animal performance
-
పశువులకూ ’108’ తరహా సేవలు
పటాన్చెరు: గ్రామగ్రామాన రైతులఇళ్ల వద్ద పాడి పశువుల సంపద పెరగాలని నీటిపారుదలశాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శుక్రవారం జిల్లా స్థాయి పశుప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పశువుల ప్రాణాలను నిలబెట్టేందుకు అవసరమైన అత్యవసర సేవలందించేందుకు 108 వంటి అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. త్వరలో ఈ అంబులెన్స్ సేవలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. పశువైద్య విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతుకు విద్యుత్ సబ్సిడీ: పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇన్సూరెన్స్ పథకాన్ని పశువుల కోసం ప్రవేశపెట్టిందన్నారు. రైతులు ఇన్సూరెన్స్ కోసం రూ.200 ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము ప్రభుత్వం భరిస్తుందన్నారు. రూ. 60 వేల వరకు బీమా సొమ్ము పొందవచ్చని సూచించారు. పాడిరైతుల అభివృద్ధికి విజయ డెయిరీ పాలసేకరణలో రైతుకు లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తున్నామని, దీంతో మిగతా అన్నిడెయిరీలు రైతులకు అదే ధరను ఇవ్వాల్సి వచ్చిందని దాంతో రైతుకు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
14 న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన
కడప అగ్రికల్చర్ : ఈనెల 14వ తేదీన అనంపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశువుల అందాల పోటీలు, బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒంగోలు జాతి పశుపరిక్షణ సమితి అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ పోటీలు ఉంటాయని అన్నారు. తాడిపత్రిలోని నూతన మున్సిఫల్ కార్యాలయ సమీపంలో ఈ పోటీలు ఉంటాయని తెలిపారు. పాలపళ్ల నుంచి ఎనిమిది పళ్లతో ఉన్న పశువులను ఈ పోటీలకు తీసుకు రావచ్చని అన్నారు. ఈ పోటీలలో పశువులను, పక్షులను తీసుకువచ్చే వారికి అన్ని వసతి సదుపాయాలు కల్పిస్తామని పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న ఒంగోలు జాతి పశువులున్న వారు ఈ పోటీలకు పశువులను, పక్షులను ప్రదర్శనకు తీసుకువెళ్లవచ్చని తెలిపారు. ప్రతి పోటీలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారన్నారు. -
ఒంగోలు జాతి పశు ప్రదర్శన
తెలుగు నేల కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన అరుదైన దేశీ పశు జాతి ఒంగోలు. సంక్రాంతి సంబరాల్లో ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన ముఖ్యఘట్టం. ఒంగోలు జాతి పెయ్యలు, పాడి ఆవులు, గిత్తల తెలుగు రాష్ట్రాల స్థాయి ప్రదర్శన జనవరి 9, 10, 11 తేదీల్లో నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు మైదానంలో జరగనుంది. పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఒక్కో విభాగంలో మూడేసి బహుమతులు ప్రదానం చేస్తారు. ఇతర వివరాలకు ట్రస్టు మేనేజర్ సుబ్బారెడ్డిని 98663 33079 నంబరులో సంప్రదించవచ్చు. గండిపేటలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శిబిరం ‘రుషి-కృషి’ పేరిట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో జనవరి 2-4 తేదీల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణా శిబిరం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట(ఓషన్ పార్క్ నుంచి 3 కి.మీ. దూరం)లోని మానస గంగ ఆశ్రమంలో శిబిరం నిర్వహిస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, తదితరులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. ఉమామహేశ్వరిని 90004 08907 నంబరులో సంప్రదించవచ్చు. ‘గో ఆధారిత’ రైతు సంఘాల నేతల సమావేశం జనవరి 9వ తేదీ ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గోఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆంధ్ర, తెలంగాణ జిల్లాల నేతల సమావేశం జరుగుతుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 8వ తేదీనే విజయవాడ చేరుకోనున్న పాలేకర్.. అదేరోజు ఉదయం 10 గంటలకు మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రకృతి సేద్యంపై సదస్సులో పాల్గొంటారు. 10వ తేదీ ఉదయం ప్రెస్‌క్లబ్‌లో తెలుగు రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. వివరాలకు.. 94401 27151, 94404 87864, 98667 60498, 81065 66828 నంబర్లలో సంప్రదించవచ్చు.