14 న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన | ongole breed animal show in 14 th april | Sakshi
Sakshi News home page

14 న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన

Published Wed, Apr 8 2015 7:20 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

ongole breed animal show in 14 th april

కడప అగ్రికల్చర్ : ఈనెల 14వ తేదీన అనంపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశువుల అందాల పోటీలు, బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒంగోలు జాతి పశుపరిక్షణ సమితి అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ పోటీలు ఉంటాయని అన్నారు. తాడిపత్రిలోని నూతన మున్సిఫల్ కార్యాలయ సమీపంలో ఈ పోటీలు ఉంటాయని తెలిపారు. పాలపళ్ల నుంచి ఎనిమిది పళ్లతో ఉన్న పశువులను ఈ పోటీలకు తీసుకు రావచ్చని అన్నారు.

ఈ పోటీలలో పశువులను, పక్షులను తీసుకువచ్చే వారికి అన్ని వసతి సదుపాయాలు కల్పిస్తామని పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న ఒంగోలు జాతి పశువులున్న వారు ఈ పోటీలకు పశువులను, పక్షులను ప్రదర్శనకు తీసుకువెళ్లవచ్చని తెలిపారు. ప్రతి పోటీలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement