తిరుపతికి వీక్లీ స్పెషల్ రైలు | Weekly special train to Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతికి వీక్లీ స్పెషల్ రైలు

Published Thu, Mar 5 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

తిరుపతికి వీక్లీ స్పెషల్ రైలు

తిరుపతికి వీక్లీ స్పెషల్ రైలు

విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్
 సంబల్‌పూర్-యశ్వంత్‌పూర్ మధ్య మరో రైలు
 {పతీవారం మూడు మాసాల పాట  ప్రత్యేక ట్రిప్పులు

 
 విశాఖపట్నం సిటీ :  ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే బుధవారం పచ్చ జెండా ఊపింది. దాదాపు 13 ట్రిప్పులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించారు. సంబల్‌పూర్-యశ్వంత్‌పూర్,విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్, విశాఖ-తిరుపతి వారాంతపు రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు.

 సంబల్‌పూర్-యశ్వంత్‌పూర్(08301) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకూ ప్రతీ బుధవారం ఉదయం 8.05 గంటలకు సంబల్‌పూర్‌లో బయల్దేరి రాయగడకు సాయంత్రం 3.15 గంటలకు, పార్వతీపురానికి సాయంత్రం 4.11 గంటలకు, విజయనగరం సాయంత్రం 5.50 గంటలకు, విశాఖకు రాత్రి 7 గంటలకు చేరుకుని తిరిగి 7.20 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు(ప్రతీ గురువారం) సాయంత్రం 4.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది.

 యశ్వంత్‌పూర్-సంబల్‌పూర్(08302) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకూ ప్రతీ గురువారం(తెల్లారితే శుక్రవారం) అర్ధరాత్రి 12.30 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 8.35 గంటలకు విశాఖకు చేరుతుంది. 8.55 గంటలకు బయల్దేరి విజయనగరంకు 9.55 గంటలకు, బొబ్బిలికి 10. 50 గంటలకు, పార్వతిపురంకు 11.13 గంటలకు, రాయగడకు అర్ధరాత్రి 12 గంటలకు చేరుకుని శనివారం ఉదయం 6.15గంటలకు సంబల్‌పూర్‌చేరుతుంది. ఈ రైలు బార్గన్ రోడ్, బలాంగీర్, టిట్లాగర్, కెసింగ, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకల, ఛిత్తూరు, కాట్పడి, జోలార్‌పెట్టాయ్, కృష్ణరాజపురం స్టేషన్‌లలో ఆగుతుంది.
 
విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్..!:

విశాఖపట్నం-సికింద్రాబాద్(08501) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకూ 13 ట్రిప్పుల పాటు ప్రతీ మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం(08502) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్8వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకూ 13 ట్రిప్పుల పాటు ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైల్లో ఒక సెకండ్‌ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, 8 జనరల్ బోగీలుంటాయి.ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం,ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుంది.
 
విశాఖ-తిరుపతి స్పెషల్..!

 విశాఖపట్నం-తిరుపతి(02873) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకూ 13ట్రిప్పుల పాటు ప్రతీ సోమవారం సాయంత్రం 4.45గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖపట్నం(02874) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకూ ప్రతీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైల్లో ఈ రైల్లో ఒక సెకండ్‌ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, 8 జనరల్ బోగీలుంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపును పరిశీలించి ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement