వేసవి ప్రత్యేక రైళ్ల పొడిగింపు.. ఏయే రూట్లలో అంటే? | Extension of summer special trains | Sakshi
Sakshi News home page

వేసవి ప్రత్యేక రైళ్ల పొడిగింపు.. ఏయే రూట్లలో అంటే?

Published Fri, May 12 2023 4:40 AM | Last Updated on Fri, May 12 2023 8:16 AM

Extension of summer special trains - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చి­మ): వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటలో తెలిపారు.

హైదరాబాద్‌–తిరుపతి (07643) జూన్‌ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్‌ (07644) జూన్‌ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, తిరుపతి–సికింద్రాబాద్‌ (07481) జూన్‌ 4 నుంచి 25 వరకు ఆదివారం, సికింద్రాబాద్‌–తిరుపతి (07482) జూన్‌ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, హైదరాబాద్‌–నర్సాపూర్‌ (07631) జూన్‌ 3 నుంచి 24 వరకు ప్రతి శనివారం నడుస్తాయని పేర్కొన్నారు.

నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07632) జూన్‌ 4 నుంచి 30 వరకు ప్రతి ఆదివారం, విజయవాడ–నాగర్‌సోల్‌ (07698) జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్‌సోల్‌–విజయవాడ (07699) జూన్‌ 3 నుంచి జూలై 1 వరకు ప్రతి శనివారం, తిరుపతి–అకోలా (07605) జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, అకోలా–తిరుపతి (07606) జూన్‌ 4 నుంచి జూలై 2 వరకు ప్రతి ఆదివారం, పూర్ణ–తిరుపతి (07607) జూన్‌ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–పూర్ణ (07608) జూన్‌ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం నడుస్తాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement