బ్యూటిప్స్
పసుపు రంగులోకి మారిన అరటిపండు తొక్కతో చర్మ కాంతిని మెరుగుపరచుకోవచ్చు. అరకప్పు తాజా పాలు తీసుకుని దానిలో అరటిపండు తొక్కను వేసి మరగపెట్టాలి. పాలు చల్లారిన తర్వాత టీ స్పూను పాలలో దూది ఉండను (కాటన్ బాల్) ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి క్లెన్స్‌ర్‌గా పనిచేస్తుంది. మిగిలిన పాలల్లో ఉన్న అరటిపండు తొక్కను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకుని అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చాయ మెరుగవుతుంది. చర్మం వదులుగా అవ్వకుండా ఉంటుంది, అలాగే ముడతలు కూడా పోతాయి.
ఒక్కోసారి ముక్కు రంధ్రాల చుట్టూ, చుబుకం దగ్గర చర్మం నల్లగా, దళసరిగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు స్నానానికి వెళ్ళే ముందుగా ఒక స్పూన్ గ్లిజరిన్, మూడు స్పూన్ల తేనె కలుపుకుని, ముఖానికి, కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను 10-15నిముషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తుంటే వారం రోజుల్లోపే మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు గ్లిజరిన్, తేనె మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం లేదా చిటికెడు పసుపు కులుపుకోవచ్చు.