సొంత గ్రామాలకు తరలుతున్న ప్రజలు
క్రిష్ణగిరి: తమిళనాడు శాసనసభ ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు తమిళనాడు ఓటర్లు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తరలివెళ్లుతున్నారు. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా వలస వెళ్లినవారు తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఆదివారం తమిళనాడుకు బయలుదేరారు. కర్ణాటక సరిహద్దు హొసూరు బస్టాం డు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసేదుకు తమిళనాడు ఓటర్ల ఆసక్తి కనిపించింది.
సంక్రాం తి పండుగ కోసం గ్రామాలకు వెళ్లే రద్దీ హొసూరు బస్‌స్టాం డులో కనిపించింది. ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్ల ను పార్టీల నాయకులు డబ్బులిచ్చి గ్రామాలకు రప్పించుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడులో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయాణికులను తీసుకెళ్లుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు సూళగిరికి వెళ్లకుండా జాతీయ రహదారిపైనే వెళ్లడంతో సూళగిరి బస్టాండులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సూ ళగిరిలోనికి బస్సులు రావాలని డిమాండ్ చేయడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ అధికారులతో చెప్పి బస్సులను మళ్లించడంతో ఆందోళన విరమించారు.