Vanjangi Hills
-
మబ్బుల్లో తేలుదాం.. మంచును ముద్దాడదాం
మబ్బులకు పైనుండే గిరి శిఖరాలు, కొండల నడుమ పాలనురగలా తేలియాడే మంచు మేఘాలు, పొద్దు పొడుస్తూనే భానుడు పొన్నపూవు ఛాయలో అలా..అలా.. పైకివస్తూంటే, మబ్బుల అలల మధ్య నిల్చొని ఊషోదయ భానుని అందాలు తనివితీరా ఆస్వాదిస్తుంటే.. ఆ అనుభూతి వర్ణణాతీతం. చెట్ల ఆకులపైన తుషార బింధువులు సూర్యుని లేలేత కిరణాలుపడి మెరిసిపోతుంటే, ఆమెరుపు పర్యాటకుల ముఖంలో ప్రతిబింబిస్తుంది. మన్యం రుచులు, మంచు అందాలతో వంజంగి పర్యాటకులకు మధురానుభూతులు పంచుతోంది.సాక్షి,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు 7 కిలోమీటర్ల దూరంలోని వంజంగిహిల్స్ పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు పొందింది. గత నాలుగేళ్లుగా వంజంగి శిఖరాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎత్తయిన వంజంగి కొండల మీదుగా కొత్తవలస ప్రాంతానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తారురోడ్డు సౌకర్యం కలి్పంచడంతో పర్యాటకులకు మరింత అనుకూలతగా మారింది. అక్టోబర్ నుంచి జనవరి నెల వరకు ప్రతి ఏడాది వంజంగి హిల్స్ ప్రాంతానికి తండోప తండాలుగా పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం పర్యాటక సీజన్ కావడంతో వంజంగి హిల్స్‌లోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగానే తరలివస్తున్నారు..వంజంగి హిల్స్‌లో ప్రకృతి అద్భుతంశీతాకాలం ప్రారంభమైన తర్వాత ఈ వంజంగి కొండలపై మంచు ,మేఘాల అందాలు చూపరులను మరింత కనువిందు చేస్తున్నాయి. వంజంగి ఘాట్ ప్రాంతం నుంచి దిగువన ఉన్న కొండలన్ని మంచు ముసుగులో అద్భుతంగా కనిపించడంతో పాటు అక్కడ నుంచి రెండు గంటల పాటు కాలినడకన ఎత్తయిన బోలెంగమ్మ పర్వతానికి చేరుకుంటే సూర్యోదయం అందాలు, పాలసముద్రంలా మేఘాలు,పొగమంచు అందాలతో పర్యాటకులు పిధా అవుతున్నారు. బోలెంగమ్మ పర్వతానికి తెల్లారకముందే పర్యాటకులు చేరుకుంటున్నారు. సూర్యోదయం అయ్యే సమయంలో ఇక్కడ రమణీయ దృశ్యాలు వారిని మరింత అబ్బుర పరుస్తున్నాయి. వంజంగి హిల్స్ ప్రాంతం విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. గూగుల్‌లో ఈ పర్యాటక ప్రదేశం గురించి సెర్చ్ చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.పర్యాటక స్వర్గం వంజంగి హిల్స్‌తో పాటు సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా రాత్రంతా వంజంగి హిల్స్ సమీపంలోని కాటేజీలు, గుడారాల్లో మకాం వేసి సూర్యోదయం అవకముందే బోలెంగమ్మ పర్వతానికి కాలినడకన చేరుకుంటున్నారు. వంజంగి ఘాట్‌తో పాటు బోలెంగమ్మ శిఖరం వరకు ఇక్కడ మంచు అందాలు పాలసముద్రంలా పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. వంజంగి హిల్స్ అందాలు అద్భుతం వంజంగి హిల్స్‌కు వచ్చే పర్యాటకులకు వసతి సౌకర్యాలను కలి్పంచేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకుంది.వంజంగి హిల్స్‌కు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసాం.పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలుశాఖల అ«ధికారులను అప్రమత్తం చేసాం.వంజంగి హిల్స్‌లో పర్యాటక అభివృద్ధి,గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.అభిõÙక్, ఐటీడీఏ పీవో, పాడేరు. కాటేజీలు నిరి్మస్తే బాగుంటుంది వంజంగి హిల్స్‌లో సూర్యోదయం, పాలసముద్రం లాంటి మేఘాలు, పొగమంచు అందాలు అద్భుతంగా ఉన్నాయి. గంటన్నర సమయం నడిచి వంజంగి హిల్స్‌పై సూర్యోదయంతో పాటు మంచు అందాలను వీక్షించడం సంతోషంగా ఉంది.వంజంగి హిల్స్‌లోనే కాటేజీలు నిర్మిస్తే పర్యాటకులకు మరింత మేలు జరుగుతుంది.వంజంగి నుంచి అరకులోయ ప్రాంతం వరకు రోడ్లు అభివృద్ధితో పర్యాటకుల వాహనాల ప్రయాణానికి ఇబ్బందులు తప్పాయి. – కనకల ఈశ్వరరావు, పర్యాటకుడు,విశాఖపట్నం -
Araku Valley: అరకు పర్యాటకుల కోసం ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా సెలవుల నేపథ్యంలో అరకు పర్యాటకుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం–అరకు మధ్య అక్టోబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఈ స్పెషల్ రైలు (08509) ప్రతీ రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్యాహ్నం 11.30 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ స్పెషల్ రైలు(08510) అరకులో ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు 5–స్లీపర్‌క్లాస్, 7–సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లతో నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో సింహాచలం, కొత్తవలస, బొర్రాగుహలు స్టేషన్లలో ఆగుతాయి. వంజంగి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి సాక్షి, పాడేరు: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మేఘాల కొండ వంజంగి హిల్స్‌కు మంగళవారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దసరా సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, విద్యార్థులు వంజంగి హిల్స్ ప్రాంతానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు, మేఘాలను చూసి పరవశించారు. ఉదయం 10గంటల వరకు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంది. -
మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!
సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు. వంజంగి హిల్స్‌లో మంచుతెరలు పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది. అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు) -
Photo Feature: వంజంగి కొండలపై పాల సముద్రం..
సాక్షి, పాడేరు: వంజంగి హిల్స్‌లో మూడు రోజులుగా పొగమంచు, మేఘాల అందాలు అలరిస్తున్నాయి. శనివారం వేకువజామున 5గంటలకు సూర్యోదయం కనువిందు చేసింది. ఆహ్లాదకర వాతావరణంతో పాటు సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. వంజంగి హిల్స్‌లో మంచు అందాలు నెలకొనడంతో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది. చదవండి: Photo Feature: మేమా.. టైంకు రావడమా.. సీలేరు: దారాలమ్మతల్లి ఆలయం సమీప అటవీ ప్రాంతం పొగమంచుతో కనువిందు చేసింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఘాట్ మీదుగా ప్రయాణం సాగించిన వాహనదారులు, స్థానికులు ఈ పొగమంచు అందాలను వీక్షించి ఎంతో పరవశించారు. -
కొండలను దాటి.. గుట్టలు ఎక్కి.. పరుగో పరుగు.. 5.41 గంటల్లోనే 50 కి.మీ. పూర్తి!
విశాఖ స్పోర్ట్స్: ఎటూ చూసినా ఎత్తైన పచ్చని కొండలు.. ఆ కొండల మధ్య పాల సముద్రాన్ని తలపించే దట్టమైన పొగమంచు అందాలు.. జాలువారే జలపాతాలు.. అలాంటి ప్రకృతి సోయగాల నడుమ పరుగు పోటీ అంటేనే ఆ మజా వేరు. కొండలు.. గుట్టలు దాటుకుంటూ.. నడవటానికి సరిగా లేని కొండవాలుపై పడుతూ..లేస్తూ.. నిర్ణీత సమయంలో లక్ష్యం చేరేందుకు ప్రకృతితో కలిసి పరుగు పెట్టారు సాహసికులు. ఇందుకు వేదికైంది వంజంగి హిల్స్. విశాఖ ఏజెన్సీల్లోని పర్వత పంక్తుల్లో వంజంగి హిల్స్ ప్రత్యేకతే వేరు. లంబసింగి పర్వతపంక్తిలో బాగా చలి వాతావరణం ఉంటే.. వంజంగి మాత్రం కాస్త వేడి వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాంటి చోట సుమారు 115 మంది సాహసికులు ఇటీవల నిర్వహించిన 50 కిలోమీటర్ల ట్రయల్ రన్లో పాల్గొని.. ప్రకృతిని ఆస్వాదించారు. ఇందులో మహిళలు ఉండటం విశేషం. విభిన్నంగా సాగిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి అనుభూతి.. అనుభవాలు.. వారి మాటల్లోనే.. Visakhapatnam: వంజంగి హిల్స్‌లోని రన్నర్స్ విలేజ్‌లో ప్రారంభమైన ట్రయల్‌రన్ తిరిగి అక్కడికే చేరుకోవడంతో ముగిసింది. ట్రయిల్‌రన్‌ను 11 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. ప్రతి లెగ్ నిర్ణీత సమయంలో చేరుకోవాలి. 50 కిలోమీటర్ల ట్రయల్ రన్లో 50 మంది, 25 కిలోమీటర్ల పరుగులో దాదాపు 65 మంది పోటీపడ్డారు. బొడ్డపుట్టు, పోతురాజుమెట్ట, సోలములు, కళ్లాలబయలు, గొందూరు, గుర్రంపణుకుల్లోని కొన్ని గ్రామాలను కలుపుతూ 50 కిలోమీటర్ల ట్రయల్‌రన్ నిర్వహించారు. క్యాంపింగ్ స్పాట్లలో సేద తీరుతూ.. ఉత్సాహవంతులు కొండ గుట్టలు ఎక్కి దిగుతూ పరుగుపెట్టారు. సాధారణ మారథాన్‌లో లాగా ఇక్కడ చక్కటి ట్రాక్ ఏర్పాట్లు ఉండవు. ఒక చోట కొండవాలులోనే పరుగెత్తితే.. మరో చోట పడిపోయే స్లోప్స్‌లో బాలెన్స్ చేస్తూ ముందుకు సాగారు. ప్రకృతితో మమేకం ట్రయల్ రన్ అంతా సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలోనే సాగింది. చివరి 10 కిలోమీటర్లు అక్కడ నివసించే గిరిజన తెగలతో ముచ్చట్లు, వారి ఆచార అలవాట్లను పరిచయం చేసుకుంటూ సాహసికులు మందుకు సాగారు. కొందరు సాహసికులు ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన వారు కావడంతో వారికి భాషతో ఇబ్బంది అయినా.. గిరిజనులతో హావభావాలు ప్రదర్శిస్తూ, పలకరిస్తూ సాగిపోవడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. సముద్రమట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తు వరకు ఉండే ఇక్కడ పరుగుతో నడక కూడా ఒక భాగమే. ఎందుకంటే అక్కడ కేవలం నడిచేందుకే మార్గం ఉంటుంది. ఇక్కడ కొందరు గాయాల పాలైనా.. గమ్యాన్ని చేరుకునే క్రమంలో వెనుకడుగు వేయలేదు. సమయానికి రాకుంటే... తొలి చెకింగ్ పాయింట్ 17.5 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని మూడున్నర గంటలలోపే చేరుకోవాలి. అలా చేరుకోని వారిని అక్కడే ఆపేశారు. అక్కడి నుంచి మరో ఆరు కిలోమీటర్ల మేర జంగీ పాయింట్. బంగారుపేట వద్ద మరో పాయింట్. ఇది పది కిలోమీటర్ల సాగుతుంది. ఇదంతా అటవీప్రాంతం. ఈ మారథాన్‌లో కొందరు ట్రయల్ డిబెట్‌గా 10 కిలోమీటర్ల మేరకే పోటీ పడగా మరికొందరు హిల్ చాలెంజ్ 25 కిలోమీటర్ల మేర పోటీపడ్డారు. ఇక సాహసికులు ఫ్లాగ్షిప్ కేటగిరీలో 50 కిలోమీటర్లు పూర్తి చేసి విశాఖ ట్రయల్ రన్ సంఘం నుంచి బహుమతులు అందుకున్నారు. రూటే విభిన్నం తొలిసారి ఈ ట్రయల్ రన్లో పాల్గొన్నాను. జమ్ము కశ్మీర్ నా స్వస్థలం. హాఫ్ మారథాన్‌లో శిక్షణనిస్తుంటా. కానీ నాకు ఈ పరుగు చాలా కొత్త. అసలు ఈ ట్రయల్‌రన్ రూటే చాలా విభిన్నంగా ఉంది. ఇది అంతా ఈజీ కాదు. దారివెంట గిరిజనుల జీవన విధానం ఎంతో ఆకట్టుకుంది. ఒకసారికే మేమింత కష్టపడితే.. వీరంతా ప్రతిరోజూ కొండలెక్కి దిగుతూ ఎంత శ్రమపడతారో! ఇక్కడ సహజసిద్ధంగా పారే నీటిని చేతులతో తాకకుండా తాగాం. ఇక్కడి ప్రజలు పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉన్నారు. –కీర్తి, మహిళా విభాగం విజేత ఎంతో శ్రమించాం అల్ ట్రైబ్ పాడేరు పేరిట ఈ ట్రయల్ రన్ నిర్వహించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల సాహసికులు పోటీపడ్డారు. రూట్ మ్యాప్ తయారు, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడానికి నెలల వ్యవధి పట్టింది. ఇంతలో ఎన్నికలు వచ్చి కొంత ఆలస్యమైంది. పలు మార్లు రూట్లో ట్రయల్స్ నిర్వహించుకున్నాం. వీటీఆర్ఏ పేరిట చివరికి మూడు కేటగిరీల్లో పోటీ నిర్వహించి విజయవంతం చేసుకోగలిగాం. ఐటీఆర్ఏ పోటీలకు సమాయత్తమవుతున్నాం. – యోగేష్, ట్రయల్ రన్ నిర్వాహకుడు గాయాలు తగిలినా.. గమ్యాన్ని చేరాను హైదరాబాద్ నుంచి ఆరుగురం ఈ ట్రయల్ రన్లో పాల్గొన్నాం. నలుగురు 25 కిలోమీటర్లు, ఒక్కరు 10 కిలోమీటర్లు, నేను 50 కిలోమీటర్ల పోటీలో పాల్గొన్నాను. నాకు గతంలో మారథాన్‌లో పాల్గొనే అనుభవం ఉంది. అదంతా రోడ్డు. ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది. అయినప్పటికీ రెండో స్థానంలో నిలిచాను. అటవీ ప్రాంతంలో మూడుసార్లు పడిపోయాను. ఒకసారి మోకాలికి గాయం అయింది. అయినా పట్టుదలతో గమ్యానికి చేరుకోగలిగాను. తొలి లెగ్ 17.5 కిలోమీటర్లను నిర్ణీత సమయానికి అర నిముషం ముందే పూర్తి చేశాను. ఇక్కడ వెనకబడితే వెనక్కి వచ్చేయడమే. ఇక రెండో లెగ్‌లో నాలుగు నిమిషాల ముందే లక్ష్యానికి చేరుకున్నా. మూడో లెగ్‌లో రోడ్ వస్తుంది. అక్కడకు అరగంట ముందే చేరాను. 46 కిలోమీటర్ల నుంచి ముగింపు లెగ్. ఇది బాగా ఎత్తు పల్లాలతో ఉంటుంది. ఇక్కడే పడిపోయాను. – ఆదిత్య దేవి, ద్వితీయస్థానం, మహిళా విభాగం రెండు సెకన్ల వ్యవధిలో... తొలుత నేను కాంపిటీషన్ స్ప్రింట్స్‌లో పాల్గొనేవాడిని. ఆ తర్వాత లాంగ్ రన్స్‌లో వందకు పైగా కిలోమీటర్లలో తలపడ్డాను. అయితే అందుకు భిన్నమైనది ఈ ట్రయల్‌రన్. అసలు ఈ పరుగు గురించి అవగాహన లేకుండానే పోటీపడ్డాను. 25 కిలోమీటర్ల ఈవెంట్లో తలపడగా ద్వితీయస్థానంలో నిలిచాను. 10 కిలోమీటర్లలోపే సత్తువ అయిపోతుంది. హిల్ రౌండ్ చాలా చాలెంజింగ్. తొలి లెగ్‌లో క్వాలిఫై అయి చివరికి 3.22 నిమిషాల్లోనే పూర్తిచేయగలిగాను. రెండు సెకన్ల వ్యవధిలోనే తొలిస్థానం కోల్పోయాను. ఈ టాస్క్‌ను పడి లేస్తూనే నిర్ణీత సమయంలో పూర్తి చేయగలగడం ప్రత్యేక అనుభూతిని కలిగించింది. – హరీష్మంత్రి, లాంగ్ రన్నర్ ప్రణాళికతో విజేతనయ్యా.. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నా. దేశంలోని పలు చోట్ల నిర్వహించిన ట్రయల్స్ రన్స్‌లో పాల్గొన్నాను. ఇక్కడ జరిగిన ఈ ట్రయల్‌రన్ వాటికి భిన్నం. ఎందుకంటే ఇది రెండు ఈవెంట్ల మేళవింపు. టెక్నికల్ రౌండ్‌కు ప్రణాళిక ఉన్నా.. హిల్ రౌండ్లో చాలా అప్రమత్తతో ముందడుగు వేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ముందు రూట్‌ను స్టడీ చేశాను. కొన్ని చోట్ల చాలా వేగంగా, మరికొన్ని చాలా నిదానంగా ముందుకు కదులుతూ గమ్యాన్ని చేరాను. దానికి తగ్గట్టుగానే ప్రణాళికతో 5.41 గంటల్లోనే 50 కిలోమీటర్లు పూర్తి చేయగలిగాను. ద్వితీయ స్థానంలో నిలిచిన వారి కంటే 50 నిమిషాల ముందే చేరుకోగలిగాను. తొలి లెగ్‌లోనే 350 కేలరీలు అయిపోయాయి. దారి వెంట ప్రొటీన్ ఫుడ్ తింటూనే అలసట లేకుండా ముందుకుసాగాను. దారి మధ్యలో స్థానిక గిరిజనులు ఎంతో అభిమానం చూపారు. చప్పట్లు కొడుతూ చాలా ప్రోత్సహించారు. –సుమన్ మిశ్రా, 50 కి.మీ విజేత -
అది కొడైకెనాలో.. కుల్లూలోయ కాదు.. మన విశాఖే
పౌరాణిక సినిమాల్లో నారదుల వారు తంబుర మీటుతూ.. మేఘాల్లోంచి అలా వెళ్లిపోతుంటే.. పాల కడలిలో శేషతల్పంపై విష్ణుమూర్తి పవళిస్తుంటే.. భలే అనిపించేది. అదంతా సినిమా పనితనం. మరి ధవళ వర్ణం మేఘాలు ముద్దాడుతుంటే.. నింగి తలుపులు తెరుచుకుంటూ సూరీడు చొరబడుతుంటే.. పాల కడలి కళ్ల ముందు ఉప్పొంగుతుంటే.. పచ్చని కొండలన్నీ బంగారం తాపడం చేసినట్టు మెరిసిపోతుంటే.. ఏ తనువు మాత్రం మురిసిపోదు? అలాంటి అనుభవాలకు కొడైకెనాలో.. కుల్లూలోయకో వెళ్లిపోనక్కర లేదు. విశాఖ జిల్లా వంజంగి కొండల్ని పలకరిస్తే చాలు.. పాల సంద్రం లాంటి పొగమంచు అందాలు వీక్షించేందుకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు. పాడేరు: వంజంగి హిల్స్‌తో పాటు సముద్ర మట్టానికి సుమారు 4,500 అడుగుల ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. ఏడాది వ్యవధిలో సుమారు 2లక్షలకు పైగానే పర్యాటకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు. మారుమూల వంజంగి పంచాయతీ శివారు గ్రామాలకు వంజంగి హిల్స్ వరంగా మారింది. గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తోంది. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వ కృషి వంజంగి హిల్స్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వంజంగి హిల్స్ ప్రకృతి అందాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ సూర్యోదయం, పాల సముద్రం లాంటి మంచు అందాల దృశ్యాలను ఫొటోలు, వీడియోల రూపంలో చూపించడంతో ఆయన స్పందిస్తూ పర్యాటక శాఖ ఉన్నతాధికారులను వంజంగి హిల్స్‌కు పంపించారు. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రాంప్రసాద్, డీఎం ప్రసాదరెడ్డిల బృందం వంజంగి హిల్స్‌లో పర్యాటక అభివృద్ధిపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వంజంగి హిల్స్‌కు వస్తున్న పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అంచనాలను రూపొందిస్తోంది. అందాలు అద్భుతం సోషల్ మీడియా, అంతర్జాలంలో వంజంగి హిల్స్ ప్రకృతి అందాలు హల్చల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. అత్యంత ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వతంపై ఉదయం సూర్యోదయం దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఈ కొండను సందర్శించాను. వంజంగి హిల్స్ అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకుంటోంది. – ఆర్.గోపాలకృష్ణ, పీవో, ఐటీడీఏ, పాడేరు ఉండిపోవాలనిపిస్తుంది వంజంగి హిల్స్‌లోని పాల సముద్రం లాంటి మంచు అందాలు అద్భుతంగా ఉన్నాయి. రాత్రంతా అడవిలో మకాం వేసి తెల్లారకముందే బోలెంగమ్మ శిఖరానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు అందాలను వీక్షించాక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. – కోడూరు హిమబిందు, యూట్యూబర్, విశాఖపట్నం వంజంగి హిల్స్‌కు ఎలా వెళ్లాలంటే.. విశాఖపట్నం నుంచి పాడేరుకు 117 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం 3 గంటలు. పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో వంజంగి కొండలున్నాయి. పాడేరు నుంచి వంజంగి హిల్స్ జంక్షన్ వరకు పక్కా తారురోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వంజంగి హిల్స్‌గా పేరొందిన బోనంగమ్మ కొండ వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది. జంక్షన్ నుంచి బోనంగమ్మ కొండకు కాలినడకన సమయం గంటన్నర నుంచి రెండు గంటలు. ► తెల్లవారుజామున 4 గంటల సమయానికే బోనంగమ్మ కొండకు పర్యాటకులు చేరుకోవాలి. ►రాత్రి బస చేసేందుకు ఎలాంటి కాటేజీలు లేవు. స్థానిక గిరిజనులు టెంట్లను అద్దెకు ఇస్తున్నారు. పాడేరులో లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ► వంజంగికి ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. పర్యాటకులు సొంత వాహనాల్లోనే వస్తుంటారు. పాడేరు పట్టణంలోని కార్లు, ఆటోలు మాత్రం ముందుగా బుక్ చేసుకుంటే అద్దెకు వస్తాయి. ► తినడానికి పలు రకాల చికెన్ వంటకాలు, అల్పాహారం, నూడుల్స్, నీళ్లు అమ్ముతారు. ► పాడేరు నుంచి 46 కిలోమీటర్ల దూరంలో అరకులోయ, 30 కిలోమీటర్ల దూరంలో జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, 60 కిలోమీటర్ల దూరంలో లంబసింగి పర్యాటక ప్రాంతాలున్నాయి. ► పాడేరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యగుండం క్షేత్రం, పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయం, ఘాట్‌లోని కాఫీ తోటలు, అమ్మవారి పాదాలు గుడి, అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన డల్లాపల్లి ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.