clean
-
మేకప్ బ్రష్‌లు శుభ్రం చేస్తున్నారా..?
సాధారణంగా ముఖానికి మేకప్ వేసుకున్నాక, కొన్ని గంటల్లోనే దాన్ని క్లీన్స్ చేస్తుంటాం. చాలా శ్రద్ధగా చర్మం పాడవకుండా చూసుకుంటాం. మరి మేకప్ కోసం రోజూ వాడే బ్రష్‌ల సంగతేంటి? వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారా? ఆ తర్వాత ఆరబెడుతున్నారా? బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్త పడుతున్నారా? లేదంటే యమ డేంజర్ అంటున్నారు నిపుణులు. కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ మేకప్ బ్రష్‌లను శుభ్రం చేసుకోమని హెచ్చరిస్తున్నారు. చేతులతో శుభ్రం చేస్తే బ్రష్‌లు పూర్తిగా శుభ్రపడవని అనుకుంటున్నారా? మేకప్ బ్రష్‌లను సులువుగా శుభ్రం చేయడానికే ఈ మేకప్ బ్రష్ క్లీనర్ అందుబాటులోకి వచ్చింది. చిత్రంలోని ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ తరచుగా మేకప్ వేసుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది అన్ని సైజ్లలోని కాస్మెటిక్ మేకప్ బ్రష్ కిట్లకు అనువుగా ఉంటుంది. ఇది బ్రష్‌లను పూర్తిగా శుభ్రం చేయడమే కాకుండా, వెంటనే పొడిగా ఆరబెడుతుంది కూడా! బ్రష్ కుచ్చు ఊడిపోకుండా, బ్రష్‌కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా శుభ్రం చేస్తుంది. మేకప్ అవశేషాలను, నూనె లేదా క్రీమ్స్‌తో వచ్చే జిడ్డును, మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. దీనిని వాడుకోవడం చాలా తేలిక. ఐషాడో బ్రష్‌ల నుంచి పౌడర్ బ్రష్‌ల వరకు అన్నింటినీ దీనితో క్లీన్ చేసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్, వైఫ్, మదర్ లేదా సిస్టర్ ఇలా రిలేషన్స్ ఏదైనా వారి స్పెషల్ డేకి ఈ డివైస్‌ని అందిస్తే పర్ఫెక్ట్ గిఫ్ట్ అవుతుంది. దీని ధర కేవలం రూ.600 మాత్రమే. ఇతర కంపెనీల్లో క్వాలిటీని బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. (చదవండి: వాన చినుకులలో వడ్డన..!) -
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
బ్లూజే ఏరో లాజిస్టిక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లీన్ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్‌క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్‌లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ వీటీవోఎల్ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కేజీల పేలోడ్ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్ కుమార్ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. -
కిచెన్‌ని కళాత్మకంగా సర్దుకోండిలా..!
వంటిల్లు అంటే నూనె జిడ్డు, మాడు వాసన కాదు. వంటిల్లు అంటే.. సమతూకంలో ఉడికే దినుసుల కమ్మదనం, ఆరోగ్యాన్ని వడ్డించే నైపుణ్యం! మనసుండాలే కానీ కిచెన్కూ కళాత్మకతతో పోపు పెట్టొచ్చు ఇలా..ఇండిపెండెంట్ ఇంట్లో సరే.. అపార్ట్మెంట్లలోనూ కిచెన్‌కి బాల్కనీ ఉంటుంది చిన్నదో పెద్దదో! ఇందులో తులసి సరే.. కొత్తిమీర, మెంతి, పుదీనా, పాలకూర, బచ్చలి వంటివి వేసి.. దీన్ని హెర్బల్ గార్డెన్‌గా మలచుకోవచ్చు. తాజా ఆకు కూరలతో ఆరోగ్యమే కాదు.. పచ్చదనంతో మనసూ మురుస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో వంటిల్లూ మెరుస్తుంది. కాస్తోకూస్తో ఖర్చూ కలిసొస్తుంది. అందమైన పాత్రలు ఇప్పుడు మళ్లీ రాగి, ఇత్తడి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. యాంటిక్ డిజైన్‌లో దొరికే ఆ పాత్రలతో అరలను సర్దితే.. రాజసం ఉట్టిపడుతుంది వంటిల్లు. పింగాణీ పాత్రలతో దీనికి టచప్ ఇవ్వొచ్చు. ఫుడ్ థీమ్ ఆర్ట్కిచెన్ వాల్స్‌ని షెల్వ్స్తో నింపేయకుండా.. ఒక్క చోటనైనా ఖాళీగా ఉంచాలి. దాన్ని నచ్చిన వంటకాలు లేదా నట్స్.. లేదా ఫ్రూట్స్.. వెజిటబుల్స్ పెయింటింగ్స్‌తో అలంకరించాలి. కుక్ బుక్స్వంటింట్లో వంట సామాగ్రికే కాదు వంటకు సంబంధించిన పుస్తకాలకూ స్పేస్ ఇవ్వొచ్చు. స్థానిక సంప్రదాయ వంటల పుస్తకాల నుంచి వరల్డ్ ఫేమస్ షెఫ్‌లు రాసిన కుక్ బుక్స్ దాకా అన్నిటినీ ర్యాక్స్‌లో పేర్చుకుంటే.. కిచెన్‌కి ఇంటలెక్చువల్ లుక్ వస్తుంది. వెరైటీ వంటకాల పట్ల మనకు ఇంట్రెస్టూ పెరుగుతుంది. తెలుసు కదా.. కుకింగ్ అనేది ఆర్టే కాదు.. స్ట్రెస్ బస్టర్ కూడా! వంటలకు రుచెంతో.. అలంకరణకు అభిరుచీ అంతే! సో.. టేస్ట్‌కి తగ్గట్టు సర్దుకోండిక!.(చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..) -
కిచెన్‌ని క్లీన్‌గా ఉంచడంలో టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!
టూత్‌పేస్ట్ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్‌ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్ సింక్లు, ట్యాప్‌లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో టూత్‌పేస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్ పేస్ట్ మన కిచెన్‌లో ఉన్న వస్తువులను క్లీన్‌గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! మన ఇంట్లో వేస్ట్‌గా మిగిలిపోయిన పాత పేస్ట్‌లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్ కారణంగా కొన్ని రకాల స్టీల్ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్‌పేస్ట్ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు..వంటగదిలోని సింక్ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్‌పేస్ట్‌ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్ పేస్ట్ భలే పనిచేస్తుంది. స్పాంజ్ సాయంతో కాస్త ప్రెజర్ ఉపయోగించి క్లీన్ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. కుళాయిలు..నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్‌పేస్ట్‌ని పూసి క్లాత్‌తో క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్‌లు..గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్ టాప్‌లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్‌పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మగ్స్‌పై కాఫీ, టీ మరకలు..కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. కటింగ్ బోర్డ్..కూరగాయలు కోసే కటింగ్ బోర్డ్‌లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్‌పేస్ట్‌తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్పేస్ట్ల్ ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
భోజన సమయంలో కింద కూర్చుంటే రూ.220 జరిమానా..!
చైనాలోని ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిత్యం కొత్త విధానాలను రూపొందించి అమలు చేస్తుంటారు. తాజాగా చైనాలోని ఓ కౌంటీలో అధికారులు తీసుకొచ్చిన నిబంధనపై అక్కడి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సిచువాన్ ప్రావిన్స్‌లోని పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్(ఎస్సీఎంపీ) మీడియా సంస్థ తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం కౌంటీలోని ప్రజలు తమ ఇళ్లను, వంట పాత్రలను శుభ్రం చేయకుంటే 1.4 డాలర్లు(రూ.120), భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8(రూ.220) డాలర్లు జరిమానా విధించనున్నారు. ఈ జరిమానా కేటగిరీలను 14 భాగాలుగా విభజించారు. అధికారులు తనిఖీల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతరత్రా కీటకాలు, దుమ్ముధూళి ఉంటే మొదటిసారి మూడు నుంచి పది యువాన్లు జరిమానా విధించనున్నారు. రెండోసారి తనిఖీల్లో కూడా ఆ ఇంట శుభ్రత లేకుంటే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేస్తారని ఎస్సీఎంపీ కథనంలో వెల్లడించింది. ఈ నిబంధనపై కౌంటీ వైస్ డైరెక్టర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అపరిశుభ్రతను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యమని తెలిపారు. ఇదీ చదవండి: నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్ కామెంట్లు.. ‘కౌంటీలో కొందరి ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇల్లంతా బూజుతో అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు. వారు భోజనం చేస్తున్న ప్రదేశంలోనే కుక్కలు, దోమలు తిరుగుతున్నాయి. ఈ సమస్యను జరిమానాలు పరిష్కరించలేవు. కానీ, ప్రజలు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు మాత్రం ఈ నిబంధనలు దోహదపడతాయని భావిస్తున్నాం’ అని వైస్ డైరెక్టర్ తెలిపారు. -
సర్దుకు పోవద్దు.. సర్దుకుందాం ఇలా..!
కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవడంలో మొదటి మెట్టు... వంట పూర్తి కాగానే.. కిచెన్ ప్లాట్‌ఫామ్, స్టౌను వెంటనే శుభ్రం చేసేసుకోవడం. స్టవ్ మీద, ప్లాట్‌ఫామ్ మీదా మనం వండిన వంటలోని చిందులు, నూనె మరకలు పడటం సహజం. అలాంటి వాటిని వంట అవగానే వెంటనే తుడిచేయాలి. గోరువెచ్చటి నీళ్లలో వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే.. క్రిములు తొలగిపోతాయి. స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌ని ఉపయోగించచ్చు. అవి కాసింత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది కిచెన్ టవల్స్నే వాడతారు. ఒకోసారి కిచెన్‌లో నూనె ఒలికిపోతుంటుంది. వెంటనే ఆ నూనె మీద గోధుమ పిండి లేదా బియ్యప్పిండిని చల్లి కాసేపటి తరువాత పేపర్‌తో తుడిస్తే జిడ్డులేకుండా శుభ్రపడుతుంది. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై మరకలు ఉంటే.. వంటసోడా వేసిన నీళ్లతో కిచెన్ ప్లాట్‌ఫామ్ తుడిస్తే చాలు. అంతేకానీ బ్లీచింగ్, అమోనియా లాంటివి వాడటం వల్ల క్యాబినెట్కున్న రంగులు, టైల్స్ దెబ్బతింటాయి. కూరగాయలు తరగడం పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయకపోతే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. తరిగేటప్పుడే ఓ డబ్బా పెట్టుకొని, తొక్కలు, తొడిమల్లాంటివి దాంట్లో వేసి తర్వాత చెత్తడబ్బాలో పడేస్తే.. శుభ్రంగా ఉంటుంది. కిచెన్ టవల్స్‌ను కూడా... కిచెన్ ప్లాట్‌ఫామ్‌ని, స్టవ్నీ క్లీన్ చేసేందుకు ఉపయోగించే కిచెన్ టవల్ని సరిగా శుభ్రం చేయకపోతే దానికి ఉండే బ్యాక్టీరియా వల్ల అంతవరకు మనం చేసినదంతా నిరర్థకమవుతుంది. కిచెన్ టవల్స్ జిడ్డుగా ఉంటే గోరువెచ్చని నీటిలో సర్ఫ్, వాషింగ్ లిక్విడ్ వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బట్టలుతికే బ్రష్‌తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి. కిచెన్ క్యాబినెట్ కిచెన్ ప్లాట్‌ఫామ్ కింద లేదా పైన సామాన్లు పెట్టుకోవడం కోసం ఉంచిన ర్యాక్స్, క్యాబినెట్ పుల్స్, హ్యాండిల్స్‌పై కూడా సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటిని క్రిమిసంహారక వైప్‌తో క్లీన్ చేస్తే మంచిది. వెనిగర్‌ని క్లాత్‌పై స్ప్రే చేసి వాడండి. దీనివల్ల వేలిముద్రలు, నీటి గుర్తులు పోయి తెల్లగా మెరుస్తాయి. ఫ్రిజ్ క్లీన్‌గా.. ఫ్రిజ్‌లో మనం చాలా స్టఫ్ పెడుతుంటాం. కానీ, దానిని ఎప్పుడో ఓసారి క్లీన్ చేస్తుంటాం. అలా కాకుండా దీనిని కూడా మరకలు లేకుండా శుభ్రంగా తుడవడం మంచిది. ఫ్రిజ్ కింద, డోర్స్, లోపల గ్లాసెస్.. ఇలా అన్నింటిని తడిగుడ్డతో తుడిస్తే త్వరగా క్లీన్ అవుతుంది. ఇక మిగిలిపోయిన ప్రతిదానిని ఫ్రిజ్‌లో తోసేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా మంచిది. సింక్ క్లీన్.. కిచెన్ క్లీన్ చేయాలంటే ముందుగా సింక్‌ని క్లీన్ చేయాలి. సింక్ బేసిన్ నీట్‌గా ఉందో లేదో చూసుకోండి. కౌంటర్ చుట్టూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి దూరమవుతాయి. అందుకే, ముందు దీనిని క్లీన్ చేయండి. సింక్ సరిగ్గా లేకపోతే అందులో నుంచే ఎక్కువ బొద్దింకలు, వాటి ద్వారా వ్యాధులు వస్తాయి. కొద్దిగా బ్లీచింగ్ పౌడర్, డిష్‌వాష్, బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే సరి. సింక్‌లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్ వాటర్‌తో శుభ్రం చేసేస్తే సింక్ దుర్వాసన రాకుండా ఉంటుంది. కాస్త తీరిక దొరికినప్పుడు ఓ క్లాత్ తీసుకుని వాటర్ స్ప్రే చేస్తూ కిచెన్ గోడలు, కౌంటర్స్‌ని క్లీన్ చేయండి. ఇందుకోసం మార్కెట్లో దొరికే స్ప్రేలను కూడా ఉపయోగించవచ్చు.. ఇప్పుడు డోర్ ఫ్రేమ్స్‌ని క్లీన్ చేయండి. వంటగదిని అన్ని వస్తువులు సులభంగా దొరికేలా సర్దుకుంటే వంట చేయడం ఈజీ అవుతుంది. ఎలాగో చూద్దాం... ట్రాన్స్పరెంట్ డబ్బాలు వంట చేసుకునేప్పుడు ఏ డబ్బాలో ఏముందా? అని వెతుక్కోవడానికే సమయం వృథా అవుతుంది. అలా కాకుండా షెల్ఫుల్లో ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు లేదా స్టీల్ డబ్బాలూ గాజు సీసాలూ అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. పని సులభం అవుతుంది. సరుకులనూ వేరు చేయడం వంట గదిలో షెల్ఫులలో అన్ని సరుకుల్ని అన్ని షెల్ఫుల్లో సర్దేయకుండా ఎక్కువగా వంటకు వాడే వాటిని ఒకచోట, తక్కువగా వాడే పదార్థాల్ని వేరే షెల్ఫులో, బేకింగ్ సామగ్రిని మరో దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
చదువుకోవాలా..? బాత్రూంలు క్లీన్ చేయాలా?
ఉట్నూర్‌రూరల్: ‘మేము చదువుకోవాలా..? లేక బాత్రూంలు క్లీన్ చేయాలా’’అంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వైస్‌ప్రిన్సిపాల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టు15వ తేదీన ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించినా, ఎలాంటి మార్పు రాలేదంటూ గేటు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి విద్యార్థినులను ఎంత బతిమిలాడినా వారు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్ అక్కడకు చేరుకున్నారు. విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు వారు కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూంలు శుభ్రం చేయిస్తుందని, స్నానపు గదులకు తలుపులు లేకపోవడంతో తలుపులు బిగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు అందుబాటులో లేదని, అనారోగ్యానికి గురైతే సిక్‌రూం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యం పాలైనా చూసేవారు లేక ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. రీజినల్ కోఆర్డినేటర్ స్పందిస్తూ తక్షణమే పీఓ దృష్టికి తీసుకువెళ్లి వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైస్ ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్ఫర్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గంగాధర్ చెప్పడంతో వారు శాంతించారు. ఈ విషయమై వైస్ ప్రిన్సిపాల్ భూ లక్ష్మిని వివరణ కోరగా.. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. -
పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్‌కు ఏపీ హబ్‌గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. తద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది. చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెట్టారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్ ఉతకనవసరం లేదు!
దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్ ధరిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్‌పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్ వినియోగిస్తున్నారు. జీన్స్ ధారణ మనిషికి మంచి లుక్‌నిస్తుంది. కొందరు జీన్స్‌ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్‌ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు. అయితే జీన్స్‌ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్‌ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్ పాడయిపోతుంది. అలాగే జీన్స్‌ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్ సీఈఓ చిప్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్‌ను కనీసం 6 నెలల తరువాతనే వాష్ చెయ్యాలి. అయితే జీన్స్‌ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్‌లో నుంచి జీన్స్‌ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
క్లీన్ హార్బర్స్‌లో 1,000 కొలువులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ సంబంధ సేవలు అందించే క్లీన్ హార్బర్స్ రాబోయే రోజుల్లో 1,000 మందిని పైగా రిక్రూట్ చేసుకోనుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కొత్తగా 300 మందిని నియమించుకోనుండగా.. ఇందులో ఎక్కువ భాగం హైరింగ్ హైదరాబాద్ కార్యాలయం కోసం ఉండనుంది. సోమవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో అలాన్ మెకిమ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రెసిడెంట్ అవినాష్ సమ్రిత్ ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణెల్లో కార్యాలయాలు ఉన్నట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం క్లీన్ హార్బర్స్‌కు దేశీయంగా 1,200 మంది సిబ్బంది ఉండగా.. హైదరాబాద్‌లో 850 మంది ఉన్నారు. కొత్త కార్యాలయంపై దాదాపు రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ టర్నోవరు దాదాపు రూ. 150–రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. 5 బిలియన్ డాలర్లుగా ఉన్న క్లీన్ హార్బర్స్ వచ్చే అయిదేళ్లలో 7 బిలియన్ పైగా డాలర్ల కంపెనీగా ఎదిగే క్రమంలో తమ వ్యాపారానికి అనువైన సంస్థల కొనుగోలు, విలీనాల యోచన కూడా ఉన్నట్లు మెకిన్ వివరించారు. -
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీన్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? బ్యాక్టీరియా ఎలా పోతుంది?
కొందరు చూడటానికి ఎంతో శుభ్రంగా ఉంటారు. ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. అయితే పరిసరాల పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోరు. ఇల్లు మురికిగా ఉండి, వ్యక్తి మాత్రం శుభ్రంగా ఉన్నా; ఇల్లు, ఇంట్లోని మనుషులు మాత్రమే పరిశుభ్రంగా ఉండి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. అనారోగ్యం, అంటువ్యాధులు పొంచే ఉంటాయి. ఇంతకీ పరిసరాల పరిశుభ్రత అంటే ఏమిటో, పరిసరాలను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూద్దాం. పరిసరాల పరిశుభ్రత అంటే ఇంటికి చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ చెత్తాచెదారం, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవడమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం కంటే.. హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై దృష్టిపెట్టడం చాలా మేలని పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం . సరైన సమయానికి చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. అయితే, ప్రతి నలుగురిలో ఒకరు మాత్రం వీటికి ప్రాధాన్యం లేదని భావిస్తున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. . మురికి, క్రిములు, శుభ్రత, ఆరోగ్యవంతంగా ఉండడానికి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. ఒక సర్వే మేరకు 23 శాతం మంది.. హానికారక సూక్ష్మ క్రిముల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారని తేలింది. అయితే, వారి నమ్మకంలో ఏమాత్రం నిజం లేదు. హానికారక సూక్ష్మక్రిములుండే పరిసరాలలో మెసలడం వల్ల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. దానికి బదులు, ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములూ లేకుండా చూడాలని, అప్పుడే హానికారక సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శుభ్రత అంటే మురికి లేకుండా చేయడం. ఆరోగ్యవంతంగా పరిసరాలను ఉంచుకోవడం అంటే మురికితోపాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేసేప్పుడు, మరుగుదొడ్డి వాడేప్పుడు, పెంపుడు జంతువులతో గడిపేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ఆరుబయట స్నేహితులు, కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో గడపడం, ఆడుకోవడంతో ‘మంచి బ్యాక్టీరియా’ను పొందవచ్చు. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల్ని పెంపొందించుకోవచ్చు. కానీ, అదే సమయంలో ప్రజలు చెడు బ్యాక్టీరియా బారిన పడకుండా చూసుకోవడం కూడా అంతే కీలకం. ‘‘పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల్ని నియంత్రించవచ్చు. ఇది చాలా సులభమైన, చౌక అయిన వ్యవహారం. ఇంట్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారా అంటురోగాలను తగ్గించొచ్చు. తద్వారా పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించవచ్చు’’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటిని మాత్రమే కాదు, ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మురికిగుంటలు, చెత్తకుప్పలు, అపరిశుభ్ర వాతావరణం ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. శ్రమ అనో, ఖర్చనో అనుకోకుండా చెత్తను క్లీన్ చేయాలి లేదా చేయించాలి. కొంతమంది తమ ఇంటిలోని చెత్తనంతటినీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పడేస్తుంటారు. క్రమేణా అవి చెత్తకు, ఆ తర్వాత అపరిశుభ్రతకు, అంటువ్యాధులకు ఆనవాళ్లుగా మారతాయి. అందువల్ల సంబంధిత శాఖ వాళ్లకు చెప్పి ఆ చెత్తను క్లీన్ చేయించాలి. అలాగే మురికిగుంటలపై కూడా దృష్టి సారించాలి. బ్లీచింగ్ పౌడర్ వేయాలి. పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. చెత్తను, తడిచెత్త, పొడిచెత్తగా వేరు చేసి పడెయ్యడం, గాజుపెంకులు, ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల వంటి వాటిని విడిగానూ పడెయ్యాలి. ఇలాంటి వాటన్నింటినీ బాధ్యతగా చేసినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సూక్ష్మక్రిములు, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? ►ఆహారాన్ని తయారు చేసే వంట శాలలు, వడ్డించే ఆహార శాలలు ప్రాంతాలు (డైనింగ్ హాల్స్) ►మరుగుదొడ్లు, వాటిని వాడిన తర్వాత చేతులు, ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలు. ►పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు. ►ఎవరైనా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కును చీదేటప్పుడు. ►చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేటప్పుడు. ►అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు శుభ్రత పాటించడం అత్యవసరం. ►మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం. ►అలాగే, శాండ్విచ్లు, చిరుతిళ్లు తయారు చేసేముందు కూడా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. ►కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్‌లను, బ్రష్‌లను కడగాలి. ఎందుకంటే ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్పైన పేరుకుపోయిన దుమ్ములో ఉండే క్రిములతో పోల్చితే ఇవి చాలా వరకు ఆరోగ్యానికి ఎక్కువ హాని చేకూర్చేవి కాబట్టి. బ్యాక్టీరియా ఎలా పోతుంది? ►ఇంట్లో నేలను కానీ, పాత్రల్ని కానీ వేడిగా ఉన్న సబ్బు నీటితో కడగడం ద్వారా బ్యాక్టీరియాను తొలగించవచ్చు. ఆ బ్యాక్టీరియా నీటితో పాటు కొట్టుకుపోతుంది. అయితే బ్యాక్టీరియాను పూర్తిగా చంపాలంటే మాత్రం నీటిని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొద్దిసేపు మరిగించాలని ఆహార ప్రమాణాల సంస్థ చెబుతోంది. ►ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను, రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి గుడ్డకు బదులు పేపర్ టవల్స్ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి. -
సఫాయి అన్న.. నీకు సలాం అన్న
సాక్షి, సనత్‌నగర్(హైదరాబాద్): సఫాయి అన్న.. నీకు సలాం అన్న.. అంటూ వారి సేవలను గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచిన మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రమేనని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. డ్రైవర్స్ కమ్ ఓనర్ స్కీం కింద సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ సెంటర్ కేంద్రంగా నగర వ్యాప్తంగా 1,350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సోమవారం మంత్రులు ప్రారంభించారు. వీరిలో మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బెస్ట్ సిటీగా హైదరాబాద్.. ► గతంలో 2015లో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఏకకాలంలో తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచిందన్నారు. ► ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారుజామున 3– 4 గంటల నుంచే పరిశ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు, ఇతర వాహనాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టకముందు నగరం నుంచి ప్రతిరోజూ 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదన్నారు. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోందన్నారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్.. ► వాహనాల ద్వారా సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తను వేరు చేసి విద్యుత్పాదనకు జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మరో 28 మెగావాట్ల ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దాని పనులు కూడా ప్రారంభమై పూర్తి చేసుకుంటే మొత్తం 48 మెగావాట్లతో దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా నగరం నిలవనున్నదన్నారు. కార్పొరేటర్లు, అధికారులు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ సంధ్య, కార్పొరేటర్లు కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, మహేశ్వరి శ్రీహరి, డీఎంసీ వంశీకృష్ణ, ఏఎంహెచ్ఓ భార్గవ నారాయణ్, మహీంద్రా కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పాఠశాల టాయిలెట్లను క్లీన్ చేసిన కలెక్టర్
సాక్షి, అడవివరం (విశాఖ పట్నం): వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున స్ఫూర్తివంతమైన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం అడవివరం జెడ్పీ హైస్కూల్‌కు విచ్చేసిన ఆయన.. పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలను ఘనంగా సత్కరించారు. పాఠశాలలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్న ఆయాల సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం పాఠశాలలోని టాయిలెట్లను కలెక్టర్ స్వయంగా క్లీన్ చేసి ఆదర్శంగా నిలిచారు. -
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
-
దునియాలో ఇలాంటి పెళ్లి చూసుండరు.. ఎందుకంటారా?
అతిథిదేవో భవ అంటారు. సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు మర్యాదులు, భోజనాలు అంటూ వాళ్లకి సపర్యలు చేసి పది కాలాలు గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. అయితే, ఈ పెళ్లి మాత్రం రోటీన్‌కు భిన్నంగా జరిగింది. నవదంపతులను మనసారా ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులకు విందు పెట్టడమే కాదు, వారు తిన్న పాత్రలను వారితోనే కడిగించారు. పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.. కానీ వివరాల్లోకి వెళితే.. ‘రెడిట్’ అనే సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళ పంచుకోవడంతో ఈ పెళ్లి తంతు బయటకొచ్చింది. ‘‘వధువు మా దగ్గర బంధువే. కానీ, వరుడి గురించి నాకు పెద్దగా తెలియదు. వాళ్లు పెళ్లి కోసం బాగానే ఖర్చు పెట్టారు. అందులో భాగంగా ఖరీదైన వేదికను అద్దెకు తీసుకుని, అలంకరణ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వేదికను అద్భుతంగా డెకరేట్ చేయించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు విందు కోసం బఫెట్‌లోని ఫుడ్ కూడా చాలా టేస్టీగానే ఉందని తెలిపింది. ఇక్కడ వరకు అంతా బాగానే నడిచింది .ప్లేటు నిండా ఆహారం పెట్టుకుని ఆరగిస్తున్నాను. అయితే, నా భర్త ఖాళీ ప్లేటుతో నా దగ్గరకు వచ్చాడు. ఏమైందని అడిగితే ఫుడ్ అయిపోయిందని చెప్పాడు. దీంతో నేను వధువు తల్లి వద్దకు వెళ్లి అడగగా అందుకు ఆమె పుడ్ అయిపోయిందని, ఇక రాదని చెప్పడంతో మిగిలిన అతిథులంతా ఆకలితోనే పస్తులున్నారు’’ అని తెలిపింది. ఖర్చు ఎక్కువైంది.. ఏమనుకోకుండా కాస్త ప్లేట్లు.. ‘‘ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. సరే ఉన్నదాంతో సరిపెట్టుకుని విందు చేశాక రిసెప్షన్ చూసేందుకు వెళ్లాం. ఇంతలో ఓ పని మనిషి మా వద్దకు వచ్చి కిచెన్‌లోకి రావాలని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత కుప్పలా పడివున్న ప్లేట్లు, గ్లాసులు చూపించి కడగాలని చెప్పింది. ఒక్కసారిగా షాక్ తగిలి ఏంటని వధువు తల్లిని అడగగా.. పెళ్లి ఖర్చులన్నీ వధువు వెడ్డింగ్ గౌను, వేదిక, విందుకే అయిపోయానని, గిన్నెలు కడిగేందుకు మనుషులను పెట్టుకోలేకపోయామని సాఫీగా ఆమె సమాధానం ఇచ్చింది. ఇక చేసేదేమిలేక నేను, మరో తొమ్మిది మంది అతిథులం పెళ్లిలోని ప్లేట్లు కడిగాల్సి వచ్చింది. పెళ్లి కోసం వచ్చి మొత్తం సమయాన్నంత మేం కిచెన్లోనే గడిపాల్సి వచ్చింది. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగగా, ప్రస్తుతం ఆ జంట విడాకులు కూడా తీసేసుకున్నారు. బహుశా అతిథుల అవమానపరిచనందుక ఫలితమేమో ఇది ఏమైనా!’ అని సదరు మహిళ చెప్పుకొచ్చింది. ఇది చదివిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఇది చాలా చేదు అనుభవం. తినేందుకు సరిపడా పుడ్ లేకపోగా.. ప్లేట్లు కడిగించారు. అసలు వాళ్ల పెళ్లి గురించే ఆలోచించారే గానీ.. అతిథులను పట్టించుకోలేదు’’ అని ఒకరు. ‘‘నీ స్థానంలో నేను అక్కడ ఉంటే.. తక్షణమే పెళ్లి నుంచి పరారయ్యేవాడిని’’ అని మరొకరు కామెంట్ చేశారు. -
ప్రజల నిర్లక్ష్యం.. రోడ్లపై జీహెచ్ఎంసీ సిబ్బంది
రహమత్‌నగర్: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో కామాటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కామాటీ పని పక్కన పెట్టి రహదారులపై చెత్త వేయకుండా ఇలా కాపలా కాస్తున్నాడు. వాహనాలపై వచ్చి రోడ్లమీద, ఫుట్‌పాత్‌లపై చెత్త పడవేయకుండా అడ్డుకుంటున్నాడు. ప్రజల నిర్లక్ష్యం మూలంగా సిబ్బంది ఇలా రోజు కాపలా ఉండాల్సి వస్తోంది. సర్కిల్–19లోని రహమత్‌నగర్ డివిజన్ హెచ్‌ఎఫ్‌నగర్, కార్మికనగర్, శ్రీరాంనగర్ డంపింగ్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది చాలా మంది ఇలాగే కాపలా కాయాల్సి వస్తోంది. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని..సామాజిక బాధ్యతతో వ్యవహరించి రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని, లేకుంటే మాకు రోజూ ఇలా కాపలా కాసే డ్యూటీ తప్పదని దుర్గయ్య వాపోయారు. రోగాలు వ్యాపిస్తున్న ఈ తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ( చదవండి: అతి తెలివి అంటే ఇదే.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం ) -
సరికొత్త టెక్నాలజీతో హైయర్ అత్యాధునిక ఏసీ
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైయర్ సెల్ఫ్ క్లీన్‌కూల్ టెక్నాలజీతో కూడిన ఏసీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అన్ని కాలాల్లోనూ అనుకూలమైన ఏసీ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. 1.5 టన్ కెపాసీటీతో కూడిన ఈ హాట్ అండ్ కోల్డ్ 3 స్టార్ ఏసీ.. ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఏసీ తనంతట తానే శుభ్రం చేసుకోవడంతోపాటు, గదిలో ఉష్ణోగ్రతను తగినట్టు కూలింగ్‌ను మార్చుకోవడం చేస్తుందని, 65 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపింది. 60 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఏసీ పనిచేస్తుందని ప్రకటించింది. మైక్రో డస్ట్ ఫిల్టర్‌తో కూడిన ఈ కొత్త క్లీన్‌కూల్ ఏసీ గాలి నుండి దుమ్ము, బ్యాక్టీరియా వైరస్‌ను తొలగిస్తుంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం నుండి వినియోగదారులను రక్షిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, బెస్ట్-ఇన్-క్లాస్ మోటారు, ఆప్టిమైజ్డ్ ఫ్యాన్ ఎయిర్ డక్ట్‌తో అమర్చబడి ఉంటుందనీ, ఇది 15 మీటర్ల వరకు గాలిని వీచేలా చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఫీచర్ గదిలోని అన్ని మూలలను చాలా వేగంగా చల్లబరుస్తుందని చెప్పింది. -
చీపుర్లు పట్టిన టీచర్లు
సత్తుపల్లి టౌన్:పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సత్తుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. గురువారం ఉదయం వచ్చిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అది చూసి మాకెందుకులే అనుకోలేదు.. చీపుర్లు పట్టి పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. దీనిపై పీఆర్టీయూ రాష్ట్ర నేత చిత్తలూరి ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవటంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దీంతో ఉపాధ్యాయులే చీపుర్లు పట్టి శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని చెప్పారు. -
ఫ్రిజ్‌లో సాల్మొనెల్లా సూక్ష్మజీవి!
మనమందరం రకరకాల ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో దాచుకుంటాం. ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ సూక్ష్మజీవులు పెరగడానికి అవకాశమే లేదని అనుకుంటాం. నిజానికి అక్కడ కూడా సాల్మొనెల్లా అనే ఓ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఎక్కువే. సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్‌లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ–హైడ్రేషన్ ముప్పు తప్పదు. అందుకే ఫ్రిజ్‌ను సైతం ఆరోగ్యకరంగా ఉండేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రిజ్‌లో ఆహారపదార్థాలు దాచుకునే క్రమంలో ఫ్రిజ్ హైజీన్ కూడా అవసరమే ఇందుకోసం మనం అందులో మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిలువ చేసుకునే సమయంలో అవన్నీ వేర్వేరుగానూ, హానికరం కాని ప్యాకింగ్ మెటీరియల్‌తో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్ లాంటి మాంసాన్ని (రా–మీట్‌ను) దేనికదే విడివిడిగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక మాంసాహారం మరో మాంసాహారంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదు. (చదవండి: మంచి నిద్రకూ.. బ్యాక్టీరియాకు లింకు) ఫ్రిజ్‌లోంచి తీసిన ఆహార పదార్థాలను పచ్చిపచ్చిగా ఉన్నవాటిని సాధ్యమైంతగా రా–ఫుడ్ రూపంలో తినకపోవడమే మేలు. ఇక ఆకుకూరలూ, కాయగూరలను తగిన ఉష్ణోగ్రత వద్ద సరిగ్గా ఉడికాకే తినాలి. ఫ్రిజ్ నుంచి తీసిన మాంసాహారాన్ని తప్పనిసరిగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించేలా తప్పక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా లేదా ఈ–కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. మాంసాహారం తినేవారు దాన్ని సరిగ్గా ఉడికించాక (ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్) మాత్రమే తినాలి. డీప్ ఫ్రీజర్ భాగంలో అర చేయి పెట్టి చూసినప్పుడు అది బాగా చల్లగా తగలాలే తప్ప... బాగా తడితడిగా చిత్తడిగా తగలకూడదు. అలా చిత్తడిగా ఉందంటే అక్కడ తగిన ఉష్ణోగ్రత నిర్వహితం (మెయింటెయిన్) కావడం లేదని అర్థం. ఫ్రిజ్‌లో తగిన చల్లదనం / ఉష్ణోగ్రత లేకపోతే దాని పనితీరు బాగాలేదని గ్రహించి, ఫ్రిజ్ రిపేర్ చేసేవారితో దాన్ని తప్పక బాగు (రిపేర్) చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఫ్రిజ్‌ను నెలకొకసారో లేదా రెణ్ణెల్లకొకసారో... ఇలా నిర్ణీత సమయంలో తప్పక శుభ్రం చేసుకుంటూ ఉండాలి. -
చుట్టాలు వస్తేకనీ..తాజ్‌ను పట్టించుకోని ప్రభుత్వం
-
కాలుష్యంతో వ్యాధుల ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘పరిసరాల పరిశుభ్రత, మూసీ ప్రక్షాళలనతోనే జల, వాయుకాలుష్యం సహా డెంగీ, మలేరియా దోమల నియంత్రణ సాధ్యం. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన మూసీని ఎంత త్వరగా ప్రక్షాళన చేస్తే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యం లో ‘హెల్త్ హైదరాబాద్’పేరుతో ఆదివారం స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో కరుణా గోపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతోన్న జల, వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మూసీని ప్రక్షాళన చేయడం ద్వారా డెంగీ, మలేరియా వ్యాధులకు కారణమవుతున్న దోమలను నియంత్రించవచ్చని చెప్పారు. శారీరక శ్రమను అలవర్చుకోవడం, సహజ ఆహారం తీసుకోవడం ద్వారా రోగాల బారీ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేయడం, పిల్లలకు ఆడుకునే అవకాశం ఇవ్వడం ద్వారా అధిక బరువు ముప్పు నుంచి పిల్లలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం వల్ల అనేక మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు బాధిత కుటుంబాలనే కాదు ప్రభుత్వాలను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన వ్యాయామం అందించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన సూచించారు. -
పళ్లు శుభ్రం చేసే చేసే పద్ధతితో డేంజర్!
మనకు పెద్దగా అలవాటు లేదుగానీ.. ఇతర దేశాల్లో పళ్లను శుభ్రం చేసుకునే పద్ధతిలో ఫ్లాసింగ్ ఒకటి. బ్రష్ చేసిన తరువాత పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని ఒక దారం సాయంతో తొలగించుకోవడాన్ని ఫ్లాసింగ్ అంటారు. బాగుందిగానీ.. ఈ ఫ్లాసింగ్ కోసం వాడుతున్న ప్రత్యేకమైన దారం కారణంగా పళ్ల మధ్య పాలిఫ్లూరోర అల్కైల్ (పీఎఫ్ఏ) రసాయన పదార్థాలు పోగుపడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. కాలిఫోర్నియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొంతమంది కార్యకర్తల రక్తనమూనాలను పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. ఫర్నిచర్ మొదలుకొని అనేక ఇతర వస్తువుల్లో నీటిని దూరంగా ఉంచేందుకు ఈ పీఎప్ఏలను వాడుతున్నారు. పైగా అంత తేలికగా నాశనమయ్యే రసాయనమూ కాదిది. మార్కెట్లో అందుబాటులో ఉన్న 18 కంపెనీలు ఈ పీఎఫ్ఏను ఫ్లాసింగ్ దారాల పై పూతగా వాడుతున్నట్లు తెలిసింది. పళ్లమధ్య ఈ దారాన్ని ఉంచి కదిలించినప్పుడు పూతలోని రసాయనాలు అక్కడే పోగుపడుతున్నాయని.. తరువాత కండరాల్లోకి కూడా చేరిపోతున్నాయని తాము గుర్తించినట్లు కేటీ బోరోనౌ అనే శాస్త్రవేత్త తెలిపారు. పీఎఫ్ఏలతో కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నది తెలిసిందే. అనేక ఇతర పదార్థాల నుంచి కూడా ఈ పీఎఫ్ఏ శరీరంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది.