
ఆహ్లాదకర వాతావరణంతో పాటు సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదించారు.
సాక్షి, పాడేరు: వంజంగి హిల్స్‌లో మూడు రోజులుగా పొగమంచు, మేఘాల అందాలు అలరిస్తున్నాయి. శనివారం వేకువజామున 5గంటలకు సూర్యోదయం కనువిందు చేసింది. ఆహ్లాదకర వాతావరణంతో పాటు సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. వంజంగి హిల్స్‌లో మంచు అందాలు నెలకొనడంతో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది.
చదవండి: Photo Feature: మేమా.. టైంకు రావడమా..
సీలేరు: దారాలమ్మతల్లి ఆలయం సమీప అటవీ ప్రాంతం పొగమంచుతో కనువిందు చేసింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఘాట్ మీదుగా ప్రయాణం సాగించిన వాహనదారులు, స్థానికులు ఈ పొగమంచు అందాలను వీక్షించి ఎంతో పరవశించారు.