‘ఫైన్’గా లేకపోతే ‘ఫైనే’
‘ఫైన్’గా లేకపోతే ‘ఫైనే’
Published Tue, Jul 19 2016 11:54 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
తాటిచెట్లపాలెం: నిత్యం విశాఖ–కాకినాడ పాసింజర్‌లో అనకాపల్లి వెళ్లే అప్పారావు రోజు మాదిరిగానే విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు కాలక్షేపానికి సమోసా తింటూ ఆ కాగితాన్ని డస్ట్‌బిన్నులో వేయకుండా కిందపడేసాడు. ఇంకేముంది రైల్వే అధికారులు రూ.100 ఫైన్ విధించారు. అదేవిధంగా కాంతారావు మూత్రవిసర్జనం రైలు పట్టాలమీదే కానిచ్చేయండంతో రూ.300 బాదారు. ఇదీ వాల్తేరుడివిజన్‌లో ఎ–1కేటగిరి రైల్వేస్టేషన్లలో ప్రస్తుతం అమలవుతున్న విధానం...
పరిశుభ్రతవైపు ఓ అడుగు అన్నచందాగా వాల్తేరుడివిజన్ అడుగులు వేస్తోంది. ఎ1స్టేషన్లుగా పరిగణించే విశాఖపట్నం, రాయగడ, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, రాయగడ స్టేషన్లతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనికై రైల్వేయాక్ట్ ను అనుసరించి స్టేషన్‌పరిసరాన్ని నాశనంచేసే వారినుంచి గరిష్టంగా రూ.500 వరకూ వసూలుచేయనున్నారు. సంబంధిత రైల్వేస్టేషన్లలో ఉమ్మివేసినా, చెత్తవేసినా, గోడలపై పనికిమాలిని రాతలు రాసినా ఫైన్‌చెల్సించాల్సి ఉంటుంది. వీటితో పాటు బట్టలు ఉతకడం, వంటలుచేయడం, మూత్రంపోయడంపై ఆంక్షలు విధించారు.
పలు నూతన విధానాల్ని అవలంబిస్తున్న విశాఖ రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే వైఫై అనాబుల్ సౌకర్యంతో పాటు వాషబుల్‌ఆప్రాన్‌వంటి అధునాతన టెక్నాలజీని వాడుతున్న తరుణంలో ప్రయాణికుల భాద్యత అనే అంశానికి ప్రాధాన్యతనిచ్చి పరిశుభ్రతలో వారిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్టుగా రైల్వేవర్గాలుతెలిపాయి. ఫైన్‌బాదుడు ఇలా ఉంటుంది...
చెత్తాచెదారం వేస్తే– రూ.100
ఉమ్మివేస్తే..–రూ.200
మూత్రవిసర్జనకు–రూ.300
గోడలను పాడుజేస్తే–రూ.500..వీటితోపాటు రైల్వే పరిసరప్రాంతాల్లో ఉమ్మివేస్తే రూ.30 ఫైన్ వసూలుచేస్తారు. ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించి మసులుకోవాలని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
Advertisement