ఉన్నత రైల్వేగా తూర్పుకోస్తాకు గుర్తింపు | East Coast Railway Recognized Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఉన్నత రైల్వేగా తూర్పుకోస్తాకు గుర్తింపు

Published Fri, Aug 15 2014 8:18 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

East Coast Railway Recognized Visakhapatnam

విశాఖపట్నం: భారతీయ రైల్వేలో తూర్పు కోస్తా(ఈస్టుకోస్టు)కు ఉన్నత స్థానం లభించింది. గత ఏడాదిలో ఈస్టుకోస్టు రైల్వే ఆపరేటింగ్ నిష్పత్తి 48.45గా పెరుగుదల వుండడంతో ఈ గుర్తింపు సొంతమైంది. విశ్వవ్యాప్త రైల్వేల చరిత్రలో వ్యాపార సరళి తక్కువగా నమోదవుతున్న తరుణంలో లోడింగ్, ప్రయాణికుల ఆదాయాల్లో ఈస్టుకోస్టు రైల్వే ఉత్తమ ఫలితాలను సాధించింది.  

ఇదే ధోరణి కొనసాగిస్తే భారతీయ రైల్వేల్లో అత్యధిక లోడింగ్ రైల్వేగా ఈస్టుకోస్టు  ఘనత సాధిస్తుందని ఆ దిశగా ఉద్యోగులంతా పని చేయాలని జనరల్ మేనేజర్ రాజీవ్ విష్ణోయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వాల్తేరు ఉద్యోగులందరికీ జీఎం తమ సందేశాన్ని పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement