Wallpapers
-
అతికించిన అందం! ఇంటి గోడలకు త్రీడీ వాల్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంచరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇల్లు అయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది. త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటుంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1/1 సైజ్ నుంచి 20/20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి ఉంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
సొగసు చూడతరమా.. లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అందాన్ని పొగడతరమా
-
Janhvi Kapoor: బంగారు మేనిలో జాన్వీ.. ఫొటోలు
-
వాట్సాప్ లో సరికొత్త ఫీచర్
ప్రపంచ వ్యాప్తంగా 2బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే వాట్సప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఇతరులతో చాట్ చేసేటప్పుడు ప్రతి ఛాట్ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. దీనికోసం కొత్తగా వాల్‌పేపర్ గ్యాలరీ అప్డేట్ చేశారు. అలాగే వినియోగదారులు స్టిక్కర్లను టెక్స్ట్ లేదా ఎమోజీలతో సహాయంతో శోధించడానికి ఒక ఫీచర్ ని కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క “టుగెదర్ ఎట్ హోమ్” స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు యానిమేటెడ్ స్టిక్కర్లుగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.(చదవండి: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే) కస్టమ్ వాల్‌పేపర్ ఫీచర్లో భాగంగా కొత్తగా 32 బ్రైట్ వాల్‌పేపర్స్, 30 డార్క్ వాల్‌పేపర్స్ ఇస్తున్నట్లు వాట్సాప్ తన బ్లాగ్ లో తెలిపింది. మీ ఫోన్ లో లైట్ మరియు డార్క్ మోడ్ సెట్టింగుల కోసం ప్రత్యేక వాల్పేపర్లను కూడా ఎంచుకోవచ్చు. మీ ఫోన్ లో డార్క్ మోడ్ మారినప్పుడు మీ చాట్ యొక్క వాల్‌పేపర్ దానంతట అదే మారనుంది అని పేర్కొంది. వాట్సాప్ డిఫాల్ట్ డూడుల్ వాల్‌పేపర్‌ను మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. మీకు నచ్చిన వాల్‌పేపర్ ఎంచుకొని దానికి తగినట్లుగా బ్రైట్ నెస్, ఓపెసిటీలో మార్పులు చేసుకోవచ్చు. ఒక వేళ మీకు ఇది నచ్చకపొతే పాత వాల్‌పేపర్ ఎంచుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది అని ఫేసుబుక్ తెలిపింది. త్వరలో దీనిని అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. -
చిన్న మార్పులతో ఇంటి అందం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: ఉన్నంతలో ఇంటిని అందంగా పెట్టుకోవటం కళే. ఇందుకోసం ప్రత్యేకంగా షాపింగ్‌లేమీ చేయాల్సిన అవసరం లేదు. కాస్తంత కళాత్మక దృష్టి ఉంటే చాలు. గోడలకు మంచి వాల్‌పేపర్స్ అతికించడం, పాత ఫర్నిచర్‌కు మెరుగులు దిద్దటం, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్, డ్రాయింగ్ రూములను చిన్న చిన్న మార్పులతో పొందికగా మలుచుకోవటం లాంటివి చేస్తే చాలు. ఇల్లు ముచ్చటగా.. పొదరిల్లులా మారుతుంది. దానికి కొన్ని చిన్నచిన్న టిప్స్ ఇవి... ♦ డైనింగ్ రూమ్‌లో పెద్ద టేబుల్ పెట్టి దానిని చైనీస్ పోర్సిలిన్ తరహా వస్తువులతో అలంకరిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఆ వస్తువులు గది రంగుకి మ్యాచ్ అవ్వాలనేమీ లేదు. ♦ వంటింటికి అందమైన లెనిన్ కర్టెన్ అమర్చాలి. ఇలా చేస్తే కిచెన్ లుక్ బాగుండటమే కాదు లోపల మనం ఏం చేస్తున్నది ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. వంటింటికి స్టీల్ అండ్ గ్లాస్ కేస్మెంట్స్ ఫ్రేమ్స్‌ని పెడితే చూడ్డానికి మరింత అందంగా ఉంటుంది. ఆరు బయట ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పని చేసుకోవచ్చు. ♦ బెడ్రూమ్లో మంచంపై మిక్స్ అండ్ మ్యాచ్ దుప్పట్లు, దిండు గలేబులు వేస్తే ఆ రూముకి కొత్త అందం వస్తుంది. బెడ్రూమ్లో యాంటిక్ కేజ్లైట్స్ పెట్టుకుంటే మరింత బాగుంటుంది. ♦ బాత్రూమ్లో పెడస్టల్ టబ్, ఫిక్సర్లు అమర్చుకుంటే బాగుంటుంది. ఇల్లు కట్టిన కాలా న్ని గుర్తు చేసేలా ఆ ఇంట్లోని వస్తువుల అమరిక ఉంటే గదులకు యాంటిక్ లుక్ వస్తుంది. ♦ ఇంట్లో ఉన్న పాత సోఫా, ఇతర ఫర్నిచర్లకు పెయింట్ వేస్తే న్యూలుక్‌తో అవి మెరిసిపోతాయి. హాలులో ఉన్న పెద్ద గోడలకు వెరైటీగా రంగు రంగుల ప్లేట్లను అతికిస్తే చూడ్డానికి ఆర్ట్పీస్లా ఎంతో బాగుంటుంది. ♦ గెస్ట్ రూమ్‌లో వినైల్ షేడ్స్‌తో వాల్ పేపర్లను అతికిస్తే ఆ గది అందం ద్విగుణీకృతం అవుతుంది. ♦ హాలు మధ్యలో ఉండే సన్నని దారులపై చిక్కటి రంగు, డిజైన్లు ఉంటే కార్పెట్లు పరిస్తే చూడ్డానికి గ్రాండ్‌గా, డెకొరేటివ్గా ఉంటుంది. -
సొంతిల్లు మెరవాలంటే..
సాక్షి, హైదరాబాద్ : పండగొస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేస్తుంటాం. అలా అని ప్రతి పండక్కి ఇంటికి రంగులు వేయించలేం. ఉన్నంతలో ఇంటిని మెరిపించాలంటే కాసింత కళాత్మకత ఉంటే చాలు. ఇందుకోసం ప్రత్యేకంగా షాపింగ్‌లేమీ అవసరం లేదు. గోడలకు మంచి వాల్‌పేపర్స్ అతికించడం, పాత ఫర్నిచర్‌కు మెరుగులు దిద్దటం, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్, డ్రాయింగ్ రూములను చిన్న చిన్న మార్పులతో పొందికగా మలుచుకోవటం లాంటివి చేస్తే చాలు. ఇల్లు ముచ్చటగా.. పొదరిల్లులా మారుతుంది. ⇔ డ్రైనింగ్ రూమ్‌లో పెద్ద టేబుల్ పెట్టి దానిని చైనీస్ పోర్సిలిన్ తరహా వస్తువులతో అలంకరిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఆ వస్తువులు గది రంగుకి మ్యాచ్అవ్వాలనేమీ లేదు. ⇔ వంటింటికి అందమైన లెనిన్ కర్టెన్ అమర్చాలి. ఇలా చేస్తే కిచెన్ లుక్ బాగుండటమే కాదు లోపల మనం ఏం చేస్తున్నది ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. వంటింటికి స్టీల్ అండ్ గ్లాస్ కేస్మెంట్స్ ఫ్రేమ్స్‌ని పెడితే చూడ్డానికి మరింత అందంగా ఉంటుంది. ఆరు బయట ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పని చేసుకోవచ్చు. ⇔ బెడ్రూమ్లో మంచంపై మిక్స్ అండ్ మ్యాచ్ దుప్పట్లు, దిండు గలేబులు వేస్తే ఆ రూముకి కొత్త అందం వస్తుంది. బెడ్రూమ్లో యాంటిక్ కేజ్లైట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ⇔ బాత్రూమ్లో పెడస్టల్ టబ్, ఫిక్సర్లు అమర్చుకుంటే బాగుంటుంది. ఇల్లు కట్టిన కాలాన్ని గుర్తు చేసేలా ఆ ఇంట్లోని వస్తువుల అమరిక ఉంటే గదులకు యాంటిక్ లుక్ వస్తుంది. ⇔ ఇంట్లో ఉన్న పాత సోఫా, ఇతర ఫర్నిచర్లకు పెయింట్ వేస్తే న్యూలుక్‌తో అవి మెరిసిపోతాయి. హాలులో ఉన్న పెద్ద గోడలకు వెరైటీగా రంగు రంగుల ప్లేట్లను అతికిస్తే చూడ్డానికి ఆర్ట్పీస్లా ఎంతో బాగుంటుంది. ⇔ గెస్ట్ రూమ్‌లో వినైల్ షేడ్స్‌తో వాల్ పేపర్లను అతికిస్తే ఆ గది అందం ద్విగుణీకృతం అవుతుంది. ⇔ హాలు మధ్యలో ఉండే సన్నని దారులపై చిక్కటి రంగు, డిజైన్లు ఉంటే కార్పెట్లు పరిస్తే చూడ్డానికి గ్రాండ్‌గా, డెకొరేటివ్గా ఉంటుంది. ⇔ ఇంట్లో ఉన్న వాలు కుర్చీలపై పాత కర్టెన్లు పరిస్తే వెరైటీగా ఉంటుంది. వాటిపైనున్న పాతకాలం నాటి డిజైన్లు కుర్చీలకు కొత్త అందాన్ని ఇస్తాయి. -
బియ్యం మిఠాయిలు
కొత్త ధాన్యం ఇంటికి వచ్చింది... కొత్త సంతోషాల పంట పండుగ చేసింది. ఉగాదికైతే ఆరు రుచులు కావాలి కానీ, సంక్రాంతి మాత్రం తియ్యగానే ఉండాలి. ఆరుబయటి నుంచి ఇంట్లో దాకా... అంతా తియ్యతియ్యగానే ఉండాలి. అందుకే... ఈ బియ్యం మిఠాయిలతో తియ్యటి పండుగ జరుపుకోండి. పరమాన్నం కావల్సినవి: కొత్త బియ్యం – ముప్పావు కప్పు, బెల్లం – 250 గ్రాములు, యాలకులు – 4 (పొడి చేయాలి), పాలు – 5 కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, జీడిపప్పు , కిస్మిస్ – తగినన్ని, నెయ్యి – 3 టేబుల్‌స్పూన్లు తయారీ: ∙బియ్యం కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో బెల్లం వేసి, నీళ్లు పోసి సన్నని మంట మీద కరిగించాలి. దీన్ని వడకట్టి, చెత్త తీసేయాలి. ఈ బెల్లం పానకాన్ని చల్లారనివ్వాలి. ∙ పాలు మరిగించి పక్కనుంచాలి. ∙బియ్యంలో నీళ్లు పోసి ఉడకించాలి. ∙చిన్న పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. ∙బియ్యం మెత్తగా ఉడికాక చల్లారిన బెల్లం పాకాన్ని పోసి కలపాలి. దీంట్లో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్ వేసి కలిపి, మంట తీసేయాలి. బూరెలు కావల్సినవి: కొత్తబియ్యం – పావు కేజీ, బెల్లం – పావు కేజీ, పచ్చికొబ్బరి తురుము – కప్పు, నూనె – వేయించడానికి తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్లు తయారీ: ∙బియ్యం కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. బియ్యంలో నీళ్లు వంపేసి కాటన్ క్లాత్‌లో వేసి పది నిమిషాలు మూటకట్టాలి. ఈ బియ్యాన్ని రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి మెత్తటి పిండి చేసుకోవాలి. బెల్లాన్ని తురిమి ఒక గిన్నెలో వేసి దాంట్లో పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. దీంతో బెల్లం కరుగుతుంది. ఇలా కరిగిన బెల్లంలో కొబ్బరి తురుము వేసి కలపాలి. కొంచెం జిగురుగా అయ్యేంతవరకు ఉంచి, నెయ్యి వేసి కలపాలి. తర్వాత దీంట్లో బియ్యప్పిండి వేస్తూ అదేపనిగా కలుపుతూ ఉండాలి. దీంట్లో 2 టీ స్పూన్ల నూనె వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న బియ్యప్పిండి చల్లారిందా లేదా చూసుకొని నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్ కవర్ మీద పెట్టి, వెడల్పుగా వత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వడ్డించాలి. తీపి పునుగులు కావల్సినవి: కొత్తబియ్యప్పిండి – కప్పు, ఓట్స్ పొడి – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – కప్పు, యాలకుల పొడి – టీ స్పూన్, పంచదార – కప్పు, మైదా – కప్పు, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి సరిపడా తయారీ: ∙ఒక గిన్నెలో నూనె, పాలు మినహా మిగిలిన పదార్థాలన్నీ తీసుకొని బాగా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ పునుగుల పిండిలా కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. తరువాత పిండిని కాగుతున్న నూనెలో ఉండల్లా వేసుకొని ఎర్రగా వేగాక తీయాలి. తీపి పొంగలి కావల్సినవి: కొత్త బియ్యం – కప్పు, పెసరపప్పు – అర కప్పు, బెల్లం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – 4 1/2 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పులు – 12, కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙పొయ్యి మీద బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కనుంచాలి. ∙అదే పాన్‌లో పెసరపప్పు కూడా కొద్దిగా వేయించి పక్కనుంచాలి. ∙వేడి బాణలిలో బెల్లం తురుము వేసి, కరిగేంతవరకు ఉంచి, చల్లారనివ్వాలి. ∙మరొక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, మంట తగ్గించాలి. ∙బియ్యం, పెసరపప్పు కడిగి నీళ్లు వంపి మరుగుతున్న నీటిలో నెమ్మదిగా పోయాలి. బియ్యం–పప్పు మెత్తగా ఉడికించి మంట తగ్గించాలి. దీంట్లో కిగించిన బెల్లం వేసి కలపాలి. మిశ్రమం ఉడికేంతవరకు ఉంచి యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి మరో 2–3 నిమిషాలు ఉంచి మంట తీసేయాలి. ఈ తీపి పొంగలిని వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయవచ్చు. నోట్: జీడిపప్పు, కిస్మిస్లు మంచి టేస్ట్ రావాలంటే చిటికెడు ఉప్పు వేసి వేయించాలి. బెల్లం గారెలు కావల్సినవి: కొత్తబియ్యం – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత, బెల్లం – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు తయారీ: ∙బియ్యం రెండుగంటల సేపు నానబెట్టాలి. నీళ్లు వడగట్టాలి. పిండి మెత్తగా వడలకు తగిన విధంగా రుబ్బుకోవాలి. ∙వేడినీళ్లలో బెల్లం వేసి కరిగించి, పాకం పట్టాలి. ∙బాణలిలో నూనె పోసి, కాగనివ్వాలి. చేతులు తడిలేకుండా చూసుకొని చేతిమీద గానీ, అరటి ఆకు మీదగానీ నిమ్మకాయ పరిమాణంలో పిండి తీసుకొని అదిమి మధ్యకు పెద్ద రంధ్రం చేయాలి. ∙ఇలా చే సిన దాన్ని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వదలాలి. సన్నని మంట మీద రెండువైపులా వేయించాలి. ∙గారె బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాక తీసి బెల్లం పాకంలో వేయాలి. మరో గారె సిద్ధమైంతవరకు బెల్లం పాకంలో గారెను ఉంచి, తర్వాత తీసి ప్లేట్లో పెట్టాలి. వేడి వేడిగా సర్వ్ చేస్తే కరకరలాడుతూ బెల్లం గారెలు రుచిగా ఉంటాయి. వీటిని పెసరపప్పు, మినప్పప్పుతోనూ చేసుకోవచ్చు. -
బెల్లం మార్కెట్‌కు సంక్రాంతి కళ
ఈ సీజన్లో అధిక లావాదేవీలు లోటును పూడ్చుకునే యత్నం అనకాపల్లి: బెల్లం మార్కెట్లో సోమవారం సంక్రాంతి పండుగ సందడి కనిపించింది. ఈ సీజన్‌కు రికార్డు స్థాయిలో బెల్లం దిమ్మలు వచ్చాయి. మార్కెట్లో 38 వేల 222 దిమ్మల లావాదేవీలు జరిగాయి. సంక్రాం తి ముందు బెల్లం తయారీ ఊపందుకుంటుంది. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఆర్థిక అవసరాల కోసం బెల్లం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వినియోగిస్తారు. వాస్తవానికి జనవరి నెలలో గతంలో 50 వేల నుంచి 80 వేల దిమ్మల వరకు వచ్చిన సందర్భాలు వున్నాయి. అయితే ఈ సీజ బెల్లం వ్యాపారానికి ఎదురవుతున్న ప్రతిబంధకాల ప్రభావం తయారీపై కూడా పడింది. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థికపరమైన లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవడంతో కొద్దిరోజులపాటు మార్కెట్లో లావాదేవీలు సైతం నిలిపివేశారు. చెరకు రైతుల భవితవ్యాన్ని దష్టిలో పెట్టుకొని వర్తకులు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా వ్యాపారాలు ప్రారంభించారు. అయితే ఏరోజుకారోజు బెల్లం అమ్మకాలు జరపగా వచ్చిన సొమ్మును పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయారు. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా అప్పటికీ అంతంతమాత్రంగా జరుగుతున్న బెల్లం వ్యాపారంపై ఫుడ్ కంట్రోల్ అధికారులు మరింత ప్రభావాన్ని చూపారు. తెల్లబెల్లం తయారీలో హైడ్రాస్ వాడుతున్నట్లు వచ్చిన ప్రచారంపై ఫుడ్‌కంట్రోల్ అధికారులు అనకాపల్లి బెల్లం మార్కెట్లో గత నెలలో దాడులు జరిపారు. ఈ కారణంగా కూడా రైతులు బెల్లం తయారీకి కాస్త వెనుకంజ వేశారు. అయితే ఆ రెండు రకాల చేదు అనుభవాల నుంచి బయటపడిన బెల్లం రైతులు ఇపుడు బెల్లం వంటకాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమతోపాటు తదుపరి కొద్ది రోజులు బెల్లం వంటకాలను రైతులు నిలిపివేస్తారు. భోగికి ముందు వండిన బెల్లాన్ని విక్రయించడం ద్వారా పండుగకు అవసరమైన సొమ్మును పొందేందుకు రైతులు బెల్లం తయారీ జోరు పెంచారు. ఈ క్రమంలోనే 2016–17 సీజన్‌కు సంబంధించి సోమవారం బెల్లం లావాదేవీలు రికార్డుగా నిలిచాయి. ఇదే నెల రెండో తేదీన మార్కెట్‌కు 30,915 దిమ్మలు వచ్చాయి. అయితే ధరలు మాత్రం రైతులను తీవ్రంగా నిరాశపరిచాయి. మొదటి రకం క్వింటాల్‌కు గరిష్టంగా 3,740 రూపాయలు పలకగా మూడో రకం కనిష్టంగా 2,300 రూపాయలు పలికింది. గత వారంతో పోల్చితే క్విం టాల్‌కు మొదటి రకం 110 రూపాయలు తగ్గగా మూడో రకం 100 రూపాయలు తగ్గింది. నిరాశతో రైతులు వున్నప్పటికీ బెల్లం అమ్మకాలపై మాత్రం పూర్తిస్థాయిలోనే ఉత్సాహం చూపించారు. -
గోదావరి బరి.. పాతబస్తీ కోడి
సంక్రాంతి సమరానికి సన్నద్ధం పుంజు ధర రూ.1.5 లక్షలు! చాంద్రాయణగుట్ట: సంక్రాంతి సమరానికి పాతబస్తీ కోడిపుంజులు కాలు దువ్వుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నాయి. పండుగ వేళ పందెంలో మజా పొందాలంటే పాత బస్తీ పుంజులు ఉండాలని పందెం రాయుళ్లు కోరుకుంటారు. కుస్తీ పోటీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఇక్కడి పహిల్వాన్లు.. కోడిపుంజులను సైతం ఎంతో శ్రద్ధగా పెంచుతారు. వాటికి శిక్షణ సైతం ఇస్తారు. అందుకే ఇక్కడి పుంజులంటే అంతే మో జు. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహించడం తెలిసిన విషయమే. ఈ రెండు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా పందేలు జరుగుతుంటాయి. కోట్ల రూపాయలు చేతులు మారే పోటీల్లో పందెంరాయుళ్ల పంట పండించే కోడిపుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. అందుకే పాతబస్తీ కోడి పుంజుకు లక్షల రూపాయలు వెచ్చించేందుకు వెనుకాడరు. కాస్ట్లీ ఫుడ్డు.. మసాజ్.. పహిల్వాన్లు పెంచే కోడి పుంజులకు విటమిన్స్‌తో కూడిన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, ఆక్రోట్స్, కీమా, ఉడికించిన గుడ్ల తెల్లసొన ఆహారంలో భాగం. తిండి పెట్టి సరిపెట్టరు.. ప్రతి కోడికి నిత్యం ప్రత్యేకంగా పందెం శిక్షణ ఇస్తూ కదనరంగంలో దూకేలా తర్ఫీదునిస్తారు. అందుకోసం ప్రత్యేక కోచ్‌లను సైతం నియమిస్తారు. వారు పుంజులకు మసాజ్ చేయడం, పరిగెత్తడం, ఈత వంటి వాటిలో శిక్షణనిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంత మంది ఫహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీరు పరిమిత సంఖ్యలో కోళ్లకు మాత్రమే ఈ శిక్షణనిస్తారు. అందుకే ఇక్కడి పుంజులకు ఎంత రేటైనా పెట్టేందుకు సిద్ధమవుతారు. నచ్చిందంటే లక్షలు పెట్టాల్సిందే.. కోస్తాంధ్ర, రాయలసీమలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లో వాలిపోతుంటారు. ఇక్కడి పహిల్వాన్ల వద్ద నుంచి పుంజు తీసుకెళితే పందెంలో విజయం తథ్యమని చాలామంది నమ్మకం. జాతి, రంగును బట్టి ఒక్కో కోడిపుంజు ధర రూ.50 వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని వీరు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో కోడిపుంజులను విక్రయిస్తుంటారు. ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు ఏర్పాటుచేసి పెంచుతారు. రెండేళ్ల వయసున్న పుంజులనే పందానికి వినియోగిస్తారు -
ఇల్లు అందంగా కనిపించాలంటే!
సాక్షి, హైదరాబాద్: ఉన్నంతలో ఇంటిని అందంగా పెట్టుకోవటం కళే. గోడలకు మంచి వాల్ పేపర్స్ అతికించడం, పాత ఫర్నిచర్‌కు మెరుగులు దిద్దటం, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్, డ్రాయింగ్ రూములను చిన్న చిన్న మార్పులతో పొందికగా మలుచుకోవటం లాంటివి చేస్తే చాలు. ఇల్లు పొదరిల్లులా మారుతుంది. ⇔ డ్రైనింగ్ రూమ్‌లో పెద్ద టేబుల్ పెట్టి దానిని చైనీస్ పోర్సిలిన్ తరహా వస్తువులతో అలంకరిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఆ వస్తువులు గది రంగుకి మ్యాచ్అవ్వాలనేమీ లేదు. ⇔ వంటింటికి అందమైన లెనిన్ కర్టెన్ అమర్చాలి. ఇలా చేస్తే కిచెన్ లుక్ బాగుండటమే కాదు లోపల మనం ఏం చేస్తున్నది ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. వంటింటికి స్టీల్ అండ్ గ్లాస్ కేస్మెంట్స్ ఫ్రేమ్స్‌ని పెడితే చూడ్డానికి మరింత అందంగా ఉంటుంది. ఆరు బయట ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పని చేసుకోవచ్చు. ⇔ బెడ్రూమ్లో మంచంపై మిక్స్ అండ్ మ్యాచ్ దుప్పట్లు, దిండు గలీబులు వేస్తే ఆ రూముకి కొత్త అందం వస్తుంది. బెడ్రూమ్లో యాంటిక్ కేజ్లైట్స్ పెట్టుకుంటే మరింత బాగుంటుంది. ⇔ బాత్రూమ్లో పెడస్టల్ టబ్, ఫిక్సర్లు అమర్చుకుంటే బాగుంటుంది. ఇల్లు కట్టిన కాలాన్ని గుర్తు చేసేలా ఆ ఇంట్లోని వస్తువుల అమరిక ఉంటే గదులకు యాంటిక్ లుక్ వస్తుంది. ⇔ ఇంట్లో ఉన్న పాత సోఫా, ఇతర ఫర్నిచర్లకు పెయింట్ వేస్తే న్యూలుక్‌తో అవి మెరిసిపోతాయి. హాలులో ఉన్న పెద్ద గోడలకు వెరైటీగా రంగు రంగుల ప్లేట్లను అతికిస్తే చూడ్డానికి ఆర్ట్పీస్లా ఎంతో బాగుంటుంది. ⇔ గెస్ట్ రూమ్‌లో వినైల్ షేడ్స్‌తో వాల్ పేపర్లను అతికిస్తే ఆ గది అందం ద్విగుణీకృతం అవుతుంది. ⇔ హాలు మధ్యలో ఉండే సన్నని దారులపై చిక్కటి రంగు, డిజైన్లు ఉంటే కార్పెట్లు పరిస్తే చూడ్డానికి గ్రాండ్‌గా, డెకొరేటివ్గా ఉంటుంది. ⇔ ఇంట్లో ఉన్న వాలు కుర్చీలపై పాతకాలం నాటి డిజైన్లు కుర్చీలకు కొత్త అందాన్ని ఇస్తాయి. -
సిద్ధమవుతున్న ‘పందెం’ కోళ్లు
తెర వెనుక అధికార పార్టీ నాయకులు మిన్నకుంటున్న పోలీసులు ఉయ్యూరు/కంకిపాడు : కోడి పందేల నిర్వహణపై కోర్టు ఆదేశాలు ఉన్నా సంక్రాంతికి బరులు సిద్ధమవుతున్నాయి. పండుగ సంప్రదాయం పేరుతో కోట్లు దండుకునేందుకు తెలుగు తమ్ముళ్లు రెడీ అవుతున్నారు. ఓ వైపు బరులు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో లాంఛనంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అతిథి గృహంలో ఆదివారం పందేలు ప్రారంభమైనట్లు, పండుగ మూడు రోజులు వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పండుగ సమీపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కంకిపాడు మండలం ఈడుపుగల్లు, ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామాల్లో బరులు భారీ సెట్టింగులతో ముస్తాబవుతున్నాయి. ఈడుపుగల్లులోని పంట పొలాల్లోనూ, గండిగుంటలో రియల్ ఎస్టేట్ వెంచరులో కోడి పందేలు, కోసు ముక్క నిర్వహించేందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. గత ఏడాది మాదిరిగానే అన్ని హంగులతో పందేలు నిర్వహించేందుకు తమ్ముళ్లు తహతహ లాడుతున్నారు. ఈడుపుగల్లు బరికి మండలానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి, గండిగుంట బరికి నామినేటెడ్ పోస్టులో ఉన్న ముఖ్య నేత కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి వెనుక అధికార పక్షానికి చెందిన ముఖ్య నేతలు వాటాలు కలిపి, బరులకు తెరతీసినట్లు వినికిడి. గతేడాది నిర్వహించిన బరుల్లో కాల్‌మనీ కేసుల్లో ఉన్న ప్రధాన సూత్రదారులు పెట్టుబడులు పెట్టినట్లు బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దఫా కూడా అంతే స్థాయిలో పందేల బరులు నిర్వహించి, లక్షల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తుంది. బరుల్లో స్టాళ్లకు డిమాండ్ ఓ వైపు బరులు ఏర్పాటు చేయటమే చట్ట విరుద్థంగా సాగుతున్న చర్య అనుకుంటే బరుల్లో స్టాళ్ల ఏర్పాటుకు కూడా భారీగా డిమాండ్ ఉంది. గండిగుంట కేంద్రంగా నిర్వహించే బరిలో పలావ్ స్టాళ్లు, మద్యం, కూల్ డ్రింక్స్, పార్కింగ్ స్టాళ్లకు బహిరంగ వేలం నిర్వహించి స్టాళ్లు కేటాయించే ఏర్పాట్లు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు రెచ్చిపోయి బహిరంగంగా, గ్రామ ప్రధాన కూడళ్లలో పందేలు నిర్వహిస్తున్నారు. ఆగిపోయిన పేకాట శిబిరాలు కూడా ధైర్యంగా తెరిచి లావాదేవీలు కొనసాగిస్తున్నారని వినికిడి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం సిద్ధమవుతున్న బరులు పైనా, గ్రామాల్లో యధేచ్చగా సాగుతున్న పందేల పైనా కన్నెత్తి చూడటం లేదనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. నామకే వాస్తేగా 8 మంది కత్తులు కట్టే వ్యక్తులను పోలీసులు బైండోవర్ చేశారు. తరలిపోతున్న పందెంపుంజులను తనిఖీల ద్వారా అదుపులోకి తీసుకుని పందేల నిర్వహణను కొంతమేరకైనా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయకపోవటం గమనార్హం. -
ఆర్టీసీ పండుగ బాదుడు
సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునే సన్నాహాల్లో సంస్థ హైదరాబాద్ నుంచి 100 ప్రత్యేక బస్సులు తిరుగు ప్రయాణానికి విశాఖ నుంచి 45 బస్సులు ఇతర ప్రాంతాలకూ అదనపు బస్సులు వీటిన్నింటిలో 50 శాతం అదనపు చార్జీలు విశాఖపట్నం : సందట్లో సడేమియా అన్నట్లు ఆర్టీసీ సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల అవసరాలను గుర్తించి, రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామంటూనే.. పనిలో పనిగా ప్రత్యేక సర్వీసులకు ప్రత్యేక చార్జీల పేరుతో దండుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. పండుగ సీజన్లో సహజంగానే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. దూరతీరాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు రావడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లన్నింటిలో రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. ప్రత్యేక రైళ్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి బస్సులే శరణ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని వందలాది ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సుధేశ్‌కుమార్ తెలిపారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా నడిపే ఈ ప్రత్యేక సర్వీసుల్లో చార్జీలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో వసూలు చేసే చార్జీలపై 50 శాతం ఎక్కువగా ఈ చార్జీలు ఉంటాయని వివరించారు. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో విశాఖ, తదితర ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలివచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-విశాఖ మధ్య సుమారు 100 బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ బస్సులు జనవరి 8 నుంచి 14వ తేదీ వరకు హైదారబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతాయి. అలాగే సంక్రాంతి పండుగ అనంతరం విశాఖ నుంచి హైదారబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం 45 బస్సులు, విజయవాడకు 50, కాకినాడకు 20, రాజమండ్రికి 30 బస్సులు నడుపుతారు. బెంగుళూరు, చెన్నై తదితర రాష్ట్రేతర ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా ఒక్కో బస్సు అదనంగా వేస్తారు. ఈ బస్సులన్నీ జనవరి 16, 17, 18, 19 తేదీల్లో విశాఖ నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్ నుంచే బయలుదేరుతాయి. రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. జనవరి ప్రారంభం నుంచి లభించే ఈ సౌకర్యాన్ని ఠీఠీఠీ.్చఞటట్టఛి ౌజీౌ.జీ ద్వారా పొందవచ్చు. అలాగే ద్వారకా బస్‌స్టేషన్ వద్ద, ఇతర అధీకృత ఏజెంట్ల వద్ద కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆర్ఎం సుధేశ్‌కుమార్ చెప్పారు. -
కత్తి కట్టి.. పందెం పట్టి..
రేపల్లె :అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సాక్షిగా సంప్రదాయం మాటున కోడి పందేలు జోరుగా సాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. పోలీసులు మౌనం దాల్చడంతో పందెంరాయుళ్లు బహిరంగంగా ‘బరి’లోకి దిగారు. సంక్రాంతి సందర్భంగా రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేలు మూడవ రోజు శుక్రవారం భారీ స్థాయిలో జరిగాయి. ఈ మూడురోజుల్లో సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు చేతులు మారగా, వందలాది పుంజులు నెత్తుటిధారలతో నేలకొరిగాయి. గుంటూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా తీరప్రాంత మండలాల నుంచి పందెంరాయుళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకోవడంతో గుడ్డికాయలంక గ్రామం కిక్కిరిసిపోయింది. జూదరులు అనూహ్యంగా తరలిరావడంతో పందేలు కూడా అదే స్థాయిలో జరిగాయి. అధికారపార్టీ ప్రజాప్రతినిధులే బరివద్ద నిలవడంతో పోలీసులు ఇటువైపు చూసే సాహసం చేయలేకపోయారు. బహిరంగంగానే కోడి పుంజులకు కత్తులుకట్టి ఒక్కొక్క జతపై లక్షలాది రూపాయల పందేలు కాస్తూ జూదరులు విజృంభించిన తీరు చట్టానికి తూట్లు పొడిచినట్టయింది. ఇదే సమయంలో పేకాటలో కోతముక్క, ఇతర డబ్బా, చక్రం వంటి జూదాలను యథేచ్ఛగా ఆడారు. అధికార పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోడి పందేలను తొలిరోజు బుధవారం ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, రెండవ రోజు గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు తొలిరోజు నుంచీ బరి వద్దనే ఉంటూ జూదరులను ప్రోత్సహించే యత్నం చేశారు. ప్రజాప్రతినిధులు, మంత్రి పందేల్లో పాల్గొనటంతో పందెంరాయుళ్లు మరింత చెలరేగిపోయారు. ఇదిలావుండగా, సంప్రదాయం మాటున నిర్వహించిన కోడి పందేల కారణంగా వందలాది మంది ఆర్థికంగా నష్టపోయారు. గ్రామీణ ప్రాంతంలో పంటలు పుష్కలంగా పండి పచ్చగా ఉన్న తరుణంలో కోడి పందేలు నిర్వహించడంవల్ల ఆర్థిక స్థితిగతులు తల్లకిందులవుతున్నాయని ఈ సందర్భంగా పలు మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. -
కళకళ..వెలవెల!
తుళ్లూరు/ తాడేపల్లి : రైతుల ఇంట అతిపెద్ద పండుగ సంక్రాంతికి సంబంధించి రాజధాని ప్రాంతంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఆనందాలు, సంతోష సంబ రాలతో కళకళలాడుతుండగా, మరో వైపు భవితపై బెంగతో ఆందోళన చెందుతున్న రైతుల లోగిళ్లు వెలవెలబోతున్నాయి. తుళ్లూరు మండలంలోని మెట్టభూముల రైతులు ఈ పండుగను ఇనుమడించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. జరీబు భూములు ఉన్న గ్రామాల్లో సంక్రాంతి సందడి కనిపించటం లేదు. ఆది నుంచి ఇక్కడి రైతులు రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఏటా మూడు పంటలు పండే భూములు ఇస్తే భవిష్యత్ ఏమిటనేది అర్థంకాని పరిస్థితిలో సంక్రాంతి వేళ సైతం తమ నిరసనలను ముగ్గుల రూపంలో తెలియజేస్తున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతు కుటుంబాల మ హిళలు తమ భూము లు ఇవ్వబోమనే రీతి లో ముగ్గులు వేశారు. రాజధాని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ గ్రామాల్లో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. తమ భూములను ప్ర భుత్వం లాగేసుకుంటే ఎలా బతకాలనే ఆందోళనతో కాలం గడు పుతున్నారు. ఉండవల్లి, పెనుమాకలో సంక్రాంతి కళ తప్పింది. భోగి మంటలతో ప్రారంభమయ్యే సంక్రాంతి పెనుమాక, ఉండవల్లిలో నిరసనలతో ప్రారంభమైంది. ఈ సంవత్సరం రైతు కుటుంబాల్లో సంక్రాంతి హడావుడి కనిపించడంలేదు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం పెనుమాక, ఉండవల్లి రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి రైతులు ఏదో ఒక రూపంలో నిరసనలు తెలియజేస్తున్నారు. అరుునా సర్కారు తన నిర్ణయూన్ని వెనక్కు తీసుకోలేదు. మూడురోజుల నుంచి పెనుమాక, ఉండవ ల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని భూమి ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మరో పక్క పోలీసు పికెట్ గ్రామంలో ఏర్పాటుచేశారు. గత 50 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా పెనుమాక , ఉండవల్లివాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తుళ్లూరు మండలంలో ఘనంగా సంక్రాంతి.. ఇప్పటివరకు పల్లెటూరుగా వున్న తుళ్లూరు ఒక్కసారిగా నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా మారిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూములు విక్రయించుకోవడంతో వచ్చిపడిన డబ్బుతో పండుగను గత ఏడాది కంటే రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాల నిర్వహణకు నిధులు విడుదల చేయడంతో గ్రామాలన్నీ పండుగ ఊపులో ఉన్నాయి. బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తుళ్లూరుతోపాటు అనేక గ్రామాల్లో సేవాసంస్థలు, ప్రజాసంఘాలతో పాటు ప్రభుత్వం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం త్వరగా జరగాలని, గ్రామాలు సుఖశాంతులతో ఉండాలని సకుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. {పధానంగా తుళ్లూరు, పెదపరిమి, మందడం, రాయపూడి, అనంతవరం, వడ్డమాను, బోరుపాలెం గ్రామాలలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి, కనుమ పండుగలను కూడా అదేస్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బంధువులు, స్నేహితుల రాకతో అక్కడి రైతుల లోగిళ్లు కళకళలాడుతున్నాయి. -
సంక్రాంతి కళలేని పల్లె
కడప కల్చరల్/అగ్రికల్చర్: మంచు తెమ్మెరలను ఛేదిస్తూ విరిసే అరుణ కాంతులు,. తెల్లవారక ముందే నిద్రలేచే పల్లె శ్రమ జీవికి ఏడాదంతా తోడుగా నిలిచే పశువులను సంపదగా భావించి, పూజించి, గౌరవించే సంసృ్కతి, ఔన్నత్యం.. ధాన్యంతో నిండుగా రైతుల గాదెలు,. గ్రామ సీమల్లో అంతటా ఆనందం.. ఈ సంబరాన్ని తీసుకొచ్చే సంక్రాంతిని పెద్ద పండుగగా భావిస్తాం. అందుకే ఈ పండుగ అంటే ఎంతో ఉత్సాహం. జీవనం కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఇళ్లకు చేరుకుంటారు. అరుుతే తీవ్ర కరువు పల్లెల్లో సంతోషాలను చిదిమేసింది. కేసీ ఆయకట్టులో కొంత వరకు వరి మినహా ఇతర పంటలేవీ రైతుకు భరోసా ఇవ్వలేకపోయాయి. పండిన ధాన్యానికి గిట్టు బాటు ధర లేదు. అందుకే ఇంత పెద్ద పండుగైనా జిల్లా వాసుల్లో అంతగా సంతోషం లేదు. ‘రుణ మాఫీ’ పై ఆశలు పెట్టుకున్న రైతుల్లో ఎక్కువ శాతం మందికి భంగపాటే ఎదురైంది. అందుకే ఈ పండుగను మొక్కుబడిగా నిర్వహించుకుంటున్నారు. పిల్లల ఆనందాన్ని కాదనలేక అప్పో సప్పో చేసైనా పండుగు చేయూలని సిద్ధమయ్యారు. ధరల దడ! రైతన్న పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ప్రజల సంగతి సరేసరి. ఆరు నెలలుగా రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను వింటే సామాన్యునికి వణుకుపడుతోంది. పచ్చడి మెతుకులైనా తిందామనుకుంటే కొబ్బెర కిలో రూ 180, ఎండు మిర్చి రూ 100కు చేరాయి. కంది మబేడలు, చింతపండు, తెల్లగడ్డలు, ఉద్దిపప్పు, వేరుశనగ పప్పు కిలో రూ 80 నుంచి 90లకు చేరాయి. పెసలు, పెసరపప్పు ధర కిలో రూ 100 నుంచి 1290కు చేరుకుంది. అలాగని పండించిన రైతుకు గిట్టుబాటు ధర అటుంచి, పెట్టుబడులు కూడా దక్కడం లేదు. ఈ నేపధ్యంలో సామాన్యుడు మార్కెట్ గురించి తలుచుకుంటేనే భయపడే స్థితికి చేరారు. అయినా సంసృ ్కతీ సాంప్రదాయాలకు పెద్దపీట వేసే గుణం గల ప్రజలు ఆకలి బాధను, సమస్యలను అణిచి పెట్టుకుని సంక్రాంతి లక్ష్మిని సాధరంగా ఆహ్వానిస్తున్నారు. పత్తాలేని ధరల నియంత్రణ కమిటీ... పండుగ పూటేకాకుండా ఇతర సమయాల్లో కూడా ధరలపై పర్యవేక్షణ చేపట్టాల్సిన కమిటీ పత్తా లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలపై నిఘా పెట్టడానికి జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షన పనిచేసే ఈ కమిటీ జిల్లాలో నెలకోసారి ధర నియంత్రణపై సమీక్ష చేపట్టాలి. క్షేత్రస్థాయిలో ధరల హెచ్చుతగ్గులను, మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా?అని పరిశీలన చేయాల్సి ఉంటుంది. సామాన్యులకు, పేద వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయా? లేదా అని సమీక్షించాలి. ఇటీవల కాలంలో ఈ పరిశీలన చేసిన దాఖలాలు లేవు. ధరలు ఇలా.. (కిలో/లీటరు-రూ.లలో) నిత్యావసర పాత ధర కొత్త ధర సరుకులు కంది పప్పు 75 95 శనగబేడలు 45 60 అలసందలు 60 85 ఎండుకొబ్బరి 180 206 బెల్లం 45 60 గోధుమ పిండి 28 38 శనగ పిండి 46 56 వేరుశనగ నూనె 85 85-100 పామాయిల్ 58 75 సన్‌ప్లవర్ 80 95 -
కార్పొరేట్‌కూ... సమ్‌క్రాంతి
పాశ్చాత్య నాగరికతను తలకెత్తుకుని తరిస్తోందని భావించే కార్పొరేట్ ప్రపంచం కూడా పండుగ ప్రాధాన్యాన్ని గుర్తిస్తోంది. ఆధునికతకు అసలైన చిరునామాలైన సాఫ్ట్వేర్, ఐటీ, ఎమ్ఎన్సీ సంస్థల కార్యాలయాల్లో...సంప్రదాయ సం‘క్రాంతి’ కనువిందు చేస్తోంది. కార్యాలయాలు కాసేపు పల్లె క్రాంతితో మెరుస్తున్నాయి. ఆఫీస్ క్యాంపస్‌లలో రంగవల్లులు హరివిల్లులై విరుస్తున్నాయి. పిండివంటల ఘుమఘుమలు పండుగలోని మాధుర్యాన్ని చవిచూపిస్తున్నాయి. ..:: ఎస్.సత్యబాబు పల్లెకు దూరంగా, అమ్మ చేతి వంటకు అందనంత దూరంగా, అయినవారి ఆప్యాయతకు దూరంగా... కాంక్రీట్ జంగిల్లో ఉరుకులు పరుగులతో గడిపేసే కార్పొరేట్ జీవితాలకు కార్యాలయ పండుగల రూపంలో కాసింత ఉపశమనం దొరుకుతోంది. ‘పండుగకు ఊరెళ్లడం ఎంత ముందుగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కుదరదు. చివరి నిమిషంలో బస్సు, రైలు టిక్కెట్లు సులభంగానూ దొరకవు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా సంక్రాంతిని మిస్ అయ్యామన్న భావన రాకుండా మా కంపెనీలో నిర్వహిస్తున్న ఈవెంట్ కొంత సంతోషాన్ని ఇచ్చింది’ అని చెప్పారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మునినాయుడు. సొంత ఊర్లకు వెళ్లని వారిని, వెళ్లే వారిని సైతం దృష్టిలో పెట్టుకుని, వారికి ఫెస్టివల్ సందడిని దగ్గర చేయాలనే తపనతో కంపెనీలు ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేస్తున్నాయి. ‘మా ఊర్లో మూడు రోజుల పాటు జరిగే పండుగ వేడుకలు ఒక ఎత్తెయితే... దాదాపు సంవత్సరం మొత్తం గడిపే కంపెనీ ప్రాంగణంలో, ఫ్యామిలీ మెంబర్స్‌లా మారిపోయిన తోటి ఉద్యోగుల మధ్య నిర్వహించే ఈవెంట్స్ ఒకెత్తు. నేను మా ఊర్లోనే కాదు ఇక్కడ జరిగే ఈవెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను’ అంటున్నారు కాప్రికార్న్లో పనిచేసే సతీష్.పంచెలూ... పట్టు చీరలూ... ‘కట్టూ, బొట్టూ మారాలి. కొత్త వంటలు, రుచులు ఆస్వాదించాలి. ‘మన’ అనుకునే వారితో కలిసి ఆడి పాడి ఆనందం పంచుకోవాలి. రొటీన్‌కు భిన్నంగా రోజంతా గడవాలి’.. ఇలా కోరుకునే వారిలో అత్యధికులు నిన్నా మొన్నటి దాకా పబ్బులు, పార్టీలు, వీకెండ్ షికార్లపైన మాత్రమే ఆధారపడేవారు. ఇప్పుడిప్పుడే వీరికి పండుగ సందడిలోని పసందు తెలిసివస్తోంది. ‘పంచెకట్టుకుని ఎన్ని రోజులైందో. సంక్రాంతి పండుగ పుణ్యమా అని మా ఆఫీసులో అందరం పంచెకట్టుకుని వచ్చాం. చాలా సంతోషంగా అనిపించింది’ అని సతీష్ చెప్పారు. ఆయన తరహా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామందే ఉన్నారు. ‘మా ఆఫీసులో సంక్రాంతికి పోటా పోటీగా ముగ్గులేస్తాం. ఎంతబాగా ఎంజాయ్ చేస్తామంటే...ఆ టైమ్‌లో మా ఇంట్లో వారి మధ్య లేననే విషయమే గుర్తుకు రాదు’ అని పంజగుట్టలోని ప్రోకర్మ ఉద్యోగిని చరిత చెప్పింది. ఇలాంటి అభిప్రాయాలే ఇప్పుడు కార్పొరేట్ కార్యాలయాలను కనువిందైన సంబరాలకు వేదికలుగా మారుస్తున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్.. భోగి, సంక్రాంతి, కనుమ... ఈ మూడు పండుగల ముచ్చట్లలో తరాలకు అతీతంగా ఆకట్టుకునేలా భాగమైనవెన్నో. చెక్కా ముక్కా తెచ్చి మండించే భోగి మంటల దగ్గర్నుంచి కాగిత విహంగంలా మనసునూ ఎగురవేసే పతంగుల హేల దాకా... ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి ముగ్గూ ముచ్చట్ల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇవే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ ప్రాంగణాలలో హరివిల్లులు విరబూయిస్తున్నాయి. పండుగలోని ముఖ్యమైన, కలర్‌ఫుల్ అంశాలను ప్రధానంగా తీసుకుని కార్పొరేట్ కార్యాలయాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సెల్ఫ్‌మేడ్ పిండివంటలతో పాట్లాక్, రంగోళి పోటీలు, కైట్ ఫెస్టివల్స్, ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కాంటెస్ట్‌లు.. వంటివి నిర్వహిస్తూ ఉద్యోగుల్లో ఉల్లాసాన్ని, ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. ‘మా కంపెనీ ఆవరణలో నిర్వహించే కైట్ ఫెస్టివల్ కోసం ఏడాదంతా ఎదురు చూస్తాం’ అని మాదాపూర్‌లోని ఫ్యాక్ట్‌సెట్ కంపెనీ ఉద్యోగి చారు చెప్పారు. కారణాలేవైతేనేం.. ఇప్పుడు కార్పొరేట్ లోగిళ్లు పండుగ కళతో కళకళ లాడుతున్నాయి. గ్లోబల్ ట్రెండ్స్‌కు చిరునామాలు.. గోరింట పూసిన చేతుల అందాన్ని చవిచూస్తున్నాయి. అచ్చతెలుగు ఆచారాలతో కనువిందు చేస్తున్నాయి. తెలుగు సంప్రదాయం నిత్యనూతనమై వెలుగుతూ ఉంటుందనే నమ్మకాన్నిస్తున్నాయి. అమ్మతనమంత ఆప్యాయంగా అంటిపెట్టుకునే ఉంటుందనే భరోసానిస్తున్నాయి. -
చంద్రన్న కానుకల పంపిణీపై విజిలెన్స్ తనిఖీలు
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రన్న సంక్రాంతి ఉచిత సరుకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఫిర్యాదులు అందడంతో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో తనిఖీలు నిర్వహించారు. కర్నూలు నగరంలో 161 చౌక డిపోలు ఉన్నాయి. 99,241 కార్డుదారులు ఉన్నారు. వారందరికీ చంద్రన్న సంక్రాంతి ఉచిత రేషన్ కిట్‌ను అందించాల్సి ఉంది. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆదివారం కర్నూలులో లాంఛనంగా ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు(మధ్యాహ్న భోజన సమయంలో గంట సేపు) మినహా రెండు రోజుల పాటు నిరంతరాయంగా సరుకులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలు జరగలేదు. మొదటి రోజు మధ్యాహ్నం వరకు రెండవ రోజు గంటసేపు సరుకులు పంపిణీ చేసి పలువురు డీలర్లు దుకాణాలు మూసివేశారు. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహశీల్దార్లు రామక్రిష్ణారావు, సీఐ వై.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కర్నూలు నగరంలో పర్యటించి సరుకుల పంపిణీ తీరును పరిశీలించారు. 125వ దుకాణం తెరవకపోవడంతో ఫోన్‌చేసి రప్పించి లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేయించారు. 125వ దుకాణంతో పాటు 144వ చౌక దుకాణం కూడా ఇన్చార్జిగా నియమించడంతో రెండు చోట్ల అరకొర పంపిణీ చేసినట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. 30, 38 చౌక డిపోలు సోమవారం అసలు తెరవలేదు. 120వ చౌక డిపో డీలరు, గంటసేపు సరుకులు పంపిణీ చేసి దుకాణం కట్టేసి వెళ్లిపోయారు. -
పల్లెల్లో సంక్రాంతి హడావుడి
ఉదయుగిరి: దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండగైన సంక్రాంతికి మరో రోజు ఉన్నప్పటికీ ఆ హడావుడి అటుపల్లెల్లోనూ, ఇటు పట్టణాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ధనిక, పేద తేడా లేకుండా ఈ పండక్కి సంబంధించి న సామగ్రిని, వస్త్రాలను కొనుగోలు చేసేందుకు పల్లెలనుంచి ఉదయగిరి పట్టణానికి పెద్దసంఖ్యలో తరలి వస్తుండటంతో దుకాణాలన్నీ కిక్కిరిశాయి. ముఖ్యంగా వస్త్రదుకాణాల్లో ఈ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. అదేవిధంగా వివిధ రకాల పిండివంటలు తయారుచేసుకునేందుకు తెచ్చిన సరుకులను మర పట్టించునేందుకు పిండిమిల్లుల వద్ద కూడా క్యూలు కట్టారు. సంక్రాంతి పండగ అంటే బాగా గుర్తొచ్చేది ఇంటిముందు ముగ్గులు. దీనికోసం ఉపయోగించి వివిధ రకాల రంగులను కూడా మహిళలు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. భోగిమంటలకు సంబంధించిన తాటాకులు, కంప, ఇతరత్రా సామగ్రిని సమకూర్చుకునే పనుల్లో యువత చురుగ్గా నిమగ్నమయ్యారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు తిరిగి వస్తుండటంతో పల్లెలు కూడా బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. మొత్తమ్మీద ఉదయగిరి ప్రాంతంలో కరువు పరిస్థితులున్నప్పటికీ సంక్రాంతి ని తమకు తగిన స్థోమతతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. -
ఊరూవాడా సంక్రాంతి సంబరాలు
అనంతపురం సెంట్రల్ : సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఊరువాడా సంబరాలు నిర్వహించాలని అడిషనల్ జాయింట్ కలెక్టరు సయ్యద్ ఖాజామొహిద్దీన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సంక్రాంతి సంబరాల వేదికైన పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వేదికను సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వంటలు, ముగ్గులు, కబడ్డీ పోటీలను నిర్వహించాలని చెప్పారు. పంటలు, పశువుల ప్రదర్శన, ప్రభుత్వ శాఖలకు సబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఆహూతులను ఆకట్టుకునే విధంగా సంప్రదాయ కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని చె ప్పారు. పతంగులను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ, సహాయ సంచాలకులు వై.వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ జాయింట డెరైక్టర్ శ్రీరామమూర్తి, అనంతపురం ఆర్డీఓ హుసేన్ సాహెబ్, ఉద్యానవనశాఖ డీడీ సుబ్బరాయుడు, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, సమాచారశాఖ డీఈ నాగభూషణం, ఐసీడీఎస్, అగ్నిమాపకశాఖ, ఆర్అండ్బీ, డీఆర్డీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు. 12, 13 తేదీల్లో గవర్నర్ పుట్టపర్తి, కదిరిలో పర్యటన అనంతపురం సెంట్రల్ : గవర్నర్ నరసింహన్ ఈనెల 12, 13వ తేదీల్లో పుట్టపర్తి, కదిరి పర్యటిస్తారని ఏజెసీ సయ్యద్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని రెవిన్యూభవన్‌లో గవర్నర్ పర్యటన, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ పర్యటనలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని చెప్పారు. గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు 66వ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఏజేసీ అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల ప్రగతి నివేదికలను ఈ నెల 15లోపు సమాచార శాఖ, సహాయ సంచాలకులకు పంపాలన్నారు. 20వ తేదీలోపు అవార్డులకు ఉద్యోగుల పేర్లు సిఫార్సు చేయాలని సూచించారు. ప్రగతిని సూచించే స్టాళ్లను, శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ హేమసాగర్, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఆర్డీవోలు హుస్సేన్‌సాహెబ్, రాజశేఖర్, రామారావు, సెరికల్చర్ జెడీ అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డీపీవో రమణ, డీయంఅంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్ పాల్గొన్నారు. -
పెద్దల పండగకు ఏర్పాట్లు చేయాలి
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ నెల్లూరు (సెంట్రల్): నగరంలో సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న పెద్దల పండగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్‌బాబుతో కలసి శనివారం ఆయన బోడిగాడితోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అనేక మంది ప్రజలు పెద్ద పండగ రోజున దివంగతులైన వారి బంధువులు, ఆత్మీయులకు పూజలు నిర్వహించేందుకు బోడిగాడితోటలోకి వస్తారన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుధ్య ఏర్పాట్లను కార్పొరేషన్ సిబ్బంది చేయాలన్నారు. నాయకులు ఎవరైనా పత్రికల్లో ఫొటోల కోసం చీపుర్లు పట్టినా నగరాన్ని శుభ్రంగా ఉంచేది మాత్రం పారిశుధ్య కార్మికులేనన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారులదేనని తెలిపారు. అనంతరం ఐదో డివిజన్లోని అరవపాళెం, బర్మాశాలగుంట ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో పేదలకు నగరానికి సమీపంలో నివాస యోగ్యమైన స్థలంలో ఇళ్లు కట్టించి కనీసం సౌకర్యాలు కల్పించాలని కమిషనర్‌కు సూచించారు. కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, శోభన్‌బాబు, సుకుమార్, సునీల్, మల్లికార్జున, నాగేంద్ర, మహేంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బాబూరావు, రఫీ, రాజా, పి.రఘురామిరెడ్డి, మున్నా, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వంగాల శ్రీనివాసులురెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్‌సిద్ధిక్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు వి.శ్రీహరిరాయలు, బి.హరిప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు. -
ఇదేం మెలిక !
బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారికే గ్యాస్ సిలిండర్ జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు : 5,84,544 ఏజెన్సీలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి : 4,58,992 బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయినవి : 3,14,308 పండగపూట కూడా...గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. ఆధార్‌తోపాటు బ్యాంకు ఖాతాలు సమర్పించిన వారికే సిలిండర్లు ఇస్తున్నారు. మూడునెలల దాకా గడువు ఉన్నా జిల్లా అధికారుల తొందరపాటు చర్యల కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -నల్లగొండ పండగ పూట గ్యాస్ వినియోగదారుల కష్టాలు నల్లగొండ: సంక్రాంతికి ముందుగానే ప్రజలు వంటగ్యాస్ కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండగ సెలవులు మూడు రోజులు అయినప్పటికి అంతకంటే ముందుగానే రెండో శనివారం, ఆదివారాలు కూడా సెలవు దినాలు కావడంతో పట్టణాల్లో, పల్లెల్లో పండగ వాతావరణం సందడి చేస్తోంది. అయితే సంక్రాంతి రోజున రకరకాల పిండివంటలు చేసుకుద్దామంటే ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెడుతున్నాయి. జిల్లా అధికారులు అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగదు బదిలీ పథకం అమల్లో భాగంగా వంట గ్యాస్ కనెక్షన్లుకు ఆధార్‌నంబర్లు తప్పని సరిగా సమర్పించాలి. దీంతోపాటు బ్యాంకు ఖాతాల నంబర్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ నెల నుంచే జిల్లాలో నగదు బదిలీ పథకం ఆరంభమైంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే ఏజెన్సీలు రీఫిల్ ఇస్తున్నారు. అదేమంటే జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు తాము నడుచుకుంటున్నామని చెబుతున్నారు. దీంతో పండుగపూట ఇంట్లో పొయ్యి వెలిగించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారుల తొందరపాటు... నగదు బదిలీ పథకం ప్రారంభమైన నాటినుంచి మూడు మాసాల్లోగా బ్యాంకు ఖాతాలు ఇచ్చేందుకు కేంద్ర వెసులుబాటు కల్పించింది. కానీ ఏజెన్సీల ఒత్తిడికి తలొగ్గిన జిల్లా అధికారులు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ రీఫిల్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. గుట్టచప్పుడు కాకుండా జారీ అయిన ఈ ఉత్తర్వులను బయటకు పొక్కనీయకుండా ఏజెన్సీలు తమ ప్రతాపాన్ని వినియోగదారులపై చూపుతున్నాయి. బ్యాంకు ఖాతాలు ఇవ్వకుండా సిలిండర్ తెచ్చుకునేందుకు వెళ్లిన వినియోగదారులకు ఏజెన్సీలు ఈ ఉత్తర్వులను చూపించి గ్యాస్ ఇవ్వకుండా తిప్పిపంపిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన గడువు మేరకు మార్చి నెలాఖరులోగా వినియోగదారులు బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ సీడింగ్ పూర్తిచేయాలి. నత్తనడకన ఆధార్ సీడింగ్.. జిల్లాలో మొత్తం 5.84 లక్షల గ్యాస్ కనెక్షన్లకుగాను 4.58 లక్షల కనె క్షన్లు గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానమయ్యాయి. ఇంకా 1,25,552 కనెక్షన్లు ఆధార్ సీడింగ్ చేయాల్సి ఉంది. ఏజెన్సీలు, బ్యాంకు ఖాతాలకు కేవలం 3.14 లక్షల కనెక్షన్లు మాత్రమే సీడింగ్ పూర్తయ్యాయి. ఆధార్ సీడింగ్ పూర్తయి ఏజెన్సీలకు బ్యాంకు ఖాతానంబర్లు ఇవ్వాల్సిన కనెక్షన్లు 1.44 లక్షలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా పూర్తికావడానికి మూడు మాసాల వరకు గడువు ఉంది. కానీ అధికారుల తొందరపాటు చర్య వల్ల ఏజెన్సీలు గ్యాస్ రీఫిల్ ఇవ్వకుండా కొత్త సమస్య సృష్టిస్తున్నారు. -
సరుకులు.. సర్దేదెలా?
ప్రొద్దుటూరు: సంక్రాంతికి చంద్రన్న కానుక అందేది అనుమానమే... ఆరు సరుకులు ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం మాట నెరవేర్చేందుకు అధికారులు, డీలర్లు కిందామీదా అవుతున్నారు. కేజీ, అరకేజీలుగా ఇవ్వాల్సిన సరుకులు బస్తాలు, 10 కేజీల రూపంలో రావడంతో వాటిని విడగొట్టి ప్యాకెట్లలో సర్దడం ఎలా అని తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం గోడవున్లకు చేరిన సరుకులు రెండు రోజుల్లో డీలర్ల ద్వారా వినియోగదారులకు అందించడం సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నారుు. నిజామాబాద్ జిల్లా నుంచీ ప్రొద్దుటూరు గోడౌన్‌కు సరఫరా అయిన బెల్లం కేక్‌లు ఒక్కొక్కటి 10 కిలోలుగా ఉంది. నిబంధనల ప్రకారం మిగతా వస్తువులతో పాటు రేషన్ కార్డుదారునికి అరకిలో బెల్లం అందించాల్సి ఉంది. అయితే అధికారులు విడిగా ప్యాక్ చేయకుండా ఇదిగో ఇలా గోడౌనుకు చేర్చారు. అత్యవసరంగా ప్రభుత్వం ఈ నెల 11 నుంచే కానుక వస్తువులను పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు నేరుగా ఈ బెల్లం కేక్‌లను డీలర్లకు చేరవేస్తున్నారు. డీలర్ల ఇళ్లకు సరకులు చేరిన తర్వాత డ్వాక్రా మహిళలను నియమించి ఈ బెల్లం కేక్‌లను పగులగొట్టించి అరకిలో చొప్పున ప్యాక్ చేయించి వినియోగదారులకు ఇవ్వాలట. ఈ బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ఈ కేక్‌లను పగులగొట్టి20 ప్యాకెట్లలో నింపడం అంత సులువైన పనా. కేవలం బెల్లం మాత్రమే కాదు గోధుమ పిండి, కందిబేడలు, శనగలు కూడా 100 కిలోల బస్తాల్లో వచ్చాయి. వీటన్నిటినీ ఇలాగే డీలర్లకు అప్పగించి డ్వాక్రా మహిళల ద్వారా కిలో, అరకిలో ప్యాకెట్లు తయారు చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకు గానూ కిలో, అరకిలో పాలిథీన్ కవర్లను కూడా సరఫరా చేశారు. అరుుతే డ్వాక్రా మహిళలకు కూలీ చెల్లిస్తారా అనే విషయంపై స్పష్టంగా చెప్పడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. వీటన్నిటినీ తమకు అప్పగిస్తే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. విడగొట్టిన తర్వాత అంతే తూకాలు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ఈ సరకులు గోడౌన్లకు రాకపోగా అధికారులు వీటిని ఇంకా డీలర్లకు సరఫరా చేయలేదు. దీంతో అటు అధికారులతో పాటు ఇటు డీలర్లు కూడా పండుగకు ముందే పంపిణీ చేయగలమా అని ఆందోళన చెందుతున్నారు. కాగా చంద్రన్న సంక్రాంతి కానుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల ఉత్పత్తి కర్మాగార సంస్థ నుంచీ నెయ్యి ప్యాకెట్లను సరఫరా చేశారు. తద్వారా సంస్థకు ఆదాయం రావడంతో పాటు వ్యాపారానికి సంబంధించి ప్రజల్లో మరింత ప్రచారం కూడా జరుగనుంది. -
వంటల వేడుక
ఎంత మూడ్రోజుల పండగ అయినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లే ఉంటుంది! భోగిని చూడండి... చలి మంటలు వేయగానే తెల్లారుతుంది. భోగి పళ్లు పోయగానే చీకటి పడిపోతుంది. సంక్రాంతిని చూడండి... ‘హరిలో రంగ హరీ’ అంటూ మొదలౌతుంది. అల్లుళ్లనీ, ఆడపడుచుల్ని రిసీవ్ చేసుకోవడంతోనే సరిపోతుంది. కనుమను చూడండి... రథమెక్కి వస్తుంది. వచ్చిన వాళ్లతో కలిసి బస్సో, రైలో ఎక్కి వెళ్లిపోతుంది. పండగలు ఇంత త్వరగా అయిపోతే ఎలా? నిరాశ చెందకండి. పండక్కి ముందు మూడురోజులు, తర్వాత మూడురోజులకు కూడా సరిపడా పిండివంటలు చేసిపెట్టుకోండి. అవి ఉన్నన్నాళ్లూ పండగలానే ఉంటుంది! ఐడియా బాగుందా? పాకం గారెలు కావలసినవి: మినప్పప్పు - కప్పు; ఉప్పు - కొద్దిగా (గారెలు తియ్యగా ఉండాలి కాబట్టి ఉప్పు ఎక్కువ వాడకూడదు); బెల్లం పొడి - కప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత తయారీ: మినప్పప్పును సుమారు నాలుగు గంటలు నానబెట్టి నీళ్లు వడకట్టి, గారెల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని ఉప్పు కలిపి పక్కన ఉంచాలి వేరే పాత్రలో కొద్దిగా నీరు మరిగించి అందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి కలిపి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించి, దించేసి, పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మినప్పిండిని కొద్దిగా తీసుకుని, అర చేతిలో గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి బెల్లం పాకంలో వేసి సుమారు ఐదునిమిషాల తరవాత తీసి వేడివేడిగా అందించాలి. మురుకులు కావలసినవి: బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - అర కప్పు; నువ్వులు - 25 గ్రా.; జీలకర్ర - 25 గ్రా.; ఇంగువ - 2 టేబుల్ స్పూన్లు; బటర్ - 100 గ్రా.; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు తీసేసి పొడి వస్త్రం మీద ఆరబోసి, తడి పూర్తిగా పోయాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చేయాలి మినప్పప్పును దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చే యాలి ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, మినప్పిండి, నువ్వులు, జీలకర్ర, ఇంగువ, బటర్, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి జంతికల పిండిలా కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పిండి మిశ్రమాన్ని మురుకుల అచ్చులో వేసి జంతిక మాదిరిగా నూనెలో తిప్పాలి రెండు వైపులా దోరగా వేయించి తీసేయాలి చల్లారాక గాలి చొరని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా పాడవ్వవు. తంబిట్టు ఉండె కావలసినవి: బియ్యం - కప్పు; వేయించిన సెనగపప్పు (పుట్నాలపప్పు) - అర కప్పు; పల్లీలు - అర కప్పు; బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు; ఎండు కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పులు; నువ్వులు - టేబుల్ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను తయారీ బాణలిలో నూనె లేకుండా బియ్యం, పల్లీలు, నువ్వులను విడివిడిగా వేయించి తీసి పక్కన ఉంచాలి పల్లీల మీద పొట్టు తీసేసి మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి మిక్సీలో... వేయించిన సెనగపప్పు, వేయించిన బియ్యం వేసి మెత్తగా పొడి చేయాలి మందపాటి పాత్రలో తగినన్ని నీళ్లు, బెల్లం వేసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగేవరకు మరిగించాలి బియ్యప్పిండి, కొబ్బరి తురుము, నువ్వులు, పల్లీ పొడి వేసి బాగా కలపాలి నెయ్యి జత చేసి మరోమారు కలిపి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక దించేయాలి కొద్దిగా చల్లారాక ఉండలు కట్టి, గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇవి సుమారు 15 రోజులు నిల్వ ఉంటాయి. -
జాహ్నవిలో సంబరం
-
అరకొర సరకులతో.. పండగ చేసుకోండి
చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీపై అనుమానాలు పది శాతం మందికీ సరిపడని సరకులు 12లోగా పంపిణీ కష్టమేనంటున్న అధికారులు విశాఖపట్నం: చంద్రన్న సంక్రాంతి కానుక సవాలుగా మారిం ది. సంక్రాంతి పండుగ చేసుకోండంటూ సర్కారు చేసిన ఉచిత సరకుల ప్రకటన ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోంది. పామాయిల్(అరలీటర్), కందిపప్పు (అరకేజీ), శనగలు(కేజీ), గోధుమపిండి (కేజీ), బెల్లం (అరకేజీ), నెయ్యి (100 గ్రాములు) కలిపి ఒక కిట్ రూపంలో ప్రతీ తెల్లకార్డుహోల్డర్లకు అందజేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. ఈ నెల 12వ తేదీలోగా వీటిని ఉచితంగా అందించాలని ఆదేశించింది. జిల్లాలో 10,79,576 కార్డులున్నాయి. ప్యాకెట్ల రూపంలో ఇచ్చే ప్రతీ సరుకూ కార్డుల సంఖ్యకనుగుణంగానే జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు చేరిన పామాయిల్,గోధుములు, శనగలు, కందిపప్పు 10 శాతం మందికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. నెయ్యి, బెల్లం జాడే లేదు. కార్డుల సంఖ్యను బట్టి 10.79లక్షల పామాయిల్ ప్యాకెట్లు(అరకిలో చొప్పున), 1122 మెట్రిక్ టన్నుల శనగలు, గోధుమలు, 561 మెట్రిక్ టన్నుల బెల్లం, కందిపప్పు, 112.205 కేజీల నెయ్యి కేటాయించాల్సి ఉంది. పామాయిల్ 2.80 లక్షల ప్యాకెట్లే వచ్చాయి. 1.83లక్షల గోధుమ పిండి ప్యాకెట్లు , 2.16 లక్షల శనగల ప్యాకెట్లు, అరకిలో చొప్పున పంపిణీ చేయాల్సిన కందిపప్పు 1.28 లక్షల ప్యాకెట్లే చేరుకున్నాయి. బెల్లం 80వేల ప్యాకెట్లు వచ్చినట్లు సమాచారం..కార్డులకూ వచ్చిన సరకుతో పోలిస్తే ఏమాత్రం సరిపోవు. కష్టమేనంటున్న డీలర్లు షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టాల్సి ఉంది.కేటాయింపులు ఇలా చేస్తే తామెలా సరఫరా చేయగలమని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తామేదో స్వాహా చేసిన భావన కార్డుహోల్డర్లకు కలుగుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. దాడికి దిగే అవకాశాలున్నాయని భీతిల్లుతున్నామన్నారు. వీటి పంపిణీ బాధ్యత.. పర్యవేక్షణలను జన్మభూమి కమిటీలకు అప్పగించడం వివదాస్పదమవుతుంది. ఇప్పటికే పింఛన్ల తనిఖీలు, రుణమాఫీ జాబితాల్లో ఈ కమిటీల మితిమీరిన జోక్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వీరికే సంక్రాంతి కానుక బాధ్యత అప్పగించడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా యూఐడీ సీడింగ్ కానీ సభ్యులతో పాటు ఆధార్, కుటుంబ వివరాలు, ఫ్యామిలీ ఫొటో అప్లోడ్ కాని రచ్చబండ కూపన్‌దారులు సంక్రాంతి కానుకకు దూరమవుతున్నారు.