మీకు మీరే బ్యూటీషియన్...
బ్యూటిప్స్
ఇప్పుడిప్పుడే ఎండలు మొదలవుతున్నాయి. బోలెడంత ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఈ పని చేయండి. బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి... ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతూ మీకే ముద్దొచ్చేస్తుంది.
కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి.