Rush of passengers
-
రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్
పండగ రద్దీ భారతీయ రైల్వేకు నిత్యం పెద్ద సవాలుగా మారుతోంది. పండగ నేపథ్యంలో లక్షలాది మంది స్వస్థలాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణిస్తుంటారు. రైల్వేశాఖ అందుకు అనుగుణంగా సాధారణ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కానీ ఎప్పటిలాగే పండగ రోజుల్లో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చలేకపోతోంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దీపావళి నేపథ్యంలో అదే తంతు కొనసాగింది. కొంతమంది ప్రయాణికులు అందుకు సంబంధించిన వీడియోలు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. Bihar govt should now run special trains for their native migrant labors . There are people who paid for AC 2 n 3 tickets but couldn't board cause these chalu ticket climbed overcrowded the train n shut the door. and as usual Indian Railway management was clueless https://t.co/hLuRWQyz3d — Romeo Sierra (@sierraromeo98) November 11, 2023 PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 Why should I pay extra reservation charges if this is how I have to travel after paying extra charge for reservation. I m not demanding Tejas Coach Services, i demand my reserved seat #IndianRailways #resign https://t.co/sOjTgPdo9v — yogita chulet (@YogitaChulet) November 9, 2023 -
వేసవి ప్రత్యేక రైళ్ల పొడిగింపు.. ఏయే రూట్లలో అంటే?
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటలో తెలిపారు. హైదరాబాద్–తిరుపతి (07643) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) జూన్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం, తిరుపతి–సికింద్రాబాద్ (07481) జూన్ 4 నుంచి 25 వరకు ఆదివారం, సికింద్రాబాద్–తిరుపతి (07482) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, హైదరాబాద్–నర్సాపూర్ (07631) జూన్ 3 నుంచి 24 వరకు ప్రతి శనివారం నడుస్తాయని పేర్కొన్నారు. నర్సాపూర్–హైదరాబాద్ (07632) జూన్ 4 నుంచి 30 వరకు ప్రతి ఆదివారం, విజయవాడ–నాగర్సోల్ (07698) జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, నాగర్సోల్–విజయవాడ (07699) జూన్ 3 నుంచి జూలై 1 వరకు ప్రతి శనివారం, తిరుపతి–అకోలా (07605) జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి శుక్రవారం, అకోలా–తిరుపతి (07606) జూన్ 4 నుంచి జూలై 2 వరకు ప్రతి ఆదివారం, పూర్ణ–తిరుపతి (07607) జూన్ 5 నుంచి 26 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–పూర్ణ (07608) జూన్ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం నడుస్తాయని తెలిపారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్(07436) ప్రత్యేక రైలు ఆగస్ట్ 7, 14 తేదీలలో రాత్రి 6.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. సికింద్రాబాద్– కాకినాడ టౌన్ (07001) ప్రత్యేక రైలు ఆగస్ట్ 8న రాత్రి 8.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. అలాగే సికింద్రాబాద్–కాకినాడ టౌన్(07053) ప్రత్యేక రైలు ఆగస్ట్ 17న రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.35 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. ఇక కాకినాడ టౌన్–సికింద్రాబాద్(07437) ప్రత్యేక రైలు ఆగస్ట్ 10న రాత్రి 9.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.55 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఇదే రైలు ఆగస్ట్ 17న రాత్రి 9.40గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటిరోజు 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అలాగే కాకినాడ టౌన్–సికింద్రాబాద్(07002) ప్రత్యేక రైలు ఆగస్ట్ 9న రాత్రి 8.45 గంటలకు కాకినాడటౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07054) ప్రత్యేక రైలు ఆగస్ట్ 18న రాత్రి 8.40గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్–నాగర్సోల్(07064) ప్రత్యేక రైలు ఆగస్ట్ 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.55 గంటలకు నాగర్సోల్ చేరుతుంది. నాగర్సోల్–సికింద్రాబాద్(07063) ప్రత్యేక రైలు ఆగస్ట్ 11వ తేదీ రాత్రి 10 గంటలకు నాగర్సోల్లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్ చేరుతుంది. హైదరాబాద్–శ్రీకాకుళంరోడ్ (07026) ప్రత్యేక రైలు ఆగస్ట్ 5, 7 తేదీలలో రాత్రి 7.30కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.10 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. శ్రీకాకుళంరోడ్–హైదరాబాద్(07025) ప్రత్యేక రైలు ఆగస్ట్ 6, 8 తేదీలలో సాయంత్రం 5.15గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.20గంటలకు హైదరాబాద్ చేరుతుంది. జబల్పూర్–తిరునల్వేలి(02194) ప్రత్యేక రైలు ఆగస్ట్ 1, 8, 15, 22, 29, సెప్టెంబర్ 5, 12, 19, 26వ తేదీలలో ఉదయం 9.30 గంటలకు జబల్పూర్లో బయలుదేరి రెండవరోజు తెల్లవారుజామున 4.45 గంటలకు తిరునల్వేలి చేరుతుంది. తిరునల్వేలి–జబల్పూర్(02193) ప్రత్యేక రైలు ఆగస్ట్ 3, 10, 17, 24, 31, సెప్టెంబర్ 7, 14, 21, 28 సాయంత్రం 5.45 గంటలకు తిరునల్వేలిలో బయలుదేరి రెండవ రోజు ఉదయం 11.15గంటలకు జబల్పూర్ చేరుతుంది. -
సొంత గ్రామాలకు తరలుతున్న ప్రజలు
క్రిష్ణగిరి: తమిళనాడు శాసనసభ ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు తమిళనాడు ఓటర్లు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తరలివెళ్లుతున్నారు. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా వలస వెళ్లినవారు తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఆదివారం తమిళనాడుకు బయలుదేరారు. కర్ణాటక సరిహద్దు హొసూరు బస్టాం డు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసేదుకు తమిళనాడు ఓటర్ల ఆసక్తి కనిపించింది. సంక్రాం తి పండుగ కోసం గ్రామాలకు వెళ్లే రద్దీ హొసూరు బస్స్టాం డులో కనిపించింది. ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్ల ను పార్టీల నాయకులు డబ్బులిచ్చి గ్రామాలకు రప్పించుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడులో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయాణికులను తీసుకెళ్లుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు సూళగిరికి వెళ్లకుండా జాతీయ రహదారిపైనే వెళ్లడంతో సూళగిరి బస్టాండులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సూ ళగిరిలోనికి బస్సులు రావాలని డిమాండ్ చేయడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ అధికారులతో చెప్పి బస్సులను మళ్లించడంతో ఆందోళన విరమించారు. -
తిరుపతికి వీక్లీ స్పెషల్ రైలు
విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్ సంబల్పూర్-యశ్వంత్‌పూర్ మధ్య మరో రైలు {పతీవారం మూడు మాసాల పాట ప్రత్యేక ట్రిప్పులు విశాఖపట్నం సిటీ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే బుధవారం పచ్చ జెండా ఊపింది. దాదాపు 13 ట్రిప్పులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించారు. సంబల్పూర్-యశ్వంత్‌పూర్,విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్, విశాఖ-తిరుపతి వారాంతపు రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. సంబల్పూర్-యశ్వంత్‌పూర్(08301) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకూ ప్రతీ బుధవారం ఉదయం 8.05 గంటలకు సంబల్పూర్లో బయల్దేరి రాయగడకు సాయంత్రం 3.15 గంటలకు, పార్వతీపురానికి సాయంత్రం 4.11 గంటలకు, విజయనగరం సాయంత్రం 5.50 గంటలకు, విశాఖకు రాత్రి 7 గంటలకు చేరుకుని తిరిగి 7.20 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు(ప్రతీ గురువారం) సాయంత్రం 4.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. యశ్వంత్‌పూర్-సంబల్పూర్(08302) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకూ ప్రతీ గురువారం(తెల్లారితే శుక్రవారం) అర్ధరాత్రి 12.30 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 8.35 గంటలకు విశాఖకు చేరుతుంది. 8.55 గంటలకు బయల్దేరి విజయనగరంకు 9.55 గంటలకు, బొబ్బిలికి 10. 50 గంటలకు, పార్వతిపురంకు 11.13 గంటలకు, రాయగడకు అర్ధరాత్రి 12 గంటలకు చేరుకుని శనివారం ఉదయం 6.15గంటలకు సంబల్పూర్చేరుతుంది. ఈ రైలు బార్గన్ రోడ్, బలాంగీర్, టిట్లాగర్, కెసింగ, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకల, ఛిత్తూరు, కాట్పడి, జోలార్‌పెట్టాయ్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్..!: విశాఖపట్నం-సికింద్రాబాద్(08501) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకూ 13 ట్రిప్పుల పాటు ప్రతీ మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం(08502) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్8వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకూ 13 ట్రిప్పుల పాటు ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైల్లో ఒక సెకండ్‌ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, 8 జనరల్ బోగీలుంటాయి.ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం,ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ-తిరుపతి స్పెషల్..! విశాఖపట్నం-తిరుపతి(02873) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకూ 13ట్రిప్పుల పాటు ప్రతీ సోమవారం సాయంత్రం 4.45గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖపట్నం(02874) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకూ ప్రతీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో ఈ రైల్లో ఒక సెకండ్‌ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, 8 జనరల్ బోగీలుంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపును పరిశీలించి ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ తెలిపారు. -
వేసవి ప్రత్యేక రైళ్లు ఇవీ..
హైదరాబాద్ బ్యూరో : వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-మచిలీపట్నం (07050/ 07049) రైలు మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 10.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 7.45 కు మచిలీపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే తేదీలలో రాత్రి 9.30 కు మచిలీపట్నం నుంచి బయలుదేరి తెల్లవారు జామున 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. విజయవాడ-తిరుపతి (07259/07260) స్పెషల్ ట్రైన్ మార్చి 5, 12, 19, 26 తేదీలలో రాత్రి 11.15 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8, 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 11.55 కు విజయవాడకు చేరుకుంటుంది. తిరుపతి-కాకినాడ (07261/07262) ప్రత్యేక రైలు మార్చి 6, 13, 20, 27 తేదీలలో మధ్యాహ్నం 3.30 కు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 7, 14, 21, 28 తేదీలలో సాయంత్రం 7.15 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 కు తిరుపతికి చేరుకుంటుంది. భువనేశ్వర్-బెంగళూర్ (00851/00852) ప్రీమియం బై వీక్లీ ట్రైన్ ఏప్రిల్ 1 నుంచి జూన్ 29 వరకు ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 10.50 కి భువనేశ్వర్ నుంచి బయలుదేరి గురు, ఆదివారాల్లో రాత్రి 10.40 కి బెంగళూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్ర, సోమ వారాల్లో తెల్లవారు జామున ఒంటిగంటకు బయలుదేరి ఆది, బుధ వారాల్లో తెల్లవారు జామున 1.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. భువనేశ్వర్-పూనే (02882/02881) ప్రీమియం స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 5 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10.15 కు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 5 గంటలకు పూనే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం ఉదయం 11.15 కు పూనే నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 5.35 కు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఇది సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్-విశాఖ (08502/08501) వీక్లీ స్పెషల్ ఏప్రిల్ 7 నుంచి జూలై 1 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ-తిరుపతి (02873/02874) స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 6 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 4.45కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 కు విశాఖ చేరుకుంటుంది. హోలీ ప్రత్యేక రైళ్లు... హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-పాట్నా (02791/02792) స్పెషల్ మార్చి 1వ తేదీన ఉదయం 6.15 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 కు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 3వ తేదీన రాత్రి 11.40 కి పాట్నా నుంచి బయలుదేరి మార్చి 5వ తేదీ ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.