
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవుల నేపథ్యంలో అరకు పర్యాటకుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–అరకు మధ్య అక్టోబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఈ స్పెషల్ రైలు (08509) ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ రైలు(08510) అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 5–స్లీపర్‌క్లాస్, 7–సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లతో నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు స్టేషన్‌లలో ఆగుతాయి.
వంజంగి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి
సాక్షి, పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మేఘాల కొండ వంజంగి హిల్స్‌కు మంగళవారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు వంజంగి హిల్స్ ప్రాంతానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు, మేఘాలను చూసి పరవశించారు. ఉదయం 10గంటల వరకు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment