
సాక్షి, అడవివరం (విశాఖ పట్నం): వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్ఫూర్తివంతమైన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం అడవివరం జెడ్పీ హైస్కూల్‌కు విచ్చేసిన ఆయన.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలను ఘనంగా సత్కరించారు.
పాఠశాలలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్న ఆయాల సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం పాఠశాలలోని టాయిలెట్లను కలెక్టర్ స్వయంగా క్లీన్ చేసి ఆదర్శంగా నిలిచారు.