శుభ్రతే సౌందర్యం | Beauty tips :Clean the beauty | Sakshi
Sakshi News home page

శుభ్రతే సౌందర్యం

Published Thu, Jun 21 2018 12:09 AM | Last Updated on Thu, Jun 21 2018 12:09 AM

 Beauty tips :Clean the beauty - Sakshi

టీనేజ్‌లో మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌తో సమస్య జటిలమై యాక్నెకు దారితీస్తుంది. చర్మం తిరిగి క్లియర్‌గా రావాలంటే ఇంట్లోనే చేసుకోదగిన సింపుల్‌ ట్రీట్‌మెంట్‌లివి. ∙ఆరెంజ్‌ పీల్‌ పౌడర్‌ను పన్నీటితోకాని మంచినీటితో కాని పేస్టులాకలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వచేసుకుని వాడుకోవచ్చు లేదా మార్కెట్‌లో రెడీమేడ్‌గా ఈ పౌడర్‌ దొరుకుతుంది. తాజా కమలాపండు తొక్కలనుగ్రైండ్‌ చేసి కూడా వాడుకోవచ్చు.

దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న చోట మాత్రమే రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. దీనిని వారానికి మూడుసార్లు వేస్తుంటేమంచి ఫలితం ఉంటుంది. ఈప్యాక్‌ వేసినప్పుడు చర్మం కాస్తమండుతుంది. నొప్పితో కూడిన మొటిమలకు ఇది మంచి ట్రీట్‌మెంట్‌ ∙వేరుశనగ నూనెలో అంతే మోతాదు నిమ్మరసం కలిపి ముఖానికిపట్టించి పది నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ∙పెరుగు, కీరా, అవకాడో మూడింటినీ మిక్సీలో వేసి మిశ్రమాన్ని చిక్కని పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖమంతా పట్టించి 15నిముషాల తర్వాత తడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement