కడప కల్చరల్/అగ్రికల్చర్: మంచు తెమ్మెరలను ఛేదిస్తూ విరిసే అరుణ కాంతులు,. తెల్లవారక ముందే నిద్రలేచే పల్లె శ్రమ జీవికి ఏడాదంతా తోడుగా నిలిచే పశువులను సంపదగా భావించి, పూజించి, గౌరవించే సంసృ్కతి, ఔన్నత్యం.. ధాన్యంతో నిండుగా రైతుల గాదెలు,. గ్రామ సీమల్లో అంతటా ఆనందం.. ఈ సంబరాన్ని తీసుకొచ్చే సంక్రాంతిని పెద్ద పండుగగా భావిస్తాం. అందుకే ఈ పండుగ అంటే ఎంతో ఉత్సాహం. జీవనం కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఇళ్లకు చేరుకుంటారు.
అరుుతే తీవ్ర కరువు పల్లెల్లో సంతోషాలను చిదిమేసింది. కేసీ ఆయకట్టులో కొంత వరకు వరి మినహా ఇతర పంటలేవీ రైతుకు భరోసా ఇవ్వలేకపోయాయి. పండిన ధాన్యానికి గిట్టు బాటు ధర లేదు. అందుకే ఇంత పెద్ద పండుగైనా జిల్లా వాసుల్లో అంతగా సంతోషం లేదు. ‘రుణ మాఫీ’ పై ఆశలు పెట్టుకున్న రైతుల్లో ఎక్కువ శాతం మందికి భంగపాటే ఎదురైంది. అందుకే ఈ పండుగను మొక్కుబడిగా నిర్వహించుకుంటున్నారు. పిల్లల ఆనందాన్ని కాదనలేక అప్పో సప్పో చేసైనా పండుగు చేయూలని సిద్ధమయ్యారు.
ధరల దడ!
రైతన్న పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ప్రజల సంగతి సరేసరి. ఆరు నెలలుగా రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను వింటే సామాన్యునికి వణుకుపడుతోంది. పచ్చడి మెతుకులైనా తిందామనుకుంటే కొబ్బెర కిలో రూ 180, ఎండు మిర్చి రూ 100కు చేరాయి. కంది మబేడలు, చింతపండు, తెల్లగడ్డలు, ఉద్దిపప్పు, వేరుశనగ పప్పు కిలో రూ 80 నుంచి 90లకు చేరాయి.
పెసలు, పెసరపప్పు ధర కిలో రూ 100 నుంచి 1290కు చేరుకుంది. అలాగని పండించిన రైతుకు గిట్టుబాటు ధర అటుంచి, పెట్టుబడులు కూడా దక్కడం లేదు. ఈ నేపధ్యంలో సామాన్యుడు మార్కెట్ గురించి తలుచుకుంటేనే భయపడే స్థితికి చేరారు. అయినా సంసృ ్కతీ సాంప్రదాయాలకు పెద్దపీట వేసే గుణం గల ప్రజలు ఆకలి బాధను, సమస్యలను అణిచి పెట్టుకుని సంక్రాంతి లక్ష్మిని సాధరంగా ఆహ్వానిస్తున్నారు.
పత్తాలేని ధరల నియంత్రణ కమిటీ...
పండుగ పూటేకాకుండా ఇతర సమయాల్లో కూడా ధరలపై పర్యవేక్షణ చేపట్టాల్సిన కమిటీ పత్తా లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలపై నిఘా పెట్టడానికి జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షన పనిచేసే ఈ కమిటీ జిల్లాలో నెలకోసారి ధర నియంత్రణపై సమీక్ష చేపట్టాలి. క్షేత్రస్థాయిలో ధరల హెచ్చుతగ్గులను, మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా?అని పరిశీలన చేయాల్సి ఉంటుంది. సామాన్యులకు, పేద వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయా? లేదా అని సమీక్షించాలి. ఇటీవల కాలంలో ఈ పరిశీలన చేసిన దాఖలాలు లేవు.
ధరలు ఇలా.. (కిలో/లీటరు-రూ.లలో)
నిత్యావసర పాత ధర కొత్త ధర
సరుకులు
కంది పప్పు 75 95
శనగబేడలు 45 60
అలసందలు 60 85
ఎండుకొబ్బరి 180 206
బెల్లం 45 60
గోధుమ పిండి 28 38
శనగ పిండి 46 56
వేరుశనగ నూనె 85 85-100
పామాయిల్ 58 75
సన్‌ప్లవర్ 80 95
సంక్రాంతి కళలేని పల్లె
Published Thu, Jan 15 2015 1:15 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement