సొంతిల్లు మెరవాలంటే.. | special story on home decors | Sakshi
Sakshi News home page

సొంతిల్లు మెరవాలంటే..

Published Fri, Sep 15 2017 11:23 PM | Last Updated on Fri, Sep 22 2017 6:40 PM

సొంతిల్లు మెరవాలంటే..

సొంతిల్లు మెరవాలంటే..

సాక్షి, హైదరాబాద్‌ : పండగొస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేస్తుంటాం. అలా అని ప్రతి పండక్కి ఇంటికి రంగులు వేయించలేం. ఉన్నంతలో ఇంటిని మెరిపించాలంటే కాసింత కళాత్మకత ఉంటే చాలు. ఇందుకోసం ప్రత్యేకంగా షాపింగ్‌లేమీ అవసరం లేదు. గోడలకు మంచి వాల్‌పేపర్స్‌ అతికించడం, పాత ఫర్నిచర్‌కు మెరుగులు దిద్దటం, బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్, డ్రాయింగ్‌ రూములను చిన్న చిన్న మార్పులతో పొందికగా మలుచుకోవటం లాంటివి చేస్తే చాలు. ఇల్లు ముచ్చటగా.. పొదరిల్లులా మారుతుంది.

డ్రైనింగ్‌ రూమ్‌లో పెద్ద టేబుల్‌ పెట్టి దానిని చైనీస్‌ పోర్సిలిన్‌ తరహా వస్తువులతో అలంకరిస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఆ వస్తువులు గది రంగుకి మ్యాచ్‌అవ్వాలనేమీ లేదు.
వంటింటికి అందమైన లెనిన్‌ కర్టెన్‌ అమర్చాలి. ఇలా చేస్తే కిచెన్‌ లుక్‌ బాగుండటమే కాదు లోపల మనం ఏం చేస్తున్నది ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు. వంటింటికి స్టీల్‌ అండ్‌ గ్లాస్‌ కేస్‌మెంట్స్‌ ఫ్రేమ్స్‌ని పెడితే చూడ్డానికి మరింత అందంగా ఉంటుంది. ఆరు బయట ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పని చేసుకోవచ్చు.
బెడ్‌రూమ్‌లో మంచంపై మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ దుప్పట్లు, దిండు గలేబులు వేస్తే ఆ రూముకి కొత్త అందం వస్తుంది. బెడ్‌రూమ్‌లో యాంటిక్‌ కేజ్‌లైట్స్‌ పెట్టుకుంటే బాగుంటుంది.
బాత్‌రూమ్‌లో పెడస్టల్‌ టబ్, ఫిక్సర్లు అమర్చుకుంటే బాగుంటుంది. ఇల్లు కట్టిన కాలాన్ని గుర్తు చేసేలా ఆ ఇంట్లోని వస్తువుల అమరిక ఉంటే గదులకు యాంటిక్‌ లుక్‌ వస్తుంది.
ఇంట్లో ఉన్న పాత సోఫా, ఇతర ఫర్నిచర్‌లకు పెయింట్‌ వేస్తే న్యూలుక్‌తో అవి మెరిసిపోతాయి. హాలులో ఉన్న పెద్ద గోడలకు వెరైటీగా రంగు రంగుల ప్లేట్లను అతికిస్తే చూడ్డానికి ఆర్ట్‌పీస్‌లా ఎంతో బాగుంటుంది.
గెస్ట్‌ రూమ్‌లో వినైల్‌ షేడ్స్‌తో వాల్‌ పేపర్లను అతికిస్తే ఆ గది అందం ద్విగుణీకృతం అవుతుంది.
హాలు మధ్యలో ఉండే సన్నని దారులపై చిక్కటి రంగు, డిజైన్లు ఉంటే కార్పెట్లు పరిస్తే చూడ్డానికి గ్రాండ్‌గా, డెకొరేటివ్‌గా ఉంటుంది.
ఇంట్లో ఉన్న వాలు కుర్చీలపై పాత కర్టెన్లు పరిస్తే వెరైటీగా ఉంటుంది. వాటిపైనున్న పాతకాలం నాటి డిజైన్లు కుర్చీలకు కొత్త అందాన్ని ఇస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement