East Coast Railway
-
బలపడుతున్న వాయుగుండం
Cyclone dana: తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24వ తేదీకి తుపానుగా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 24వ తేదీన పూరి–పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.తుపాను కారణంగా నేడు, రేపు పలు రైళ్లు రద్దురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేకు ‘దనా’ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. నేడు రద్దయిన రైళ్లు కామాఖ్య–బెంగళూరు (12552), సిల్చార్–సికింద్రాబాద్ (12514), డిబ్రుగర్–కన్యాకుమారి (22504), సికింద్రాబాద్–భువనేశ్వర్ (17016), చెన్నై సెంట్రల్–హౌరా (12840), పుదుచ్చేరి–హౌరా (12868), చెన్నై సెంట్రల్–షాలీమార్ (22826), పుదుచ్చేరి–భువనేశ్వర్ (12897), బెంగళూరు–భువనేశ్వర్ (18464), ముంబై–భువనేశ్వర్ (11019), బెంగళూరు–గౌహతి (12509), హైదరాబాద్–హౌరా (18046), కన్యాకుమారి–డిబ్రుగర్ (22503), సికింద్రాబాద్–హౌరా (12704), బెంగళూరు–హౌరా (22888), సికింద్రాబాద్–మాల్దాటౌన్ (03429), యశ్వంత్‌పూర్–హౌరా (12864), తిరునెల్వేలి–షాలీమార్ (06087) రైళ్లను బుధవారం పూర్తిగా రద్దు చేశారు. రేపు రద్దయ్యే రైళ్లు... హౌరా–సికింద్రాబాద్ (12703), ఖరగ్‌పూర్–విల్లుపురం (22603), హౌరా–భువనేశ్వర్ (12073), షాలీమార్–హైదరాబాద్ (18045), సత్రగచ్చి–మంగుళూరు సెంట్రల్ (22851), షాలీమార్–చెన్నై సెంట్రల్ (12841), హౌరా–తిరుచ్చిరాపల్లి (12663), హౌరా–బెంగళూరు (12863), షాలీమార్–వాస్కోడిగామా(18047), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), పాట్నా–యర్నాకులం (22644), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (06090), చెన్నై సెంట్రల్–హౌరా (12842), చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (22808), బెంగళూరు–ముజఫర్‌పూర్ (15227), తాంబరం–సత్రగచ్చి (06095), బెంగళూరు–హౌరా (12246), పూరి–తిరుపతి (17479) రైళ్లను 24న పూర్తిగా రద్దు చేశారు. -
దానా ఎఫెక్ట్..రద్దయిన 34 రైళ్లు ఇవే
అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాను ముప్పు నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని భువనేశ్వర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు సేవలందించే 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ఉదయం అల్పపీడనంగా.. 22న వాయుగుండంగా బలం పుంజుకుని బుధవారం (23న) ఇది దానా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తీర్పు తీర ప్రాంతాల దానా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తరుణంలో తీర్పుతీర ప్రాంతాలకు రైల్వే సేవలందించే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన 34రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే నోట్‌ను విడుదల చేసింది. -
రైలు ప్రమాద బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: రైలు ప్రమాదంలో బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించారు. ‘‘ఘటన దురదృష్టకరం. బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వాళ్లకు రూ.50 వేల సాయం అందిస్తాము’’ అని మంత్రి బొత్స తెలిపారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిందని, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొందని అభినందించారు. ఏపీ అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారని తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల పునరుద్ధరణ పనులను కూడా రైల్వే అధికారులు ప్రారంభించారని.. సాయంత్రంలోపే పూర్తవుతాయని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. ఆదివారం రాత్రి కంటాకపల్లి వద్ద పలాస-విశాఖ ప్యాసింజర్ రైలును రాయగడ-విశాఖ ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇప్పటిదాకా 13 మంది మృతి చెందగా, 50 మందిదాకా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్.. ఘటనాస్థలానికి వెళ్లాలని, సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణను ఆదేశించారు. దీంతో రాత్రి నుంచి ఆయన అక్కడే పరిస్థితిని సమీక్షిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. -
ఉత్తరాంధ్రకు ద.మ.రైల్వే ఉత్తచేయి.. పత్తాలేని సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: అసలే పండుగ సీజన్.. జనం సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ.. ఉత్తరాంధ్రవాసులకు దక్షిణ మధ్య రైల్వే ఉత్తచేయి చూపింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కనీసం ఒక్క ప్రత్యేక రైలూలేదు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లల్లో విశాఖ మీదుగా ఒక్కటి కూడా వెళ్లడంలేదు. ఆరేడు రెగ్యులర్ రైళ్లు తప్ప ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. విశాఖ వైపుగా నడిచే రెగ్యులర్ రైళ్లన్నీ వచ్చే ఫిబ్రవరి వరకు కూడా వెయిటింగ్ జాబితాతో దర్శనమిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 30 రైళ్లను అదనంగా నడిపేందుకు చర్యలు చేపట్టింది. వాటిలో కాకినాడ, తిరుపతి, బెంగళూరు, విజయవాడ వంటి ప్రాంతాలకే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖ, చుట్టుపక్కలప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు లేవని కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన వినయ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. సమన్వయలేమి... దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వేల మధ్య సమన్వయం కొరవడటం వల్లే ప్రత్యేక రైళ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం నెలకొందని ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి దువ్వాడ వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి కాగా, దువ్వాడ నుంచి విశాఖ తదితర ప్రాంతాలు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తాయి. దీంతో హైదరాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లపై చూపిన శ్రద్ధ విశాఖ వైపు కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈస్ట్‌కోస్ట్ రైల్వే కూడా సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ‘హైదరాబాద్ నుంచి సామర్లకోట వరకు, అక్కడి నుంచి కాకినాడకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, విశాఖకు వెళ్లాలంటే మరో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సామర్లకోట నుంచి విశాఖకు వెళ్లడం ఎలా సాధ్యం’’అని ఫణీంద్ర అనే ప్రయాణికుడు చెప్పారు. రెగ్యులర్ రైళ్లు ఇప్పటికే భర్తీ కావడం, ప్రత్యేక రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ, గంటల తరబడి కూర్చొని ప్రయాణంచేయడం మహిళలు, పిల్లలు, వయోధికులకు చాలా కష్టం. మరోవైపు బస్సుల కంటే రైళ్లలో చార్జీలు కూడా తక్కువ. పదిలక్షల మంది వరకు ప్రయాణం ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సంక్రాంతి వేడుకలకు హైదరాబాద్ నుంచి 25 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది. అందులో కనీసం 10 లక్షల మంది విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవాళ్లే ఉంటారని అంచనా. మరికొద్దిరోజుల్లో విద్యార్థులకు సెలవులు ప్రకటించనుండటంతో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
Araku Valley: అరకు పర్యాటకుల కోసం ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవుల నేపథ్యంలో అరకు పర్యాటకుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–అరకు మధ్య అక్టోబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఈ స్పెషల్ రైలు (08509) ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ రైలు(08510) అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 5–స్లీపర్‌క్లాస్, 7–సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లతో నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతాయి. వంజంగి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి సాక్షి, పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మేఘాల కొండ వంజంగి హిల్స్‌కు మంగళవారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు వంజంగి హిల్స్ ప్రాంతానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు, మేఘాలను చూసి పరవశించారు. ఉదయం 10గంటల వరకు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది. -
Railways: ఇకపై ఆ రైళ్లలో జనరల్ ప్రయాణం
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఆయా రైళ్లలో జనరల్ టికెట్లను పునరుద్ధరించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే చర్యలు తీసుకున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్టేషన్లలోని జనరల్ కౌంటర్స్‌లో ఈనెల 21 నుంచి టికెట్లు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాయగడ–గుంటూరు(17244)ఎక్స్‌ప్రెస్ (4 కోచ్‌లు), విశాఖపట్నం–విజయవాడ(12717)రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (6 కోచ్‌లు), విశాఖపట్నం–గుంటూరు(17240)సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (6 కోచ్‌లు), విశాఖపట్నం–లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్(4 కోచ్‌లు)కు జనరల్ టికెట్లు ఇవ్వనున్నారని తెలిపారు. కోవిడ్ కారణంగా జనరల్ టికెట్లను రద్దు చేసి, అన్ని క్లాసులకు రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: (Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు) -
జావద్ తుపాన్ ఎఫెక్ట్: 95 రైళ్లు రద్దు
సాక్షి, భువనేశ్వర్: జావద్ తుపాను ఎఫెక్ట్ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 95 రైళ్లను రద్దు చేసింది. గురువారం రద్దు చేసిన రైళ్లు.. ►సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్, త్రివేండ్రం శాలీమార్, బెంగుళూరు కంటోన్మెంట్- గౌహతి, అహ్మదాబాద్-పూరి ఎక్స్‌ప్రెస్, కన్యాకుమారి- దిబ్రుఘర్ శుక్రవారం రద్దు చేసిన రైళ్లు ►పూరి- గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్ పలకనామ ఎక్స్‌ప్రెస్, పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్, హౌరా-యశ్వంత్ పూర్-దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్, పురీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రాగాచ్చి-చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్ ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా-విశాఖ. ►ధన్ బాద్-అలిప్పీ, టాటా-యశ్వంత్ పూర్, పూరీ-అహ్మదాబాద్, భువనేశ్వర్-జగదల్పూర్, చెన్నై సెంట్రల్-హౌరా, హైదరాబాద్-హౌరా, చెన్నై-భువనేశ్వర్, 1226 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో, సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా, తిరుపతి-పూరీ, యశ్వంత్ పూర్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా, వాస్కో-హౌరా, తిరుచురాపల్లి-హౌరా, బెంగళూర్-భువనేశ్వర్, ముంబై-భువనేశ్వర్, విశాఖ-కొర్బా, విశాఖ-రాయగఢ్, గుంటూరు-రాయగఢ్, జగడల్ పూర్-భువనేశ్వర్, జునాఘర్ రోడ్-భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం రోజు రద్దు అయిన రైళ్లు ►భువనేశ్వర్-ప్రశాంతి నిలయం, హాతియా-బెంగుళూరు, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ – నిజాముద్దీన్- సమత ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండోల్ రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. -
AP: గులాబ్ తుపాన్‌తో పలు రైళ్లు రద్దు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘గులాబ్ తుపాన్’ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 310కిలో మీటర్లు, కళింగపట్నానికి 380 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ‘గులాబ్’ తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్ల రాకపోకలు మల్లింపు, కొన్ని రైళ్లను రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. 08463 భువనేశ్వర్-కే.ఎస్.ఆర్ బెంగళూరు స్పెషల్ ట్రైన్, 02845 భువనేశ్వర్- యస్వంత్ పూర్ స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేసినట్లు పేర్కొంది. -
ఏపీలో ‘స్మార్ట్’గా రైల్వే సేవలు
సాక్షి, అమరావతి: రైలు టెర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇందుకు గూడ్స్ షెడ్లను ఎంచుకుని అక్కడే వ్యాపారం ఆరంభించేందుకు ‘సర్వీస్ మార్కెట్ ఎట్ రైల్ టెర్మినల్స్’ (స్మార్ట్) అనే పథకం ప్రారంభించనుంది. రైలు టెర్మినళ్ల వద్ద సర్వీస్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను ఆహ్వానించనుంది. అంటే గూడ్స్ షెడ్ల వద్ద సరుకును నేరుగా వినియోగదారులకు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశం కల్పిస్తోంది. ఏపీలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్ ఐదు చోట్ల గూడ్స్ షెడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఉత్తరాంధ్రలోని కంటకపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నంలలో గూడ్స్ షెడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. సర్వీస్ ప్రొవైడర్లకు, వినియోగదారులకు మేలు స్మార్ట్ పథకం ద్వారా సర్వీస్ మార్కెట్ చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లు తమ సరుకు రైల్ ట్రాన్స్‌పోర్టు ద్వారా గూడ్స్ షెడ్లకు చేరుస్తారు. అక్కడి నుంచి నేరుగా వినియోగదారులకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోడ్డు రవాణా కంటే రైల్ ట్రాన్స్‌పోర్టు ధరలు చౌకగా మారాయి. చౌకగా వినియోగదారులకు సరుకును అందించే అవకాశం ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు గూడ్స్ షెడ్ల ద్వారా మార్కెట్ చేయాలనుకుంటే తమ సంస్థ పేరును కానీ, వ్యక్తిగతంగా వివరాల్ని ఫ్రైట్ ఆపరేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎఫ్‌వోఐఎస్) ద్వారా నమోదు చేసుకోవాలి. వినియోగదారుడు ఎవరైనా నేరుగా సర్వీస్ ప్రొవైడర్‌ను స్మార్ట్ పథకం ద్వారా సంప్రదించవచ్చు. ట్రక్కులు, లాజిస్టిక్స్ వ్యాపారులు, రైలు రవాణాను ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజకనకరంగా ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు దక్షిణ మధ్య రైల్వే గతేడాది అన్ని డివిజన్ల పరిధిలో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసింది. సరుకు రవాణాలో కీలకంగా ఈ బీడీయూలను భాగస్వామ్యం చేసి ఆదాయం ఆర్జిస్తోంది. రైతులు, చిరువ్యాపారులు సైతం ఇతర రాష్ట్రాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకు రవాణా చేస్తూ తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందుతున్నారు. గతేడాది సరుకు రవాణా ద్వారా ఏపీ నుంచి రైల్వే శాఖ రూ.2,600 కోట్ల ఆదాయం పొందింది. అధికశాతం కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి సరుకు రవాణాలో భాగస్వామ్యం ఉంది. -
ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు..
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరి«ధిలో నడుస్తున్న పలు స్పెషల్ రైళ్ల వేళలు మారినట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్పు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయన్నారు. ►రాయగడ–విశాఖపట్నం (08507) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రోజూ ఉదయం 5.45 గంటలకు రాయగడలో బయల్దేరి అదే రోజు ఉదయం 10గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08508) విశాఖపట్నంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.05 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, పార్వతీపురం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ►పలాస–విశాఖపట్నం (08531) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు పలాసలో ఉదయం 5గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 9.25గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08532) విశాఖలో ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి రాత్రి 10గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళంరోడ్డు, తిలారు, నౌపడ స్టేషన్లలో ఆగుతుంది. -
సివిల్స్ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..
సాక్షి, హైదరాబాద్ : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఓడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ 4 తేదీన పరీక్ష నిర్వహిస్తుండటంతో ముందు రోజు ఈ రైళ్లు నడిపేందుకు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 3 న బెర్హాంపూర్, కియోంజార్, ఖరియార్ రోడ్, ఇచ్ఛాపురం నుంచి సాయంత్రం 4 గంటలకు, కోరాపుట్ నుంచి ఉదయం 5 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరనున్నాయి. కాగా ఈ రైళ్లు అదే రోజు సాయంత్రం నగరాలకు చేరుకోనున్నాయి. అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కోరాపుట్-కటక్, కోరాపుట్-విశాఖపట్నం, రూర్కెలా- కటక్, జారుసగూడ, బారిపాడ-కటక్ మరియు విజయవాడ- విశాఖపట్నం మధ్య పరీక్షా ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతుంది. కాగా మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
రెండు కిలోమీటర్ల పొడవైన రైలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణికుల రైలు కన్నా సరకులను తీసుకెళ్లే గూడ్సు రైలు చాలా పొడుగుంటుందన్న విషయం మనకు తెల్సిందే. రైల్వే క్రాసింగ్ వద్ద నిలబడి ముందు నుంచి పొతున్న గూడ్సు రైలును ‘అబ్బా! ఎప్పుడు వెళ్లి పోతుందా!’ అంటూ అసహనంతో ఎదురు చూసిన చిన్నప్పటి రోజులు అందరికి గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు భారత రైలు పట్టాలపైకి అంతకన్నా మూడింతలు పొడవున్న గూడ్సు రైళ్లు వస్తున్నాయి. పైథాన్ రేక్‌గా పిలిచే 147 వ్యాగన్లు కలిగిన రెండు కిలోమీటర్ల పొడవున్న గూడ్సు రైలును ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఇటీవల ఒడిశాలోని సాంబల్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయోగాత్మకంగా నడిపింది. మూడు రేక్‌లను అనుసంధానించిన అంటే మొదటి రేక్‌లో 45 వ్యాగన్లు ఉండగా, రెండు, మూడు రేక్స్‌లో 51 చొప్పున వ్యాగన్లు అనుసంధానించిన ఈ గూడ్సు రైలుకు నాలుగు ఇంజన్లతోపాటు మూడు గార్డ్ వ్యాన్లను కలిపారు. విశాఖపట్నం రేవుకు తీసుకెళ్లాల్సిన కంటేనర్లను ఈ గూడ్సు వ్యాగన్లలో పంపించారు. సహరాన్పూర్ డివిజన్ రైల్వే మేనేజర్ ఈ రైలు గమనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలా పొడవైన గూడ్సు రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఆర్థికంగా ఎంతో కలసి వస్తుందని ఆయన అన్నారు. -
రెండు కిలోమీటర్ల పొడవైన రైలు
-
ఎన్నో ప్రమాదాలు.. వేలాది మృతులు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో రైల్వే లైన్లు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రమాదాలూ అదేస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. తూర్పు కోస్తా రైల్వే చరిత్రలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనే అతి పెద్దది. ఈ ప్రమాదంలో 40 మంది మృత్యువాత చెందగా.. 71 మందికిపైగా గాయాలయ్యాయి. దేశంలో ఘోర రైలు ప్రమాదాలను ఒకసారి గమనిస్తే.. ► 1981 జూన్ 6: బిహార్‌లోని సహర్సా వద్ద ప్యాసింజర్ రైలు భాగమతి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ► 1995 ఆగస్టు 20: ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 358 మంది చనిపోయారు. ► 1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసాల్ వద్ద అవధ్–అస్సాం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 268 మంది మృతిచెందారు. ► 1998 నవంబరు 26: పంజాబ్‌లోని ఖాన్నా వద్ద జమ్మూ తావీ–సీల్డా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. 212 మంది మరణించారు. ► 2010 మే 28: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌జిల్లాలో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 170 మంది తుదిశ్వాస విడిచారు. ► 1964 డిసెంబర్ 23: తమిళనాడులో పాంబన్–ధనుష్కోటి ప్యాసింజర్ రైలు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 150 మంది చనిపోయారు. ► 2002 సెప్టెంబర్ 9: హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బిహార్‌లోని గయ వద్ద పట్టాలు తప్పింది. 140 మంది కన్నుమూశారు. ► 2003 జూలై 2: వరంగల్ స్టేషన్ వద్ద గోల్కొండ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 21 మంది మృతిచెందారు. ► 2005 అక్టోబర్ 29: తెలంగాణలోని వలిగొండ వద్ద మూసి నదిపై బ్రిడ్జి కూలిపోయింది. అదే బ్రిడ్జిపై వెళ్తున్న డెల్టా ప్యాసింజర్ నదిలో పడిపోయింది. 114 మంది ప్రయాణికులు కన్నుమూశారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లకు నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైళ్లు అదనపు ట్రిప్పులను పొడిగిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం-తిరుపతి వీక్లీ ప్రత్యేక రైలు (08573) : ఫిబ్రవరి 1 నుంచి మార్చి 28 (సోమవారాలు) రాత్రి 10.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 01.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక వీక్లీ రైలు(08574) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో తిరుపతిలో మధ్యాహ్నం 03.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, రెండు థర్డ్ ఎ.సి కోచ్‌లు, తొమ్మిది స్లీపర్ క్లాస్‌లు, ఆరు సెకండ్‌క్లాస్ సిట్టింగ్, రెండు సెకండ్ క్లాస్ కం లగే జ్ కోచ్‌లున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి. విశాఖ నుంచి సికిందరాబాద్‌కు విశాఖపట్నం-సికిందరాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్(08501) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో విశాఖపట్నం నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికిందరాబాద్ చేరుకుంటుంది. సికిందరాబాద్- విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (08502) : ఫిబ్రవరి 3 మొదలు మార్చి 30వ తేదీల్లో (బుధవారాలు) సాయంత్రం 04.30 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, మూడు థర్డ్ ఎ.సి, పది స్లీపర్, ఆరు సెంకడ్క్లాస్ సిట్టింగ్ కోచ్, రెండు సెకండ్‌క్లాస్ సిట్టింగ్ కం లగేజ్ కోచ్‌లుండే ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగ ల్, కాజీపేట్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
తిరుపతికి వీక్లీ స్పెషల్ రైలు
విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్ సంబల్పూర్-యశ్వంత్‌పూర్ మధ్య మరో రైలు {పతీవారం మూడు మాసాల పాట ప్రత్యేక ట్రిప్పులు విశాఖపట్నం సిటీ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే బుధవారం పచ్చ జెండా ఊపింది. దాదాపు 13 ట్రిప్పులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించారు. సంబల్పూర్-యశ్వంత్‌పూర్,విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్, విశాఖ-తిరుపతి వారాంతపు రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. సంబల్పూర్-యశ్వంత్‌పూర్(08301) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకూ ప్రతీ బుధవారం ఉదయం 8.05 గంటలకు సంబల్పూర్లో బయల్దేరి రాయగడకు సాయంత్రం 3.15 గంటలకు, పార్వతీపురానికి సాయంత్రం 4.11 గంటలకు, విజయనగరం సాయంత్రం 5.50 గంటలకు, విశాఖకు రాత్రి 7 గంటలకు చేరుకుని తిరిగి 7.20 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు(ప్రతీ గురువారం) సాయంత్రం 4.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. యశ్వంత్‌పూర్-సంబల్పూర్(08302) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకూ ప్రతీ గురువారం(తెల్లారితే శుక్రవారం) అర్ధరాత్రి 12.30 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 8.35 గంటలకు విశాఖకు చేరుతుంది. 8.55 గంటలకు బయల్దేరి విజయనగరంకు 9.55 గంటలకు, బొబ్బిలికి 10. 50 గంటలకు, పార్వతిపురంకు 11.13 గంటలకు, రాయగడకు అర్ధరాత్రి 12 గంటలకు చేరుకుని శనివారం ఉదయం 6.15గంటలకు సంబల్పూర్చేరుతుంది. ఈ రైలు బార్గన్ రోడ్, బలాంగీర్, టిట్లాగర్, కెసింగ, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకల, ఛిత్తూరు, కాట్పడి, జోలార్‌పెట్టాయ్, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ-సికింద్రాబాద్‌కు స్పెషల్..!: విశాఖపట్నం-సికింద్రాబాద్(08501) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకూ 13 ట్రిప్పుల పాటు ప్రతీ మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం(08502) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్8వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకూ 13 ట్రిప్పుల పాటు ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైల్లో ఒక సెకండ్‌ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, 8 జనరల్ బోగీలుంటాయి.ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం,ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. విశాఖ-తిరుపతి స్పెషల్..! విశాఖపట్నం-తిరుపతి(02873) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకూ 13ట్రిప్పుల పాటు ప్రతీ సోమవారం సాయంత్రం 4.45గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-విశాఖపట్నం(02874) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకూ ప్రతీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో ఈ రైల్లో ఒక సెకండ్‌ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 9 స్లీపర్ క్లాస్, 8 జనరల్ బోగీలుంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపును పరిశీలించి ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ తెలిపారు. -
కిరండూల్ మార్గంలో రైళ్లు రద్దు
విశాఖపట్నం సిటీ : మావోయిస్టుల బంద్ పిలుపు మేరకు తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. కొత్తవలస-కిరండూల్ మార్గంలో విశాఖ నుంచి బయల్దేరే పలు రైళ్లను కుదిం చినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో రాత్రి వేళ నడిచే రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ-కిరర డూల్(58501) పాసింజర్ 19, 20 తేదీల్లో రాత్రి వేళ జగదల్పూర్ స్టేషన్లో ఆగిపోతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో 20, 21 తేదీ ల్లో జగదల్పూర్ నుంచి విశాఖ మధ్య మాత్రమే కిరండూల్-విశాఖ(58502) పాసింజర్ నడుస్తుందని ప్రకటిం చారు. గూడ్సు రైళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నారు. -
హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు
ఈ నెల 9,16, 23, 30వ తేదీలలో విశాఖ- హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి తిరిగి విశాఖకు.. విశాఖపట్నం సిటీ: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని తూర్పుకోస్తా రైల్వే విశాఖ-హైదరాబాద్ మధ్య ఒక రైలును నడపనుంది. ఈ నెల 9,16,23,30వ తేదీలలో ఈ రైలు విశాఖ నుంచి రాజధానికి బయలుదేరుతుంది. ఇందులో ఎనిమిది జనరల్ బోగీలుంటాయి. ఒక సెకండ్‌ఏసీ, ఒక థర్డ్ ఏసీ, అయిదు రిజర్వేషన్ బోగీలుంటాయి. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, వరంగల్, కాజీపేట వంటి స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఆయా తేదీల్లో విశాఖలో హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 10, 17, 24,31వ తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మర్నాడు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుందని వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరుపతికి ఫాస్ట్ ప్యాసింజర్
► విశాఖ నుంచి ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో.. ► ప్యాసింజరే కానీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌లు ► తొలిరోజే విశేష స్పందన విశాఖపట్నం సిటీ: విశాఖ నుంచి తిరుపతికి వారంలో మూడు రోజులపాటు ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌లతో ఓ ప్యాసింజర్ బయల్దేరుతోంది. విశాఖ-రేణిగుంట మధ్య జనసాధారణ్ రైలు పేరు తో ఈ ప్యాసింజర్ మంగళవారం సాయంత్రం విశాఖ నుంచి బయల్దేరింది. తొలిరోజే వందలాది ప్రయాణికులతో కదిలింది. ఉత్తరాంధ్ర ప్రయాణికులు విజయవాడ మీదుగా రేణిగుంట వెళ్లేందుకు ఈ ప్యాసింజర్‌ను తూర్పు కోస్తా రైల్వే పట్టాలెక్కించింది. విశాఖ, తూర్పు, పశ్చిమ ోదావరి, కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రయాణించే ఈ రైలు సాధారణ ప్రయాణికులందరికీ ఉపయోగపడేలా హాల్టులను ఏర్పాటు చేశారు. మొత్తం 16 బోగీలతో నడిచే ఈ రైలు అన్ని బోగీలూ కొత్తవే కావడంతో అందరినీ ఆకర్షిస్తోంది. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన ఈ ప్యాసింజర్‌లో ప్రయాణికులు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉన్నారు. తిరుమలఎక్స్ప్రెస్లో బెర్తులు లభించని వారు, జనరల్ బోగీల్లో సీట్లు లభ్యం కాని వారంతా ఈ రైలునే నమ్ముకున్నారు. దీంతో అప్పటి వరకూ ఖాళీగానే దర్శనమిచ్చిన జనసాధారణ రైలు బయల్దేరే వేళకు అసాధార ణంగా నిండిపోయింది. దీంతో ఈ రైలుకు రానున్న రోజుల్లో భారీ డిమాండ్ ఉండొచ్చన్న అంచనాతో రైల్వే వర్గాలున్నాయి. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ప్యాసింజరు రైలే గానీ ఎక్స్‌ప్రెస్ రైలులా కొద్ది స్టేషన్లలోనే ఆగుతుంది. కాకినాడ నుంచి తిరుపతికి ప్యాసింజర్ రైలున్నా విశాఖ నుంచి మాత్రం ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నం చేయలేదు. తిరుపతి వెళ్లేందుకు తిరుమల ఎక్స్‌ప్రెస్(17488) ఎప్పుడూ రద్దీగా ఉంటుండడంతో పాటు ప్రత్యేక రైళ్లు నడిపినా ప్రయాణికులకు బెర్తులు లభ్యం కావడం లేదు. అందుకే ఈ రైలును ప్రత్యేకంగా నడుపుతున్నారు. దీని డిమాండ్‌ను బట్టి రానున్న రోజుల్లో రెగ్యులర్ చేసే అవకాశాన్ని రైల్వే వర్గాలు పరిశీలిస్తున్నాయి. వారంలో మూడు రోజులు విశాఖ-రేణిగుంట(08507) వీక్లీ జనసాధారణ ప్రత్యేక రైలు ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చేరుతుంది. రేణిగుంట-విశాఖ(08508) వీక్లీ జనసాధారణ ప్రత్యేక రైలు ప్రతి సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి ఆ మరుసటి ఉదయం 5.15 గంటలకు విశాఖకు చేరుతుంది. -
ఉన్నత రైల్వేగా తూర్పుకోస్తాకు గుర్తింపు
విశాఖపట్నం: భారతీయ రైల్వేలో తూర్పు కోస్తా(ఈస్టుకోస్టు)కు ఉన్నత స్థానం లభించింది. గత ఏడాదిలో ఈస్టుకోస్టు రైల్వే ఆపరేటింగ్ నిష్పత్తి 48.45గా పెరుగుదల వుండడంతో ఈ గుర్తింపు సొంతమైంది. విశ్వవ్యాప్త రైల్వేల చరిత్రలో వ్యాపార సరళి తక్కువగా నమోదవుతున్న తరుణంలో లోడింగ్, ప్రయాణికుల ఆదాయాల్లో ఈస్టుకోస్టు రైల్వే ఉత్తమ ఫలితాలను సాధించింది. ఇదే ధోరణి కొనసాగిస్తే భారతీయ రైల్వేల్లో అత్యధిక లోడింగ్ రైల్వేగా ఈస్టుకోస్టు ఘనత సాధిస్తుందని ఆ దిశగా ఉద్యోగులంతా పని చేయాలని జనరల్ మేనేజర్ రాజీవ్ విష్ణోయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వాల్తేరు ఉద్యోగులందరికీ జీఎం తమ సందేశాన్ని పంపించారు. -
వాల్తేరు జోన్ వస్తుందా?
విశాఖపట్నం: కొన్నాళ్లు ఆగ్నేయ రైల్వేలో. అది కూడా కలకత్తా హెడ్‌క్వార్టర్‌గా!! ఆ తరవాతేమో తూర్పు తీర రైల్వేలో. భువనేశ్వర్ ప్రధాన కార్యాలయంగా!!. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను జోనల్ ప్రధాన కార్యాలయంగా చేయాలని... లేనిపక్షంలో తెలుగు ప్రాంతాలన్నీ కలసి ఉండే దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలని అప్పట్లో ఎన్నెన్నో ఉద్యమాలు. మరెన్నో డిమాండ్లు. ఆఖరికి పార్టీలకతీతంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధులంతా ఒకే వేదికపైకి వచ్చి మరీ నినదించినా ఫలితం లేదు. ఇపుడు రాష్ట్ర విభజన జరిగి సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రైల్వే జోన్ ఏర్పడుతున్న తరుణంలోనూ వివక్షే. కొత్తగా ఏర్పడుతున్న జోన్‌ను ప్రధాన కార్యాలయంగా చేయడానికి విశాఖ డివిజన్‌కు అన్ని అర్హతలు ఉన్నా దాన్ని పక్కనపెడుతున్నారనేదే స్థానికుల ఆవేదన. ఈ మేరకు రైల్వే శాఖ, ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సంకేతాలను ప్రస్తావిస్తూ... ఆదాయం, మౌలిక సదుపాయాల పరంగా అగ్రస్థానంలో ఉన్న విశాఖనే జోనల్ కేంద్రంగా చేయాలని వారు చెబుతున్నారు. ఆ వివరాల సమాహారమే ఈ కథనం. విశాఖ డివిజన్‌ను జోనల్ ప్రధాన కార్యాలయంగా చేయాలంటూ దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం... రాష్ట్ర విభజన నేపథ్యంలో జోన్ కోసం వాల్తేర్ జోనల్ సాధన కమిటీ పేరిట మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అన్ని పార్టీలూ మద్దతునిచ్చాయి. ఇలా పోరాడిన బీజేపీ, టీడీపీలే ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. అలాంటిది ఈ తరుణంలోనైనా జోన్ కల సాకారం కానట్లయితే భవిష్యత్తులో ఏ పార్టీ నేతలనూ విశాఖ ప్రజలు నమ్మటం కష్టమే. తమను గెలిపిస్తే విశాఖను జోనల్ కేంద్రంగా చేసి పువ్వుల్లో పెట్టి అప్పగిస్తామన్న ప్రజాప్రతినిధులు ఇకనైనా చొరవ చూపాలన్నది వారి మాట. రైల్వే జోన్ ఒక్కటే కాదు..దువ్వాడ మీదుగా తరలిపోతున్న రైళ్లను విశాఖకు రప్పించటం కూడా కలగానే మిగులుతోంది. ఎప్పుడూ అన్యాయమేనా...! ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ది సుదీర్ఘ చరిత్ర. బ్రిటిష్ కాలంలో బీఎన్నార్ రైల్వేస్, ఆ తర్వాత సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్‌లో వాల్తేరు దారుణంగా నష్టపోయింది. ఉద్యోగాల్లోనూ, ఉపాధిలోనూ, ఒడిశా, బెంగాల్ వారిదే హవా. ఇప్పటికీ కాంట్రాక్టులన్నీ వారివే. ఆఖరికి ఆర్ఆర్బీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించాలనుకునే తెలుగు వారిని భువనేశ్వర్‌లో హాల్‌టికెట్లను చించేసి తరిమిన సందర్భాలూ కోకొల్లలు. ఇప్పటికీ అదే పరిస్థితి. పైగా కొత్త రైళ్లు, అదనపు బోగీలు, ప్రత్యేక రైళ్లన్నీ ఒడిశా పట్టాలెక్కుతున్నాయి. ఒడిశా ప్రజాప్రతినిధులు, జోనల్ రైల్వే అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇక్కడి ఆదాయాన్నంతటినీ ఒడిశాకు మళ్లించి అక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఎన్నో ఆరోపణలున్నాయి. దూరమే భారమా...! వాల్తేరుకు ఆదాయంతో బాటు మానవ వనరులూ పుష్కలం. 198 ఇంజిన్ల మరమ్మతులు చేసే డీజిల్ లోకోషెడ్, 170 ఎలక్ట్రిక్ లోకో మోటివ్లను సరి చేసే ఎలక్ట్రికల్ లోకోషెడ్ సహా వందల ఎకరాల ఖాళీ స్థలం, రైల్వే ఉద్యోగులకు అనువైన నగర స్థలాలు, 150 పడకల రైల్వే ఆస్పత్రి, కోచింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు కన్నా ఇక్కడ అధునాతన సదుపాయాలున్నాయి. ఎన్ని ఉన్నా లాబీయింగ్ లేకపోవటమే శాపంగా మారుతోందన్నది స్థానిక నేతల మాట. ఇతర డివిజన్ల రూట్ ట్రాక్ వివరాలు -వాల్తేరు-1105 -విజయవాడ-958 -గుంటూరు-627 -గుంతకల్-1354 లాబీయింగ్ లేకనే..! రాజకీయ లాబీయింగ్ లేకపోవటం వల్లే వాల్తేరు రైల్వే అన్యాయానికి గురవుతోంది. ఢిల్లీలో చక్రం తిప్పే వారు ఉత్తరాంధ్రలో కరువయ్యారు. రైల్వే జోన్ విషయమై ప్రజాప్రతినిధులు నోరు విప్పకపోవడం వల్లనే ఈ సమస్యలు. -డి. వరదా రెడ్డి-అధ్యక్షుడు ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ జోన్ ఇవ్వాల్సిందే..! వాల్తేరు కేంద్రంగా రైల్వే జోన్ కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. రాష్ట్ర విభజన తర్వాత కూడా వాల్తేరును ఈస్టుకోస్టు రైల్వేలోనే ఉంచుతారని అంటున్నారు. గతంలోనే రైల్వే సౌకర్యాల విషయంలో నష్టపోయాం. మళ్లీ నష్టపోలేం. అందుకే జోన్ కావాలి. -ఎం. నాగేంద్ర, బీజేపీ నగర పూర్వ అధ్యక్షుడు -
పలు రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే
భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం డివిజన్లో పలు రైళ్లు రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం వెల్లడించింది. విశాఖ, భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లీస్తున్నట్లు పేర్కొంది. రైలు నెంబర్12863: హౌరా -యశ్వంత్‌పూర్, రైలు నెంబర్18463: భువనేశ్వర్ - బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, రైలు నెంబర్18047: హౌరా-వాస్కో అమరావతి ఎక్స్‌ప్రెస్, రైలు నెంబర్18401: పూరీ-వోకా ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. విజయనగరం, రాయ్‌పూర్, నాగ్‌పూర్ మీదుగా మళ్లీస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే పేర్కొంది. -
గుండెల్లో రైళ్లు
=గుండెల్లో రైళ్లు =భారీ వర్షాలతో అధికారుల్లో భయంభయం =శనివారం మూడు రైళ్లు రద్దు, ఏడు దారిమళ్లింపు =రూ.5కోట్లకుపైగా నష్టం సాక్షి, విశాఖపట్నం: తూర్పుకోస్తా రైల్వేకు వరుస వర్షాలతో దడపట్టుకుంది. పలాస-ఖుర్దా మార్గంలో పట్టాలపై నీళ్లు ప్రవహిస్తుండడంతో ఏంచేయాలో పాలుపోక కంగారుపడుతోంది. విశాఖ నుంచి ఒడిషా, కోల్‌కతా మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లలో అసలు ఏవి రద్దుచేయాలి? వేటిని నడపాలనేదానిపై స్పష్టత లేక తలబాదుకుంటోంది. శుక్రవారం మొత్తం 11 రైళ్లు రద్దుచేసిన అధికారులు శనివారం తాత్కాలికంగా మరో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దుచేశారు. పరిస్థితినిబట్టీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విశాఖ నుంచి సికింద్రాబాద్, చైన్నై ఇతర మార్గాల్లో వెళ్లే రైళ్లను కూడా రద్దుచేశారు. పూరి-తిరుపతి మధ్య పలురైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోపక్క శనివారం వాతావరణ పరిస్థితులు అనుకూలించినా, లేకపోయినా పట్టాలపై నీటిఉధృతి తగ్గని నేపథ్యంలో మరికొన్ని రైళ్లు రద్దుచేయాలని అధికారులు భావిస్తున్నారు. మరో మూడురోజుల వరకు విశాఖ నుంచి ఒడిషా-కోల్‌కతా వైపు, విశాఖ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వైపు వెళ్లే బళ్లలో కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లించే యోచన చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి అర్థరాత్రి సమయం వరకు రద్దైన రైళ్లు ఇవే.. 17479 పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, 58526 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ ,184 96 భువనేశ్వర్-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్,22883 పూరీ-యశ్వంత్‌పూర్ వీక్లీ గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్,22817 హౌరా-మైసూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, 02728 సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ,18447,18437 భువనేశ్వర్-జగదల్పూర్/భవానీపట్న ఎక్స్‌ప్రెస్, 18448,18438 జగదల్పూర్/భవానీపట్న-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, 11020 భువనేశ్వర్-ముంబాయి సీఎస్టీ కోణార్క్ ఎక్స్‌ప్రెస్,12839 హౌరా-చెన్నై సెంట్రల్మెయిల్,58301 సంబల్పూర్-కోరాపుట్ ప్యాసింజర్, 58302 కోరాపుట్-సంబల్పూర్ ప్యాసింజర్. ఇవికాకుండా 18402 ఓఖా-పూరీ ఎక్స్‌ప్రెస్ ఖల్లికోట్కు 17016 సికిందరాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ పలాసకు శుక్రవారం వరకు కుదించారు.17015 విశాఖ ఎక్స్‌ప్రెస్ పలాస నుంచి సికిందరాబాద్ వెళుతుంది. రైళ్ల రీషెడ్యూల్ 12842 చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నైలో శుక్రవారం రాత్రి 10.20కి బయలుదేరగా, 13 గంటల 35నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది.12703 హౌరా-సికిందరాబాద్ ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ హౌరాలో శుక్రవారం ఉదయం 7.25 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. 17016 సికిందరాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బదులుగా రాత్రి 9 గంటలకు, 22850 సికిందరాబాద్-షాలిమర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు బదులు సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరింది. ఈ రైళ్లన్నీ బల్హర్షా,నాగ్‌పూర్,జార్సుగుడ,కాగజ్పూర్ల మీదుగా పంపారు. 15902 దిబ్రుఘర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు బదులు శనివారం ఉదయం 7.30 గంటలకు బయలు దేరనుంది. ఇవికాకుండా 22881 పూనే-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ , 22603 ఖరగ్‌పూర్-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ ,12704 సికింద్రాబాద్ -హౌరా ఫలక్నామా -హౌరా ఎక్స్‌ప్రెస్, 12509 బెంగుళూర్-గువహతి ఎక్స్‌ప్రెస్,12863 హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ని జార్సుగుడ, ,12508 గువహతి-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ,16310 పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లను పలుమార్గాలద్వారా మళ్లించారు. -
పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే
-
పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే
పై-లీన్ తుపాన్ ప్రభావంతో ఒడిశాలోని భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. చెన్నై - హౌరా ఎక్స్‌ప్రెస్, చెన్నై - హౌరా మెయిల్ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ముజఫర్‌నగర్- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 7 గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపింది. అలాగే హౌరా - కన్యాకుమారీ 15 గంటలు, తిరుపతి - భువనేశ్వర్, షాలిమార్ - యశ్వంత్ పూర్, పురులియా - విల్లుపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లు 8 గంటలు, యశ్వంత్ పూర్ - హౌరా 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ పేర్కొంది. సంత్రగచ్చి- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైల్‌ను ఖరగ్‌పూర్ మీదగా మళ్లిస్తున్నట్లు తెలిపింది.