The skin
-
తగ్గినా... తిరగబెడుతోంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడితే అప్పటికి తగ్గినట్లుగా అనిపించినా, మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి.– సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు, దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువమానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు ∙సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కువగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది. చిన్నపిల్లల్లో : తలపై చర్మం జిడ్డుగా, పొరలుగా, ఎర్రటి దద్దుర్లలా కనిపిస్తాయి. దీనినే ‘క్రెడిల్ క్యాప్’ అని అంటారు. ఇది చంకలకు, గజ్జలకు వ్యాపిస్తుంది. వీళ్లలో దురద ఎక్కువగా ఉండకపోవచ్చు. నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
హెల్త్ టిప్స్
తులసి ఆకులను గ్రైండ్ చేసి ఒక టీ స్పూన్ మిశ్రమంలో అర టీ స్పూన్ తేనె కలిపి రోజుకొకసారి తీసుకోవాలి. ప్రతిరోజూ ఇలా తీసుకుంటుంటే చర్మం నిగారిస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ దరి చేరవు.తులసి రసాన్ని తలకు పట్టించి తలకు టవల్ చుట్టేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేస్తే పేలు పోతాయి. ఇలా వారానికి ఒకసారి వరుసగా ఐదారు వారాలపాటు చేస్తే సమస్య పూర్తిగా పోతుంది.తులసి రసం అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. ఆకులను గ్రైండ్ చేసి తెల్లటి, నల్లటి మచ్చలున్న చోట రాసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా రోజుకు నాలుగు సార్లు చేస్తుంటే రెండు వారాల్లో మచ్చలన్నీ చర్మంలో కలిసి పోతాయి. అర కప్పు టీ ఆకులు లేదా పొడిని అరలీటరు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడపోసి గాలి దూరని సీసాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. కాలినగాయాలకు, అలసిన కళ్లకు ఇది చక్కటి చికిత్స. దీనిని దూదితో కాని అలాగే కాని చర్మం మీద రాస్తే సరిపోతుంది. ఎండ నుంచి వచ్చిన వెంటనే ఒకసారి చన్నీటితో కడిగి టీ ద్రవాన్ని రాస్తే దేహానికి సాంత్వన చేకూరుతుంది. -
బ్యూటిప్స్
పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి.వేడినీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురద తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడుచందనం కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది.టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి, ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే... జిడ్డు తగ్గి చర్మం అందంగా ఉంటుంది. -
బ్యూటిప్స్
రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది. ఒక్కొక్క టీ స్పూన్ వెన్న, ఓట్స్ పొడిలో అయిదారు చుక్కల నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపుదేలుతుంది. అరకప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారాక వడకట్టి నిల్వ చేసుకోవాలి. దీన్ని ఉదయం, రాత్రి క్రమం తప్పకుండా రెండు వారాలపాటు రాసుకుంటే పగుళ్లు తగ్గి, కాళ్ళు మృదువుగా ఉంటాయి. -
బ్యూటిప్స్
రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టుకొని, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దూది ఉండను ఈ నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలకూ తొలగిస్తాయి. దురద, దద్దుర్లు లాంటివాటినీ, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె టీ స్పూన్ చొప్పున తీసుకొని, అందులో ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపాలి. ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకొని, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత పాల మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని, ముఖానికి రాసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఆరేంత వరకు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మకాంతి పెరుగుతుంది. -
స్కిన్ టైట్నింగ్
బ్యూటిప్స్ రెండు లేదా మూడు క్యాబేజీ ఆకులు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, గుడ్డు తెల్ల సొన తీసుకుని అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. అవసరమైతే నీటిని కలుపుకోవచ్చు. పొడి చర్మం వాళ్ళు మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌ను కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ని ముఖమంతా అప్లై చేసుకోవాలి. మసాజ్ చేయకూడదు. ప్యాక్ టైట్ అయ్యేంతవరకూ లేదా ప్యాక్ పొడిబారేంత వరకూ ఉంచుకుని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా, వదులు అవకుండా ఉంటుంది. ఇంట్లోనే బ్లీచింగ్ తయారి: బాగా మరిగిన పాలు చల్లారిన తర్వాత పై మీగడను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ముఖాన్ని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. తయారుచేసుకున్న బ్లీచ్‌ను ముఖమంతా అప్లై చేసుకోవాలి. వేలితో ముఖంపై నెమ్మదిగా వలయాకారంలో రబ్ చేయాలి. పది నిముషాలపాటు ఉంచుకుని కడిగేసుకోవాలి. తేడా మీరే గమనిస్తారు. మార్కెట్లో లభించే బ్లీచ్ కంటే బాగా పనిచేస్తుంది. -
తులసి ఫేస్ ప్యాక్
బ్యూటిప్స్ గుప్పెడు తులసి ఆకులు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. తులసి ఆకులు లేకపోతే తులసి పౌడర్‌నైనా నీటిలో కలుపుకుని పేస్ట్ చేసుకోవచ్చు. పౌడర్ మార్కెట్లో లభిస్తుంది. తులసి ఆకుల పేస్ట్ రెండు టీ స్పూన్లు, ఓట్మీల్ పౌడర్ రెండు టీ స్పూన్లు, రెండు టీ స్పూన్ల పాలు, కొద్దిగా నీళ్ళు తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్‌ను ముఖమంతా అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్ వేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. ఈ ప్యాక్‌ను నెలకు రెండుసార్లు వేసుకుంటే మొటిమలు రావడం తగ్గుతుంది. చర్మం రంగు కూడా మెరుగవుతుంది. సెన్సిటివ్ స్కిన్వాళ్ళు ఈ ప్యాక్‌ను ముందుగా చేతిపై వేసుకుని మంట, దురద లేకపోతే ముఖానికి వేసుకోవచ్చు. కోకోనట్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనె ముఖానికి పట్టించి, వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. టవల్ తీసుకుని వేడి నీటిలో ముంచి ముఖం పై అద్దాలి. ఇలా అయిదారు సార్లు చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. చివరగా రోజ్ వాటర్‌ని అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు సార్లయినా క్రమం తప్పకుండా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. -
బ్యూటిప్స్
పసుపు రంగులోకి మారిన అరటిపండు తొక్కతో చర్మ కాంతిని మెరుగుపరచుకోవచ్చు. అరకప్పు తాజా పాలు తీసుకుని దానిలో అరటిపండు తొక్కను వేసి మరగపెట్టాలి. పాలు చల్లారిన తర్వాత టీ స్పూను పాలలో దూది ఉండను (కాటన్ బాల్) ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి క్లెన్స్‌ర్‌గా పనిచేస్తుంది. మిగిలిన పాలల్లో ఉన్న అరటిపండు తొక్కను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకుని అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చాయ మెరుగవుతుంది. చర్మం వదులుగా అవ్వకుండా ఉంటుంది, అలాగే ముడతలు కూడా పోతాయి. ఒక్కోసారి ముక్కు రంధ్రాల చుట్టూ, చుబుకం దగ్గర చర్మం నల్లగా, దళసరిగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు స్నానానికి వెళ్ళే ముందుగా ఒక స్పూన్ గ్లిజరిన్, మూడు స్పూన్ల తేనె కలుపుకుని, ముఖానికి, కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను 10-15నిముషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తుంటే వారం రోజుల్లోపే మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు గ్లిజరిన్, తేనె మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం లేదా చిటికెడు పసుపు కులుపుకోవచ్చు. -
కేశ సంరక్షణే ప్రధానం
ఆయుర్వేద ఇతిహాసాన్ని పరిశీలిస్తే చరక సుశ్రుత వాగ్భటుల్ని వృద్ధత్రయమంటారు. భావమిశ్రుడు, శారంగధరుడు, మాధవకరుడు లఘుత్రయంగా పేరొందారు. ‘దారుణక’ అనే పేరుగల వ్యాధిని వాగ్భటుడు కపాలగత రోగంగానూ, మాధవాచార్యులు ‘క్షుద్ర’రోగంగానూ అభివర్ణించారు. వ్యాధి తీవ్రత స్వల్పంగా ఉన్నవాటిని క్షుద్రరోగాలుగా వర్గీకరించారు. వ్యాధి స్థానాన్ని బట్టి ఇది కపాల చర్మరోగం. లక్షణాలు : తల మీద చర్మం పొడిబారి చిన్న పొలుసులుగా రాలిపోతుంది. అప్పుడప్పుడు చిన్న పొక్కులు వస్తుంటాయి. విపరీతమైన దురద ఉంటుంది. కనుక దీన్ని కఫ ప్రధానమైన వాతానుబంధ వ్యాధిగా చెప్పారు. శాలాక్యతంత్ర నిపుణుడైన ‘విదేహుడు’ మరికొన్ని లక్షణాలను కూడా చెప్పాడు. సూదులతో పొడిచినట్లు నొప్పి, మంట, స్రావం. వీటితో పాటు తలవెంట్రుకలు రాలిపోవడాన్ని ఉపద్రవంగా చెప్పాడు. అంటే ఇది సెకండరీ ఇన్ఫెక్షన్ స్వభావం. ఇదే పిత్తప్రకోపావస్థ. కారణాలు : తల మీది చర్మంలో శుభ్రత లోపించడం, కేశమూలాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, మానసిక ఉద్వేగాలు కూడా ఈ వ్యాధిపై ప్రభావం చూపిస్తాయి. నివారణ... తలను శుభ్రంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత అవసరం. చర్మానికి హాని కలిగించే రసాయనాలున్న తీవ్రమైన షాంపూలను వాడకూడదు. ఆహారంలో ఉప్పు, కారం తక్కువగా తినాలి. ఔషధాలు... త్రిఫలాచూర్ణంతో కషాయం కాచుకొని, తలను కడుక్కుని, తర్వాత తలస్నానం చేయాలి. తడి ఆరిన తర్వాత తల చర్మంపై పూయవలసిన ఔషధ తైలాలు: దూర్వాది తైలం లేక మహామరీచాదితైలం లేక మంజిష్ఠాది తైలం. కడుపులోకి మందులు: లఘుసూతశేఖరరస మాత్రలు పూటకొక్కటి చొప్పున రోజుకి మూడు మాత్రలు పంచతిక్త గుగ్గులు ఘృతం రెండు చెంచాలు ఉదయం, రెండు చెంచాలు సాయంత్రం, కొంచెం పాలతో కలిపి ఖాళీ కడుపుతో సేవించాలి. ఖదిరారిష్ట రెండు చెంచాలు, శారబాద్యాసవ రెండు చెంచాలు కలిపి, నాలుగు చెంచాలు నీళ్లు కూడా కలిపి రోజుకి రెండుసార్లు ఆహారం తిన్న తర్వాత తాగాలి. అధిక ఒత్తిడి చుండ్రు సమస్యను తీవ్రతరం చేస్తుంది. దాని నివరణకు ప్రాణాయామం చేయడం మేలు. చర్మతత్వాన్ని బట్టి చికిత్స చర్మవ్యాధులు, నరాల బలహీనత , రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ. అన్ని చర్మవ్యాధులలో మానసిక ఒత్తిడి ఏ విధంగా కారకమో చుండ్రుకు కూడా ఒత్తిడి ముఖ్యమైన కారకం. పొడి చుండ్రు: ఇది చాలా తరచుగా చూసే సమస్య. తలలో పెద్ద పెద్ద తెల్లటి పొలుసులు ఏర్పడి, పొడి చారికలుగా పైకి లేస్తుంది. ఈ తరహా చుండ్రు యుక్తవయసు వారిలో ఎక్కువగా చూస్తాం. ఇది ఒక సౌందర్య సమస్యగానే తీసుకుంటారు. తడి చుండ్రు: దీన్ని కొంచెం తీవ్రస్థాయి చుండ్రుగా పరిగణిస్తారు. దీనిలో పచ్చటి చమురుతో కూడిన పొలుసులు, వాటి అంచులు ఒక క్రమమైన పరిమాణంలో ఏర్పడతాయి. త్వరత్వరగా చర్మకణాలు వృద్ధి చెందడమే కాకుండా అవి దెబ్బతింటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా రాలి పోయే క్రమంలో చర్మంపై వాపు, ఎర్రగా అవుతుంది. అధికంగా దురద కలుగుతుంది. ఈ తరహా చుండ్రు తలపై భాగాన మాత్రమే కాకుండా నుదుటిపైన, శిరోజాల మొదలులో, కనుబొమల్లో, కనురెప్పల్లో, చెవి భాగాలలో కూడా చూస్తుంటాం. చుండ్రు వేరు - సోరియాసిస్ వేరు తలపై ఏర్పడే సోరియాసిస్‌లో ఎర్రటి మచ్చలు ఏర్పడి అవి క్రమేణ నల్లగా మారి వాటి మీద ఎండిన తెలుపు, బూడిద రంగులో చర్మం పొలుసు పొలుసులుగా రాలుతుంటుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో చర్మకణాలు త్వరత్వరగా అంటే 2-3 రెట్లు ఎక్కువగా వృద్ధిచెందుతుంటాయి. పైగా అక్కడి పొలుసులను తొలగిస్తే రక్తస్రావమై వ్యాధి ఎక్కువవుతుంది. జాగ్రత్తలు సరైన నియమాలతో పోషకాహారం తీసుకోవడం. మానసిక వ్యాకులతకు దూరంగా ఉండటం తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, రోజుకు రెండుసార్లు సరిగ్గా దువ్వడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా జాగ్రత్త పడటం. మందులు చుండ్రు నివారణకు, శిరోజాల నిగారింపుకు కాలిసల్ఫ్, ఆర్సనిక్ ఆల్బమ్, బాడియాగ, గ్రాఫైటిస్, నేట్రం మూర్, వినికామైనర్, మెజీరియమ్ మందులు ఉపయోగపడతాయి. వినికామైనర్: చర్మంపై నూనె ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారిలో చర్మగ్రంథులు మూసుకుపోయి విపరీతమైన దురద పుడుతుంది. గోకడం వల్ల పుండు పెద్దగా మారి పొరలు పొరలుగా రాలుతుంది. వెంట్రుకలన్నీ కుచ్చుల్లా ఒకదానికొకటి అంటుకుపోయి చర్మకణాలు బాగా దెబ్బతింటాయి. దీర్ఘకాలంగా ఈ తరహా చుండ్రుతో బాధపడేవారికి బట్టతలకు దారితీసేవారికి ఈ మందు ను ఉపయోగిస్తారు. నేట్రం మూర్: మానసికంగా బాగా ఒత్తిడికి గురై భయాందోళనలకు లోనై బాగా కుంగిపోయేవారిలో చుండ్రు ఎక్కువగా కనిపిస్తుంది. నూనె గ్రంథులు ఎక్కువగా ప్రేరేపణకు గురికావడం వల్ల చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, తెల్లటి పొరలుగా రాలే వారికి ఈ మందును వాడతారు. సెవియా: దిగులుగా, ఉత్సాహం లోపించినట్టుగా ఉండటం, చర్మగ్రంథులు తడిగా ఉండి చర్మం పొలుసులుగా రాలడం, వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా ఉండి, జుట్టు అధికంగా రాలడం వంటి సమస్యలకు ఈ మందు వాడుతారు. గ్రాఫైటీస్: మందంగా ఉన్న చర్మంపై పెచ్చులు పెచ్చులుగా పొట్టు రాలడం, శుభ్రత లోపించి చెడువాసన రావడం, దురద మూలంగా పుండ్లు ఏర్పడటం, రాత్రివేళలో దురద ఎక్కువవటం, భయస్తులకు ఈ మందు ఇస్తారు. బాడియాగ: పొడి చర్మతత్వం కలిగి చలికాలంలో ఏర్పడే చుండ్రు, దురదతో పాటు చాలా సున్నితంగా ఉండే మాడు కలిగిన వారికి ఉపయోగిస్తారు. కాలిసల్ఫ్: చుండ్రు విపరీతంగా ఉండి, సోరియాసిస్ ఎగ్జిమాను తలపించే చారికలు, పొరలు దురదతో పొక్కులతో పాటు... త్వరగా ఉలిక్కిపడటం, భయపడటం, సున్నితవిషయాలకు త్వరగా స్పందించడం వంటి వారికి ఈ మందు ఉపయోగిస్తారు. -
టొమాటో + పాలు= క్లెన్సర్
బ్యూటిప్స్ ముఖం, మెడ చర్మం జిడ్డుగా, నల్లగా అనిపిస్తుంటే ఇంట్లోనే సులభంగా క్లెన్సర్‌ని తయారుచేసుకుని ఉపయోగించవచ్చు. టొమాటో, పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ అలర్జీల నుంచి కాపాడటమే కాకుండా, మృతకణాలను తొలగించడంలోనూ సహకరిస్తాయి. టొమాటో, పాలు కలిపి తయారు చేసిన మిశ్రమం సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేయడమే కాదు... చర్మాన్ని నునుపుగానూ చేస్తుంది. కావల్సినవి: పండిన పెద్ద టొమాటో ఒకటి, పచ్చిపాలు అరగ్లాసు, శుభ్రమైన నీళ్లు లీటర్ తయారీ: టొమాటోను మెత్తగా గుజ్జు చేయాలి. గుజ్జును పలుచని వస్త్రంలో వేసి గిన్నెలోకి వత్తాలి. ఇలా వచ్చిన టొమాటో జ్యూస్‌కి సమపాళ్లలో పాలు కలపాలి. దీనిని బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఉపయోగించే విధానం: ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు రోజుకు రెండుసార్లు ఉపయోగించాలి. మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం తాజా మెరుపును సంతరించుకుంటుంది. గమనిక: సున్నితమైన, పొడి చర్మం గలవారు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది. ఈ మిశ్రమాన్ని రెండు రోజుల కంటే ఎక్కువగా నిల్వ చేయకూడదు. -
సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను చాలాకాలంగా శరీరంపై దద్దుర్లు, ఇన్ఫెక్షన్, చర్మం పగిలినట్లుగా కావడం, చర్మంపై పొలుసుల్లా వచ్చి రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే సోరియాసిస్ అని నిర్ధారించారు. ఏవేవో ఆయింట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఈ సమస్య మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. అసలీ సమస్య ఎందుకు వస్తుందో తెలియ జేయండి. హోమియోలో దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? - వినయ్, కర్నూలు సోరియాసిస్ అనేది దీర్ఘకాలం కనిపించే చర్మవ్యాధి. కానీ అంటువ్యాధి మాత్రం కాదు. ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వస్తే చర్మం ఎర్రగా మారుతుంది. పొడిబారినట్లుగా అయిపోయి చర్మం పొలుసుల్లా రాలిపోతుంది. దురదలు రావడం, మచ్చలు పడటం కూడా జరుగుతాయి. కారణాలు: సోరియాసిస్‌కు ఇప్పటివరకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. అవి... మానసిక ఒత్తిడి వంశపారంపర్యం ఆటోఇమ్యూన్ ప్రతిస్పందన జన్యుసంబంధిత లోపాలు. రకాలు: చర్మ కణాలు, చర్మం మీది రంగులను బట్టి సోరియాసిస్‌ను చాలా రకాలుగా విభజించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని... ఫ్లేక్ సోరియాసిస్: ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చర్మం మీద ఎర్రగా పొంగిన కణాలను కలగజేస్తుంది. ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులుగా వృద్ధి అవుతాయి. ఇవి ఎక్కువగా తల, మోచేతులు, మోకాళ్లు, గోళ్ల మీద ఏర్పడతాయి. గట్టేట్ సోరియాసిస్: ఇందులో నీటి బొట్ల లాంటి చిన్న చర్మ కంతుల వంటివి ఏర్పడతాయి. ఫిస్టులార్ సోరియాసిస్: దీనిలో తెల్లటి చీము వంటి చిక్కటి పదార్థం కలిగిన బొబ్బలు చర్మంపై కనిపిస్తుంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్: ఇది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఒక రకమైన కీళ్లకు సంబంధించిన వ్యాధి. దీనిలో సోరియాసిస్‌తో పాటు కీళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. లక్షణాలు: చర్మం ఎర్రగా మారడం దురద చర్మం గట్టిగా తయారవడం అరికాలు, అరచేయిపై బొబ్బలు ఏర్పడటం గోళ్లు పెళుసుగా తయారయ్యి నల్ల రంగుకు మారడం జరుగుతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది కీళ్లనొప్పులు దురద ఎక్కువగా ఉన్నప్పుడు గీరగానే చర్మం మీద పుండ్లు పడి రక్తం స్రవించడం కనిపిస్తుంది. సోరియాసిస్‌ను ప్రేరేపించే కారణాలు: సోరియాసిస్ అనేది చికిత్స తీసుకుంటున్నా తగ్గుతూ, మళ్లీ పెరుగుతూ ఇబ్బంది పెడుతుంది. అయితే దీన్ని ప్రేరేపించే కారణాలకు దూరంగా ఉంటే వ్యాధి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి... మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి దుమ్ము ధూళి పెంపుడు జంతువుల వంటి అలర్జీలను కలిగించే కారకాలకు దూరంగా ఉండాలి యాంటీ బయాటిక్స్ వాడినప్పుడు దీని తీవ్రత పెరుగుతుంది. కాబట్టి వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి చల్లటి వాతావరణంలో తిరగకుండా ఉండటం మంచిది పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. నిర్ధారణ: రోగి వైద్య చరిత్రను పరిశీలించడం, చర్మాన్ని పరీక్షించడం ద్వారా దీని నిర్ధారణ చేయవచ్చు. వ్యాధిలోని వ్రణాలను బట్టి, చర్మంపై కనిపించే లక్షణాలను బట్టి అది ఏ రకమైన సోరియాసిస్ అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. నివారణ: వ్యాయామం చేయడం పరిశుభ్రత పాటించడం పోషకాహారం తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహారపు అలవాట్లు మెడిటేషన్ చర్మ సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇతర ఇన్ఫెక్షన్స్ రాకుండా శుభ్రత పాటించడం చర్మం పొడి బారకుండా ఆయిల్ పూయడం వంటి జాగ్రత్తల ద్వారా నివారించొచ్చు. చికిత్స: సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక రోగికీ, మరో రోగికీ వ్యాధి తీవ్రతలో, లక్షణాల్లో తేడా ఉంటుంది. హోమియో విధానంలో రోగి అలవాట్లు, వ్యక్తిత్వం, మానసిక స్థితి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని, కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మందులిస్తారు. హోమియో మందుల ద్వారా పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. మళ్లీ ఇది తిరగబెట్టకుండా కూడా చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం.రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
తెల్ల మచ్చలు తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఫలితంగా తీవ్రమైన మానసిక వేదన కలుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం చెప్పండి. - మహేశ్‌కుమార్, వరంగల్ బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల కలుగుతుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇది 2 నుంచి 3 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం... టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల క్షీణించడం జరుగుతుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి: బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగ్జైటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. కొన్నిసార్లు కాలిన గాయాలు, ప్రమాదాల వల్ల వచ్చే గాయాలు సరిగా మానకపోవచ్చు. దాంతో ఈ ప్రాంతంలో మచ్చపడి ఇలా తెల్లమచ్చలు రావచ్చు. పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలు : వీటివల్ల వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు ప్రస్ఫుటం అయ్యే వీలుంది. మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. రకాలు: శరీరం అంతటా ఏర్పడే తెల్లమచ్చలు కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో ఏర్పడే ప్యాచెస్ శరీరం అంతటా వ్యాపించే తెల్లమచ్చలు జననాంగాలను ప్రభావితం చేసేవి పెదవులు, వేళ్లు, బొటనవేళ్లను ప్రభావితం చేసే మచ్చలు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
మెరుగైన చర్మకాంతికి...
బ్యూటిప్స్ వర్షాకాలంలో కొందరికి చర్మం పొడిగా అయిపోవడం, డల్‌గా అవ్వడం, నల్లబడటం, బిరుసుగా అయిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడటానికే ఈ చిట్కాలు... ఓ బౌల్లో రెండు చెంచాల ముల్తానీ మట్టి, 1 చెంచా గంధపు పొడి, 2 చెంచాల లవంగ నూనె, కాసింత నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని నలుగు పిండి మాదిరిగా కాళ్లు, చేతులు, మెడకు రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వానాకాలం అయ్యేవరకూ వారంలో నాలుగైదు సార్లు ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి స్నానం చేస్తే... చర్మం మృదువుగా ఉండటంతో పాటు వానాకాలం వచ్చే చర్మవ్యాధులు కూడా దరిచేరవు. సువాసన కావాలనుకునేవారు కాస్త రోజ్‌వాటర్ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో కొంచెం బియ్యప్పిండి, నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనితో ఒళ్లు తోముకుని, ఆపైన వేణ్నీళ్లతో స్నానం చేస్తే చర్మం కాంతులీనుతుంది. -
వేసవిలో కూల్‌గా ప్యాక్స్...
బ్యూటిప్స్ ఎండ వేడిమి, దుమ్ము.. చర్మపు రంగును, తాజాదనాన్ని తగ్గిస్తాయి. వేసవి కాలంలో చర్మం నిగారింపు కోల్పోకుండా, వేడి నుంచి ఉపశమనం పొందాలంటే... పుదీనా ప్యాక్: ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. తర్వాత టీ స్పూన్ పుదీనా ఆకుల పేస్ట్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. బాదం నూనెలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం మీద, కళ్లకింద, మెడ, గొంతు, చేతులపై మృదువుగా రాయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.50 గ్రాముల ఎర్రకందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బాలి. దీంట్లో పచ్చిపాలు, బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మేనికంతా పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దోసకాయ గుజ్జులో టేబుల్ స్పూన్ పంచదార కలిపి, ఫ్రిజ్‌లో చల్లబడేవరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. -
కళ్లజోడు మచ్చలకు కలబంద...
బ్యూటిప్స్ కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు పోయి, చర్మం పూర్వపు రంగులోకి రావాలంటే...కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి.మచ్చలపై తేనె రాసి, 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల కళ్లజోడు వల్ల అయిన మచ్చలను తగ్గించుకోవచ్చు. బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. లేదంటే, బంగాళదుంప ముక్కతో మచ్చలున్న చోట మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి. నారింజతొక్కలను ఎండబెట్టి, పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి, పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేయాలి.అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్నచోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. {స్టాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
కమిలిన చర్మానికి...
బ్యూటిప్స్ వేసవిలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ‘ట్యాన్.’ చేతులు, పాదాలు, ముఖం ఎండవేడిమికి నల్లబడుతుంది. ఈ సమస్య దరిచేరకుండానే కాదు, రంగుమారిన చర్మం పూర్వస్థితికి రావాలంటే ఇంట్లోనే కొన్నిర జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో... పసుపు, పెరుగు, తేనె కలిపి శరీరమంతా పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. చర్మానికి తగినంత మాయిశ్చరైజింగ్ లభించి మృదువుగా అవుతుంది. స్నానానికి అరగంట ముందు శనగపిండిలో తగినంత పెరుగు కలిపి శరీరమంతా పట్టించి, మర్దనా చేయాలి. ఆరిన తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. ఎండకాలంలో గంధంపొడి చర్మానికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గంధం చెక్కను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ నూరాలి. ఇలా తీయగా వచ్చిన గంధం చూర్ణాన్ని దేహానికి పట్టించాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ట్యాన్ తగ్గుతుంది. చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. నిమ్మరసం సౌందర్యపోషణలో ఔషధకారిగా పనిచేస్తుంది. అన్ని రకాల చర్మతత్వాలకు సరిపడుతుంది. సహజసిద్ధమైన బ్లీచింగ్‌లా పనిచేసే గుణాలు ఉండటంతో చర్మకాంతి పెరుగుతుంది. అలొవెరా రసం సహజసిద్ధమైన యాంటిసెప్టిక్ లోషన్‌లా పనిచేస్తుంది. దుమ్ము, ధూళి వల్ల చర్మంపై చేరిన బాక్టీరియాను తొలగించడంతో పాటు వైరస్కారకాలను దూరం చేస్తుంది. టేబుల్ స్పూన్ అలొవెరా జెల్, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, పాదాలకు, చేతులకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి, వారానికి 3 సార్లు ఈవిధంగా చే స్తుంటే ట్యాన్ తగ్గుతుంది. చర్మకాంతి పెరుగుతుంది. -
ఇల్లే ఓ బ్యూటీ క్లినిక్
ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఎంత ఎండలు ఉన్నా, బయటకి వెళ్లనిదే ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటితో సహా ఇతర పనులు జరగవు కదా! ఎండలోకి వెళ్లేముందు ముఖానికి, చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టం. అయితే బోలెడంత ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది. కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొబ్బరిపాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకుని, ఆరాక కడుక్కున్నా మంచి ఫలితం ఉంటుంది. కేవలం ముఖానికి రాసుకోవడమే కాదు; కొబ్బరినీళ్లు తాగడం వల్ల కూడా చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది. అదేవిధంగా ఒక్క ఎండాకాలంలోనే కాదు; చాలామందికి కళ్ల కింద నల్లటి వలయాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దానికి ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన చల్లటి బంగాళదుంప లేదా కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అందులోని బ్లీచింగ్ ఏజెంట్ ఆ మచ్చలను మటుమాయం చేస్తుంది. -
బార్లీ బ్యూటీ
బ్యూటిప్స్ క్లెన్సర్: బార్లీ పొడిలో పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి రాసుకొని, 15 నిమిషాలు వదిలేసి తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది స్వేదరంధ్రాలను శుభ్రపరచడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోజూ ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ప్యాక్: బార్లీ గింజలను పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. చర్మం కాంతిమంతం కూడా అవుతుంది. వాటర్ థెరపీ: బార్లీ గింజలను నీళ్లలో వేసి, రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగాలి. అలాగే కొద్దిగా నీళ్లను ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది. తేనెతో: టీ స్పూన్ బార్లీ పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి ఇది జీవకళ తీసుకువస్తుంది. -
‘అచ్చు’ వ్యాధి!
మెడిక్షనరీ చర్మంపై అరచేత్తో మెచ్చుకోలుగా చరిస్తే... ఐదు వేళ్లూ అచ్చులు తేలుతాయి. కొద్దిగా గీరినా చాలు... ఎర్రబారి వాతలు కనిపిస్తాయి. గోముగా అలా నిమిరినా చాలు... మేనుపై మార్కింగ్ వచ్చేస్తుంది. కొంతమందిలో కనిపించే ఈ చర్మ సమస్యను ‘డర్మటోగ్రాఫియా’ అనీ, డర్మటోగ్రాఫిజమ్ అని కూడా అంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారి చర్మంపై ఏదైనా రాస్తే... పచ్చబొట్టు తరహాలో అది చాలాసేపు ఉండిపోతుంది. కాకపోతే పచ్చబొట్టు కాస్త ఆకుపచ్చ రంగులో ఉంటే అది చర్మం ఎర్రబారినప్పుడు ఉండే రంగుకు మారుతుంది. ఈ సమస్య ఎందుకు వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే మైక్రోఒవెన్ దగ్గర చాలా సేపు ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువని పరిశోధకులు తెలుసుకున్నారు. అయితే దీనివల్ల ప్రాణాపాయం ఉండదు. ఇదేమీ అంటువ్యాధి కాదు. యాంగ్జైటీ, తీవ్రమైన ఒత్తిడి, చర్మంపై బిగుతుగా దుస్తులు ధరించడం వంటివి దీన్ని మరింత పెంచుతాయని కూడా తేలింది. ఈ సమస్యకు యాంటీహిస్టమైన్స్తో చికిత్స చేస్తారు. -
ఇక ఆయిలీతో నో ప్రాబ్లమ్..
బ్యూటిప్స్ జిడ్డు చర్మం వారు ఏ కాలాన్నీ ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే ముఖం కడుక్కున్న రెండు నిమిషాలకే చర్మం ఆయిలీగా మారుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా అలాంటి వారు కొన్ని సూచనలు, చిట్కాలు పాటించక తప్పదు.. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి రోజూ నిమ్మరసంతో కానీ నేరుగా నిమ్మకాయ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేసి ముఖాన్ని క్లీన్ చేసుకుంటే జిడ్డుతనం తగ్గుతుంది. ఇంట్లోనే ఫేస్ స్ప్రే తయారు చేసుకొని వాడటం మేలు. ఒక కప్పు నీళ్లలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ఏదైన చిన్న బాటిల్లో నింపుకోవాలి. ఇంట్లో ఉన్నా లేక ఆఫీసులో రెండు నిమిషాలకోసారి ముఖంపై చల్లుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటే చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది. ఎండలో నడిచేటప్పుడు కచ్చితంగా గొడుగును వాడటం మర్చిపోకండి. అది వాన నుంచే కాదు మనల్ని ఎండ నుంచీ కాపాడుతుంది. కాబట్టి బయటికి వెళ్లే ముందు బ్యాగ్‌లో గొడుగును తీసుకెళ్లండి.సన్‌స్క్రీన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్‌ను ప్రతి రోజూ చర్మానికి రాసుకోవాలి. అది చెమట కారణంగా అయ్యే డీహైడ్రేషన్‌ను నియంత్రిస్తుంది. -
మీకు మీరే బ్యూటీషియన్...
బ్యూటిప్స్ ఇప్పుడిప్పుడే ఎండలు మొదలవుతున్నాయి. బోలెడంత ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఈ పని చేయండి. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి... ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది. కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. -
కూల్ ప్యాక్
బ్యూటిప్స్ చలిపోయింది. ఎండలు పెరుగుతున్నాయి. ఈ సంధికాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి చర్మాన్ని కాపాడేవే ఈ కూల్ప్యాక్లు. ఎండకు వాడిన చర్మానికి ఈ ప్యాక్‌లు వేస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది. బంగాళాదుంపను తురిమి ముఖమంతా పరిచి అరగంట తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే సన్‌ట్యాన్‌ను అరికట్టవచ్చు. అలాగే ముఖం మీద మచ్చలు, గీతలు పోయి చర్మంకాంతులీనుతుంది. కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసి ప్యాక్ తయారు చేసుకోవాలి. పొడి చర్మానికయితే ఒక టేబుల్‌స్పూన్ పౌడర్‌లో అంతే మోతాదులో పాలమీగడ లేదా తాజాపాలు లేదా పెరుగు కలిపి ప్యాక్ వేయాలి. జిడ్డు చర్మానికయితే తగినంత పన్నీరు కలిపి ప్యాక్ వేయాలి. ఈ ప్యాక్ వేసిన తర్వాత ఐదు నిమిషాల సేపు వలయాకారంగా మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది మేనిఛాయను మెరుగుపరుస్తుంది కూడ. తాజా బత్తాయి రసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా పేస్టు చేయాలి. అందులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే ముఖం మీద గుల్లలు, మచ్చలు, గీతలు కూడా పోతాయి. ఈ ప్యాక్ చర్మాన్ని తెల్లబరుస్తుంది కూడ. -
ఫ్రూటీ బ్యూటీ
బ్యూటిప్స్ ఆయిలీ స్కిన్... నిమ్మరసం సహజమైన క్లెన్సర్. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానివ్వదు. పదిద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్‌కు చక్కటి ఫేస్ ప్యాక్. దీనిని పొడిచర్మానికి కాని నార్మల్ స్కిన్‌కు కాని వాడితే మరింత పొడిబారుతుంది. రకరకాల పండ్లను, సౌందర్యసాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది పొడిచర్మానికి పనికి రాదు. డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ వెజిటబుల్ ఆయిల్ బాగా కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు. ఒక టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. నార్మల్ స్కిన్‌కి... ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జు ఒక కప్పులో కోడిగుడ్డు వేసి(పచ్చసొనతో సహా) బ్లెండ్ చేసి సగం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. మసాజ్ తర్వాత మిగిలిన సగం మిశ్రమాన్ని ప్యాక్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫలితం వెంటనే కనిపిస్తుంది. దీనిని నార్మల్ స్కిన్‌తోపాటు అన్నిరకాల చర్మానికీ వేయవచ్చు. ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారట్ రసం రాస్తుండాలి. వారం రోజులకే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు మాసిపోవడంతోపాటు చర్మం కాంతిమంతమవుతుంది. -
ఫ్రైడే
సూర్య @ 42.3 డిగ్రీలు శుక్రవారం ‘రికార్డు’ ఉష్ణోగ్రత ఈ సీజన్లో ఇదే అత్యధికం సాక్షి, సిటీబ్యూరో: రోహిణి కార్తె ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి నగరంలో వడదెబ్బతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం 42.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే అత్యధికం. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. గాలిలో తేమ అనూహ్యంగా 16 శాతానికి పడిపోవడంతో మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి వెళ్లినవారి చర్మం ఎండకు వాడిపోయింది. కాగా మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. -
ముందే తాకిన సెగ
నిన్నటి వరకు చలితో గజగజ వణికిపోయిన నగరవాసులపై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం వేళ బయటకి వెళ్లాలం టే భయపడే పరిస్థితి వచ్చేసింది. గతేడాది ఫిబ్రవరి మొదటి వారంలో రోజుకు సగటున 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. ఈసారి ఏకంగా 32-33 డిగ్రీల మేర నమోదవుతుండటంపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మార్చి తర్వాత మరెలా ఉంటుందోనని భయపడుతున్నారు. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న వాహన, పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి రెండు వారాల ముందే గ్రేటర్‌కు ఎండసెగ తగిలింది. సాక్షి, సిటీబ్యూరో: తెల్లవారుజామున చలి.. తెల్లవారుతుండగానే సెగ.. ఇప్పుడు నగరంలో నెలకొన్న వాతావరణం ఇది. వేసవికి ముందే ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఉక్కపోస్తోంది. క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. ఎండ తీవ్రతకు చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు వడదెబ్బ బారిన పడటంతో పాటు టూవీలర్స్‌పై ప్రయాణించే మార్కెటింగ్ ఉద్యోగులు, యువ తీ యువకులు చర్మ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున చలి, మధ్యాహ్నం ఎండ వల్ల చర్మం పొడిబారుతోంది. ఉక్కపోత వల్ల మెడ, కాళ్లు, చేతులపై పొక్కులు వస్తున్నాయి. బయటికి వెళ్తే నీళ్ల బాటిల్, గొడుగు విధిగా వెంట తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. చల్లని గాలి కోసం తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. టైట్ జీన్స్, బిగుతైన దుస్తులకు దూరంగా ఉంటే మేలు. చెమట పొక్కులు రాకుండా శరీరానికి చల్లదనాన్ని పంచే కూల్ పౌడర్లు వాడాలి. చన్నీటితో రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) స్నానం చేయాలి. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకూడదు. పనులుంటే ఉదయమే పూర్తి చేసుకుని ఎండ ముదిరే సమయానికి ఇంటికి చేరుకోవాలి. బయటికి వెళ్లే ముందు చర్మానికి సన్‌లోషన్స్ తప్పనిసరి. మసాలా ఆహారానికి బదులు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పానీయాలకు బదులు పండ్ల రసాలు, పండ్లు, కొబ్బరి బొండాలు తాగాలి.