హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు
ఈ నెల 9,16, 23,
30వ తేదీలలో విశాఖ-
హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైలు
హైదరాబాద్ నుంచి తిరిగి విశాఖకు..
విశాఖపట్నం సిటీ: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని తూర్పుకోస్తా రైల్వే విశాఖ-హైదరాబాద్ మధ్య ఒక రైలును నడపనుంది. ఈ నెల 9,16,23,30వ తేదీలలో ఈ రైలు విశాఖ నుంచి రాజధానికి బయలుదేరుతుంది. ఇందులో ఎనిమిది జనరల్ బోగీలుంటాయి. ఒక సెకండ్‌ఏసీ, ఒక థర్డ్ ఏసీ, అయిదు రిజర్వేషన్ బోగీలుంటాయి. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, వరంగల్, కాజీపేట వంటి స్టేషన్‌లలో రైలు ఆగుతుంది. ఆయా తేదీల్లో విశాఖలో
హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు
రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 10, 17, 24,31వ తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మర్నాడు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుందని వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.