ఒంగోలు జాతి పశు ప్రదర్శన | Ongole breed cattle show | Sakshi
Sakshi News home page

ఒంగోలు జాతి పశు ప్రదర్శన

Published Thu, Jan 1 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

Ongole breed cattle show

తెలుగు నేల కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన అరుదైన దేశీ పశు జాతి ఒంగోలు.  సంక్రాంతి సంబరాల్లో ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన ముఖ్యఘట్టం. ఒంగోలు జాతి పెయ్యలు, పాడి ఆవులు, గిత్తల తెలుగు రాష్ట్రాల స్థాయి ప్రదర్శన జనవరి 9, 10, 11 తేదీల్లో నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు మైదానంలో జరగనుంది. పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఒక్కో విభాగంలో మూడేసి బహుమతులు ప్రదానం చేస్తారు. ఇతర వివరాలకు ట్రస్టు మేనేజర్ సుబ్బారెడ్డిని 98663 33079 నంబరులో సంప్రదించవచ్చు.
 
గండిపేటలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శిబిరం

‘రుషి-కృషి’ పేరిట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో జనవరి 2-4 తేదీల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణా శిబిరం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట(ఓషన్ పార్క్ నుంచి 3 కి.మీ. దూరం)లోని మానస గంగ ఆశ్రమంలో శిబిరం నిర్వహిస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, తదితరులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. ఉమామహేశ్వరిని 90004 08907 నంబరులో సంప్రదించవచ్చు.
 
‘గో ఆధారిత’ రైతు సంఘాల నేతల సమావేశం

జనవరి 9వ తేదీ ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గోఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆంధ్ర, తెలంగాణ జిల్లాల నేతల సమావేశం జరుగుతుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 8వ తేదీనే విజయవాడ చేరుకోనున్న పాలేకర్.. అదేరోజు ఉదయం 10 గంటలకు మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రకృతి సేద్యంపై సదస్సులో పాల్గొంటారు. 10వ తేదీ ఉదయం ప్రెస్‌క్లబ్‌లో తెలుగు రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. వివరాలకు.. 94401 27151, 94404 87864, 98667 60498, 81065 66828 నంబర్లలో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement