పెద్దల పండగకు ఏర్పాట్లు చేయాలి
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్
నెల్లూరు (సెంట్రల్): నగరంలో సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న పెద్దల పండగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్‌బాబుతో కలసి శనివారం ఆయన బోడిగాడితోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అనేక మంది ప్రజలు పెద్ద పండగ రోజున దివంగతులైన వారి బంధువులు, ఆత్మీయులకు పూజలు నిర్వహించేందుకు బోడిగాడితోటలోకి వస్తారన్నారు.
ఈ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుధ్య ఏర్పాట్లను కార్పొరేషన్ సిబ్బంది చేయాలన్నారు. నాయకులు ఎవరైనా పత్రికల్లో ఫొటోల కోసం చీపుర్లు పట్టినా నగరాన్ని శుభ్రంగా ఉంచేది మాత్రం పారిశుధ్య కార్మికులేనన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారులదేనని తెలిపారు. అనంతరం ఐదో డివిజన్‌లోని అరవపాళెం, బర్మాశాలగుంట ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో పేదలకు నగరానికి సమీపంలో నివాస యోగ్యమైన స్థలంలో ఇళ్లు కట్టించి కనీసం సౌకర్యాలు కల్పించాలని కమిషనర్‌కు సూచించారు.
కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, శోభన్‌బాబు, సుకుమార్, సునీల్, మల్లికార్జున, నాగేంద్ర, మహేంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బాబూరావు, రఫీ, రాజా, పి.రఘురామిరెడ్డి, మున్నా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వంగాల శ్రీనివాసులురెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్‌సిద్ధిక్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు వి.శ్రీహరిరాయలు, బి.హరిప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు.