీ కాలనీకి చెందిన మచ్చ అంకయ్యను అరిచాడు. ఇంతలోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు దూరంగా కూతపెడుతూ వస్తుండటాన్ని గమనించారు. రైలును ఎలాగైనా ఆపి ప్రమాదాన్ని తప్పించాలని వారిద్దరూ భావించారు. అంకయ్య వేసుకున్న ఎర్రటి టీషర్టును విప్పి చేతితో ఊపుతూ రైలుకు ఎదురుగా పరుగులు పెట్టారు. గమనించిన రైలు డ్రైవర్ విరిగిన పట్టాలకు కొద్ది దూరంలో రైలును ఆపేశాడు. రైల్వే గ్యాంగ్‌మెన్ తేజకు విషయాన్ని తెలియజేయడంతో ఆయన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అరగంటపాటు శ్రమించి తాత్కాలిక మరమ్మతులను చేసి ఆగి ఉన్న రైలును సురక్షితంగా పంపారు. తర్వాత విరిగిన పట్టాలను శాశ్వత మరమ్మతులు చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని వాకబు చేసి తప్పిన ప్రమాదంతో ఊపిరి పీల్చుకున్నారు. మల్లికార్జున్‌ను రైల్వే అధికారులు, ప్రయాణికులతోపాటు గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. -
హలో.. పూర్ణ ఎక్స్‌ప్రెస్ బోల్తా పడింది !
ఆదిలాబాద్‌టౌన్: రైల్వే అధికారులు మంగళవారం అర్ధరాత్రి జిల్లా యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. తలమడుగు మండలం ఉండం దగ్గర పూర్ణ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రక్‌ను ఢీకొని బోల్తా పడిందని డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అక్కడి నుంచి జిల్లా పోలీసు అధికారులకు ఈ సమాచారం అందింది. హుటాహుటిన పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న రైలులో ప్రయాణం చేస్తున్న వారి బంధువులు, స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఆదిలాబాద్ రైల్వే ట్రాక్ నుంచి ఉండం వరకు ప్రమాదం ఎక్కడ జరిగిందని వెతుక్కుంటూ వెళ్లారు. తీరా తెల్లవారుజామున 4 గంటల సమయంలో రైల్వే అధికారులు మాక్ డ్రిల్ చేశామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారో లేదో, ఘటన జరిగితే స్పందన ఎలా ఉంటుందోనని చావుకబురు చల్లగా చెప్పడంతో అందరూ బిత్తరపోయారు. రైల్వే అధికారులపై ఫైర్.. రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా మాక్‌డ్రిల్ నిర్వహించడంపై జిల్లా ఎస్పీతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని రైల్వే అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. -
‘బసంతిని వేలం వేశారు..’
ముంబై : సాధరణంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు.. జరిమానా విధిస్తారు. ఒక వేళ జరిమానా కట్టలేక పోతే టీసీ కాళ్లావేళ్లా పడి, బతిమిలాడి బయటపడతాం. కానీ ముంబై రైల్వే అధికారులు మాత్రం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికురాలికి జరిమానా విధించారు. కానీ ఫైన్ చెల్లించలేక పోవడంతో ఆ ప్రయాణికురాల్ని వేలం వేశారు. ఎంత దారుణం.. ఫైన్ చెల్లించలేదని వేలం వేస్తారా అంటూ రైల్వే అధికారులపై ఆగ్రహించకండి. ఎందుకంటే రైల్వే అధికారులు వేలం వేసిన ప్రయాణికురాలు మనిషి కాదు ‘మేక’. వినడానికి కాస్తా విచిత్రంగా అనిపిస్తున్న ఈ సంఘటన బుధవారం సాయంత్రం ముంబై రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం రైల్వే నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రయాణికుడు మేకతో కలిసి ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. అది గమనించిన టీసీ అతన్ని జంతువులతో కలిసి ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం.. ముందు టికెట్ చూపించమని అడిగాడు. సదరు ప్రయాణికుడు నిబంధనలను అతిక్రమించడమే కాక అతను టికెట్ కూడా కొనలేదు. దాంతో టీసీ అతనికి ఫైన్ విధించాడు. జరిమానా చెల్లించడానికి తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. కానీ టీసీ ఫైన్ కట్టాల్సిందేనని చెప్పడంతో.. సరే నా మేకను మీ దగ్గర ఉండనివ్వండి. నేను వెళ్లి డబ్బులు తీసుకోస్తాను అని కోరాడు. చేసేదేంలేక టీసీ మేకను పట్టుకుని నిల్చున్నాడు. డబ్బులు తీసుకోస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగిరాలేదు. దాంతో ఆ మేకను స్టేషన్లోనే కట్టేసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంతేకాక ఆ మేకకు ‘బసంతి’ అనే పేరు కూడా పెట్టారు. కానీ ఇలా ఎన్ని రోజులు..? అందుకే చివరకూ మేకను వేలం వేయడానికి నిర్ణయించారు. ‘బసంతి’ ఖరీదును మూడు వేల రూపాయలుగా నిర్ణయించారు. అయితే మరో ఆసక్తికర అంశం ఏంటంటే మేకను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మరో 500 రూపాయలు తగ్గించి వేలం వేశారు. ఓ వ్యక్తి 2500 రూపాయలను చెల్లించి ‘బసంతి’ని తన సొంతం చేసుకున్నాడు. ముంబై లోకల్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ. 256 జరిమానా విధిస్తారు. కానీ బసంతిని వేలం వేయడం ద్వారా 10 రెట్లు అధికంగా రైల్వేకు లాభం రావడం విశేషం. -
శివారు.. సిటీ.. ఓ ఎంఎంటీఎస్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతాలను నగరంతో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ మొత్తం 96.25 కి.మీల దూరంతో రూ.641 కోట్ల అంచనా వ్యయంతో 2012– 13లో ఈ పనులకు అనుమతులు వచ్చాయి. పెరిగిన అంచనా వ్యయం మేరకు రూ.817 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రాష్ట్రం రూ.544 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే రూ.272 కోట్లు భరించాలి. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.110 కోట్లు మాత్రమే విడుదల చేయగా, దక్షిణ మధ్య రైల్వే తన వంతు నిధులను పూర్తిగా ఖర్చు చేసింది. మిగతా నిధులు కూడా విడుదలైతే ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకువస్తా మని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ పనులు పూర్తయితే తెల్లాపూర్–రామచంద్రాపురం, సనత్‌నగర్–మేడ్చల్–బొల్లారం, ఫలక్‌నుమా–ఉందానగర్ ప్రాంతాలు.. శంషాబాద్ విమానాశ్రయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో సులువుగా అనుసంధానం అవు తాయి. ఫలితంగా నగరవాసులకు భారీగా సమయం, ఇంధన ఆదా, ప్రయాణ ఖర్చులు కలసి వస్తాయి. పెరిగిన అంచనా వ్యయం.... ప్రారంభం నాటి అంచనా ప్రకారం ప్రాజెక్టు విలువ రూ.641 కోట్లు.. తరువాత భూసేకరణ, పనుల్లో జాప్యం తదితర సమస్యల కారణంగా రూ.817 కోట్లకు చేరింది. మిగతా మార్గాల్లో సమస్యలు కొలిక్కి రాగా, సనత్‌నగర్–మౌలాలి మార్గంలోని సుచిత్ర ప్రాంతంలో భూ సేకరణపై కాస్త ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై ద.మ.రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి.. ♦ 1. తెల్లాపూర్–రామచంద్రాపురం ♦ 2. సికింద్రాబాద్–బొల్లారం ఇంకా రావాల్సింది.. రూ.434 కోట్లు.. ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 18 నాటికి పనులు పూర్తవ్వాలి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వాటాలోని మిగిలిన రూ.434 కోట్లు కూడా విడుదలైతే త్వరలోనే రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ మార్గాలివే... 1.ఫలక్‌నుమా–ఉందానగర్–శంషాబాద్ ఎయిర్‌పోర్టు (13.5 కి.మీ.+6.5 కి.మీ.) డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్ పనులు. అంచనా వ్యయం రూ.85 కోట్లు. (ఇందులో ఉందానగర్– ఎయిర్‌పోర్టు 6.5 కి.మీ.ల దూరంలో కొత్త రైల్వేలైను నిర్మాణ పనులకు ఇంకా అనుమతి రాలేదు.) 2.తెల్లాపూర్–రామచంద్రాపురం (5.75కి.మీ). పాత ట్రాక్‌ను పునరుద్ధరణ+విద్యుదీకరణ. అంచనా వ్యయం రూ.32 కోట్లు 3. సికింద్రాబాద్–బొల్లారం (14కి.మీ.).ఎలక్ట్రిఫికేషన్+స్టేషన్ ఆధునీకరణ.అంచనా వ్యయం రూ.30 కోట్లు 4.సనత్‌నగర్–మౌలాలి (22.4 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.170 కోట్లు 5. మౌలాలి–మల్కాజిగిరి–సీతాఫల్మండి (10 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.25 కోట్లు 6. బొల్లారం–మేడ్చల్ (14 కి.మీ.). డబ్లింగ్+ఎలక్ట్రిఫికేషన్. అంచనా వ్యయం రూ.74 కోట్లు. 7. మౌలాలి–ఘట్కేసర్ (12.2 కి.మీ.).నాలుగులైన్ల నిర్మాణం+ఎలక్ట్రిఫికేషన్.అంచనా వ్యయం రూ.120 కోట్లు 8. ప్రయాణికుల సదుపాయాలకురూ.20 కోట్లు 9. రైలు కోచ్‌లకు రూ.85 కోట్లు మొత్తం వ్యయం... 641 కోట్లు గడువులోగా పూర్తి చేస్తాం... ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు పూర్తిగా సహకరిస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో సమావేశం నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కూడా విడుదల చేసింది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది. – వినోద్‌కుమార్ యాదవ్, జీఎం, ద.మ. రైల్వే -
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: దేశ రాజధాని ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ సూపర్ ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (22416) రైలులో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం 6 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్ 11.45 గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 12 కి.మీ. దూరంలోని బిర్లానగర్ స్టేషన్ వద్ద బీ6, బీ7 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్‌ను లాగి రైలును ఆపి వేశారు. రైలు నిలిచిన వెంటనే ప్రయాణికులు భయాందోళనతో ఒకరికొకరు తోసుకుంటూ కిందికి దూకడంతో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంతకు మినహా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ రెండు బోగీల్లో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకవేళ వేగంగా కదులుతున్న రైలులో మంటలు వ్యాపించి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. శిక్షణ ముగించుకుని తిరిగివస్తున్న 37 మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా ఈ రైలులో ఉన్నారు. వారెవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కోచ్‌లోని ఎయిర్ కండిషన్ యూనిట్లో సమస్యతో మంటలు మొదలయ్యాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ‘బీ7 బోగీలోని టాయిలెట్‌పైనున్న రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్డ్ యూనిట్ (ఆర్ఎంపీయూ)లో మొదట మంటలు ప్రారంభమయ్యాయి’ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మంటలు అంటుకున్నాయని, ఆ సమయంలో రైలు పూర్తి వేగాన్ని అందుకోలేదని గ్వాలియర్ రైల్వే పీఆర్వో మనోజ్ సింగ్ తెలిపారు. కాగా, రైలు నాలుగు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.30 గంటలకు గ్వాలియర్ జంక్షన్ నుంచి తిరిగి బయలుదేరింది. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే శాఖ తెలిపింది. విశాఖలో ఆందోళన.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదానికి గురైన రెండు బోగీలు విశాఖపట్నం కోటాలో కేటాయించారు. ఈ బోగీల్లో 65 మంది విశాఖ వరకు రిజర్వేషన్ చేయించుకున్న వారున్నారు. దీంతో ఆ బోగీల్లో ఉన్న తమ వారి పరిస్థితిపై బంధువులు కలవరానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వే అధికారులు స్పష్టం చేయడంతో పాటు తమ వారితో ఫోన్లో సంప్రదించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాక బంధువులు ఊరట చెందారు. మరోవైపు ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న మరో రెంటిని కూడా భద్రతా కారణాల దృష్ట్యా తొలగించారు. వాటి స్థానంలో గ్వాలియర్‌లో మరో నాలుగు బోగీలను అమర్చారు. షెడ్యూలు ప్రకారం ఈ రైలు విశాఖకు మంగళవారం సాయంత్రం 5.50 గంటలకు రావలసి ఉండగా.. మంగళవారం రాత్రి 10 గంటలకు విశాఖ చేరుకోవచ్చని తూర్పు కోస్తా రైల్వే అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల సమాచారం కోసం విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం వరకూ హెల్ప్లైన్లను అందుబాటులో ఉంచారు. వివరాల కోసం 0891–2746330, 2746344, 2746338, 2744619, 2883003, 2883004, 2883005, 2883006 ల్యాండ్లైన్లతో పాటు 8500041673, 850041670 మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చు. రైలు ప్రమాదం నేపథ్యంలో నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులతో జీఎం ఉమేష్‌సింగ్, సీపీఆర్వో జేపీ మిశ్రా, వాల్తేరు డివిజన్ ఏడీఆర్ఎం కె.ధనుంజయరావు, చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఏకే బెహ్రా తదితరులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. -
ఒక్క టికెట్‌తో తిరుమలేశుడి చెంతకు!
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు రైల్లో వెళ్లే భక్తులు తిరుపతిలో దిగి అక్కడి నుంచి బస్టాండుకు వెళ్లి బస్సు టికెట్ కొనుక్కుని కొండపైకి చేరుకుంటారు. కానీ.. ప్రత్యేకంగా బస్సు టికెట్ కొనుక్కొనే అవసరం లేకుండా రైలు టికెట్లోనే బస్సు టికెట్ కలసి ఉండే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇలా కొనని వారు కూడా రైలులో ప్రయాణిస్తున్నప్పుడే బస్సు టికెట్ కొనే విధానాన్ని కూడా రైల్వే ప్రారంభించింది. వెరసి.. బస్సు టికెట్ కోసం విడిగా కసరత్తు చేయాల్సిన అవసరం లేకుండా భక్తులకు పని తగ్గించింది. కొద్ది రోజుల క్రితమే ఈ రెండు విధానాలు ప్రారంభించినా.. వీటిపై భక్తులకు అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే అన్ని రైళ్లలో... హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వెంకటాద్రి, నారాయణాద్రి, రాయలసీమ, సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్, పద్మావతి... ఇలా అన్ని రైళ్లలో రైలు టికెట్లోనే బస్సు టికెట్ కలసి ఉండే కాంబో విధానం అమలులో ఉంది. టికెట్ బుక్ చేసుకునేప్పుడు తిరుమల వరకు కొనాలి. ఉదాహరణకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే వారు కాచిగూడ నుంచి తిరుమల వరకు టికెట్ కొనాలి. తిరుపతిలోనే రైలు దిగినా టికెట్‌పై మాత్రం తిరుమల వరకు ప్రయాణిస్తున్నట్టుగా జారీ అవుతుంది. ఆ టికెట్‌ను అలిపిరి వద్ద చెక్ చేసే సమయంలో ఆర్టీసీ సిబ్బందికి చూపితే దాన్ని తీసుకుని ఆర్టీసీ టికెట్ ఇస్తారు. ప్రత్యేకంగా తిరుపతిలో క్యూలో నిలబడి బస్ టికెట్ కొనాల్సిన బాధ తప్పుతుంది. రద్దీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో తిరుపతిలో బస్ టికెట్ కొనటం కూడా గగనమే అవుతోంది. ఆ బాధ లేకుండా రైలు టికెట్‌తోపాటే బస్‌టికెట్ కొనుక్కునే వెసులుబాటును రైల్వే అందుబాటులోకి తెచ్చింది. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే త్వరలోనే ప్రత్యామ్నాయ విధానం ఖరారు చేసి అందుబాటులోకి తేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలులోనే బస్ కండక్టర్లు... ఇక హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో రేణిగుంటకు చేరువకు రాగానే బస్ కండక్టర్లే రైళ్లలోకి వస్తారు. వారు అక్కడికక్కడే తిరుమల టికెట్లు జారీ చేస్తారు. ఇందుకోసం ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ–రైల్వేలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కడప మార్గంలో వెళ్లే రైళ్లలో కోడూరు వద్ద ఆర్టీసీ కండక్టర్లు రైళ్లలోకి ఎక్కుతారు. గూడూరు మార్గంలో వచ్చే వాటిల్లోకి కాళహస్తి వద్ద ఎక్కుతారు. వారి నుంచి అప్పటికప్పుడు తిరుమలకు అప్ అండ్ డౌన్ టికెట్లు కొనుక్కోవచ్చు. దిగిన తర్వాత హైరానా పడాల్సిన అవసరం లేకుండా ఈ వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వెళ్లే కాచిగూడ–తిరుపతి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్–తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు చెన్నై నుంచి వచ్చే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు–బెంగళూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, కాకినాడ నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–తిరుపతి ఎక్స్‌ప్రెస్, మన్నార్గుడి ఎక్స్‌ప్రెస్, కొల్హాపూ ర్ నుంచి వచ్చే హరిప్రియ ఎక్స్‌ప్రెస్, మైసూ రు నుంచి వచ్చే గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లలో దీన్ని ప్రారంభించారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో మరిన్ని రైళ్లల్లో పారంభించనున్నట్టు ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. -
ఆ ఉద్యోగాలకు ఏకంగా 2కోట్ల దరఖాస్తులు!
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చదివిన చదువులకు కొలువులు దొరకక, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి వెళ్తోంది. ఏ చిన్న ఉద్యోగానికైనా లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా రైల్వేలో వెలువడిన 90,000 ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి వెల్లువెత్తిన దరఖాస్తులను చూసి రైల్వే అధికారులే ఆశ్చర్యపోయారు. రైల్వేశాఖలో గ్రూప్ సీ, డీ పోస్టులకుగాను రెండుకోట్లకుపైగా దరఖాస్తుల వచ్చినట్టు రైల్వే అధికారులు అధికారికంగా తెలిపారు. ఇంకా చివరి తేదికి గడువు ఉన్నందున్న దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంతమందికి ఒకేసారి పరీక్షలు నిర్వహించడం, ఎంపిక చేయటం రైల్వే శాఖకి కష్టం కలిగించేదే.. -
ఈ వంతెన భూకంపాలనూ తట్టుకుంటుంది!
కౌరి(జమ్మూకశ్మీర్): అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్–రేసి–అనంత్‌నాగ్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు. -
చెన్నైలో చాలా మంది ఎలా చనిపోతున్నారో తెలుసా..
చెన్నై: ప్రయాణీకులు తమ నిర్లక్ష్య వైఖరితో నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. గత ఐదు నెలల్లో నిబంధనలు ఉల్లంఘించి పట్టాలు దాటుతూ 550 మంది మృత్యువాత పడడమే ఇందుకు నిదర్శనం. వీరిలో 20 శాతం మంది సెల్ఫోన్లో మాట్లాడుతూ పట్టాలు దాటడం, రైళ్లు ఎక్కడం, దిగడంతో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాల కారణంగా ఏడాది సరాసరిగా 27 వేల మందికి పైగా మృతిచెందుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో పేర్కొంది. రైలు ప్రమాదాలలో మృతిచెందుతున్న వారి సంఖ్య కంటే నిబంధనలు ఉల్లంఘించి రైలు పట్టాలు దాటడం, రైళ్లు ఎక్కడం, దిగడం వంటి కారణాలతో ఏర్పడే మరణాలే అధికంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా భద్రతా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలలో రైలు గేట్లు, మార్గాలు దాటడం, సెల్ఫోన్లలో మాట్లాడుతూ నడిచివెళ్లడం, విద్యుత్ రైళ్లలో జనరద్ధీలో జారిపడడం వంటి కారణాలతో ప్రాణనష్టం అధికమవుతోంది. దక్షిణ రైల్వే చెన్నై పోలీసు జోన్లో చెన్నై సెంట్రల్, ఎగ్మూరు, తాంబరం, చెంగల్పట్టు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ధర్మపురి, హోసూరు, ఈరోడ్, కోయంబత్తూరు, తిరుపూర్ సహా 23 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. చెన్నై జోన్ ప్రాంతంలో గత జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలల్లో మాత్రం రైలు పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తూ 550 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రైల్వే పోలీసు ఉన్నతాధికారులు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెన్నై జోనల్ రైల్వే పోలీసు, రైల్వే భద్రతా దళం పోలీసులతో కలిసి రైలు పట్టాలపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రతి శుక్రవారం చర్యలు తీసుకుంటున్నామని, అంతేకాకుండా అనేక రైల్వే స్టేషన్లలో అవగాహన ప్రచారాలు చేపడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రయాణీకులు నిబంధనలు ఉల్లంఘించి పట్టాలు దాటుతున్నట్లు తెలిపారు. దీని గురించి సెంట్రల్ రైలు పోలీసు ఇన్స్పెక్టర్ శేఖర్ మాట్లాడుతూ మొత్తం రైలు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యలో 20 శాతం మంది సెల్ఫోన్లు ఉపయోగించే వారిగా తెలిసిందన్నారు. సెల్‌ఫోన్ కారణంగా మృతిచెందిన ప్రాంతాలకు తాము వెళ్లి చూడగా సెల్‌ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి వెళుతున్నారని, దీంతో మృతుని చిరునామా, గుర్తింపులో సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. అందుచేత ప్రయాణీకులు రైలులో ఎక్కేటపుడు, దిగేటపుడు సెల్ఫోన్లు ఉపయోగించకుంటే మంచిదన్నారు. -
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన డీసీఎం
యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలం జగదేవ్‌పూర్ రోడ్డులోని రైల్వే గేట్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో రైల్వేగేట్ ధ్వంసమైంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి వచ్చి మరమ్మతులు చేపట్టారు. -
‘దురంతో’కు తప్పిన ప్రమాదం
ఆమదాలవలస: శాంత్రగచ్చి– చెన్నై దురంతో ఎక్స్‌ప్రెస్‌కు బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో బుధవారం రైల్వే ట్రాక్ విరిగింది. అధికారులు సకాలంలో స్పందించి మరమ్మతులుS చేపట్టడంతో దురంతోకి ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం..ఉదయం 6.45 గంటలకు శాంత్రగచ్చి–చెన్నై (దురంతో ఎక్స్‌ప్రెస్) ప్లాట్‌ఫాం దాటిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ ఉన్న ప్రయాణికులు, అధికారులు పరిశీలించగా పట్టా విరిగి ఉండడాన్ని గమనించారు. వెంటనే అధికారులు అప్రమత్తమై పట్టాకు మరమ్మతులు చేపట్టారు. -
తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. రైళ్లు ఆలస్యం
వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద బుధవారం ఉదయం రైల్వే విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో నేటి ఉదయం గూడురు-నెల్లూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మార్గంలో వెళ్లనున్న జమ్ము-కశ్మీర్ ఆర్మీ రైలు సహా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఫౌంటెయిన్లు, పిల్లల కోసం ఆటస్థలాలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సరికొత్త హంగులు సంతరించుకోనుంది. స్టేషన్ రీమోడలింగ్‌లో భాగంగా పలు మార్పు లకు దక్షిణమధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సికిం ద్రాబాద్ను వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలనే ఒకప్పటి ప్రతిపాదన స్థానంలో తాజాగా రీమోడలింగ్ అంశం తెరపైకి వచ్చిం ది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్లో అదనపు సదుపాయాల ఏర్పాటు, కేటరింగ్ సేవల్లో నాణ్యత పెంపు, వాణిజ్య కేంద్రాల విస్తరణ, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లవంటి అదనపు హంగులతో రైల్వేస్టేషన్ సేవలను విస్తరించ నున్నారు. టికెట్‌తో పాటు టికెట్టేతర ఆదాయం పెంచుకొనేందుకు అనుగుణంగా రీమోడలింగ్ పనులు చేపట్టనున్నారు. టికెట్టేతర ఆదాయమే లక్ష్యం... సుమారు 200 రైళ్లు, 2.5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.750 నుంచి రూ.800 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఇందులో 80 శాతానికి పైగా టికెట్ విక్రయా లపైనే వస్తోంది. లక్షలాది మంది రాక పోకలు సాగించే ఏ-1 స్టేషన్లో టిక్కెట్టేతర ఆదాయం తక్కువగా ఉండడంపై అధికా రులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వినియో గదారులను ఆకట్టుకొనేలా స్టేషన్‌కు అదనపు హంగులు సమకూర్చాలని నిర్ణరుుంచారు. వరల్డ్ క్లాస్ అంశంపై నెలకొన్న పీటముడి కూడా తొలగిపోవడంతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు వంటివి ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పెంచు కొనేందుకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై పెద్ద రెస్టారెంట్‌ను ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌కు రెండు వైపులా పార్కింగ్ సదుపాయాలను మెరుపర్చేందుకు చర్యలు తీసుకుంటారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను స్టేషన్ బయటి వైపునకు పొడి గిస్తారు. తద్వారా చిలకల గూడ వైపు ఉన్న 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు ప్రయా ణికులు నేరుగా రాకపోకలు సాగించేం దుకు అవకాశం లభిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం... స్టేషన్లో ప్రయాణికులు వారి కోసం వచ్చే బంధుమిత్రులు సేద తీరేందుకు... అనువైన చోట పచ్చికల ఏర్పాటు వంటి ఆహ్లాదకరమైన సౌకర్యాలు కల్పిస్తారు. రెండు వైపులా ఫౌంటెరుున్లు ఏర్పాటు చేస్తారు. అలాగే షాపింగ్ కోసం వచ్చే వారు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలాలను కూడా రూపొందించాలనే ప్రతిపాదన కూడా ఉంది. బడా షాపింగ్ మాల్స్‌లో మాదిరిగానే... పిల్లలు ఆడుకొనేందుకు ఏర్పాట్లు చేస్తారు. వరల్డ్ క్లాస్ లేనట్లే... ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్ర బిందువుగా ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై పెరుగుతున్న రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని 2008లోనే అంతర్జా తీయ ప్రమాణాలకు అనుగుణంగా అభి వృద్ధి చేయాలని ప్రతిపాదించారు. సుమా రు రూ.500 కోట్ల అంచనాలతో వరల్డ్‌క్లాస్ స్టేషన్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. కానీ భారీ బడ్జెట్‌తో కూడిన ఈ ప్రాజెక్టుపై రైల్వే వెనుకడుగు వేసింది. వరుసగా బడ్జెట్లలో ప్రతిపాదించినప్ప టికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా ప్రణాళికలను రూపొందిస్తున్న క్రమంలోనే రీమోడలింగ్‌కు రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు. -
భూపరిహారం చెల్లించలేదని రైలునే జప్తుచేశారు!
దావణగెరె(కర్ణాటక): ఏడేళ్లయినా రైల్వేశాఖ నష్టపరిహారం ఇవ్వకపోడంతో కోర్టు ఆదేశాలతో ఓ రైతు ఏకంగా రైలును జప్తుచేశాడు. దావణగెరె జిల్లా హరిహరలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. హరిహర-కొట్టూరు రైలుమార్గం కోసం హరిహర తాలూకా బొగ్గళ్లికి చెందిన రైతు, లాయర్ శివకుమార్ నుంచి రైల్వే 2009లో భూమి సేకరించింది. ఇప్పటివరకూ రూ. 37 లక్షల పరిహారం ఇవ్వలేదు. దీంతో రైతు.. హరిహర కోర్టును ఆశ్రయించారు. కేసులో రైలును పూచీకత్తుగా పేర్కొనడంతో రైలును జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. శివకుమార్ సోమవారం కోర్టు సిబ్బందితో కలసి హరిహర స్టేషన్లో ధారవాడ-మైసూరు ఇంటర్సిటీ రైలును స్వాధీనం చేసుకున్నాడు.ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే అధికారులు పరిహారం ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రైతు, కోర్టు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వికారాబాద్-సదాశివపేట మధ్య రైల్వే ట్రాక్ దిగువ కంకర కొట్టుకుపోయిన మార్గాన్ని రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురవటంతో వికారాబాద్-పర్లీ మార్గంలో సదాశివపేట-వికారాబాద్ మధ్య ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసిన అధికారులు... ముద్ఖేడ్-నిజామాబాద్ మార్గంలోకి మళ్లించారు. షిర్డీ-విజయవాడ, పుణె-హైదరాబాద్, ఔరంగాబాద్-హైదరాబాద్ రైళ్లను మళ్లించారు. రంగంలోకి దిగిన అధికారులు... ట్రాక్‌కు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. జీఎం రవీంద్రగుప్తా పర్యవేక్షణలో 200 మంది సిబ్బంది, భారీ హిటాచీ యంత్రాలను రంగంలోకి దింపి ట్రాక్‌ను సిద్ధం చేశారు. హైదరాబాద్-కొచువెళ్లి మధ్య మరో సర్వీసు... రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-కొచువెళ్లి మధ్య మరో సర్వీసు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు కొచువెళ్లికి 26 ఉదయం 3.20కి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో కొచువెళ్లిలో 26 రాత్రి 8.15కి బయలుదేరి 28 ఉదయం నగరానికి చేరుకుంటుందన్నారు. నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కట్పడి, అంబూరు, వనియంబాడిల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. -
‘వ్యాగన్’ స్థలాన్ని పరిశీలించిన డీజీఎం
మడికొండ : రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం అయోధ్యపురంలో కేటాయించిన స్థలాన్ని శుక్రవారం సాయంత్రం రైల్వే శాఖ అధికారులు పరిశీలించారు. రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ చిరంజీవి, అసిస్టెంట్ మేనేజర్లు విశ్వనాథ్, మూర్తి తదితరులు స్థల పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాగన్ వర్క్‌షాప్‌నకు కేటాయించిన స్థలంలో మరో ఫ్యాక్టరీ ఏర్పాటుకు పరిశీలించినట్లు తెలిపారు. అలాగే, ఇంకా స్థల సేకరణకు అవకాశం ఉందా అనే అంశంపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారి వెంట సర్వేయర్ నితిన్, అధికారులు పాల్గొన్నారు. -
నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ సిద్ధం
నేడు సెఫ్టీ అధికారుల సమీక్ష రైల్వేలైన్‌ను పరిశీలించనున్న అధికారులు కర్నూలు: ఎట్టకేలకు నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేలైన్ సిద్ధమైంది. దశాబ్ద కాలం నుంచి వేచిచూస్తున్న నంద్యాల ప్రజల కల నెరవేరింది. మంగళవారం నిర్వహించే సెఫ్టీ అధికారులు సమీక్ష, లైన్ పరిశీలనతో లైన్ క్లియర్ కానుం ది. పెండేకంటి వెంకటసుబ్బయ్య గవర్నర్‌గా ఉన్న సమయంలో 1970లో నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేను ప్రతి పాదించారు. 1980 సర్వే చేపట్టగా 1990 మేలో పనులు చేపట్టారు. 185 కిలో మీటర్లల మార్గంలో నంద్యాల నుంచి ఎర్రగుంట్ల వరకు రైలు వెళ్లి అక్కడి నుండి తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందు కోసం సుమారు రూ. 450 కోట్లు వ్యయం చేశారు. విడతల వారీగా నిధులు ఇస్తూ ఎట్టకేలకు పనులు పూర్తి చేశారు. ఎంతో మందికి ప్రయోజనం : నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే ఈ రైల్వే లైన్ ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చనుంది. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ప్రజలకు నెరవేరింది.నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాల ప్రజలు ఈ మార్గం ద్వారా తిరుపతికి రైలు ద్వారా వెళ్లే వెసలు బాటు కలుగుతుంది. నంద్యాల, మద్దూరు, కొత్తూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, నొన్సం, జమ్మలమడుగు మీదుగా ఎర్రగుంట్లకు చేరుతుంది. సెఫ్టీ రన్‌తో రైళ్ల రాకపోకలు: నంద్యాల - ఎర్రగుంట్ల మీదుగా రైల్వేశాఖ అధికారులు సేఫ్టీరన్ చేపట్టనున్నారు. పట్టాల పటిష్టతను పరిశీలించిన అనంతరం రైలు నడుపుతారు. గుంతకల్ డివిజన్‌కు చెందిన అధికారులు పరిశీలించిన తర్వాత మూడు నెలల తర్వాత నుంచి నిరంతరం రైళ్ల రాకపోకలను చేపడుతారు. -
రైల్వే ట్రాక్‌ల రక్షణకు చర్యలు
- చెరువులతో ముంపు ప్రమాదం ఉన్న చోట నివారణ చర్యలు - రైల్వే, నీటి పారుదల శాఖ అధికారుల భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురిసిన ప్పుడు రైల్వే ట్రాక్‌లకు చేరువగా ఉన్న చెరువులు, వాగులు, నదుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని రైల్వే శాఖ, నీటిపారుదల శాఖలు నిర్ణయించాయి. జిల్లాల వారీగా ప్రమాదకరంగా ఉన్న చెరువులపై ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో చర్చించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఇరుపక్షాలు అవగాహనకు వచ్చాయి. రైల్వేలైన్లకు ప్రమాదకరంగా మారిన చెరువులు, వాటి పునరుద్ధరణ వంటి అంశాలపై రైల్వే అధికారులు బుధవారం జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. దీనికి రైల్వే శాఖ నుంచి చీఫ్ ఇంజనీర్ బ్రహ్మానందం సహా ఇతర అధికారులు హాజరవగా, చిన్న నీటి పారుదల విభాగం నుంచి సీఈ నాగేంద్రరావు, ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గుర్తించిన 870 ముంపు ప్రమాదం ఉన్న చెరువుల పరిధిలో చేయాల్సిన సంయుక్త సర్వే, గండ్లు పడే అవకాశం ఉన్న చెరువుల పరిధిలో చేపట్టిన పునరుద్ధరణ, నవీకరణ చర్యలపై చర్చించారు. ఇప్పటికే సర్వే చేసిన 370 చెరువులు పోనూ మిగతా చెరువుల్లో త్వరితగతిన సర్వే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రెండు శాఖలు సమన్వయం చేసుకోవడం, ప్రమాదకరంగా ఉండే రైల్వేట్రాక్‌లపై గ్యాంగ్మెన్లు ఇచ్చే సమాచారం ఆధారంగా వేగంగా స్పందించడం వంటి అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు. -
ప్లాట్‌ఫామ్ పైనే రైల్వే పోలీసులు
* వసతుల్లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది * పట్టించుకోని రైల్వే అధికారులు నగరంపాలెం (గుంటూరు) : గుంటూరు రైల్వేస్టేషనులో రైల్వే పోలీసులకు సరైన వసతులు లేక ప్లాట్‌ఫామ్‌ల పైనే విధులు నిర్వహిస్తున్నారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై, రైళ్లలో నేరాల నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం రైల్వే పోలీసులను రైల్వేశాఖకు కేటాయిస్తుంది. వీరికి అవసరమైన పోలీస్ స్టేషన్‌ను రైల్వేశాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గుంటూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌కు సుమారు 30 సంవత్సరాల క్రితం నాలుగు-ఐదు ప్లాట్‌ఫ్లామ్‌ల మధ్యలో, గతంలో బుకింగ్ కౌంటరుగా వినియోగించిన రెండు గదులను కేటాయించారు. ఎస్ఐ స్థాయి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రస్తుతం డివిజన్ ముఖ్య పోలీస్‌స్టేషన్‌గా మారి సిబ్బంది పెరిగినా ప్రస్తుతం అదేప్రాంతంలో సిబ్బంది సర్దుకుంటున్నారు. ఇందులో గుంటూరు, తెనాలికి చెందిన సీఐ కార్యాలయాలు ఒక గదిలో, గుంటూరు స్టేషనుకు సంబంధించిన ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెచ్‌సీలు, 43మంది కానిస్టేబుళ్ల ఆఫీస్రూం, లాకప్‌లు ఒక గదిలో కొనసాగుతున్నాయి. కార్యాలయంలో కనీసం కుర్చోవడానికి కూడా చోటులేకపోవటంతో సిబ్బంది ప్లాట్‌ఫామ్ పైనే చిన్న పార్టిషన్ కట్టుకుని కూర్చుంటున్నారు. ఇక హెల్ప్‌డెస్క్ ప్లాట్‌ఫామ్ పైనే ఏర్పాటుచేశారు. రికార్డు రూం, ఆర్మ్డ్ గది అసలు లేదు. స్టేషన్లో 24 గంటలు విధులు నిర్వహించాల్సి రావడంతో కాసేపు సేదతీరే అవకాశమే లేదని సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌కు కేటాయించిన భవనం గుంటూరు రైల్వే స్టేషను ఏర్పడినప్పుడు నిర్మించినది కావడంతో పది సంత్సరాల క్రితమే పెంకులతో నిర్మించిన కప్పు శిథిలావస్థకు చేరి మట్టి రాలుతోందన్నారు. దీని కోసం సీలింగ్ చేసినా వర్షాకాలంలో పై కప్పు నుంచి నీరు కారి సీలింగ్ పూర్తిగా చెడిపోవడంతో తొలగించివేశారు. స్టేషన్లో రైల్వే శాఖకు చెందిన కార్యాలయాలపై ఉన్న శ్రద్ధలో కనీసం పది శాతం కూడా రైల్వేపోలీస్స్టేషన్పై చూపడం లేదని సిబ్బంది వాపోతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు స్టేషన్‌కు రంగులు వేయడం తప్ప పూర్తిస్థాయి మరమ్మతులు చేసిందిలేదన్నారు. ప్రస్తుత స్థలంలోనైనా రెండు అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందన్నారు. పోలీస్‌స్టేషను మరమ్మతుల కోసం రైల్వే పోలీసులు డివిజన్ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు పంపినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తున్న రైల్వే పోలీసుల సమస్యల పరిష్కారం కోసం డివిజస్థాయిలోని రైల్వే ఉన్నతాధికారులు కృషిచేయాల్సిన అవసరం ఉంది. -
రైల్వేస్టేషన్‌ను తగులబెట్టిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. శనివారం ఓ రైల్వేస్టేషన్‌ను మావోయిస్టులు తగులబెట్టేశారు. కోడేనార్ పరిధిలో కుమార్సాద్రా రైల్వేస్టేషన్‌ను మావోయిస్టులు తగులబెట్టినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘డెల్టా’కు త్రుటిలో తప్పిన ప్రమాదం
♦ రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయి గాల్లో తేలిన పట్టాలు ♦ ఎర్రని వస్త్రం ఊపుతూ రైలుకు ఎదురెళ్లిన రైతులు.. 1,500 మందికి తప్పిన ముప్పు వలిగొండ: డెల్టా ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. రైల్వే ట్రాక్ కింద మట్టి కట్ట కొట్టుకుపోయి పట్టాలు గాలిలో వేలాడడాన్ని చూసి ఇద్దరు రైతులు రైలును ఆపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సేఫ్టీ ఉద్యోగితో కలసి రైలుకు ఎదురుగా పరుగెడుతూ ఎరుపు వస్త్రం ఊపారు. దానిని గమనించిన లోకోపైలట్(డ్రైవర్) రైలును నిలిపేశాడు. 1,500 మందికిపైగా ప్రయాణికులతో వెళుతున్న ఆ రైలు.. ప్రమాదకర స్థలానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఆగింది. లేకుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో శుక్రవారం తెల్లవారుజామున 5.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ బావి వద్దకు వెళుతూ..: గుంటూరు-సికింద్రాబాద్ రైలు మార్గంలో వలిగొండ-నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 9వ నంబర్ గేట్ వద్ద నిర్మిస్తున్న ఆర్యూబీ (రోడ్డు అండర్ బ్రిడ్జి) వద్ద రైల్వే ట్రాక్ కింద మట్టికట్ట కొట్టుకుపోయింది. దాదాపు మూడు మీటర్ల మేర గండి పడడం తో పట్టాలు గాలిలో వేలాడాయి. శుక్రవారం ఉదయం 5.50 గంటల సమయంలో టేకులసోమారానికి చెందిన పాక వెంకటేశం, పాక శ్రీశైలం పాలు పితకడానికి బైక్‌పై వ్యవసాయబావి వద్దకు వెళ్తున్నారు. వారు 9వ నంబర్ గేట్ వద్దకు చేరుకోగానే... కల్వర్టు వద్ద నీరు నిలిచి ఉండడం గమనించారు. దగ్గరకు వెళ్లి చూసే సరికి రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి ఉంది. అదే సమయంలో డెల్టా రైలుకు సిగ్నల్ ఉండడం గమనించి.. వెంటనే అప్రమత్తమయ్యా రు. అక్కడ కాపలాగా ఉన్న రోడ్ సేఫ్టీ కాంట్రాక్టు ఉద్యోగి చేగూరి భిక్షపతికి విషయం చెప్పారు. ముగ్గురూ కలసి ఎర్రటి వస్త్రాన్ని చేతుల్లో తీసుకుని రైలుకు ఎదురుగా పట్టాల మీద పరుగెత్తారు. రైలు లోకోపైలట్ వారిని గమనించి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఆలస్యంగా రావడం మంచిదైంది: డెల్టా రైలు నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌కు ఉదయం 5:20 నిమిషాలకు చేరుకోవాలి. కానీ సుమారు అరగంట ఆలస్యంగా వచ్చింది. సమయానికి వచ్చి ఉంటే.. పట్టాల కింద మట్టి కొట్టుకుపోయిన విషయం తెలిసి ఉండేది కాదు. సమాచారం అందిన గంటకు ఆ స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది గండిని పూడ్చి, పట్టాలకు మరమ్మతులు చేపట్టారు. డెల్టా రైలు ఉదయం 8.20 గంటల వరకు అక్కడే ఆగిపోయింది. గతంలో భారీ ప్రమాదం: గతంలో ఇదే వలిగొండ మం డలం గొల్నేపల్లి వద్ద డెల్టా రైలు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కల్వర్టు కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రైలు పట్టాలు గాలిలో వేలాడాయి. డ్రైవర్ గమనించకపోవడంతో రైలు బోల్తా పడింది. 115 మంది మృతిచెందగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. తాజా ఘటనలో మట్టి కొట్టుకుపోవడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేమీ లేదని ఏడీఈ బదియా తెలిపారు. ‘నేను, నా సోదరుడు పాలు పితకడానికి వెళ్తున్నాం. 9వ నంబర్ గేట్ వద్ద నీరు చేరడంతో మట్టి కొట్టుకుపోయి పట్టాలు తేలి ఉన్నాయి. భిక్షపతితో కలసి రైలు ఆపాం.’ అని రైతు వెంకటేశం తెలిపారు. కారణమిదే.. రైల్వే ట్రాక్ పక్కన నాగిరెడ్డిపల్లి వైపు నుంచి భారీగా వరద నీరు ఆర్యూబీ వంతెన వైపు చేరింది. ఆ నీటి ప్రవాహం ధాటికి వంతెన పక్కన ఉన్న మట్టి మూడు మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో పట్టాల కింద మట్టి పోయి గాలిలో వేలాడాయి. అయితే ఈ వంతెన పనులు రెండు నెలల క్రితం చేపట్టారు. ఆ ప్రదేశంలో పెద్ద బండ రాళ్లు వచ్చాయని... ప్రజలు, వాహనాలు, రైతుల రాకపోకలకు గమనిస్తూ బ్లాస్టింగ్ చేస్తుండడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
-రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో అత్యవసరంగా నిలిపివేత ఘట్కేసర్ టౌన్ యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్ వెళ్లే టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో దాన్ని అధికారులు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద నిలిపేశారు. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించగా ఎస్ 2, ఎస్ 3 రైలు బోగీల్లో బ్రేక్ లైనర్లు బిగుసుకోవడంతో పొగలు వచ్చినట్లు తేలింది. బ్రేక్ లైనర్లు చల్లబడే వరకు స్టేషన్లో రైలును నిలిపిన అధికారులు సుమారు అరగంట తర్వాత పంపించారు. రైలును అత్యవసరంగా ఎందుకు నిలిపారో తెలియని ప్రయాణికులు ఆందోళన చెందారు. మెయిన్ ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ నిలపడంతో మిగతా రైళ్లను లూప్‌లైన్ ద్వారా కాజీపేట వైపు పంపించారు. -
గూడ్సురైలుకు తప్పిన పెనుముప్పు
అనంతపురం జిల్లా పెనుకొండలో గూడ్సురైలుకు పెను ప్రమాదం తప్పింది. బొంబాయి నుంచి బెంగళూరుకు పెట్రోల్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులోని ఎనిమిది ట్యాంకర్ల నుంచి పెట్రోల్ లీకేజి అవుతోంది. ఇది గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలును నిలిపేశాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు బోగీలకు మరమ్మత్తులు చేస్తున్నారు. పెట్రోల్ లీకేజీని గుర్తించి వెంటనే గూడ్స్‌ను నిలిపివేసిన డ్రైవర్‌ను అధికారులు అభినందించారు. లీకేజీ గుర్తించక పోయిఉంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేద అభిప్రాయప్పడారు. -
ఉత్తరాంధ్రలో నిలిచిన విద్యుత్ సరఫరా..
- ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు విశాఖపట్నం తలపాకలోని 400 కేవీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. నాలుగు జిల్లాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామునుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం సామర్లకోట నుంచి శ్రీకాకుళం వరకు విద్యుత్ లేకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ అంతరాయంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నయ ఏర్పాట్ల పై రైల్వే అధికారులు దృష్టి సారించారు. మరి కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
దోపిడీ జరిగిందన్నా.. పట్టించుకోరు..
దోపిడి జరిగిందని ఫిర్యాదు చేసిన మహిళతో రైల్వే అధికారులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన నగరంలోని మలక్‌పేట రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ రైల్వే స్టేషన్లో కొందరు మాదక ద్రవ్యాల మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు ప్లాట్‌ఫాం పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వద్ద నుంచి కొందరు దుండగులు సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ పట్ల రైల్వే పోలీసులు దురుసుగా వ్యవహరించారు. దీంతో బాదితురాలు గత కొన్ని రోజులుగా రైల్వే స్టేషన్ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని.. మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవ ర్తించడం, ఈవిటీజింగ్‌కు పాల్పడటం వంటి చర్యలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది. -
ముంచెత్తిన వాన
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోనిచిత్తూరు, నెల్లూరు జిల్లాల ను భారీనుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. వైఎస్సార్, అనంతపురం తదితర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సోమవారం 26 సెం.మీ గరిష్ట వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో రాయలసీమలో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుమలలో జలాశయాలు నిండిపోయాయి. భారీ వ ర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో చీకటిపల్లె - పల్లవోలు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న బాహుదా ఏటిలో సోమవారం రాత్రి పాల వ్యాన్(బొలెరో) కొట్టుకుపోయింది. అమిలేపల్లికి చెందిన వాహన యజమాని శేఖర్(25) గల్లంతయ్యాడు. అదే వాహనంలో ఉన్న ఇద్దరిని పోలీసులు కాపాడారు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం వెదురుపట్టు పొలా ల్లో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన 60 మంది కూలీలు వరదనీటిలో చిక్కుకున్నారు. వీరిని స్థానికులు, అధికారులు కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సోమవారం రాత్రి సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఓ కళాశాల బస్సు నీటిలో చిక్కుకుంది. విద్యార్థులను స్థానికులు రక్షించారు. వైఎస్సార్ జిల్లాలో గుంజన నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజంపేట నియోజకవర్గం టి.సుండుపల్లె సమీపంలోని మద్దిలవంక వంతెన దాటుతూ కొట్టుకుపోవడంతో మనెమ్మ (35) మృతి చెందింది. సుండుపల్లె వద్ద లగిశెట్టి పిచ్చయ్య (55) బహుదానదిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. పలు రైళ్ల రద్దు..: పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై వరద చేరడంతో విజయవాడ-గూడూరు-చెన్నై మార్గాల్లో నడిచే కొన్ని రైళ్లను రద్దుచేసి, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. చెరువులు జాగ్రత్త: సీఎం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువుల కట్టలు తెగకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా తెగినట్లయితే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆరు జిల్లాల కలెక్టర్లతో భారీ వర్షాల ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమిళనాడులో 12 మంది మృతి.. తీవ్ర అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఒక్క చెన్నై నగరంలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. మిగిలిన ప్రాంతాల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని అశోక్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద ముంపులో చిక్కుకున్న 12 మంది పిల్లలు సహా 22 మంది భారత వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. -
ఫలక్‌నుమాలో పట్టాలు తప్పిన రైలింజన్
- ఆలస్యంగా నడిచిన ప్యాసింజర్ రైళ్లు - మధ్యాహ్నం వరకు ఎంఎంటీఎస్ సర్వీసుల నిలిపివేత చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున రైలింజన్ పట్టాలు తప్పింది. దీనిని గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) రాజ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 11367 నంబర్ కలిగిన రైలింజన్ గూడ్స్ రైలు బోగీలను తీసుకువచ్చి ప్యాసింజర్ రైలు బోగిలను తగిలించుకునేక్రమంలో చక్రాలు పట్టాలు తప్పింది.దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజన్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారులు మహబూబ్‌నగర్, కాచిగూడ నుంచి వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అనంతరం కాచిగూడ నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను రప్పించి రైలింజన్‌ను పట్టాల పైకి ఎక్కించారు. ఈ కారణంగా దాదాపు మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఎంఎంటీఎస్ సర్వీసుల నిలిపివేత రైలింజన్ పట్టాలు తప్పడంతో అధికారులు ఫలక్‌నుమా-సికింద్రాబాద్ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్యాసింజర్ రైళ్ల రద్దీ తగ్గడంతో సర్వీసులను పునరుద్దరించారు. వర్షంతో ఒరిగిన సిగ్నల్ స్తంభం శుక్రవారం రాత్రి పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి ఫలక్‌నుమా బ్రిడ్జి సమీపంలోని సిగ్నల్ లైట్ ఒకవైపు ఒరిగింది. రైలింజన్‌ను రివర్స్‌లో తీసుకొస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించని కారణంగా ఇంజన్ పట్టాలు తప్పినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) రాజ్ కుమార్ సాక్షికి తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. -
అమ్మో.. నెల్లూరు రైల్వేస్టేషన్!
తొక్కిసలాట కేంద్రంగా గుర్తించిన రైల్వే శాఖ నెల్లూరు(సెంట్రల్) : నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న చెన్నై-కోల్‌కతా మార్గమధ్యంలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో నెల్లూరు ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైల్వేశాఖ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పండగ సందర్భాల్లో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న కేంద్రాల్లో నెల్లూరు ఒకటని అధికారులు వెల్లడించారు. ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండగ సందర్భంగా మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని రైల్వే అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, వరంగల్‌లో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర, రొట్టెల పండగకు నెల్లూరు రైల్వేస్టేషన్ అత్యంత తొక్కిసలాట జరిగే ప్రాంతంగా రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో తొక్కిసలాట జరగకుండా ఏఏ చర్యలు తీసుకుందాం అనే దానిపై కూడా నిపుణుల కమిటీని నియమించనున్నారు. నెల్లూరులో ప్రస్తుతం రైల్వే రాకపోకలకు నాలుగు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ కెపాసిటీ 10 వేల మంది మాత్రమే. సాధారణ రోజుల్లో 4 నుంచి 5 వేల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అదే ఆదివారం, పండగ రోజుల్లో 10 వేలకు పైగా ఉంటారు. రొట్టెల పండగ సందర్భంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది వస్తుంటారని అంచనా. అంటే స్టేషన్ కెపాసిటీకి ఐదు రెట్లు అధికంగా వస్తుంటారు. ఈ స్టేషన్ మౌలిక సదుపాయాలపై రైల్వే అధికారులు ప్రత్యేక పరిశీలన జరపనున్నారు. సౌత్స్టేషన్తో పోలిస్తే వేదాయపాళెం ప్లాట్‌ఫారాలు అనువుగా ఉన్నట్లు భావిస్తున్నారు. నెల్లూరు నగరం బుజబుజ నెల్లూరు వరకూ విస్తరించడంతో ప్రయాణికుల సౌకర్యార్థం వేదాయపాళెం రైల్వే స్టేషన్‌ను అబివృద్ధి చేయాల్సి ఉంది. పండగ సందర్భంగా సౌత్‌స్టేషన్‌లో కొన్ని రైళ్లను ఆపితే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని పలువురు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే కమిటీ వేయనున్నట్లు సమాచారం. స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ సౌకర్యం రోజుకు 1220 యూనిట్లు వాడకం మాత్రమే. ఈ యూనిట్లు సంఖ్యకూడా పెంచాలని పలువురు కోరుతున్నారు. సౌకర్యాలు నిల్ బాంబ్‌స్క్వాడ్,మెటల్‌డిటెక్టర్,షిఫ్టుల వారిగా తనికీ సిబ్బం ది ఉండాలి. కాని నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో మాత్రం మెటల్‌డిటెక్టర్‌ను సిబ్బంది కొరతతో తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్టేషన్‌లోని ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇవి ఏర్పాటు చేయాలి. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, సమ్మక్క-సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లా, రొట్టెల పండగకు నెల్లూరు రైల్వేస్టేషన్ అత్యంత తొక్కిసలాట జరిగే ప్రాంతంగా రైల్వే అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: తొక్కిసలాట కేంద్రంగా గుర్తించారు. అందుకు అనువుగా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే నిపుణుల కమిటీతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. - షాజహాన్, స్టేషన్ సూపరింటెండెంట్ -
మోటర్ మేన్, గార్డును విధుల నుంచి తొలగించండి
‘చర్చిగేట్ రైలు ప్రమాద ఘటన’ నివేదికలో సూచించిన కమిటీ రైల్వే అధికారుల నిర్లక్ష్యమూ ఉంద ని వెల్లడి సాక్షి, ముంబై : చర్చిగేట్‌లో లోకల్ రైలు ప్రమాదానికి కారకులైన మోటర్ మేన్ (డ్రైవర్), గార్డును విధుల నుంచి తొలగించాలని దర్యాప్తు కమిటీ నివేదికలో సిఫార్సు చేసింది. ప్రమాదం తర్వాత మోటర్ మేన్ క్యాబిన్లోకి చొరబడిన మరో మోటర్ మేన్, లోకో ఇన్స్పెక్టర్పై కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది. చర్చిగేట్‌లో జూన్ 28న వేగంగా దూసుకు వచ్చిన ఓ లోకల్ రైలు బప్ఫర్ స్టాపర్లను ఢీ కొని ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పశ్చిమ రైల్వే పరిపాలన విభాగం ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కమిటీని నియమించింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని, విధుల్లో ఉన్న మోటర్ మేన్ ఎల్.ఎస్.తివారి, గార్డు అజయ్‌కుమార్ గుహేర్‌లను విధుల నుంచి తొలగించాలని కమిటీ పేర్కొంది. ప్రమాదం జరిగిన రోజు మోటర్ మేన్ తివారి డ్యూటీ ముగించుకునే తొందరలో మరో ప్లాట్‌ఫారంపై ఉన్న విరార్ లోకల్ రైలును ఎక్కే తొందరలో పొరపాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన రోజు డ్యూటీలో ఉండగా తివారి మొబైల్ ఫోన్ వినియోగించలేదని ఫోన్ కాల్స్ సమాచారం ద్వారా వెల్లైడె ంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా మోటర్ మాన్ క్యాబిన్లో మొబైల్ జామర్ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. లోకల్ రైలు బప్ఫర్ స్టాపర్లు, స్టేషన్లో ఉన్న బప్ఫర్ స్టాపర్లు సమాంతరంగా లేకపోవడంవల్ల రైలు వాటిని ఢీ కొట్టి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిందని, బప్ఫర్ స్టాపర్లు సమాంతరంగా ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండే దపి రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా కమిటీ వేలెత్తి చూపించింది. -
అదే ఆలస్యం.. అవే అవస్థలు
- రైళ్ల రాకపోకల్లో విపరీతమైన జాప్యం - పడరాని పాట్లు పడుతున్న ప్రయాణికులు పుష్కరఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానమాచరించేందుకు రైళ్లలో రాజమండ్రి వస్తున్న ప్రయాణికులు అవే కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైళ్లు ఆలస్యంగానే నడవడంతో అసహనానికి గురవుతున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి వచ్చే భక్తులు అధికంగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 112 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా సరిపోవడం లేదు. రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చేసరికి చోటు దొరకదనే భయంతో యాల్రికులు పట్టాలపై నుంచి పరుగులు తీసి రెలైక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగైదు గంటలకు ఒకసారి తమ ప్రాంతానికి వెళ్లే రైలు రావడంతో యాత్రికుల నడుమ తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సోమవారం రద్దీ మరింత అధికం కావడంతో రాజమండ్రి , గోదావరి రైల్వే స్టేషన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఇబ్బందులు పడుతున్న పిల్లలు రైళ్లలో ప్రయాణించే భక్తుల పిల్లలు ఆలస్యాన్ని, అసౌకర్యాన్నీ తట్టుకోలేక గగ్గోలు పెడుతున్నారు. వారిని సముదారుుంచడం తల్లిదండ్రుల వల్ల కావడం లేదు. కొంత మంది తిరుగు ప్రయాణంలో బస్సులను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లు దుర్గంధభరితంగా మారాయి. పారిశుధ్య సిబ్బంది తక్కువగా ఉండడంతో పరిసరాలను పరిశుభ్రం చేయడం సాధ్యపడడం లేదు. యాత్రికులు తినుబండారాల వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారవేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం వల్ల పరిసరాలు దుర్గంధపూరితం అవుతున్నారుు. బయో టాయిలెట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్వహణ లేక కంపుకొడుతున్నాయి. సొమ్మసిల్లిపోతున్నారు.. రైల్వేస్టేషన్/ రాజమండ్రి సిటీ : సోమవారం ఉదయం నుంచి రైల్వే, బస్స్టేషన్లు రద్దీగా మారాయి. రాజమండ్రి రైల్వేస్టేషన్లో ఒడిశా రాష్ర్టం పర్లాకిమిడికి చెందిన రాము రైలు ఎక్కబోయి సొమ్మసిల్లిపోగా రైల్వే ఆసుపత్రి సిబ్బంది సేవలు అందించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వికలాంగుడు రైలు ఎక్కే సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో నాలుగు, ఐదు ప్లాట్‌ఫారాలకు చేరుకోవాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది పట్టాలపైనే ఉంటూ రైళ్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. -
రైళ్లలో సరుకుల అక్రమ రవాణా!
* పరాకాష్టకు చేరిన జీరో దందా * బిల్లులు లేకుండా రాష్ట్రానికి చేరుతున్న రూ.కోట్ల విలువైన సరుకులు * రైల్వే రిసీట్ ఉంటే చాలు పన్నుల గురించి పట్టించుకోని రైల్వేశాఖ * వాణిజ్యపన్నుల శాఖ తనిఖీల్లో బయటపడ్డ బండారం * కేసుల నమోదుకు సహకరించని రైల్వే అధికారులు సాక్షి, హైదరాబాద్: అమ్మకం బిల్లు, డెలివరీ చలాన్, వే బిల్లు... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకులు రవాణా చేసేటప్పుడు ఉండాల్సిన కనీస రసీదులివి. కానీ రైళ్లలో సరుకులు రాష్ట్రాలు దాటివస్తున్నా ఈ బిల్లులేవీ కనిపించట్లేదు. కేవలం రైల్వే రిసీట్(ఆర్.ఆర్)తో లక్షల రూపాయల విలువైన వస్తు సామ గ్రి రైళ్లలో యథేచ్ఛగా నిత్యం రవాణా అవుతోంది. సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న రైల్వేశాఖ ఇతర రసీదుల గురించి పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. శుక్రవారం వాణిజ్యపన్నుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా రైల్వే గోడౌన్లు, స్టేషన్లలో జరిపిన తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలివి. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు సంయుక్త కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) రేవతి రోహిణి నేతృత్వంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడల్లోని రైల్వే గోడౌన్లతోపాటు నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, కాజీపేట, వరంగల్ తదితర 10 రైల్వే గోడౌన్లలో అధికారులు తనిఖీ చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ నుంచి విలువైన సరుకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల ద్వారా రవాణా అవుతున్న విషయాన్ని గుర్తించారు. రైల్వే గోడౌన్లలో కోట్ల రూపాయల విలువైన వస్తుసామగ్రి ఉన్నా, వాటిని పరిశీలించడమే తప్ప సీజ్ చేసేందుకు గానీ, కేసులు నమోదు చేసేందుకు గానీ వాణిజ్యపన్నుల శాఖను రైల్వే శాఖ అనుమతించకపోవడం గమనార్హం. అహ్మదాబాద్, నాగ్‌పూర్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, త్రివేండ్రం తదితర నగరాల నుంచి రోజూ కోట్ల విలువైన సామగ్రి పన్నులు చెల్లించకుండా హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలకు చేరుతోంది. రైల్వే గూడ్స్ ట్రాన్స్‌పోర్టులో వస్తువు విలువ, దాని బరువును బట్టి చార్జి చేసి రైల్వే రిసీట్(ఆర్.ఆర్) ఇస్తారు. ఆర్ఆర్ చూపిం చి సదరు వ్యాపారి సరుకును తీసుకెళతారు. రెండు నెలల క్రితం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన కంటైనర్లలో కోటి రూపాయల విలువైన బాస్మతి బియ్యం కూడా మెదక్ జిల్లా నాగులపల్లి వద్ద వాణిజ్యపన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో దొరికాయి. ఈ సంస్థ కూడా రైల్వేకు అనుబంధంగా సాగుతున్నదే కావడం గమనార్హం. -
జీఎం శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు
దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జీఎంగా సక్సేన హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పదవీ విరమణ చేశారు. 36 ఏళ్లుగా భారత రైల్వేలో వివిధ హోదాలలో పనిచేసిన ఆయన ఏడాదిన్నరకు పైగా ద.మ.రైల్వే జీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థానంలో దక్షిణ పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ సక్సేనా ఇన్చార్జి జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 2013 నవంబర్ 20 నుంచి ద.మ.రైల్వే జీఎంగా పని చేసిన శ్రీవాస్తవకు రైల్వే అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు జీఎంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హోదాతో నిమిత్తం లేకుండా ప్రతి ఉద్యోగిని ఆప్యాయంగా పలకరించి కుటుంబంలో పెద్దన్నలా వ్యవహరించారని శ్రీవాస్తవ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఏజీఎం ఉమేశ్ సింగ్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్, జీఎం సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి, ప్రజాసంబంధాల అధికారి షకీల్ అహ్మద్ తదితరులు శ్రీవాస్తవతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో శ్రీవాస్తవ దంపతులను కూర్చొబెట్టి ఉద్యోగులు స్వయంగా వాహనాన్ని లాగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నేటి నుంచి సక్సేనా... దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్‌గా నియమితులైన ప్రదీప్ కుమార్ సక్సేనా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ 1977 బ్యాచ్‌కు చెందిన సక్సేనా అసిస్టెంట్ ఇంజనీర్‌గా సెంట్రల్ రైల్వేలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ముంబై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. దక్షిణ మధ్య రైల్వేకు రెగ్యులర్ జనరల్ మేనేజర్ నియామకం జరిగే వరకు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. -
పాసింజర్ రైలు అడ్డగింపు
లెవెల్ క్రాసింగ్ మూసివేతపై ఆందోళన వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ పల్లెవాడ (కైకలూరు) : రైల్వే లెవెల్ క్రాసింగ్ దారిని మూసివేయడాన్ని నిరసిస్తూ రామవరం గ్రామస్తులు పాసింజర్ రైలును అడ్డుకున్నారు. గ్రామానికి చేరడానికి దగ్గర దారిగా ఉపయోగపడుతున్న పల్లెవాడ - రామవరం క్రాసింగ్‌ను రైల్వే అధికారులు మూసివేయడంపై ఆందోళన చేపట్టారు. గ్రామానికి చేరే పట్టాల వద్ద వాహనాలు వెళ్లకుండా ఇనుప గడ్డర్లు పాతిన విషయాన్ని తెలుసుకుని పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు వచ్చి పట్టాలపై కూర్చున్నారు. దీంతో గుడివాడ - నర్సాపూర్ (77204) పాసింజరు రైలు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న కైకలూరు తహశీల్దార్ కేఏ నారాయణరెడ్డి, భీమవరం రైల్వే ఎస్సై చింతయ్య అక్కడికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. యాభయ్యేళ్లుగా ఇదే దారిలో గ్రామస్తులందరూ ప్రయాణిస్తున్నారని, కైకలూరు, ఏలూరు వంటి పట్టణాలకు చేరుకోవడానికి దగ్గర మార్గమని వారు వివరించారు. గ్రామానికి చేరుకోడానికి నేరుగా ఉన్న ఈ గేటును మూసివేసి పల్లెవాడ మలుపు వద్ద గేటును ఉంచడం అన్యాయమని చెప్పారు. ప్రజలు రాత్రి సమయంలో వచ్చేటప్పుడు ఆ రహదారిలో లైట్లు లేవని తెలిపారు. గేటు మూసివేత విషయం తెలియడంతో ముందుగానే రైల్వే అధికారులు, కలెక్టర్‌కు వినతిపత్రం అందించామన్నారు. ప్రజల అవసరాల రీత్యా అధికారులు వెంటనే రైలు పట్టాలకు అడ్డంగా నిర్మించిన స్తంభాలను తొలగించాలని వారు కోరారు. చివరకు రైల్వే పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. చేపల రైతులకు మేలు చేసేందుకే... పల్లెవాడ నుంచి రామవరానికి నేరుగా వచ్చే లెవెల్ క్రాసింగ్ దారిని మూసివేసి సమీపంలోని చేపల చెరువులకు వెళ్లే లెవెల్ క్రాసింగ్‌ను ఉంచడంపై రామవరం గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పల్లెవాడ మలుపు వద్ద నుంచి వెళ్లే రహదారిలో చేపల చెరువులు అధికంగా ఉన్నాయని, యజమానులు చేపల మేతలు తీసుకువెళ్లడానికి ఆ దారి అనుకూలంగా ఉంటుందని వారు చెబుతున్నారు. -
నిరుద్యోగులతో రైల్వే ఆటలు
వీఆర్ఎస్ ఉద్యోగుల పిల్లలతో చెలగాటం ప్రభుత్వ ఉత్తర్వు అమలుచేయని వైనం 80 మంది నిరుద్యోగుల జీవితం అగమ్యగోచరం విజయవాడ : రైల్వే అధికారులు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. విధి నిర్వహణలో వారు చొరవ తీసుకోకపోవడంతో విజయవాడ రైల్వే డివిజన్లో 80 మంది నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైల్వేలో పనిచేస్తూ వీఆర్ఎస్ (మూడు సంవత్సరాలు సర్వీసు ఉండగా) తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు రైల్వే శాఖకు 2010లో దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్ల సర్వీసు ఉన్న వారు విజయవాడ రైల్వే డివిజన్ నుంచి 587 మంది దరఖాస్తు చేయడంతో వారికి వీఆర్ఎస్ ఇచ్చేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారి పిల్లలు పరీక్ష రాసేందుకు 2010 అక్టోబరు 9న దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఏడాది తరువాత 2011 డిసెంబరు 24న రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షల ఫలితాలు 2012 జనవరి 1న విడుదల చేశారు. నోటిఫికేషన్ సమయంలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహించాలనే ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలను రద్దు చేస్తూ 2012 జనవరి 3న రైల్వే బోర్డు నుంచి రైల్వే జీఎంలు, డీఆర్ఎంలకు లేఖలు అందాయి. ఈ ఆదేశాలను డివిజన్ అధికారులు పట్టించుకోకుండా 2011లో పరీక్ష రాసిన వారికి 1500 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా పీఈటీ టెస్ట్‌లో పాసయిన వారికే ఉద్యోగాలు ఇవ్వడంతో అందులో ఉత్తీర్ణులు కానివారు 80 మంది మిగిలిపోయారు. 2011లో ఒక్కసారి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వీఆర్ఎస్లో వెళ్లే వారి పిల్లల కోసం రైల్వే శాఖ సంవత్సరానికి రెండు సార్లు నోటిఫికేషన్ ఇస్తుంది. రాత పరీక్ష, పీఈటీ టెస్ట్‌లో ఫెయిల్ అయిన వారికి తిరిగి పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని 2010/ఆర్టీ-2 ద్వారా బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను ఇక్కడి అధికారులు పట్టించుకోలేదు. రెండో చాన్స్ వస్తుందని పట్టించుకోకుండా ఉన్న వారి పిల్లలు 150 మంది వరకు ఉన్నారు. వీరి తల్లిదండ్రులకు ఉన్న సర్వీస్‌ను పరిశీలిస్తే మూడేళ్లకు మూడు నెలలు తగ్గింది. దీంతో వారు వీఆర్ఎస్ ద్వారా జరిగే టెస్ట్ రాసేందుకు అనర్హులయ్యారు. 2010 అక్టోబరు 9న దరఖాస్తు చేసుకొని పరీక్ష పాసైన వారందరికీ తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు, వీఆర్ఎస్ తీసుకుంటున్న తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అంబేద్కర్ వర్ధంతికి సర్వం సిద్ధం
షామియానాలు, టెంట్లు, అంబులెన్సులను అందుబాటులో ఉంచిన బీఎంసీ సాక్షి, ముంబై: భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చైత్యభూమివద్ద సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి అంబేద్కర్‌కు నివాళులర్పిం చేందుకు వచ్చే లక్షలాది మంది అభిమానులకు బీఎంసీ పరిపాలనా విభాగం మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇందులోభాగంగా శివాజీపార్క్ మైదానంలో లక్షా చదరపు టడుగుల విస్తీర్ణంలో భారీ టెంట్లు, షామియానాలు తదితరాలను సిద్ధం చేసింది. ఈ నెల ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి కావడంతో మూడు రోజుల ముందు నుంచేఆయన అనుయాయులు నగరానికి చేరుకోవడం మొదలైంది. వారు బస చే యడం మొదలుకుని స్నానాల గదులు, తాగునీరు, సంచార మరుగుదొడ్లు, అక్కడక్కడా తాత్కాలిక కుళాయిలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. బెస్ట్ సంస్థ కూడా తనవంతుగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొబైల్ ఫోన్ల చార్జింగ్ వసతితోపాటు, భారీ విద్యుత్ దీపాలు, ఫ్లడ్ లైట్లు తదితర సౌకర్యాలు కల్పించింది. అదేవిధంగా పోలీసు శాఖ కంట్రోల్ రూంలు, భారీ పోలీసు బలగాలను సమకూర్చి సిద్ధంగా ఉంచింది. చలి కారణంగా ఎవరైనా అనారోగ్యం బారినపడితే వారికి అక్కడే వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచింది. శివాజీపార్కు మైదానంతోపాటు చైత్యభూమికి సమీపంలో ఉన్న ఇందు మిల్లు ఖాళీ స్థలాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. అక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు, తాగు నీటితోపాటు విద్యుత్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ శాఖ ఏర్పాట్లు మహాపరినిర్వాణ్ పురస్కరించుకుని శుక్ర, శని, ఆది వారాలు దాదర్, శివాజీపార్క్, చైత్యభూమి పరిసరా ప్రాంతాలన్నీ అంబేద్కర్ అభిమానులతో కిటకిటలాడుతుంటాయి. దీంతో ఇటు అంబేద్కర్ అనుయాయులతోపాటు అటు వాహన చోదకులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ శాఖ తగు చర్యలు తీసుకుంది. శివాజీపార్క్, దాదర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని రహదారులపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించనున్నారు. మరికొన్నింటిని వన్‌వేగా, నో పార్కింగ్ జోన్లు ప్రకటించనున్నారు. ఐదు, ఆరు, ఏడో తేదీల్లో వాహనాల్లో రాకపోకలు సాగించేవారు దాదర్, శివాజీపార్కు మీదుగా కాకుండా ఇతర మార్గాల మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ శాఖ సూచించింది. చైత్యభూమికి చుట్టుపక్కల నివసించేవారు తమ వాహనాలను దూరంగా ఎక్కడైనా నిలిపిఉంచి కాలిబాటన రావాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. చైత్యభూమి దర్శనానికి ఏర్పాట్లు అంబేద్కర్ సమాధిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారు. అందువల్ల ఈ క్యూ నాలుైగైదు కిలోమీటర్ల మేర ఉంటుంది. ఎస్వీ రోడ్డుపై చైత్యభూమికి ఇటు మాహిం అటు సెంచురీ బజార్ ఇలా రెండు దిశల్లో క్యూలో నిలబడేందుకు ఏర్పాట్లు చేశారు తోపులాటలు జరగకుండా ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక బారికేడ్లను నిర్మించారు. దాదర్‌లో రైలు దిగిన వారికి మార్గదర్శనం చేసేందుకు అక్కడ కార్యకర్తలను నియమించారు. దారి పొడవునా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు అంబేద్కర్ అభిమానులకు రైల్వే పరిపాలనా విభాగం కూడా తనవంతుగా ఏర్పాట్లు చేసింది. ప్రతి ఆదివారం నిర్వహించనున్న మెగాబ్లాక్‌ను ఈ ఆదివారం రద్దు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్, కొంకణ్ మార్గంలో పది ప్రత్యేక రైళ్లు నడపనుంది. రాకపోకలు సాగించేందుకు పశ్చిమ, సెంట్రల్, హార్బర్ మార్గంలో అర్థరాత్రి ప్రత్యేకంగా కొన్ని లోకల్ ట్రిప్పులు నడపనున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో సాయంత్రం, రాత్రి తరువాత దాదర్, సీఎస్టీనుంచి రోజూ రెండు చొప్పున నాగపూర్, నాందేడ్, ఔరంగాబాద్, బుసావల్, చాలీస్‌గావ్ తదితర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ అనుయాయులకు రైల్వే అధికారులు సూచించారు. -
ఫిబ్రవరి వరకే సాగర్ జలాలు
కురిచేడు, త్రిపురాంతకం: నాగార్జున సాగర్ జలాలు ఫిబ్రవరి నెలాఖరు వరకే విడుదల చేస్తామని ఎన్ఎస్పీ ఎస్ఈ శారద పేర్కొన్నారు. ఆయకట్టుకు వచ్చే జలాలను వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాగర్ కాలువపై దర్శి నుంచి జిల్లా సరిహద్దు 85/3 మైలు వరకు శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా 126వ మైలు కురిచేడు వద్ద విలేకరులతో మాట్లాడారు. గతంలో వేసిన నాట్లను మాత్రమే సాగు చేసుకోవాలని..కొత్తగా నార్లు పోసి నాట్లు వేయవద్దని ఆమె సూచించారు. ఫిబ్రవరి నెలాఖరుకు నీటి సరఫరా నిలిచిపోతుందని..అప్పుడు పంట దశలో ఉందని రైతులు ఆందోళన చేసినా ప్రయోజనం ఉండదని, ముందుగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. మేజర్లపై ఏర్పాటు చేసిన అక్రమ తీములను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన కాలువ 124వ మైలు వద్ద ఉన్న రైల్వే గేటు ముసివేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారని..దీనిపై వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట చీమకుర్తి, దర్శి ఈఈలు శ్రీనివాసరావు, బీఎస్వీ.ప్రసాదు, ఒంగోలు, దర్శి, కురిచేడు డీఈఈలు పూర్ణచంద్రరావు, కరిముల్లా, లాల్ అహమ్మద్, కురిచేడు ఏఈ శ్రీనివాసరావు, ఎస్వీ.ఎస్.గుప్తా తదితరులు ఉన్నారు. -
‘ప్రీమియం’ దోపిడి
సాక్షి, సిటీబ్యూరో: ఉన్న పథకానికే కొత్త పేరు... ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తున్నట్టు ప్రకటనలు. అసలుకు ఎసరు. అడ్డదారిలో డబ్బులు పోగేసుకునే వ్యూహం. ఇదీ రైల్వే అధికారుల తీరు. ప్రీమియం రైళ్ల పేరుతో కొత్త తరహా బెర్తుల బేరానికి దిగిన దక్షిణ మధ్య రైల్వే తత్కాల్ టిక్కెట్లనూ వదిలిపెట్టడం లేదు. వాటిని ‘ప్రీమియం’ రూట్‌కు మళ్లించింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ బాగా ఉన్న ఏడు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’ చార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఈ చార్జీలు ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు భారంగా మారాయి. మిగిలిన రైళ్ల లాగానే తత్కాల్ కోటాలోనే కోత విధించి...‘ప్రీమియం తత్కాల్’ పేరిట దోపిడీకి దిగడం గమనార్హం. జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏడు ప్రధాన రైళ్లలో ప్రవేశపెట్టిన ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విస్తరించే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, దక్షిణ్, గోదావరి, బెంగళూర్, శబరి, పాట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రీమియం తత్కాల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లలోని తత్కాల్ టిక్కెట్లకు కోత పెట్టి 50 శాతం ప్రీమియం తత్కాల్ కిందకు మార్చేశారు. దీంతో ప్రయాణికులు రెట్టింపు మొత్తం చెల్లించవలసి వస్తోంది. మొదట్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే రూట్లలో ప్రత్యేక రైళ్ల (సాధారణ చార్జీలే ఉంటాయి) స్థానంలో ప్రీమియం రైళ్లను (రెట్టింపు చార్జీలు) ప్రవేశపెట్టారు. సెలవులు,పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో రద్దీని బట్టి ప్రీమియం రైళ్లను నడిపే అధికారులు... ప్రస్తుతం రద్దీతో నిమిత్తం లేకుండా రెగ్యులర్ రైళ్లలో సైతం తత్కాల్ టిక్కెట్లను ప్రీమియంతో ముడిపెట్టడం విశేషం. కోటాకు టాటా... అన్ని రైళ్లలోనూ ఫస్ట్‌క్లాస్, సెకెండ్ ఏసీ, థ ర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలలో 30 శాతం చొప్పున తత్కాల్ టిక్కెట్లు ఉంటాయి. ఒక స్లీపర్ క్లాస్ బోగీలో సాధారణంగా 72 బెర్తులు ఉంటాయి. వాటిలో 22 తత్కాల్కుకేటాయిస్తారు. సాధారణ చార్జీల కంటే తత్కాల్పైరూ.100 నుంచి రూ.150 అధికంగా ఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్లీపర్ క్లాస్ రూ.475 ఉంటే ... తత్కాల్లో అది రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అలా ప్రతి రైలులోనూ అన్ని తరగతులతో కలిపి సుమారు 300 బెర్తులకు అదనపు చార్జీలతో 24 గంటల ముందుగా బుక్ చేసుకొనే అవకాశం ఉంది. రెండు నెలల క్రితం ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’తో... అసలైన తత్కాల్ కోటాకు సగం వరకూ కోత పడింది. అదే సమయంలో చార్జీలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. దీనివల్ల ప్రయాణికులపై మరింత భారం పెరిగింది. ఇక్కడ ఎంతో నేర్చుకోవచ్చు నాంపల్లి: ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ పౌర సంబంధాల నమూనా లేనప్పటికీ భారతదేశంలో పీఆర్ వ్యవస్థ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గ్లోబల్ అలయన్స్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ చైర్మన్ గ్రేగర్ఆఫ్ అన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘గెటింగ్ టు లీడర్ షిప్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, వియత్నాంలోనూ ఉత్తమ పీఆర్ నమూనాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఎడిటర్ డాక్టర్ సి.వి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ కె.నరేంద్ర, డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు. -
ప్రజల సహకారంతో ‘స్వచ్ఛ భారత్’
అనంతపురం టవర్‌క్లాక్ :కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజా సహకారంతో నిరంతరం కొనసాగిస్తామని రైల్వే శాఖ డివిజినల్ ఆపరేటింగ్ సీనియర్ మేనేజర్ ఆల్విన్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చీపురు పట్టి చెత్తను తొలగించారు. ముందుగా రైల్వేస్టేషన్ ఆవరణంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు క్రిష్ణయ్య, స్టేషన్ మేనేజర్ అశ్వర్థనాయక్, పారిశుద్ధ్య సి బ్బంది, రైల్వే పోలీసులు , ఉద్యోగులు, కార్మికులతో ఆయన ప్రతిజ్ఙ చేయించారు. స్టేషన్ ఆవరణంలో చెత్తను తొలగించి, మొక్కలను నాటారు. రైల్వే స్టేషన్లో, క్వాటర్స్‌లో ఇళ్ల వద్ద ఉన్న చెత్త చెదారాన్ని తొలగించారు. రైల్వే అధికారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి వీధులను శుభ్రం చేశారు. ఆల్విన్ మాట్లాడుతూ ప్రయాణికులు, ప్రజలు పరిశుభ్రతను పాటించాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా కుండీలలో వేయాలని సూచించారు. ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన, స్టేషన్ మాస్టర్ జయచంద్రనాయుడు, చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ దామోదరమూర్తి, సిగ్నల్ ఇంజనీరు సత్యం, రవిబాబు, సీటీఐ ప్రసాద్, ఇంజనీర్లు గోవిందరాజులు, ఎఎస్ఐ లింగమయ్య, కార్పొరేటర్ మళ్లికార్జున, కార్మికులు, ఉద్యోగులు, పోలీసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ పోలీస్టేషన్లో సీఐ మధుసూదన ఆధ్వర్యంలో ఆయుధ పూజను చేశారు