సాధారణంగా ముఖానికి మేకప్ వేసుకున్నాక, కొన్ని గంటల్లోనే దాన్ని క్లీన్స్ చేస్తుంటాం. చాలా శ్రద్ధగా చర్మం పాడవకుండా చూసుకుంటాం. మరి మేకప్ కోసం రోజూ వాడే బ్రష్‌ల సంగతేంటి? వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారా? ఆ తర్వాత ఆరబెడుతున్నారా? బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్త పడుతున్నారా? లేదంటే యమ డేంజర్ అంటున్నారు నిపుణులు.
కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ మేకప్ బ్రష్‌లను శుభ్రం చేసుకోమని హెచ్చరిస్తున్నారు. చేతులతో శుభ్రం చేస్తే బ్రష్‌లు పూర్తిగా శుభ్రపడవని అనుకుంటున్నారా? మేకప్ బ్రష్‌లను సులువుగా శుభ్రం చేయడానికే ఈ మేకప్ బ్రష్ క్లీనర్ అందుబాటులోకి వచ్చింది. చిత్రంలోని ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ తరచుగా మేకప్ వేసుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది.
ఇది అన్ని సైజ్‌లలోని కాస్మెటిక్ మేకప్ బ్రష్ కిట్‌లకు అనువుగా ఉంటుంది. ఇది బ్రష్‌లను పూర్తిగా శుభ్రం చేయడమే కాకుండా, వెంటనే పొడిగా ఆరబెడుతుంది కూడా! బ్రష్ కుచ్చు ఊడిపోకుండా, బ్రష్‌కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా శుభ్రం చేస్తుంది. మేకప్ అవశేషాలను, నూనె లేదా క్రీమ్స్‌తో వచ్చే జిడ్డును, మలినాలను పూర్తిగా తొలగిస్తుంది.
దీనిని వాడుకోవడం చాలా తేలిక. ఐషాడో బ్రష్‌ల నుంచి పౌడర్ బ్రష్‌ల వరకు అన్నింటినీ దీనితో క్లీన్ చేసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్, వైఫ్, మదర్ లేదా సిస్టర్ ఇలా రిలేషన్స్ ఏదైనా వారి స్పెషల్ డేకి ఈ డివైస్‌ని అందిస్తే పర్ఫెక్ట్ గిఫ్ట్ అవుతుంది. దీని ధర కేవలం రూ.600 మాత్రమే. ఇతర కంపెనీల్లో క్వాలిటీని బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు.
(చదవండి: వాన చినుకులలో వడ్డన..!)
Comments
Please login to add a commentAdd a comment