ఫ్రూటీ బ్యూటీ | froot beauty | Sakshi
Sakshi News home page

ఫ్రూటీ బ్యూటీ

Published Thu, Feb 4 2016 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

ఫ్రూటీ బ్యూటీ

ఫ్రూటీ బ్యూటీ

బ్యూటిప్స్
 
ఆయిలీ స్కిన్...

 నిమ్మరసం సహజమైన క్లెన్సర్. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానివ్వదు. పదిద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్‌కు చక్కటి ఫేస్ ప్యాక్. దీనిని పొడిచర్మానికి కాని నార్మల్ స్కిన్‌కు కాని వాడితే మరింత పొడిబారుతుంది.

 రకరకాల పండ్లను, సౌందర్యసాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది పొడిచర్మానికి పనికి రాదు.
 
డ్రైస్కిన్ అయితే...
 ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ వెజిటబుల్ ఆయిల్ బాగా కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు.  ఒక టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
నార్మల్ స్కిన్‌కి...
 ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జు ఒక కప్పులో కోడిగుడ్డు వేసి(పచ్చసొనతో సహా) బ్లెండ్ చేసి సగం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. మసాజ్ తర్వాత మిగిలిన సగం మిశ్రమాన్ని ప్యాక్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫలితం వెంటనే కనిపిస్తుంది. దీనిని నార్మల్ స్కిన్‌తోపాటు అన్నిరకాల చర్మానికీ వేయవచ్చు. ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారట్ రసం రాస్తుండాలి. వారం రోజులకే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు మాసిపోవడంతోపాటు చర్మం కాంతిమంతమవుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement