Visakhapatnam-Hyderabad
-
పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ‘ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు’
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అంకుషాపూర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. 16 పైగా బోగిలతో విశాఖ నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరిందని, అందులోని ఆరో బోగీలు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అన్నారు. రైలులోని వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్ (040 27786666) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. దెబ్బ తిన్న పట్టాలు, సిమెంట్ దిమ్మెల తొలగింపు కొనసాగుతోందని.. సుమారు 400 మంది రైల్వే సిబ్బంది మరమత్తు చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. Train No.12727 (Visakhapatnam - Secunderabad) Godavari Express got derailed btw Bibinagar - Ghatkesar. *6 coaches derailed:* S1 to S4, GS, SLR *No casualties/Injuries* Passengers are being cleared by the same train by detaching the derailed coaches. Helpline No: 040 27786666 pic.twitter.com/YuBIln1BgK — South Central Railway (@SCRailwayIndia) February 15, 2023 ‘గోదావరి ఎక్స్‌ప్రెస్ భోగిలన్నీ జర్మనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(లింకే-హాఫ్మన్-బుష్) బోగిలే. ఒక ఎల్ఎహెచ్బీ కోచ్ కాలపరిమితి 35 ఏళ్లు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి ఉత్పత్తి అవుతాయి. ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం స్టీల్‌తో కోచ్‌ల తయారీ అవుతాయి. 2020 నుంచి ఈ టెక్నాలజీ కోచ్‌లను తయారు చేయిస్తున్నాం. ఈ టెక్నాలజీనే అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఏ కోచ్‌కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో, మరో బోగీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బోగీలు పక్కకు జరగవు. ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు ఎంత స్పీడ్‌లో ఉన్నా.. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం ఆధునాతనంగా ఉంటుంది. ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ద్వారా బోగీలు ఢీ కొనడం లాంటివి, స్లయిడ్ అవ్వకుండా ఆపగలుగుతుంది.’ అని తెలిపారు. -
హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు
ఈ నెల 9,16, 23, 30వ తేదీలలో విశాఖ- హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి తిరిగి విశాఖకు.. విశాఖపట్నం సిటీ: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని తూర్పుకోస్తా రైల్వే విశాఖ-హైదరాబాద్ మధ్య ఒక రైలును నడపనుంది. ఈ నెల 9,16,23,30వ తేదీలలో ఈ రైలు విశాఖ నుంచి రాజధానికి బయలుదేరుతుంది. ఇందులో ఎనిమిది జనరల్ బోగీలుంటాయి. ఒక సెకండ్‌ఏసీ, ఒక థర్డ్ ఏసీ, అయిదు రిజర్వేషన్ బోగీలుంటాయి. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, వరంగల్, కాజీపేట వంటి స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఆయా తేదీల్లో విశాఖలో హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 10, 17, 24,31వ తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. మర్నాడు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుందని వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.